
సాక్షి, న్యూఢిల్లీ : అమర్‌నాత్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మంచు లింగాన్ని దర్శించి తరించాలని వేల సంఖ్యలో భక్తులు కోరుకుకుంటారు. అయితే అమర్‌నాథ్ యాత్ర అంత సులువుకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపయాలు, రవాణ వంటి సమస్యలు ఈ యాత్రలో భక్తులను విపరీతంగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అమర్‌నాథ్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
అంతేకాక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అడిషనల్ సెక్రెటరీ హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఎన్‌జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అమర్‌నాథ్ యాత్రపై పరిశీలన చేసి.. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై ప్రణాళిక రూపోందిస్తుందని ఎన్‌జీటీ ప్రకటించింది. ఈ కమిటీ ప్రధానంగా రహదారి, దేవస్థానం సమీపంలో పరిశుభ్రత, భక్తులకు అవసరాలను పరిశీలిస్తుందని ఎన్‌జీటీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment