ప్రతీకాత్మక చిత్రం
కాన్పూర్(ఉత్తరప్రదేశ్): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గాలిపటాలు ఎగరేయొద్దని ప్రజలకు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇళ్లలో గడుపుతున్న జనంలో కొంతమంది కాలక్షేపానికి పతంగులు ఎగరవేస్తున్నారు. దీన్ని గుర్తించిన కాన్పూర్ పోలీసులు పతంగులు ఎగరేయొద్దని బాలీవుడ్ హిట్ పాటలతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘గాలిపటాలు ఎగరవేయడం మానండి. మాట వినకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అనే అర్థం వచ్చేలా పాటలతో కాన్పూర్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పతంగులు ఎగరేయొద్దని పిల్లకు చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు.
కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 1,868 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సోకిన వారిలో 289 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ ఎగబాకుతోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు, మృతుల సంఖ్య 872కు చేరింది. కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రజలు మరికొంత కాలం ఇళ్లకు పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
చదవండి: కరోనా వైరస్.. మరో దుర్వార్త
Comments
Please login to add a commentAdd a comment