Central Pollution Control Board
-
సగం మంది ఇంటి నుంచే పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సీజన్లోనే అత్యంత చలిరాత్రిని చవిచూసిన ఢిల్లీవాసులు బుధవారం సైతం పొగచూరిన సూర్యోదయాన్నే ఆస్వాదించాల్సిన దుస్థితి దాపురించింది. హస్తినవాసుల చలి, వాయుకాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 426గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా ‘తీవ్రం’ కేటగిరీనే కొనసాగిస్తోంది. కాలుష్యం కోరల్లో చిక్కిన ఢిల్లీలో ఇంకా జనం సొంత, ప్రజారవాణా వాహనాల్లో తిరిగితే కాలుష్యం మరింత పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. రోడ్లపై జనం రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆమ్ ఆద్మీ సర్కార్ సూచించింది. అయితే అత్యయక సేవల విభాగాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అగ్నిమాపకదళం, పోలీసులు, విద్యుత్, విపత్తు స్పందన దళం వంటి విభాగాల సిబ్బందికి ఈ వర్క్ ఫ్రమ్ హోం నిబంధన వర్తించదు.ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తంగా 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘ ప్రభుత్వ సిబ్బందితోపాటు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు సైతం 50 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించినవారవతారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య పనివేళలను కొద్దిగా మార్చండి. దీంతో ఆఫీస్వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కాస్తయినా మటుమాయం కావొచ్చు’’ అని ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా కోరారు. ‘‘ ఎక్కువ మంది సిబ్బంది రాకపోకల కోసం ప్రైవేట్ సంస్థలు షటిల్ బస్సు సేవలను వినియోగించుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సైతం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఇదే నియమాన్ని అమలుచేస్తోంది’’ అని రాయ్ సూచించారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఢిల్లీ చుట్టూతా బీజేపీపాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా సర్కార్ అనుసరిస్తున్న కాలుష్య నివారణ విధానాలనే మీరూ ఆచరించండి’ అని రాయ్ హితవుపలికారు.కొనసాగుతున్న గ్రేప్–4 నిబంధనకాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలుచేసిన నాల్గవ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రేప్)ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రేప్–4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్‌తో నడిచే మధ్యస్థాయి, భారీ రవాణా వాహనాలను ఢిల్లీలోనికి అనుమతించట్లేరు. పాఠశాల ఢిల్లీలో ఉదయం చాలా ప్రాంతాల్లో అరకిలోమీటర్లోపు ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్‌వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది. పలు విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం సరేసరి. చలి, తీవ్ర కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు కళ్ల మంటలు, శ్వాస సంబంధ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాయు నాణ్యతా సూచీని గణించే ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలోనూ పరిస్థితి ఇంకా రెడ్‌జోన్‌లోనే కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీలో వాయునాణ్యత మరీ దారుణంగా పడిపోయి ‘సివియర్ ప్లస్’గా రికార్డవడం తెల్సిందే. దీంతో సోమవారం నుంచి గ్రేప్–4ను అమల్లోకి తెచ్చారు. ప్రతి ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కాలుష్యవాయు గాఢత అలాగే కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసుల వాయుకష్టాలు పెరుగుతుండటంతో 2017 ఏడాది నుంచి ఈ గ్రేప్ నిబంధనలను అమలుచేస్తున్నారు. -
Central Pollution Control Board: నిర్భయంగా శ్వాసించండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తెలియజేసింది. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం(ఎన్సీఏపీ) పరిధిలో 131 నగరాలుండగా, వీటిలో 95 శాతం నగరాల్లో గాలి నాణ్యత మెరుగైనట్లు వెల్లడించింది. 2017–18 నాటి ‘పీఎం10’ స్థాయిలతో పోలిస్తే ఇప్పుడు 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీపీసీబీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. → ఎన్సీఏపీ పరిధిలోని 131 నగరాలను గాను కేవలం 18 నగరాల్లో గాలి నాణ్యత ప్రమాణాల మేరకు నమోదైంది. ఎన్ఏఏక్యూఎస్ ప్రకారం ‘పీఎం10’ ధూళి కణాలుక్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల్లోపు ఉండాలి. → కడప, వారణాసి, ధన్‌బాద్, డెహ్రాడూన్, ట్యుటికోరిన్, మొరాదాబాద్, కోహిమా, లక్నో, కాన్పూర్, ఆగ్రా, గ్రేటర్ ముంబై తదితర 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గాయి. → విజయవాడ, అహ్మదాబాద్, ఘజియాబాద్, రాజ్‌కోట్, రాయ్‌బరేలీ, కోల్‌కతా, జమ్మూ, సిల్చార్, దిమాపూర్, జోద్పూర్ తదితర 14 నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 నుంచి 40 శాతం తగ్గిపోయాయి. → హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, దుర్గాపూర్, డేరాబాబా నానక్, వడోదర, అలహాబాద్, అసన్‌సోన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరు, అకోలా, సూరత్, నోయిడా తదితర నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 శాతం దాకా పడిపోయాయి. → రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అమరావతి, ఢిల్లీ, హౌరా, థానే, లాతూర్, అల్వార్, మండీ గోవింద్గఢ్, పటియాలా, జైపూర్, చంద్రపూర్, నాసిక్, ఝాన్సీ, సాంగ్లీ తదితర 21 నరగాల్లో పీఎం10 స్థాయిలు 10 నుంచి 20 శాతం తగ్గిపోయాయి. → గాలిలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాన్ని 2024 నాటికి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో ఎన్సీఏపీ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. 2017 నాటి కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. → 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో సూరత్, జబల్పూర్ టాప్‌లో ఉన్నాయి. → 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్), అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. → 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్‌బరేలీ(యూపీ), నల్లగొండ (తెలంగాణ) టాప్ ర్యాంకులు సాధించాయి.→ వాయు నాణ్యతను మెరుగుపర్చడంలో ప్రతిభ చూపిన నగరాలకు కేంద్ర పర్యావరణ శాఖ శనివారం జైపూర్‌లో ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డులు’ ఇచ్చింది. -
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. -
ఢిల్లీలో వరుణుడి ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుణ దేవుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2007 తర్వాత నగరంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి. శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. వాయు నాణ్యత మెరుగుపడింది. గాలి నాణ్యత సూచి ఆదివారం ఉదయం 9 గంటలకు 54గా నమోదయ్యింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం ఇది ‘గుడ్’ కేటగిరీలోకి వస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది ప్రస్తుత సీజన్లో సగటు కంటే తక్కువే కావడం గమనార్హం. శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు కాగా, శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు. రెండింటి మధ్య వ్యత్యాసం 2.6 డిగ్రీలు. నగరంలో 1969 తర్వాత ఇదే అతి తక్కువ వ్యత్యాసమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1998 అక్టోబర్ 19న ఈ వ్యత్యాసం 3.1 డిగ్రీలు నమోదయ్యందని చెప్పారు. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఢిల్లీలో రుతుపవనాలు గత నెల 29న వెనక్కి మళ్లాయి. రుతుపవనాల సీజన్ ముగిసింది. పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంచుకొస్తున్న ముప్పు
సమస్త జీవన రంగాలనూ ఇప్పటికే చుట్టుముట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలు మున్ముందు మరింత ముప్పుగా పరిణమించబోతున్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక చేస్తున్న హెచ్చరిక అందరి కళ్లూ తెరిపించాలి. ఈ బెడద నుంచి బయటపడాలన్న ప్రయత్నాలు నత్తనడకనే ఉండటం ఆందోళన కలి గిస్తోంది. దేశంలో ఏటా 33 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) ఎన్నడో అంచనా వేసింది. అయిదేళ్లలో ఇది రెట్టింపుకన్నా ఎక్కువైందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సగటున ఏడాదికి 21.8 శాతం వ్యర్థాలు కొత్తగా వచ్చిపడుతున్నాయి. ఇందుకు ఆధునిక జీవనశైలిని, ప్రభుత్వాల నిర్లిప్త ధోరణిని ప్రధానంగా తప్పుబట్టాలి. ఏడాదిన్నరగా పట్టి కుదుపుతున్న కోవిడ్ మహమ్మారి కూడా ఈ వ్యర్థాల పెరుగుదలకు కారణమే. అయినా కదలికేది? ప్లాస్టిక్ వ్యర్థాల్లో 66 శాతం వాటా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బెంగాల్, తమిళనాడులదే. ఆ రాష్ట్రాలు అమలు చేసే చర్యలు, వాటి లోటుపాట్లు సమీక్షించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తగిన సలహాలివ్వాలి. ఆ పని చురుకందుకోవాలి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే దీన్ని వదుల్చుకోవడం అంత సులభం కాదు. ప్లాస్టిక్ వాడకం సదుపాయంగా ఉంటుందని చాలామంది చూస్తారు తప్ప, వాడి పడేశాక ఆ వ్యర్థాలు ఏమవుతాయన్న స్పృహ ఉండదు. పునర్వినియోగ ప్రక్రియతో అవి కొత్త రూపు సంతరించుకోవడం అంతంత మాత్రమే. దాని వాటా కేవలం 9 శాతం మాత్రమే. మిగతాదంతా నేలపై, డ్రైనేజీల్లో, నదులు, సముద్ర జలాల్లో చేరుతుంది. అవగాహన కొరవడి 12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతున్నారు. అది మరింత ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పశుపక్ష్యాదులకు సైతం ప్రాణాంతకంగా పరిణమిస్తాయని, వందల ఏళ్లపాటు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయనే చైతన్యం జనంలో కొరవడుతోంది. ఒకసారికి మాత్రమే వినియోగపడే ప్లాస్టిక్‌ను క్రమేపీ నిషేధించాలని మన దేశం చాన్నాళ్లక్రితమే అనుకుంది. అందుకు సంబంధించిన నిబంధనలు సైతం 2016లో ఖరారయ్యాయి. మరో రెండేళ్లకు పూర్తి స్థాయి నిషేధం దిశగా చర్యలుండాలని కూడా సంకల్పించుకున్నారు. కానీ ఆచరణ అంత మెరుగ్గా లేదు. వచ్చే ఏడాది జూలైకల్లా ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను నిషేధించాలనుకుంటున్నట్టు 3 నెలల క్రితం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్లాస్టిక్ అనగానే అందరికీ ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ 320 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్లకన్నా తక్కువుండే ప్లాస్టిక్ సంచులవరకూ అన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర రసాయనాలు, పెట్రో కెమికల్స్ విభాగం మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. కానీ వాటిని ఒక్కో రాష్ట్రం ఒక్కోవిధంగా అర్థం చేసుకుని నిబంధనలు తీసుకొచ్చాయి. ఏ రెండు రాష్ట్రాల మధ్యా సారూప్యత లేకుండా నిబంధనలుండటం వల్ల ఉత్పత్తిదారులు సులభంగా తప్పించుకుంటున్నారు. చర్యలు తీసుకునే విషయంలోనూ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వాలు ఎంతసేపూ చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులపై ప్రతాపం చూపుతాయి తప్ప ప్లాస్టిక్ సీసాలు, ఇతరత్రాు ఉత్పతతుŠుతలు చేసే భారీ సంస్థల జోలికిపోవు. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను ప్రపంచంలో అధికంగా ఉత్పత్తి చేసే సంస్థలేమిటో ఆరాతీయగా అందులో 90 శాతం కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని తేలింది. మనదేశానికి సంబంధించినంతవరకూ గెయిల్, ఇండియన్ ఆయిల్, హల్దియా పెట్రో కెమికల్స్, రిలయన్స్ తదితర సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ప్యాకేజింగ్ వాటా 60 శాతం ఉంటుందని లెక్కేస్తున్నారు. కానీ దాన్ని అరికట్టడంపై ఇంతవవరకూ సరైన అవగాహన లేదు. 2016లో రూపొందిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిదారు, దిగుమతి చేసుకునే సంస్థ, దాన్ని వినియోగించే సంస్థ ఆ వ్యర్థాల నిర్వహణకు జవాబుదారీతనం వహించాలి. ఇంతవరకూ అది అమల్లోకి రాలేదు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ చెత్తలో కలిసిపోయి, నదీజలాల్లోకి చేరి పర్యావరణం కాలుష్యమయం అవుతోంది. వాటిని తిని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకొచ్చినా వినియోగించుకునేవారు స్వల్పం. ఆమధ్య భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థల సమాఖ్య వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో కేవలం 7,500 రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటిలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలే. మహమ్మారిలా విస్తరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపు చేయడం వీటివల్ల సాధ్యమేనా? మరింత మెరుగైన సాంకేతికత, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడంలో శాస్త్రీయ విధానాల అమలు, బడా సంస్థలు సైతం రీసైక్లింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తేగానీ లక్ష్యసాధన నెరవేరదు. ప్రభుత్వాలు చురుగ్గా కదలకపోతే సమస్య అదుపు తప్పుతుంది. కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రహదార్లు నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. వీటికి నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు, మన్నిక కూడా అధికమంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడటానికి, ప్రాణాంతక వ్యాధులు విస్తరించడానికి పర్యావరణ విధ్వంసమే కారణమని పదేపదే రుజువవుతోంది గనుక ఈ సమస్యను ఇంకెంతమాత్రమూ ఉపేక్షించడానికి లేదు. గాలి, నీరు, నేల... ఇలా అన్నిటినీ సర్వనాశనం చేసే ప్లాస్టిక్ వినియోగంపై అందరినీ చైతన్యవంతం చేసే కార్యాచరణ తక్షణావసరం. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఎప్పటినుంచంటే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జూలై 1 నుంచి వివిధ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌ల వంటి వాటిపైనే నిషేధం ఉండగా..ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటిఫికేషన్ రూపంలో దీనిపై ఆదేశాలు జారీచేసింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా.. ప్రజల్లో అవగాహన కల్పనకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. నిషేధం వీటిపైనే.. ► ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, ఉత్పత్తి, దిగుమతి, స్టాక్ పెట్టుకోవడం, అమ్మకం, సరఫరా, పంపిణీ, వినియోగం తదితరాలు.. ► ఇయర్ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ఐస్‌క్రీం, క్యాండీలకు ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్ ► అలంకరణకు ఉపయోగించే థర్మకోల్ ► ప్లేట్లు, గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేల వంటి సామగ్రి ► స్వీట్‌బాక్స్‌లు ప్యాకింగ్ చేసే ఫిల్మ్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు ► వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్/ పీవీసీ బ్యానర్లు ఉల్లంఘనులపై జరిమానాలు... ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సీపీసీబీ నిర్ణయించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్రాల పీసీబీలు లేదా కాలుష్య నియంత్రణ కమిటీలకు కల్పించింది. రిటైల్ వ్యాపారులు, అమ్మకందారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులపై జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిమానాలు విధించవచ్చు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై రూ.500, పారిశ్రామిక వ్యర్థాలకు కారణమయ్యే వారికి రూ.5 వేల చొప్పున జరిమానా వేయొచ్చు. ప్రత్యామ్నాయాలివే... ► పత్తి/ ఉన్ని/వెదురుతో తయారు చేసిన బ్యాగ్‌లు ► స్పూన్లు, స్ట్రాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వెదురు లేదా ఇతర పదార్థాలతో తయారు చేసే వస్తువులను ఉపయోగించవచ్చు ► వేడి పానీయాలు, ఇతర అవసరాల నిమిత్తం మట్టిపాత్రల వంటివి వాడొచ్చు. -
ఢిల్లీలో శబ్దాలు చేస్తే రూ. లక్ష జరిమానా
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇకపై ఎవరైనా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ముందుగా అనుమతి లేకుండా పెళ్లిళ్లు, పండుగల్లో బాణాసంచా పేల్చినా, లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్స్ వాడితే విధించే జరిమానాలను సవరించినట్టుగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సవరించిన జరిమానాల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబల్, రాత్రి వేళల్లో 45 డెసిబల్ శబ్దాలకు మాత్రమే అనుమతి ఉంది. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్లగా ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే మొదటిసారి రూ. 20 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తారని డీపీసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. 1,000 కేవీఏకి మించి డీజీ సెట్స్ వినియోగిస్తే రూ.లక్ష, 62.5 నుంచి 1,000 కేవీ మధ్య డీజీ సెట్స్ వాడితే రూ. 25 వేలు, 62.5 కేవీఏ వరకు డీజీ సెట్స్‌పై రూ.10 వేలు జరిమానా విధించాలని నిబంధనల్ని సవరించారు. -
వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..
న్యూఢిల్లీ: మాస్క్‌లను, చేతి తొడుగులను వాడిన తరువాత, వాటిని ముక్కలుగా కత్తిరించి కనీసం 72 గంటల పాటు పేపర్ బ్యాగ్‌లలో ఉంచి, ఆ తరువాత మాత్రమే పారవేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తాజాగా విడుదల చేసిన కోవిడ్–19 మార్గదర్శకాల్లో పేర్కొంది. వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, సంస్థల్లో సాధారణ జనం వాడిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ముక్కలుగా చేసి, ప్రత్యేక బిన్లో మూడు రోజుల పాటు ఉంచిన తరువాత, మామూలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో తెలిపారు. బయో మెడికల్ వేస్ట్‌ని పసుపురంగు బ్యాగుల్లో వేయాలని, ఈ పసుపు రంగు బ్యాగులను సాధారణ చెత్తను తీయడానికి వాడరాదని వెల్లడించారు. అయితే కోవిడ్ రోగులు వాడిన ఖాళీ వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహారాన్ని బయో మెడికల్ వేస్ట్‌తో కలపరాదని, సాధారణ చెత్తతో పాటే వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
మన గాలి వెరీ'గుడ్'
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు తొలిసారిగా హరిత జోన్ (గ్రీన్‌జోన్)లో స్థానం సంపాదించాయి. నెలకు పైగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి పలు నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత పెరిగింది. గతంలో ఏ కాలంలోనైనా (ముఖ్యంగా వేసవిలో) ఈ స్థాయిలో మెరుగైన వాయునాణ్యత రికార్డయిన దాఖలాల్లేవు. లాక్‌డౌన్‌తో వాహనాలు, పరిశ్రమలు, ఇతర త్రా రూపాల్లోని కాలుష్యం తగ్గి పోవడంతో మొదటిసారి రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ‘గ్రీన్‌జోన్’లో స్థానం పొందాయి. హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి వంటి నగరాలు మెరుగైన పాయింట్లు సాధించా యి. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పలు నగరాల్లో వాయు నాణ్యతలో గణనీయమైన మార్పులొచ్చాయి. గత వర్షాకాలంలో నమోదైన వాయు నాణ్యత స్థాయిలో ఈ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత నమోదైందంటే లాక్డౌన్ ఎంత మార్పు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వాయు నాణ్యత 0–50 పాయింట్లుగా ఉంటే దానిని గ్రీన్‌జోన్‌గా పరిగణిస్తారు. దక్షిణాది నగరాలే ‘గుడ్’: లాక్డౌన్ కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు వాయు నాణ్యతసూచీలో ‘గుడ్’ కేటగిరీ సాధించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల తో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, మొత్తంగా దక్షిణాది నగరాలతో పోలిస్తే ఉత్తరాది నగరాలు ఇంకా మెరుగైన స్థితి సాధించలేదు. దేశవ్యాప్తంగా.. గతేడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం బారినపడిన 20 నగరాల్లో మన దేశంలోని 14 నగరాలు నిలవగా, ఇప్పుడు సుదీర్ఘ లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. న్యూమోనియా వంటి వ్యాధులతో పోరాడేందుకు స్వచ్ఛమైన వాయువు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత నెలలో వాయునాణ్యతను పరీక్షించినపుడు దాదాపు సగం నగరాలు మాత్రమే ‘శాటిస్ఫాక్టరి’ కేటగిరీలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 103 నగరాల్లో 90శాతానికి పైగా నగరాల్లో వాయు నాణ్యత మెరుగుపడి, ‘గుడ్’ కేటగిరిలోకి చేరినట్టు సీపీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నగరాల్లో ‘గాలి’ మారింది.. బుధవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3.15కి సమీర్ యాప్ ద్వారా ఏక్యూఐ డేటాను సీపీసీబీ అప్డేట్ చేసింది. అందులోని లెక్కల ప్రకారం.. 25 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి టాప్‌లో నిలిచింది. హైదరాబాద్‌లో మొత్తంగా వాయునాణ్యత 47 పాయింట్లుగా నమోదైంది. ఇంకా నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇక్రిశాట్ కాలనీ వద్ద 38 పాయిం ట్లు, హైదరాబాద్ వర్సిటీ వద్ద 42, ఎర్రగ డ్డ సమీపంలో 46, బొల్లారం ఇండస్ట్రియ ల్ ఏరియా వద్ద 48, శివార్లలోని ముత్తంగి చెరువు సమీపంలో 51, జూ పార్కు వద్ద 55 పాయింట్లుగా వాయునాణ్యత నమోదైంది. దక్షిణాది నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం నమోదైన వాయు నాణ్యత స్థాయిలివీ.. గాలికీ ఓ లెక్కుంది! వాయు నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్ యాప్’ ద్వారా ఆన్లైన్ లో వెల్లడిస్తుంటుంది. ఏక్యూఐ 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు. అంతకుమించి తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. -
ప్లాస్టిక్కే.. పెనుభూతమై..
ప్లాస్టిక్ భూతం మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. నదీ, సముద్ర జలాలను కలుషితం చేస్తూ జీవరాశి ప్రాణాలను హరిస్తోంది.. భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది భూమిలో వందల ఏళ్లపాటు తిష్ట వేసి భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తూ పంటల దిగుబడిని దెబ్బతీస్తోంది.. కాలుస్తుంటే గాలిని కలుషితం చేస్తూ వ్యాధులకు దారితీస్తోంది.. ఆకాశాన్నంటుతున్న కాలుష్యంతో భూతలం మీద జీవుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.. మన దైనందిన జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ కలిగిస్తున్న పెనుముప్పు ఇది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) లెక్కల ప్రకారం.. దేశంలో ప్రతి ఒక్కరు ఏడాదికి సగటున 11 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో 130 కోట్ల జనాభా ఏడాదికి 1,430 కోట్ల కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం ఏడాదికి 2022 నాటికి 20 కిలోలకు, 2025 నాటికి 25 కిలోలకు చేరుతుందని అంచనా. కాగా.. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 109 కిలోలు, చైనాలో 38 కిలోలు వినియోగిస్తున్నారు. సాక్షి, అమరావతి: ఉదయం లేచాక ఇంటికి టిఫిన్ తెచ్చుకోవడం నుంచి ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు, పండ్లు, పిల్లలకు చిరుతిండ్లు, ఆన్లైన్ షాపింగ్‌ల వరకు.. మరెన్నో రకాలుగా లెక్కకు మిక్కిలిగా సింగిల్ యూజ్ (ఒకసారి వాడి పారేసేది) ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు మన ఇంటిలో చేరుతున్నాయి. మన దేశంలో రోజుకు 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతున్నాయని అంచనా. ఇందులో మున్సిపాలిటీలు, పంచాయతీలు సేకరించని వ్యర్థాలు దాదాపు 10 వేల టన్నులు. అంటే.. ఆ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్ చేయడం లేదు. వీటికి అదనంగా ఆన్లైన్ మార్కెటింగ్, ఆహార పదార్థాల డెలివరీ యాప్‌ల ద్వారా నెలకు 22 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అదనంగా చేరుతున్నాయి. ఈ వ్యర్థాలన్నీ మన కాలనీల్లో, ఊళ్లల్లో, రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కొన్నాళ్లకు కాలువలు, చెరువులు, నదులు, సముద్రాల్లో చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8 మిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని ఎలన్ మెక్‌థన్ ఫౌండేషన్ అంచనా వేసింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. 2016లో కేంద్రం రూపొందించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం.. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. రోజువారీ వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా విభజించి ఇంటింటికీ వెళ్లి సేకరించడం, వాటిని రీసైక్లింగ్ చేయడం, అనంతరం మిగిలిన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం చేయాలి. ఈ నిబంధనలకు 2018లో కేంద్రం సవరణలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వెదజల్లే సంస్థలనే బాధ్యులను చేసింది. రీసైక్లింగ్ చేయడానికి వీలులేని మల్టీలేయర్ ప్లాస్టిక్ (చిప్స్ ప్యాకెట్లకు వాడేది)ను రెండేళ్లలో పూర్తిగా నిషేధించాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కేంద్రం రెండేళ్లపాటు వాయిదా వేసింది. దేశంలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించినా అమలు సక్రమంగా లేదు. చాలా రాష్ట్రాల్లో తూతూమంత్రంగా సాగుతోంది. ప్రభుత్వాలు ఏం చేయాలి? - సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. - ప్లాస్టిక్ వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని కలిగించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. ప్యాకింగ్ అవసరాల కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. - సిక్కిం దేశంలోనే తొలిసారిగా 1998లోనే సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. సమర్థంగా అమలు చేస్తోంది. సిక్కింను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రజలు ఏం చేయాలి? - ఇళ్లల్లో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి. రాగి, గాజు నీళ్ల సీసాలు వాడాలి. - పాలు, ఇతర పదార్థాలు, వస్తువుల ద్వారా వచ్చే ప్లాస్టిక్ కవర్లను చెత్తతో కలిపి పారేయకుండా ఒకచోట ఉంచి నెలకోసారి వాటిని పాత సామాన్లు, పాత పేపర్లు కొనేవారికి విక్రయించాలి. ఇలా చేస్తే వాటి రీసైక్లింగ్ సాధ్యమవుతుంది. - మార్కెట్‌కు వెళ్లేటప్పుడు చేతి సంచీ తీసుకెళ్లడంతోపాటు వాహనాల్లోనూ ఓ సంచీ పెట్టుకోవాలి. సంప్రదాయ, దేశీయ విధానాలే ఉత్తమం.. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలాలి అంటే మనం పాత పద్ధతులనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫంక్షన్లలో భోజనాలకు ఆకులతో చేసిన విస్తర్లు/అరటి ఆకులు వేసేవారు. సరుకుల ప్యాకింగ్‌కు పాత పత్రికలు, చిత్తు కాగితాలు వాడేవారు. విస్తర్లు, పేపర్ కవర్ల తయారీ కుటీర పరిశ్రమగా ఉండి ఎంతోమందికి స్వయం ఉపాధి లభించేది. అదేవిధంగా జనపనార ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచాలి. కొద్ది రోజుల కిందట తమిళనాడులో ఒక ఆవు అనారోగ్యంతో ఉండటంతో దాని యజమాని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా పరిశీలించిన వైద్యులు దాని కడుపులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని తేల్చారు. ఏకంగా ఐదు గంటలపాటు ఆవుకు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వ్యర్థాలను బయటకు తీశారు. అవి ఏకంగా 52 కిలోలు ఉండటం చూసి నివ్వెరపోయారు. రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా పెరిగిపోతున్నాయనేదానికి, ఎలాంటి అనర్ధాలు సంభవిస్తాయి అనేదానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ప్లాస్టిక్‌తో నష్టాలెన్నో.. - నదులు, సముద్ర జలాల్లో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాలను చేపలు, కొన్ని అరుదైన తాబేళ్లు, తిమింగలాలు తిని మరణిస్తున్నాయి. విషతుల్యమైన చేపలను తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. - వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినడానికి, తాగడానికి వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల నుంచి కరిగిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల చర్మ, జీర్ణకోశ సమస్యలు, థైరాయిడ్, గొంతు నొప్పి సంభవిస్తున్నాయి. - ప్లాస్టిక్‌ను కాలుస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం విడుదలై శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడంతో భూగర్భ జలాలు కలుషితమై మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. - ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి పొరల్లో వందల ఏళ్లు ఉండిపోతుండటంతో భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా 8 లక్షల తాబేళ్లు, 10 లక్షల సముద్ర పక్షులు, మరెన్నో చేపలు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ రహిత జిల్లాయే లక్ష్యం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మూడు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చాం. క్రెడాయ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో రైతు బజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. – ఇంతియాజ్, కలెక్టర్, కృష్ణా జిల్లా సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి నిషేధించాలి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని ప్రభుత్వం నిషేధించాలి. అన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు తగిన మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిని, మార్కెటింగ్‌ను పెంచాలి. – మనోజ్ నలనాగుల, పర్యావరణ శాస్త్రవేత్త ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. అడ్డాకులతో చేసిన విస్తర్లు, ప్లేట్లు, కాగితాల కవర్లు, జనపనార ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంతోపాటు వాటి మార్కెటింగ్‌కు ప్రభుత్వాలు కృషి చేయాలి. దీంతో ఎంతోమందికి స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. – జేవీ రత్నం, గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధి సమన్వయంతోనే సమర్థంగా.. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం కోసం 2008లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. విద్యాసంస్థలు, మార్కెట్లు, కూరగాయల బజార్లతోపాటు ఇంటింటికీ తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మూడేళ్లలోనే బొబ్బిలి మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా చేయగలిగాం. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనిచేస్తే రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేదాన్ని సమర్థంగా అమలు చేయొచ్చు. – రాజగోపాల్ నాయుడు, అమ్మ ఫౌండేషన్, బొబ్బిలి ప్లాస్టిక్‌ను తినేసే బ్యాక్టీరియా ప్లాస్టిక్ వ్యర్థాల ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. స్పెయిన్‌లోని కాంటాబ్రియా యూనివర్సిటీలో బయోమెడిసిన్– బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను తినే చిన్న పురుగులను గుర్తించారు. అయితే.. ఆ పురుగులపై ఎంతవరకు ఆధారపడొచ్చు.. వాటితో ఇతర సమస్యలేమైనా తలెత్తుతాయా అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
చెవిమోతలో గ్రేటర్ ఫైవ్
సాక్షి, హైదరాబాద్ : అబ్బా.. సౌండ్ పొల్యూషన్.. రోడ్డెక్కితే రోజూ మనం అనుకునేది ఇదే.. డొక్కు వాహనాల శబ్దాలు, నిర్మాణ సంబంధ యంత్రాల రణగొణ ధ్వనులు, పరిశ్రమల్లోని భారీ యంత్ర పరికరాల చప్పుళ్లు, ట్రాఫిక్జాంలో హారన్ల మోతలు.. ఇలా రకరకాల కారణాలతో మొత్తమ్మీద సిటీ గూబ గుయ్యిమంటోంది. ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలు అన్న తేడా లేదు.. అన్నింటా బ్యాండ్ బాజాయే.. నిజానికి ప్రతి దానికీ ఒక లిమిట్ ఉండాలి. అలాగే ఈ శబ్ద కాలుష్యానికి కూడా.. వాస్తవానికి ఆ పరిమితి ఎంత? నగరంలో దాన్ని మించి ఎంత ఉంది అన్న లెక్కలను పరిశీలిస్తే.. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతాల్లో 65, పారిశ్రామిక ప్రాంతాల్లో, 75 డెసిబుల్స్ శబ్ద అవధిని మించరాదు. నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 45, వాణిజ్య ప్రాంతాల్లో 55, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 డెసిబుల్స్ మించరాదు. కానీ గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం 70 నుంచి 90 డెసిబుల్స్..రాత్రి వేళల్లో సరాసరిన 65–75 డెసిబుల్స్ మేర శబ్దాలు వెలువడుతున్నాయి. ఇక దేశంలోని పరిస్థితి లెక్కేస్తే.. లక్నో తొలిస్థానంలో నిలవగా..రెండో స్థానంలో కోల్‌కతా, మూడోస్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో ముంబై, ఐదో స్థానంలో గ్రేటర్ హైదరాబాద్‌లు నిలిచినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిస్థితి ఇదీ.. (డెసిబుల్స్‌లో) -
కోరలు చాస్తున్న కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ ధూళికణాల కాలుష్యంతో గ్రేటర్ హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏటేటా పెరుగుతోన్న వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో నగరవాసులు సతమతమవుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ ధూళికణాల మోతాదు 15 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ మహానగరంలో ఘనపు మీటరు గాలిలో 2016లో 40, 2017లో 49, 2018 జూన్ నాటికి 52 మైక్రోగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఈ సూక్ష్మ ధూళికణాలు తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతోనే గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. కాలుష్యానికి కారణాలివే.. ♦ ప్రధానంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతోన్న పొగ ద్వారా 50% సూక్ష్మ ధూళికణాలు గాలిలో చేరుతున్నాయని నివేదిక వెల్లడించింది. ♦ మరో 11 శాతం రహదారులపై ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి కారణం. ♦ చెత్తను బహిరంగంగా తగలబెడుతుండడంతో 7 శాతం సూక్ష్మ ధూళికణాలు వెలువడుతున్నాయి. ♦ పరిశ్రమల నుంచి వెలువడుతోన్న పొగ, ఇతర ఉద్గారాల కారణంగా మరో 33 శాతం ♦ గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు విడుదల చేస్తున్న పొగ, రహదారులపై రేగుతున్న దుమ్ము. ♦ శివారు ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో, గాలిలో సూక్ష్మ ధూళికణాలు పెరిగి, సమీప ప్రాంత వాసుల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ♦ బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శృతిమించుతున్నట్లు తేలింది. ♦ ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు వెల్లడైంది. ♦ బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగా కాలుష్య ఉధృతి ఉన్నట్లు తేలింది. ♦ గ్రేటర్ పరిధిలోని 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ♦ గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లను ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ♦ వాహనాల సంఖ్య లక్షలు దాటినా, గ్రేటర్లో 10 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ♦ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం (ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ధూళి కాలుష్యంతో అనర్థాలివే.. ♦ పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ ధూళి రేణువులు పీల్చే గాలిద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ♦ చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ♦ తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది. ♦ ధూళి కాలుష్య మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. ♦ ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. -
ఇసుక తవ్వకాలపై 3న నివేదిక ఇవ్వండి
► కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు జరుపుతున్న అంశంపై 2 వారాల్లోగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని మార్చి 28న తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై రేలా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రాగా, గత ఆదేశాలు అమలు కాని విషయాన్ని స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది కొరత కారణంగా వెళ్లలేకపోయామని, ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు తనిఖీలు నిర్వహిస్తామని కాలుష్య నియంత్రణ మండలి బదు లిచ్చింది. మే 3న నివేదిక సమర్పించాలని, 4న విచారణ జరుపుతామని ధర్మాస నం స్పష్టం చేసింది. కాగా, ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీతకు యంత్రాలు వినియోగిస్తున్నామని, ఇందుకు వీలుగా ఇసుక తవ్వకాల నిషేధంపై ఉత్తర్వుల్లో సవరణ చేయాలని ఏపీ కోరగా ధర్మాసనం నిరాకరించింది. -
చెవికి చిల్లులే...
- ధ్వని కాలుష్యంలో గ్రేటర్ నాలుగో స్థానం - యువతలో వినికిడి శక్తి తగ్గుతోందంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: లక్షల్లో దూసుకుపోతున్న వాహనాలు... కుర్రకారు వాడే ఆధునిక హారన్లు... రణగొణలతో సిటిజనుడి గూబ గుయ్యిమంటోంది. కాలం చెల్లిన డొక్కు బస్సులు, కార్లు... ఎక్కడ చూసినా ట్రాఫిక్ పద్మవ్యూహాలు... ధ్వని కాలుష్యంతో భాగ్యనగరి దద్దరిల్లుతోంది. దేశంలో అత్యధికంగా శబ్ద కాలుష్యం బారినపడే ఆరు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ది నాలుగో స్థానం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సగటున 85 డెసిబుల్స్ శబ్ద కాలుష్యంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో 80 డెసిబుల్స్‌తో ఢిల్లీ, 75 డెసిబుల్స్‌తో చెన్నై ఉన్నాయి. 73 డెసిబుల్స్ కాలుష్యంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధార ణంగా మనిషి వినే శబ్ద అవధి 55 డెసిబుల్స్ ను మించరాదు. ధ్వని కాలుష్యంవల్ల యువతలో వినికిడి శక్తి 15 శాతం మేర తగ్గుతున్నట్లు ఈఎన్టీ వైద్య నిపుణులు చెబుతున్నారు. నగరంలో శబ్ద కాలుష్యానికి కారణాలివే ► కుర్రకారు వినియోగించే మోడిఫైడ్ హారన్ల వల్ల శబ్ద అవధి 75 డెసిబుల్స్ కంటే అధికంగా ఉంటోంది. ► గ్రేటర్ లో వాహనాల సంఖ్య 46 లక్షలు. బయటి నుంచి నిత్యం 10 లక్షల వరకు వస్తాయి. ఇవన్నీ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవడంతో ఏర్పడే రణగొణలతో ధ్వని రెట్టింపవుతోంది. ► మెట్రో రైలు పనుల నేపథ్యంలో భారీ నిర్మాణ యంత్ర సామగ్రి వినియోగం, స్టీలు, ఇనుప బారికేడ్లు తదితరాల వల్ల కూడా అధిక ధ్వనులు వెలువడుతున్నాయి. వివిధ నిర్మాణాల్లో జేసీబీలతో తవ్వకాలు, బోర్లు, జనరేటర్ల వినియోగం వల్లా ధ్వనులు పెరుగుతున్నాయి. ► నగరంలో కాలం చెల్లిన వాహనాలు 20 లక్షలు. ఇవన్నీ రోడ్డెక్కుతుండడంతో రణగొణలు అధికమవుతున్నాయి. ► గ్రేటర్ లో మొత్తం వాహనాలు 46 లక్షలు. అందుబాటులో ఉన్న రహదారులు 6,500కి.మీ. మాత్రమే. దీంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడి హారన్లు మోతమోగుతున్నాయి. ► డీజే సంగీత హోరుకు కూడా యువత వినికిడి శక్తి కోల్పోతోంది. అత్యధికంగా నమోదయ్యే ప్రాంతాలు ► నగరంలో అత్యధికంగా 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం వెలువడుతున్న జాబితాల్లో అబిడ్స్, పంజగుట్ట, జూబ్లీహి ల్స్, ప్యారడైజ్,చార్మినార్, జేబీఎస్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కూకట్పల్లి, జేఎన్టీయూ తదితర ప్రాంతాలున్నాయి. సెలైంట్ జోన్స్‌గా పరిగణించే కోర్టులు, ఆస్పత్రు లు, ప్రార్థనా స్థలాలు, జూపార్క్ వంటి ప్రాంతాల్లోనూ శబ్ద కాలుష్యం 70 డెసిబుల్స్‌ను దాటుతుండడంతో రోగులు, వణ్యప్రాణులు అవస్థలు పడుతున్నాయి. కలిగే నష్టాలివే... ► పగటి వేళల్లో 55, రాత్రి వేళల్లో 45 డెసిబుల్స్ శబ్ద అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్నవారికి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. నిద్రలేమి, అలసట, రక్తపోటు పెరుగుతాయి. ► నగరంలో ఈఎన్టీ వైద్యులను సంప్రదిస్తున్న ప్రతి వెయ్యి మందిలో 20 శాతం మందికి వినికిడి శక్తి తగ్గినట్టు గుర్తించారు. ► నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారు. వారి గుండె వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► అత్యధిక ధ్వనులు విన్నపుడు పిల్లల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. ఇలా కాపాడుకోవాలి ► కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయిన 8 గంటల పాటు నిరంతరాయంగా 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ► అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి. ► sాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. -
డబ్ల్యూహెచ్ఓ నివేదిక తప్పు
వాయుకాలుష్య నివేదికపై మండిపడ్డ జవదేకర్ భారత్‌నే లక్ష్యంగా చేసుకుంటున్న పాశ్చాత్య దేశాలు న్యూఢిల్లీ: వాయుకాలుష్యం పైప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదిక పూర్తిగా తప్పుదారి పట్టించేదిలా ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోతున్న 100 నగరాల్లో 30 నగరాలు భారత్‌కు చెందినవే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదకలో పేర్కొనడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. వాయుకాలుష్యంపై పాశ్చాత్య దేశాలు భారత్‌నే లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపాదేశాలతోపాటు భారత్‌లోని నగరాల్లో కాలుష్యంపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను విడుదల చేస్తామని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో నివేదికలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, బెంజిన్ వంటి కీలక కాలుష్య కారకాలను కారణాలుగా చూపలేదన్నారు. 2012-13 నాటి సమాచారాన్ని విశ్లేషించి ఢిల్లీ నగరం వాయుకాలుష్యంలో 11 వస్థానంలో ఉందని.. దీనిపై ప్రపంచ పర్యావరణ వేత్తలు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. పీఎం 2.5 స్థాయి ఆధారంగా నగరాల్ని వర్గీకరించారని..కానీ వీటికంటే వాయుకాలుష్యంను పెంచే ఓజోన్ కాలుష్యం, బె ంజిన్ కాలుష్యం, సల్ఫర్ డైయాక్సైడ్, నైట్రోజన్ డైయాక్సైడ్‌లు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి తెలిపారు. పీఎం స్థాయి 2.5 ఉన్న నగరాలు ప్రత్యేకంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చాలా ఉన్నాయన్నారు. త్వరలో తమ ప్రభుత్వం విడుదల చేయబోయే వాయుకాలుష్య నగరాల జాబితాను డబ్ల్యూహెచ్‌వో నివేదికకు కౌంటర్ పార్ట్ కాదని.. కేవలం ప్రజల అవగాహన కోసమేనని మంత్రి వివరించారు. పీఎం 1 పై పర్యవే క్షణకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి తెలిపారు. -
మన హైదరాబాద్ నెం - 4
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో వెల్లడి నగర వాసుల ఆరోగ్యానికి పొగ మేలుకోకపోతే ముప్పు తప్పదు సిటీబ్యూరో: మహా నగరంపై కాలుష్య రక్కసి దాడి చేస్తోంది. నగర వాసుల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అన్ని వయసుల వారినీ మంచాన పడేలా చేస్తోంది. వాయు కాలుష్యంలో దేశంలోని ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ నగరం నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. సీపీసీబీ తాజా నివేదికలో వాయు కాలుష్యంలో ఎప్పటిలాగానే దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో... కోల్‌కతా మహా నగరం రెండో స్థానంలో నిలిచాయి. మూడు, నాలుగో స్థానాల్లో ముంబ యి, హైదరాబాద్ ఉన్నాయి. మన పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఐదు, ఆరుస్థానాల్లో నిలిచాయి. ప్రధానంగా సూక్ష్మ ధూళి కణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల మోతాదు పెరగడంతో నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. పలువురి ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం... ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు వాయు కాలుష్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. కాలుష్యానికి ప్రధాన కారణాలివే... గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 45 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వాటికి తోడు రోజూ కొత్తగా 800 వాహనాలు రోడ్డెక్కుతుండడంతో రహదారులు కిక్కిరిసిపోయి నగరం పొగ చూరుతోంది. ప్రధాన రహదారులపై వాహనాల వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోవడంతో ఇంధన వినియోగం బాగా పెరుగుతోంది. మరోవైపు సర్వీసింగ్ చేయకుండానే నడుపుతుండడంతో లక్షలాది వాహనాల నుంచి వెలువడుతున్న పొగ దట్టమైన మేఘాలను తలపిస్తోంది. దీనిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటున్నాయి. కొన్ని పెట్రోలు బంకుల్లో కల్తీ ఇంధ న విక్రయంతో కాలుష్య కారకాల మోతాదు అధికంగా నమోదవుతున్నట్లు పీసీబీ అధ్యయనంలో తేలింది. ప్రధాన నగరంలో మెట్రో పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల ఏర్పాటుకు తవ్వకాలు జరుపుతున్నప్పుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలిసి శ్వాసించే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి.మహా నగరంలో నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం..తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగు నీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో దుమ్ము, ధూళి కాలుష్యం పెరుగుతోంది. జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తిచేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నాయి. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు అలాగే వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం మరింత పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాహనాల వేగానికి రహదారులపై పైకి లేచే దుమ్ము, ధూళి... ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగలో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాల మోతాదు పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. పంజగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోంది. వాయు కాలుష్యం నమోదుకు ఫిన్లాండ్ యంత్రం నగరంలో వాయు కాలుష్యం మోతాదును, గాలిలో సుమారు 250 రకాల కాలుష్య కారకాలను లెక్కించేందుకు ఫిన్లాండ్ దేశానికి చెందిన పోర్టబుల్ ఎయిర్‌క్వాలిటీ మానిటరింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ పీసీబీ ప్రయత్నిస్తోంది. ఇటీవల బెంగళూరులోని బయోకాన్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన యంత్రాన్ని పీసీబీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. దీని పనితీరు సంతృప్తికరంగా ఉందని వారు ‘సాక్షి’కి తెలిపారు. దీని ఖరీదు సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుందని... నగరంలోని ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అనర్థాలివీ.. వాయు కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాసకోస సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ఆస్తమా, బ్రాంకైటీస్, హై బ్లడ్‌ఫ్రెషర్, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం తదితర వ్యాధులతో జనం సతమతమవుతున్నారు. వివిధ ఆస్పత్రులకు వస్తున్న వారిలో 90 శాతానికి పైగా రోగులు వాయు కాలుష్యం బారిన పడుతున్నవారేనని వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తులకు ప్రమాదమే గాలిలో కలిసి ఉండే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, దుమ్ము, ధూళి రేణువులు సూర్యకిరణాలతో రసాయనిక సంయోగం చెంది ఫొటో కెమికల్ సొల్యూషన్ ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావంతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. వీటి వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా కేసులు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యత, మన్నిక కలిగిన మాస్క్‌లను ధరించడం ద్వారా కొంతవరకు కాలుష్యం నుంచి బయటపడవచ్చు. కొన్నిసార్లు ధూళి రేణులువులు రక్తంతో కలిసిపోయి రక్తప్రసరణకు అడ్డుగా నిలిచి గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదం ఉంది. - డాక్టర్ సుధీర్ నడింపల్లి, పల్మనాలజిస్టు,సన్‌షైన్ ఆస్పత్రి సీపీసీబీ తాజా లెక్కల ప్రకారం గ్రేటర్లో కాలుష్య కారకాల మోతాదు ఇలా... ప్రతి ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించడం గమనార్హం. ఘనపు మీటరు గాలిలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదు ఒక గ్రాముకు మించరాదు. కానీ చాలా ప్రాంతాల్లో 3 గ్రాములుగా నమోదైంది. ఘనపు మీటరు గాలిలో సల్ఫర్‌డయాక్సైడ్ మోతాదు 80 గ్రాములకు మించరాదు. చాలా ప్రాంతాల్లో వంద గ్రాములు దాటడం గమనార్హం. -
నది కాలుష్యాన్ని నియంత్రించాలని హైకోర్టు ఉత్తర్వులు
భువనగిరి, న్యూస్‌లైన్: జంట నగరాల్లోని పారిశ్రామికవాడల నుంచి విడుదలయ్యే కాలుష్యం మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పోచంపల్లి, చౌటుప్పల్, బీబీనగర్ మండలాలతో పాటు మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అయితే మూసీ కాలుష్యం నుంచి తమను కాపాడాలని ఎంతోకాలంగా నది పరీవాహక ప్రజలు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు మాటలతో కాలం గడపడం తప్పా నిజాయితీగా చర్యలు చేపట్టింది లేదు. లెక్కలు కట్టడంలో మాయ మూసీనదిపై పర్యావరణ కాలుష్య సూచీ ప్రమాదకరస్థాయిలో ఉంది. ఇది ఏటా పెరుగుతున్నా.. దాన్ని తక్కువగా చూపించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి బడా కంపెనీలు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2010లో 70.7గా నమోదైన పర్యావరణ కాలుష్య సూచీ, 2011నాటికి 74.58కి చేరింది. 2013 నాటికి అది అత్యధికంగా 76.05కు చేరడడం తథ్యమని తెలుస్తోంది. అయితే సీపీసీబీ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) జారీ చేసిన ఆయా ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య సూచీ కేవలం 47.33 శాతానికి తగ్గినట్లు తప్పుడు నివేదికను సృష్టించారు. ఇందులో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అప్పీలేట్ అథారిటీ, రాష్ట్ర పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారులు బాధ్యులు. అంతేకాదు అయా కంపెనీల నుంచి వెలువడుతున్న నీటిలో కెమికల్ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి), వాయు కాలుష్కంలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ధూళిరే ణువులు, సూక్ష్మ ధూళికణాలు మోతాదును తక్కువగా చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్యావర ణానికి పెను ముప్పు హైదరాబాద్‌లోని పెద్ద కంపెనీలు వదిలే పారిశ్రామిక వ్వర్థజలాల ఉత్పత్తితో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. పారిశ్రామిక ఘన వ్వర్థాలను దుండిగల్‌లోని సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్‌కు తరలించాల్సి ఉన్నా, కంపెనీలు నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నాయి. ఎక్కడికక్కడే ఘన వ్వర్థాలను భూమిలో పూడ్చుతుండడంతో విషతుల్యమౌతోంది. పలు పరిశ్రమలు తమకు అనుమతి ఉన్న దానికంటే అత్యధికంగా ఉత్పత్తులు తయారుచేస్తుండడం పర్యావరణానికి ముప్పుగా మారిందని పర్యావరణ నిపుణులు అందోళన వ్వక్తం చేస్తున్నారు. ఇలా చేయాల్సి ఉన్నా.. పారిశ్రామిక వ్వర్థాలతో కూడిన జలాలను 1200 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద ఆవిరి చేయాల్సి ఉన్నా పరిశ్రమలు పెరిగిన విద్యుత్ చార్జీల నేపథ్యంలో ఆ పనిచేయడం లేదు. వాటిని దొంగచాటుగా సమీప చెరువులు, కాలువల్లో గుట్టుచప్పుడు కాకుండా కలిపేస్తున్నారు. పారిశ్రామిక వ్వర్థాలు కలిపిన జల ఉద్గారాలను శుద్ధిచేసేందుకు సొంతంగా పరిశ్రమలోనే ఎప్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ఏర్పాటు చేయడంలో చాలా పరిశ్రమలు చేతులెత్తేశాయి. జల ఉద్గారాల్లోని పర్యావరణానికి తీవ్ర హాని చేసే మూలకాలను శుద్ధిచేసే రివర్స్ అస్మోసిస్ ప్లాంటు ఏర్పాటులోనూ ఎక్కువగా నిర్లక్ష్యం కన్పిస్తోంది. పలు పరిశ్రమలు వాయి ఉద్గారాలను వడకట్టే స్ట్రిప్సర్ ఏర్పాటు చేసే విషయాన్ని గాలికొదిలేశాయి. కర్మాగారాల్లో ఘన, ద్రవ, వాయు ఉద్గారాల్లో హానికార క మూలకాలను అవిరి చేసే మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ (ఎంఈఈ), ఎజిటేటెడ్ థిన్ ఫిల్మ్ డ్రైవర్లు లేకపోవడం అందోళన కలిగించే అంశం. నిషేధానికి తూట్లు ఇలా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1999 ఏప్రిల్ 20న జారీ చేసిన నిషేధం ఉత్తర్వుల (జీ.ఓ.ఎంఎస్.నెం.62) ప్రకారం హైదరాబాద్ నగర శివార్లలో గల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ , నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచ కూడదు. జల, వాము కాలుష్య చట్టాలను ఉల్లంఘించే పనులకూ పాల్పడరాదని ఉత్తర్వుల్లో ఉన్నా వాటికి పరిశ్రమల యాజమాన్యాలు తిలోదకాలిచ్చాయి. పై ఉత్తర్వులకు గండికొడుతూ 2013 జూలై 25న నిషేధం ఉత్తర్వులకు సవరణ చేస్తూ జీఓఎంఎస్నెం 64జారీ అయ్యేలా చేసుకున్నారు. దీని ప్రకారం జీరో లిక్విడ్ డిశ్చార్జి (జల, వాయు), విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరువాత ఉత్పత్తి సామర్థ్యం విస్తకణ చర్యలు చేపట్టుకోవచ్చన్న సాకుతో నిషేధాన్ని ఎత్తివేసేలా సఫలీకృతమయ్యారు. ఈ ఉత్తర్వులతో తమ ఉత్పత్తులను అన్యూహ్యంగా పెంచుకునేందుకు గేట్లు బార్ల తెరిచినట్లైంది. దీంతో పరిశ్రమల లాబీ ఆగడాలకు అడ్డులేకుండా పోయింది.