ఇసుక తవ్వకాలపై 3న నివేదిక ఇవ్వండి
► కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు జరుపుతున్న అంశంపై 2 వారాల్లోగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని మార్చి 28న తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై రేలా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రాగా, గత ఆదేశాలు అమలు కాని విషయాన్ని స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
సిబ్బంది కొరత కారణంగా వెళ్లలేకపోయామని, ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు తనిఖీలు నిర్వహిస్తామని కాలుష్య నియంత్రణ మండలి బదు లిచ్చింది. మే 3న నివేదిక సమర్పించాలని, 4న విచారణ జరుపుతామని ధర్మాస నం స్పష్టం చేసింది. కాగా, ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీతకు యంత్రాలు వినియోగిస్తున్నామని, ఇందుకు వీలుగా ఇసుక తవ్వకాల నిషేధంపై ఉత్తర్వుల్లో సవరణ చేయాలని ఏపీ కోరగా ధర్మాసనం నిరాకరించింది.