లాక్‌డౌన్ కారణంగా రహదారులన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో అడవిలో సంచరించే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చి హల్‌చల్ చేస్తున్నాయి. ఎలాంటి భయం లేకుండా వీధులపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా కోతులు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణ రోజుల్లోనే కోతులు ఇళ్లలోకి దూరి నానా హంగామా చేస్తుంటాయి. ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడంతో వీటికి హద్దే లేకుండా పోతుంది. ఇటీవల ఓ కోతి ఇంటి మేడ మీదకు ఎక్కి ఏకంగా గాలిపటాన్ని ఎగరేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద గురువారం తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. (మీకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైందా ?)
‘లాక్‌డౌన్ కారణంగా పరిణామం వేగంగా వృద్ధి చెందుతోంది. కోతి గాలిపటాన్ని ఎగరేస్తోంది. అవును ఇది ఖచ్చితంగా కోతినే’.. అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో కోతి గాలిపటానికి కట్టి ఉన్న దారన్ని లాగడం కనిపిస్తోంది. దారాన్ని చివరి వరకు పూర్తిగా లాగి గాలిపటాన్ని తన చేతితో పట్టుకుంటుంది. ప్రస్తుతం కోతి వీడియో వైరల్ అవ్వడంతో అనేకమంది దీనిపై స్పందిస్తున్నారు. ‘లాక్‌డౌన్ కారణంగా కోతి కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది’ అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. (ఎక్కడా చోటు లేదని ఇక్కడ దాక్కున్నావా..)
Comments
Please login to add a commentAdd a comment