చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో | Ban on Chinese manjha to continue in India with the supreme court refusing | Sakshi
Sakshi News home page

చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో

Published Fri, Jan 13 2017 12:10 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో - Sakshi

చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో

న్యూఢిల్లీ : చైనా మాంజాపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌జీటీని ఆశ్రయించాలని సూచించింది. గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాకు అనుమతి ఇవ్వాలంటూ గుజరాత్‌ కు చెందిన వ్యాపారుస్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కాగా మనుషులు, జంతువులు, పక్షులకు ప్రాణాంతకంగా పరిణమించిన పతంగుల గాజుముక్కల మాంజాను ఎన్జీటీ దేశవ్యాప్తంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎన్జీటీ ఉత్తర్వులతో రాష్ట్రాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement