సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో (ఎన్జీటీ) జరుగుతున్న విచారణ డిసెంబర్ 8కి వారుుదా పడింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలంటూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట అక్రమాలకు పాల్పడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
తెలంగాణలోనూ పెద్ద పెద్ద యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ) ఆధీనంలో పూర్తి పాదర్శకంగా తవ్వకాలు చేపడుతోందని వివరించారు. ప్రభుత్వం ఆధీనంలో తవ్వకాలు చేపడితే అక్రమాలు జరగవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ఇసుక తవ్వకాలపై విచారణ వాయిదా
Published Fri, Nov 25 2016 3:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement