kite flying
-
పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన బాలుడు
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన అభిలాష్ అనే బాలుడు పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్.. విద్యుత్ తీగలకు గాలిపటం తట్టుకోవడంతో దాన్ని విడిపించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు బాలుడిని సమీపంలోని ఏరియా అసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి ఇంటి డాబాపై గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్.. విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడిపోయాడు. విద్యుత్ తీగలు బాలుడికి అతుక్కుపోవడంతో తీవ్ర రక్తస్రావమై, చావుబతుల మధ్య కొట్టిమిట్టాడాడు. కరెంటు తీగలు రేకులపైనే ఉండటంతో బాలుడిని కాపాడే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. దయనీయ పరిస్థితిలో బాలుడు రోదిస్తున్న తీరు చుట్టుపక్కల వారని కలచి వేసింది. కాగా, అభిలాష్ విద్యుత్ షాక్‌కు గురైన సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేరు. -
పతంగి కోసం వెళ్లి.. పెంటకుప్పలో పడి
ముంబై: సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అవును పండుగ ముందు నుంచి మొదలయ్యే పతంగుల సందడి ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పతంగులు సంతోషాన్నే కాదు.. అప్పుడప్పుడు విషాదాన్ని కూడా నింపుతాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా గాలిపటం ఎగురేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది. (చదవండి: వైరల్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం) షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. -
కరోనా: పతంగులు ఎగరేయొద్దు
కాన్పూర్(ఉత్తరప్రదేశ్): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గాలిపటాలు ఎగరేయొద్దని ప్రజలకు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇళ్లలో గడుపుతున్న జనంలో కొంతమంది కాలక్షేపానికి పతంగులు ఎగరవేస్తున్నారు. దీన్ని గుర్తించిన కాన్పూర్ పోలీసులు పతంగులు ఎగరేయొద్దని బాలీవుడ్ హిట్ పాటలతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘గాలిపటాలు ఎగరవేయడం మానండి. మాట వినకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అనే అర్థం వచ్చేలా పాటలతో కాన్పూర్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పతంగులు ఎగరేయొద్దని పిల్లకు చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 1,868 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సోకిన వారిలో 289 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ ఎగబాకుతోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు, మృతుల సంఖ్య 872కు చేరింది. కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రజలు మరికొంత కాలం ఇళ్లకు పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. చదవండి: కరోనా వైరస్.. మరో దుర్వార్త -
గాలిపటం ఎగరేస్తున్న కోతి
-
ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి
లాక్డౌన్ కారణంగా రహదారులన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో అడవిలో సంచరించే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఎలాంటి భయం లేకుండా వీధులపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా కోతులు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణ రోజుల్లోనే కోతులు ఇళ్లలోకి దూరి నానా హంగామా చేస్తుంటాయి. ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడంతో వీటికి హద్దే లేకుండా పోతుంది. ఇటీవల ఓ కోతి ఇంటి మేడ మీదకు ఎక్కి ఏకంగా గాలిపటాన్ని ఎగరేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద గురువారం తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. (మీకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైందా ?) ‘లాక్డౌన్ కారణంగా పరిణామం వేగంగా వృద్ధి చెందుతోంది. కోతి గాలిపటాన్ని ఎగరేస్తోంది. అవును ఇది ఖచ్చితంగా కోతినే’.. అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో కోతి గాలిపటానికి కట్టి ఉన్న దారన్ని లాగడం కనిపిస్తోంది. దారాన్ని చివరి వరకు పూర్తిగా లాగి గాలిపటాన్ని తన చేతితో పట్టుకుంటుంది. ప్రస్తుతం కోతి వీడియో వైరల్ అవ్వడంతో అనేకమంది దీనిపై స్పందిస్తున్నారు. ‘లాక్డౌన్ కారణంగా కోతి కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది’ అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. (ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..) -
గాలి పటం ఎగురవేస్తూ..
సాక్షి, నాగిరెడ్డిపేట: గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ బాలుడు మృతిచెందాడు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ పంచాయతీ పరిధిలో గల అక్కంపల్లికి చెందిన మంత్రి మల్లేశ్, పెంటమ్మ దంపతులు కూలి పనుల కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. వారి కుమారుడు మహేందర్(12) నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతూ గ్రామంలోనే నానమ్మ వద్ద ఉంటున్నాడు. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ వెళ్లాడు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని భవనంపై శుక్రవారం గాలిపటం ఎగురవేసేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతిచెందాడు. చదువులో చురుకుగా ఉండే మహేందర్ మృతితో పాఠశాలలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు!
సంక్రాంతి సీజన్లో తోటి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసుకుంటున్నారని ఆ పిల్లాడు కూడా ముచ్చటపడ్డాడు. ''నాన్నా, గాలిపటం కొనుక్కుంటా.. రెండు రూపాయలు ఇవ్వవా'' అని ముద్దుగా అడిగాడు. ఆ మాత్రం దానికే ఆ తండ్రికి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు గానీ సదరు తండ్రి ఆ కొడుకును దారుణంగా కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన వారణాసిలో జరిగింది. వినోద్ రాజ్‌భర్ (35) తన భార్య గాయత్రి, కుమార్తె కోమల్, ఇద్దరు కొడుకులు శివం, సత్యంలతో కలిసి వారణాసిలోని గంజ్ ప్రాంతంలో ఉంటాడు. ఇటీవలి కాలంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో శివం గాలిపటం కొనుక్కుంటానని డబ్బులు అడిగాడు. అప్పటికే బాగా తాగి ఉన్న వినోద్.. కొడుకును మేడ మీదకు తీసుకెళ్లి, అతడిని తీవ్రంగా కత్తితో పొడిచాడు. తండ్రి అన్నయ్యపై దాడి చేస్తుండటాన్ని చూసిన సత్యం.. ఆ విషయాన్ని తన తల్లి గాయత్రికి చెప్పగా ఇద్దరూ కలిసి శివాన్ని ఆస్పత్రికి తరలించారు. పిల్లవాడి ఏడుపు విన్న చుట్టుపక్కల వాళ్లు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వాళ్లు వచ్చి వినోద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత సత్యాన్ని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
పైలట్లూ.. గాలిపటాలతో జాగ్రత్త!
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే గాలిపటాల జోరు బాగా కనిపిస్తుంది. దాదాపుగా భారతదేశంలో అన్నిచోట్లా వీటిని బాగానే ఎగరేస్తుంటారు. ఈ నేపథ్యంలో విమానాలు నడిపే పైలట్లు కాస్తంత చూసుకుని వెళ్లాలనం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తోంది. ప్రధానంగా గుజరాత్లో వీటి సందడి మరీ ఎక్కువగా ఉంటుందని, ఔత్సాహికులు చాలా పెద్దపెద్ద మాంజాలను ఉపయోగించి తమ గాలిపటాలను విమానాల కంటే కూడా ఎత్తులో ఎగరేస్తారని, అందువల్ల అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే పైలట్లు అప్రమత్తంగా ఉండాలని ఏఏఐ తెలిపింది. ముఖ్యంగా రాత్రిపూట ఈ గాలిపటాలు కనిపించే అవకాశం తక్కువని, పగటి పూట మామూలువే ఎగరేస్తున్నా, రాత్రిళ్లు మాత్రం లైట్లు అమర్చిన గాలిపటాలు ఎగరేస్తున్నారని, అందువల్ల విమానాలు టేకాఫ్ తీసుకునే సమయంలోను, ల్యాండింగ్ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఏఏఐ తెలిపింది. కేవలం ఒక్క అహ్మదాబాద్ మాత్రమే కాదని, ఇండోర్, వడోదర, సూరత్, ఉదయ్‌పూర్, ముంబై లాంటి నగరాల్లో కూడా గాలిపటాలతో తాము ఈ సీజన్ మొత్తం కాస్త జాగ్రత్తగానే ఉండక తప్పదని పైలట్లు అంటున్నారు. గుజరాత్లో ఉత్తర్యాన్ పేరుతో సంక్రాంతిని జరుపుకొంటారు. హైదరాబాద్‌లాగే అక్కడ కూడా భారీగా గాలిపటాల ఉత్సవాలు చేస్తుంటారు. అందుకే పైలట్లను ఏఏఐ హెచ్చరించింది. -
చైనా మాంజాపై నిషేధం ఎత్తివేతకు నో
న్యూఢిల్లీ : చైనా మాంజాపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్జీటీని ఆశ్రయించాలని సూచించింది. గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాకు అనుమతి ఇవ్వాలంటూ గుజరాత్ కు చెందిన వ్యాపారుస్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కాగా మనుషులు, జంతువులు, పక్షులకు ప్రాణాంతకంగా పరిణమించిన పతంగుల గాజుముక్కల మాంజాను ఎన్జీటీ దేశవ్యాప్తంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎన్జీటీ ఉత్తర్వులతో రాష్ట్రాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి. -
సంక్రాంతి వేడుకల్లో విషాదం
హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపుర్ అల్లూరి సీతారామరాజు నగర్లో గాలి పటం ఎగురవేస్తూ మల్లేశ్ అనే యువకుడు బిల్డింగ్‌పై నుంచి జారి పడిపోయాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మల్లేశ్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.