గాలి పటం ఎగురవేస్తూ.. | boy died in kite flying | Sakshi
Sakshi News home page

గాలి పటం ఎగురవేస్తూ..

Published Sat, Jan 20 2018 8:31 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

boy died in kite flying

సాక్షి, నాగిరెడ్డిపేట: గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ బాలుడు మృతిచెందాడు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌ పంచాయతీ పరిధిలో గల అక్కంపల్లికి చెందిన మంత్రి మల్లేశ్, పెంటమ్మ దంపతులు కూలి పనుల కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్‌ వలస వెళ్లారు. వారి కుమారుడు మహేందర్‌(12) నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేట మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతూ గ్రామంలోనే నానమ్మ వద్ద ఉంటున్నాడు. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్‌ వెళ్లాడు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని భవనంపై శుక్రవారం గాలిపటం ఎగురవేసేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతిచెందాడు. చదువులో చురుకుగా ఉండే మహేందర్‌ మృతితో పాఠశాలలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement