కృష్ణా నదీ వరద ప్రవాహ మట్టం, కొండవీటి వాగు వరద ప్రవాహ మట్టం కంటే లోతట్టులో ఉన్న రాజధాని ప్రాంతం ఎత్తు ఎలా పెంచుతారని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ వరద ప్రవాహ మట్టం, కొండవీటి వాగు వరద ప్రవాహ మట్టం కంటే లోతట్టులో ఉన్న రాజధాని ప్రాంతం ఎత్తు ఎలా పెంచుతారని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ, పండలనేని శ్రీమన్నారాయణ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ఎన్జీటీ గురువారం విచారించింది.
ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా జస్టిస్ స్వతంత్రకుమార్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ తడబడ్డారు.అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదావేశారు.