గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు!
గాలిపటానికి రూ. 2 అడిగితే.. పొడిచేశాడు!
Published Tue, Jan 17 2017 10:15 AM | Last Updated on Thu, Aug 16 2018 4:31 PM
సంక్రాంతి సీజన్‌లో తోటి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసుకుంటున్నారని ఆ పిల్లాడు కూడా ముచ్చటపడ్డాడు. ''నాన్నా, గాలిపటం కొనుక్కుంటా.. రెండు రూపాయలు ఇవ్వవా'' అని ముద్దుగా అడిగాడు. ఆ మాత్రం దానికే ఆ తండ్రికి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు గానీ సదరు తండ్రి ఆ కొడుకును దారుణంగా కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన వారణాసిలో జరిగింది. వినోద్ రాజ్‌భర్ (35) తన భార్య గాయత్రి, కుమార్తె కోమల్, ఇద్దరు కొడుకులు శివం, సత్యంలతో కలిసి వారణాసిలోని గంజ్ ప్రాంతంలో ఉంటాడు.
ఇటీవలి కాలంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో శివం గాలిపటం కొనుక్కుంటానని డబ్బులు అడిగాడు. అప్పటికే బాగా తాగి ఉన్న వినోద్.. కొడుకును మేడ మీదకు తీసుకెళ్లి, అతడిని తీవ్రంగా కత్తితో పొడిచాడు. తండ్రి అన్నయ్యపై దాడి చేస్తుండటాన్ని చూసిన సత్యం.. ఆ విషయాన్ని తన తల్లి గాయత్రికి చెప్పగా ఇద్దరూ కలిసి శివాన్ని ఆస్పత్రికి తరలించారు. పిల్లవాడి ఏడుపు విన్న చుట్టుపక్కల వాళ్లు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వాళ్లు వచ్చి వినోద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత సత్యాన్ని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement