
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బేఖాతార్ చేస్తోందని పర్యావరణ వేత్త మన్నారాయణ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మాణాల పేరిట చెరువులు, వాగుల జోలీకి వెళ్లద్దని ఎన్‌జీటీ సూచించినా ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాజధాని గ్రామాల్లో రోడ్ల పేరుతో ఇప్పటికి 10 చెరువులను పూడ్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పూడ్చివేతలపై మళ్లీ ఎన్‌జీటీనీ ఆశ్రయిస్తామని మన్నారయణ స్పష్టం చేశారు.
భూమి ఇవ్వకున్నా.. రోడ్డు వేస్తున్నారు: రాజధాని రైతు
రాజధాని నిర్మాణానికి తాను భూమి ఇవ్వకున్నా దౌర్జన్యంగా తన పొలంలో రోడ్డు వేసారని రైతు తాతబాబు తన గోడును వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం బలవంతంగా తన భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూమినివ్వనని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయం రాష్ట్రపతికి ఫిర్యాదుచేస్తానన్నారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తాతబాబు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment