Amarnath Yatra
-
Mahashivratri: మనోభీష్టాలు నెరవేర్చే.. ఐదు విశిష్ట శివాలయాలు..
రేపు (ఫిబ్రవరి 26, బుధవారం) మహాశివరాత్రి.. దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణలతో మారుమోగిపోనున్నాయి. మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. మనదేశంలో పలు పురాతన శివాలయాలు ఉన్నాయి. వీటిలో ఐదు శివాలయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కేదార్నాథ్కేదార్నాథ్ దేవాలయం ఉత్తరాఖంఢ్‌లోని రుద్రప్రయాగలో ఉంది. ఇది నాలుగు ధామ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు ఉత్తరాఖండ్‌లోని రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు.సోమనాథ్ గుజరాత్‌లోని కథియావర్ ప్రాంతంలో సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ వైభవం గురించి మహాభారతం, భగవద్గీత, స్కంద పురాణాలలో కూడా ఉందని చెబుతారు. శివుణ్ణి తన ప్రభువుగా భావించిన చంద్రుడు ఇక్కడ తపస్సు చేశాడని అంటారు.త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం నల్ల రాతితో నిర్మితమయ్యింది. ఇక్కడికి వచ్చిన శివ భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతుంటారు.దక్షేశ్వర్ఉత్తరాఖంఢ్లోని హరిద్వార్‌లో దక్షేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేస్తే పలు ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు.అమర్నాథ్ అమర్నాథ్ ఆలయం జమ్ముకశ్మీర్‌లో ఉంది. ఈ ఆలయం ఒక గుహ రూపంలో ఉంటుంది. ఈ పవిత్ర గుహలో దాదాపు 10 అడుగుల ఎత్తున సహజ శివలింగం మంచుతో ఏర్పడుతుంది. ఆషాఢ పూర్ణిమ నుండి రక్షాబంధన్ వరకు భక్తులు అమరనాథుణ్ణి దర్శనం చేసుకునేందుకు తరలివస్తుంటారు.ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు -
అమర్నాథ్ యాత్ర రికార్డులు బద్దలు!
అమర్నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్నాథ్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్నాథ్ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.అమర్నాథ్ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. జమ్మూలోని యాత్రి నివాస్, చంద్రకోట్ యాత్రి నివాస్, శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్నాథ్ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.సంవత్సరం యాత్రికుల సంఖ్య2011 6.34 లక్షలు2012 6.22 లక్షలు2013 3.53 లక్షలు2014 3.73 లక్షలు2015 3.52 లక్షలు2016 2.20 లక్షలు2017 2.60 లక్షలు2018 2.85 లక్షలు2019 3.42 లక్షలు2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.2022 3.04 లక్షలు2023 4.50 లక్షలు2024 ఇప్పటివరకు 5.10 లక్షలు -
కాశ్మీర్‌లోయలో కుండపోత.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో ఆదివారం(ఆగస్టు4) కుండపోత(క్లౌడ్‌బర్స్ట్) వర్షం కురిసింది. దీంతో శ్రీనగర్-లేహ్ జాతీయరహదారికి దారి తీసే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్- లేహ్ జాతీయరహదారిపైనా ట్రాఫిక్‌ను రద్దు చేయడంతో బల్టాల్ వద్ద అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో యాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. -
మూడు లక్షలకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్నాథ్కు తరలివచ్చారు.అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. -
అమర్నాథ్ యాత్ర: కరిగిన మంచు శివలింగం.. భక్తుల నిరాశ
జమ్ముకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. -
అమర్నాథ్ యాత్రికులకు తప్పిన ప్రమాదం.. బస్సుకు బ్రేక్స్ ఫెయిల్
జమ్ము కశ్మీర్: అమర్నాథ్ యాత్ర భక్తులతో ఉన్న బస్సుకు బ్రేక్స్ ఫెయిల్ కావటంతో భయానక ఘటన చోటు చోటుకుంది. ఈ ఘటన మంగళవారం జమ్ము కశ్మీర్‌లోని రామ్‌బణ్ జిల్లాలోని నేషనల్ హైవే 44పై జరిగింది. యాత్రికులతో బస్సు అమర్నాథ్ నుంచి పంజాబ్‌లోని హొసియాపూర్‌కు వెళ్తుండుగా బ్రేక్స్ ఫెయిల్ అయినట్లు డ్రైవర్ తెలిపాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కొందరు యాత్రికులు కదులుతున్న బస్సు నుంచి బయటకు దూకారు. అలా బయటకు దూకిన 10 మంది గాయపడ్డారు.The brakes of a bus carrying Amarnath pilgrims failed on a slope while returning from Baltal to Hoshiarpur. Some people jumped out of the moving bus. Police and security forces stopped the bus with great effort. 8 people were injured in the incident. The pilgrims were from… pic.twitter.com/Y6mnmHQpPG— Gagandeep Singh (@Gagan4344) July 2, 2024 ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి బస్సు లోయలో పడిపోకుండా బండరాళ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై భద్రత అధికారులు స్పందించారు. ‘బస్సులో 40 అమర్నాథ్ యాత్రికులు ఉన్నారు. బాస్సు అమర్నాథ్ నుంచి పంజాబ్‌లోని హొసియాపూర్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బ్రేక్స్ ఫెయిల్ కావటంతో డ్రైవర్ బస్సు ఆపడానికి సాధ్యం కాలేదు. విషయంలో తెలియగానే భద్రతా బలగాలు.. బస్సు ముందు బండరాళ్లను పెట్టి ఆపారు’ అని పోలీసు అధికారులు తెలిపారు. -
అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
జమ్ముకశ్మీర్‌లో ప్రతీయేటా జరిగే అమర్నాథ్యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. మహాశివుని నామస్మరణలతో జరుగుతున్న యాత్రలో రెండవ రోజున (ఆదివారం) సుమారు 14,717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుని దర్శనం చేసుకున్నారు.అమర్నాథ్ యాత్ర చేసేందుకు తాజాగా పహల్గావ్, బాల్టల్‌ల నుంచి రెండవ బృందం బయలుదేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. ఈ మార్గంలో స్థానికులు యాత్రికులకు స్వాగతం పలికారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు అమర్నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.శ్రీనగర్‌లోని వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై మొదటివారం నుంచి వర్షాలు కురియనున్నాయి. 25వ సారి అమర్నాథ్ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలోకన్నా ప్రస్తుతం ఏర్భాట్లు బాగున్నాయని అన్నారు. తాను కోవిడ్ సమయంలోనూ హెలికాప్టర్లో అమర్నాథ్ యాత్ర చేసుకున్నానని తెలిపారు. -
అమర్నాథ్ యాత్ర ప్రారంభం
శ్రీనగర్: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్నాథ్ యాత్ర మొదలైంది. మొదటి రోజైన శనివారం అమర్నాథ్ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం సాయంత్రం జమ్మూలోని భగవతి నగర్ నుంచి బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపులకు 4,603 మంది యాత్రికులు చేరుకోవడం తెల్సిందే. శనివారం ఉదయం వీరు బేస్ క్యాంపుల నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. అనంత్‌నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్– పహల్గాం సంప్రదాయ మార్గం ఒకటి కాగా, గండేర్బల్లోని ఇరుకైన 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం మరోటి. ఈ రెండు మార్గాల గుండా సాగే యాత్రను సీనియర్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నానికల్లా యాత్రికులు కశ్మీర్ లోయకు చేరుకున్నారు. అక్కడ వీరికి అధికారులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. -
ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో కలిగిన హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఈ నెల 29 నుంచి మొదలు కానుంది.. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ల జారీ ప్రారంభమైంది.తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచారు. సరస్వతి ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని.. క్యూలైన్లలో బారులు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించాయి.అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7గంటల్లోగా భగవతినగర్‌లోని బేస్ క్యాంప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్.. అలాగే, పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ (సాధుల కోసం) వద్ద మొదలు కానుంది.కాగా జమ్మూకశ్మీర్ ఉగ్రదాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటరుకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలూ సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు. -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
అమర్నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జమ్మూ సిద్ధమయ్యింది. జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు టోకెన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నేటి(బుధవారం) నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం నుంచి టోకెన్ తీసుకునే యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.ఏడీసీ శిశిర్ గుప్తా రిజిస్ట్రేషన్ కేంద్రాలను సందర్శించి యాత్రకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎండ నుంచి రక్షణకు కేంద్రాల వద్ద షెడ్లు, టెంట్లు వేస్తున్నమని, తాగునీరు, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుప్తా తెలిపారు. సరస్వతి ధామ్, జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో భక్తులు తమ ప్రయాణపు టోకెన్లు అందుకోవచ్చు. అనంతరం కేంద్రంలో యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం వారు గాంధీనగర్ ప్రభుత్వ ఆస్పత్రి, సర్వల్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది.యాత్రికుల కోసం బేస్ క్యాంప్ అయిన బాల్తాల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. జూన్ 29 నుంచి వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 28, శుక్రవారం నాడు జమ్ము నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల బృందం కశ్మీర్ వ్యాలీకి బయలుదేరనుంది. -
Amarnath Yatra 2024: యాత్రా మార్గంలో చెత్తకు చెక్ పెట్టేలా ఏర్పాట్లు
అమర్నాథ్ ధామ్ యాత్ర అంత్యంత వైభవంగా జూన్ 29న ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా అమర్నాథ్ యాత్రా మార్గంలో ప్రతీయేటా మూడు నుంచి నాలుగు వందల టన్నుల చెత్త పేరుకుపోతుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించనుంది.ఒకవైపు అమర్నాథ్ యాత్ర జరుగుతుండగానే మరోవైపు ఈ మార్గంలో చెత్తను పారవేసే ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖ సభ్యులు సేవలు అందించనున్నారు. యాత్రా మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు చెత్తవేసుకునే కిట్ అందించనున్నారు.యాత్రా మార్గంలో వ్యర్థాలను తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్, లంగర్, గుహ వరకు వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక శిబిరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిలిపివేశారు.అమర్నాథ్ యాత్రా మార్గంలో 2850 మరుగుదొడ్లు, 516 స్నాన ఘాట్లు నిర్మించారు. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు బేస్ క్యాంప్‌లలోని వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ బాత్రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె బిర్డి తాజాగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశమైన చందన్వాడిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీఎపీఎఫ్ అధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. -
అమర్నాథ్కు పెరిగిన భక్తుల సంఖ్య!
అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
ఈసారి అమర్నాథ్ యాత్ర 45 రోజులే..
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు. -
తప్పక చూడాల్సిన అద్భుతమైన శివాలయాలు (ఫొటోలు)
-
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: 62వ వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా, మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. -
వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్
-
సాయి పల్లవి అమర్నాథ్ యాత్ర..వైరల్ అవుతున్న పోస్ట్
-
కశ్మీర్ కొండల్లో హీరోయిన్.. ఏకంగా నడుచుకుంటూ వెళ్లి!
ఇదివరకు తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి అనూహ్యంగా గ్యాప్ తీసుకున్నారు. అవకాశాలు రాక కాదు. వచ్చిన అవకాశాలు నచ్చక అనేది ప్రచారంలో ఉంది. ఇక తమిళంలో కొన్ని చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలను సాధించలేదు. ఏదేమైనా చిన్న గ్యాప్ తరువాత ఈమె తమిళంలో కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. (ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!) శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. శివకార్తికేయన్ సైనికుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను కాశ్మీర్లో కొన్ని రోజులు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌కు గ్యాప్ రావడంతో నటుడు శివకార్తికేయన్ తన కథానాయకుడిగా నటించిన మా వీరన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి సాయిపల్లవి ఏం చేశారంటే ఏకంగా పాదయాత్ర చేపట్టారు. అదేనండీ భక్తి మార్గం. అవును ఇప్పుడు అమర్నాథ్ యాత్ర సీజన్ జరుగుతోంది కదా. సాయిపల్లవి కశ్మీర్‌లోని అమరనాథ్ యాత్రకు కాలిబాటన పయనించారు. అక్కడ హిమ లింగేశ్వరుడిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. సాయిపల్లవిని చూసిన భక్తులు, సామాన్య ప్రజలు ఆమెతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. (ఇది చదవండి: ఆమె జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. కానీ ఇప్పుడామె స్టార్ హీరోయిన్! ) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో అమర్నాథ్ యాత్ర మూడు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం వల్ల పంజ్తరణి, శేష్నాగ్ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు ఆదివారం మంచు శివలింగ దర్శనానికి తరలివెళ్లారు. భారీ వర్షాలకుతోడు కొండ చరియలు విరిగిపడుతుండడంతో అమర్నాథ్ యాత్రను అధికారులు మూడు రోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పవిత్ర గుహ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. జమ్మూకశ్మీర్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్లో మంచు సైతం కురిసింది. సోమవారం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ వాసి దుర్మరణం రాజాం సిటీ(ఆంధ్రప్రదేశ్): ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి రావు మృతి చెందారు. బొద్దాం గ్రామానికి చెందిన రవి రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్య కల్యాణితో కలిసి వారం క్రితం కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో రవి రావు ప్రాణాలు కోల్పోయారు. కల్యాణితో పాటు మరికొందరిని సహాయక సిబ్బంది రక్షించారు. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
జమ్మూ: అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు శనివారం కూడా నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతూ ఉండడంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గం మధ్యలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. భక్తులెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను భక్తులందరూ తూచ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో రెండు మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తోంది. ‘‘అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాలైన పాహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నాం’అని ఒక అధికారి వెల్లడించారు. బేస్ క్యాంప్ అయిన భగవతి నగర్ నుంచి శనివారం కొత్త బ్యాచ్ ఎవరినీ అనుమతించలేదు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది. 80 వేల మందికి పైగా భక్తులు ఈ ఏడాది యాత్రకు డబ్బులు చెల్లించారు. -
భారీ భద్రత నడుమ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర ఈరోజు(శనివారం) నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 31వ తేదీ వరకూ అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భద్రతా దళాలను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రం దర్శనలో భాగంగా భక్తులు మంచుతో కూడిన శివలింగాన్ని దర్శించుకోనున్నారు. మొత్తంగా 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకోనున్నారు. మొదటి మార్గంలో వెళ్లేవారు షెహల్గావ్ నుంచి పంచతరుణికి వెళ్లి.. అక్కడ నుంచి అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. రెండో మార్గంలో వెళ్లే వారు శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు వెళ్లి అక్కడ నుంచి సుమారు 14 కి.మీ పయనించి మంచు లింగాన్ని దర్శించుకుంటారు. అమర్ నాధ్ యాత్రకి ఐటీబీపీ దళాలు భారీ భద్రత కల్పిస్తున్నాయి. ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు అమర్నాథ్ యాతరకు వస్తారని అంచనా వేస్తున్నారు. -
అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభం
శ్రీనగర్: ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ విజయ్ కుమార్ బిధూరి. జులై 1 నుండి ఆగస్టు 31 వరకు సాగే ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఏర్పాట్లు షురూ.. రెండు నెలలపాటు జరిగే ఈ యాత్ర ఏర్పాట్ల విషయమై శ్రీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాశ్మీర్ డివిజనల్ కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై 62 రోజులపాటు కొనసాగి ఆగస్టు 31న ముగుస్తుంది. దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండే యాత్ర ఆద్యంతం వారికి సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దారి పొడవునా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. క్యాంపుల సామర్ధ్యాన్ని పెంచి ఒక్కోచోట సుమారు 75000 మందికి పైగా భక్తులకు వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నాము. వ్యర్ధాలను తొలగించడానికి ప్రతి క్యాంపులోనూ అంతర్గతంగా నిర్మించిన వ్యవస్థలను ఏర్పాటు చేశాము. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సుమారు 8-9 లక్షల మంది హాజరయ్యే అవకాశముందన్నారు. హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో.. రిజర్వేషన్ కౌంటర్లు, తత్కాల్ రిజర్వేషన్లు, సాంకేతిక సదుపాయాలు, వైఫై, విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలు, పారిశుధ్యం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లన్నిటినీ జమ్మూ డిప్యూటీ కమీషనర్ అవ్ని లవాస పర్యవేక్షణలో జరుగుతున్నాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా.. ప్రతీ ఏటా వైభవోపేతంగా జరిగే అమర్నాథ్ యాత్రకు దేశవిదేశాల నుంచి లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. హిమాలయాల నడుమ కోలాహలంగా జరిగే ఈ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి శివనామస్మరణ చేసి తరించాలనుకుంటారు భక్తులు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారని అంచనా. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ? -
Amarnath Yatra 2023: జులై 1 నుంచి అమర్ నాథ్ యాత్ర
సాక్షి, ఢిల్లీ: అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాటు చేసింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంది. అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో 2023 అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే.. అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు, భద్రతను సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: నిర్మలా సీతారామన్ అల్లుడు.. మోదీకి బాగా దగ్గర! -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ.. భక్తులకు ఈసారి కొత్త రూల్..!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు ఇవాళే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ ద్వారా భక్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే అధికారులు ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. ► 13-70 ఏళ్ల భక్తులే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులు ► అందరూ కచ్చితంగా ఆరోగ్య ధ్రువపత్రాన్ని పొందుపర్చాలి ► ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: సీఎం మమత మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. సీబీఐ, ఈడీ విచారణపై స్టే.. -
జూలై ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూ: హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. యాత్రకు వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
15 మంది అమర్నాథ్ యాత్రికులు మృతి!
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కాజీగుండ్‌లోని బద్రాగుండ్ క్రాసింగ్ వద్ద టిప్పర్ డంపర్ ఢీకోట్టినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. ఆ వరదల్లో సుమారు 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు తగ్గిన క్రమంలో యాత్రను పునరుద్ధరించారు అధికారులు. తిరిగి ప్రారంభమైన మూడో రోజే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. అమరనాథ్ యాత్రకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి గురువారం 5వేల మంది యాత్రికులు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ‘నున్వాన్-పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 201 వాహనాల్లో మొత్తం 5,449 మంది యాత్రికులు బయలుదేరారు. ’ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. జున్ 29న భగవతి నగర్ బేస్ క్యాంప్‌లో అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు గవర్నర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 88,526 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో ఆరోగ్య సమస్యలతో 11 మంది మరణించారు. ఆగస్టు 11న రక్షా బంధన్, శ్రావణ పౌర్ణిమ రోజున అమర్నాథ్ యాత్ర ముగియనుంది. ఇదీ చూడండి: ప్రధాని మోదీ హత్యకు కుట్ర?.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్ -
క్షేమంగానే ఉన్నా.. కంగారుపడకండి
సాక్షి,తెర్లాం(విజయనగర): అమర్‌నాథ్‌లోని శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన తను క్షేమంగానే ఉన్నానని, భయపడవద్దంటూ తెర్లాం గ్రామానికి చెందిన కోల శ్రీనివాసరావు మంగళవారం ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఆయన అమర్నాథ్ యాత్రకు వెళ్లాడు. అక్కడ కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లి సుమారు 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ వార్తలు టీవీల్లో ప్రచారం కావడంతో శ్రీనివాసరావు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అమర్నాథ్లో క్షేమంగానే ఉన్నట్టు తన ఫొటోను వాట్సప్‌లో పంపించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు 9 సార్లు అమర్నాథ్ యాత్రకు వెళ్లి మహా శివలింగాన్ని దర్శించుకున్నట్టు ఆయన ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. -
క్షేమంగా తిరిగొచ్చిన అమర్నాథ్ యాత్రికులు
నందిగామ: భగవంతుని దర్శనానికి వెళ్లిన వారు భద్రంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. పరమేశ్వరుని దయతో విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డామని చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్నాథ్ యాత్రకు వెళ్లింది. వీరిలో చందర్లపాడు మండలానికి చెందిన అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి పార్వతమ్మ, అత్తలూరి అక్షయలింగ శర్మ, అత్తలూరి కనకదుర్గ, అత్తలూరి దశరథరామశర్మ, అత్తలూరి మంజు ఉన్నారు. వీరితోపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మరో 29 మంది కలిపి మొత్తం 35 మంది గత నెల 27న విజయవాడ నుంచి రైలులో అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. ఈ నెల 8న సాయంత్రం 3.30 గంటలకు అమరనాథుని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కొద్దిసేపటికే అప్పటివరకు వారు బస చేసిన ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. వీరంతా అప్పటికే ఆ ప్రాంతాన్ని వదిలి కొద్దిదూరం వచ్చేయటంతో సురక్షితంగా బయటపడగలిగారు కానీ, ఆ భీతావహ వాతావరణంలో కొందరు బృందం నుండి విడిపోయారు. తప్పిపోయిన వారు ఆదివారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకోవటంతో ఆర్మీ సిబ్బంది మొత్తం 35 మందిని ఒకే బస్సులో ఎక్కించి ఆదివారం రాత్రికి జమ్మూకు చేరవేశారు. అక్కడి నుంచి చండీగఢ్æకు వచ్చి, అక్కడి నుంచి రైలు ద్వారా మంగళవారం రాత్రికి విజయవాడకు చేరుకున్నారు. దేవుడే రక్షించాడు విపత్తు సంభవించటానికి కొద్దిసేపటి ముందువరకు మేము అక్కడే ఉన్నాము. అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే భీతావహమైన ఘటన చోటు చేసుకుంది. అలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు. దేవుడు మమ్మల్ని రక్షించాడు. – అత్తలూరి పార్వతమ్మ, చందర్లపాడు ప్రభుత్వం సహకరించింది కొండ మార్గంలో ఒక్కసారిగా వరద ముంచెత్తిన సమయంలో మాతో వచ్చిన కొందరు తప్పిపోయారు. మన ప్రభుత్వం చొరవ చూపి జిల్లా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు మా యోగక్షేమాలు విచారించింది. మొత్తం మీద సురక్షితంగా ఇంటికి చేరాం. – అత్తలూరి అక్షయలింగ శర్మ, చందర్లపాడు -
Amarnath Yatra 2022 : అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
వర్ష బీభత్సం, 16 మంది భక్తుల దుర్మరణాలతో ఈ నెల 8 నుంచి తాత్కాలికంగా ఆగిన అమర్నాథ్ యాత్ర సోమవారం తిరిగి మొదలైంది. 12వ బ్యాచ్ కింద 4,236 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు. గుహకు చేరే మార్గం వరదల్లో దెబ్బతినడంతో సైన్యం తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా 1.13 లక్షల మంది శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆగస్టు 11న యాత్ర ముగియనుంది. -
అమర్నాథ్ యాత్రలో మరో ఏపీ మహిళ మృతి
-
అమర్నాథ్లో పెను విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి
సాక్షి, న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం: అమర్నాథ్ యాత్రలో జరిగిన పెను విషాదంలో ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 8న అమర్నాథ్ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ భవన్ కమిషనర్ కౌశిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చదవండి: Amarnath Yatra: 35 మంది ఏపీవాసులు సురక్షితం.. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 37 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. ఇందులో 24 మంది సురక్షితంగా స్వస్థలాలకు పయనమయ్యారు. మరో 11 మంది ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. -
అమర్నాథ్ యాత్ర..ఏపీ వాసులు సురక్షితం
-
అమర్నాథ్ యాత్ర.. కొత్త బ్యాచ్‌లకు బ్రేక్
జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది. -
Amarnath Yatra: 35 మంది ఏపీవాసులు సురక్షితం.. ఇద్దరు గల్లంతు!
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి, నందిగామ/రాజమహేంద్రవరం, రాజంపేట: ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. మిగతావారిని సోమవారం ఉదయం రైలులో చండీగఢ్ నుంచి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఏపీ యాత్రికుల్ని గుర్తించాల్సి ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ భవన్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శ్రీనగర్‌లోని టెంపుల్ బోర్డు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో చర్చిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ యాత్రికులు అంతా క్షేమంగా చేరుకునేలా చర్యలు చేపట్టారు. నందిగామ వాసులు సురక్షితం అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా వాసులు క్షేమంగా ఉన్నారు. జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్నాథ్ యాత్రకు వెళ్లింది. వీరిలో చందర్లపాడు మండలానికి చెందిన అత్తలూరు సత్యనారాయణ, అత్తలూరి పార్వతమ్మ, అత్తలూరి అక్షయలింగ శర్మ, అత్తలూరి కనకదుర్గ, అత్తలూరి దశరథరామశర్మ, అత్తలూరి మంజు ఉన్నారు. వీరితోపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మరో 29 మందితో కలిపి మొత్తం 35 మంది కలిసి గత నెల 27న విజయవాడ నుంచి రైలులో బయలుదేరారు. మార్గమధ్యంలో పలు క్షేత్రాలను దర్శించుకుని ఈ నెల 8న సాయంత్రం 3.30 గంటలకు అమరనాథుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో వరద విపత్తు నుంచి సురక్షితంగా బయటపడినా యాత్రికుల బృందం చెల్లాచెదురైంది. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తప్పిపోయిన వారంతా ఆదివారం ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఆర్మీ సిబ్బంది 35 మందిని ఒకే బస్సులో భద్రత కల్పించి రాత్రికి జమ్మూకు తరలించారు. వారంతా అక్కడి నుంచి చండీగఢ్ చేరుకుని రైలు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అమర్నాథ్ యాత్రికుడు వెంకటరమణ అనారోగ్యంతో గుడారంలో తల దాచుకున్నట్లు తెలిసింది. త్వరలో మిగతా యాత్రికులతో కలసి విమానంలో రానున్నట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు రాజమహేంద్రి వాసులు గల్లంతు! తూర్పు గోదావరి జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన 20 మందిలో ఇద్దరి అచూకీ మాత్రం తెలియరాలేదు. వారి జాడ కోసం ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన కొత్త పార్వతి, మునిశెట్టి సుధ ఆచూకీ తెలియలేదని చెప్పారు. ఫోన్లలో ఛార్జింగ్ లేకపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వారు ఎక్కడున్నారో గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి ఆచూకీ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఐఏఎస్ అధికారి ఏ.బాబు తెలిపారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన 867 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వెలగపూడి, ఢిల్లీలో హెల్ప్ లైన్ నంబర్లు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వెలగపూడి సచివాలయంలో 1902, ఢిల్లీలోని ఏపీ భవన్లో 011–23384016 హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. -
అమర్నాథ్ యాత్ర: కాపాడాలని రాయగడ యువకుల వీడియో సందేశం
కొరాపుట్(భువనేశ్వర్): పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఒడిశా వాసులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. ఇందులో నవరంగ్‌పూర్ వాసులు క్షేమంగా భయటపడగా, రాయగడకు చెందిన యువకులు మాత్రం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందించారు. నవరంగపూర్‌జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన పశుమర్తి నగేష్, శాంతి, వినయ్, వాసు, చిన్ను, సోహిణీ, హరి, బొద్దుపు సునీత యాత్రకు భయలుదేరి వెళ్లారు. వీరితో పాటు జయపురానికి చెందిన కోట కామేశ్వరరావు, చంద్ర దంపతులు, సాలూరులో పలివెల శ్రీను, జ్యోతి, పార్వతీపురానికి చెందిన నాగుల రేష్మ దంపతులు తోడయ్యారు. అంతా శుక్రవారం అమర్నాథ్లో విపత్తు జరిగే సమయానికి కొన్ని గంటల ముందు స్వామివారి దర్శనం చేసుకొని, తిరిగి శ్రీనగర్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వీరు అమర్నాథ్ గుహ వద్దనే ఉన్నారు. సాయంత్రం ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ చేరే సమయంలో విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి టీవీల్లో దుర్ఘటన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆందోళనకు గురయ్యారు. జమ్మూ–కశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫోన్లు మాత్రమే పని చేస్తాయి. కేవలం స్థానికులకు మాత్రమే ప్రీ పెయిడ్ ఫోన్లు పనిచేస్తాయి. వెళ్లిన వారందరివీ ప్రీపెయిడ్ ఫోన్లు కావడంతో వీరి క్షేమ సమాచారం ఆలస్యమైంది. శ్రీనగర్‌లో ప్రతి హోటల్లో వైఫై సదుపాయం ఉంటుంది. దీంతో వీరందరి ఫొటోలు వాట్సాప్‌లో పంపిచడంతో అంతా క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే గండం నుంచి భయట పడ్డామని యాత్రికులు తమ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. చిక్కుకున్న రాయగడ వాసులు.. రాయగడ: ‘అమర్నాథ్ యాత్రకు వెళ్లాం. అనుకోని విధంగా అంతా ప్రమాదంలో చిక్కుకున్నాం. మమ్మల్ని కాపాడండి’ అని రాయగడకు చెందిన యువకులు వీడియో సందేశం ద్వారా ప్రాథేయపడ్డారు. పట్టణంలోని కాళీపూజ జంక్షన్‌కు చెందిన బసంతకుమార్ సేనాపతి, సౌమ్యరంజన్ పాత్రొ, కొనతాం రవికుమార్, టుకున ప్రధాన్, నిహార్‌రంజన్ పాత్రొ 10రోజుల క్రితం అమర్నాథ్ యాత్రకు వెళ్లాం. వీరంతా తమకు సంబంధించిన సామగ్రిని జమ్మూలో విడిచి, అమర్నాథ్కు పయనమయ్యారు. యాత్రలో భాగంగా మంచులింగాన్ని శుక్రవారం ఉదయం దర్శించుకుని, తిరిగి వస్తున్న సమయంలో వంశతరణి నదీ వర్షబీభత్సానికి వారు నివసించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లు కొట్టుకుపోయాయి. దీంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బాతల్ నుంచి నడక ప్రయాణం కొనసాగించామని వీడియో ద్వారా రాయగడలో ఉన్న తమ మిత్రులకు తెలియజేశారు. ప్రస్తుతం తాము ఐదుగురం మంచుకొండలపై ప్రయాణం చేస్తున్నామని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. జమ్మూ వరకు తమను చేర్చేవిధంగా సహకరించాలని వారంతా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం స్పందించి తమ వారిని కాపాడాలని బాధితుల కుటుంబీకులు కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై! బీజేపీ గూటికి కుల్దీప్ బిష్ణోయ్! -
అమర్నాథ్ యాత్రలో ఆరుగురు ఏపీ యాత్రికుల మిస్సింగ్
-
అమర్నాథ్లో కన్నడిగులు క్షేమం: సీఎం
శివాజీనగర: జమ్ముకశ్మీర్‌లోని అమర్నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు సంభవించి పలువురు మరణించడం తెలిసిందే. దీంతో యాత్రను రద్దు చేశారు. అమర్నాథ్ పర్యటనలో వంద మందికి పైగా కన్నడిగులు ఉన్నారు. వారి రక్షణకు చర్యలు తీసుకున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై, రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు. శనివారం సీఎం మాట్లాడుతూ కన్నడిగులు అందరూ క్షేమమని, ఎలాంటి అవాంఛనీయాలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు. 15–20 మంది ఫోన్ చేసి తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పగా, అక్కడి అధికారులతో మాట్లాడి సాయం చేయాలని కోరామన్నారు. సహాయం అవసరమైతే సహాయవాణికి కాల్ చేయాలన్నారు. మైసూరు లాయర్లు సురక్షితం మైసూరు: అమర్నాథ్ వరద విపత్తు నుంచి మైసూరు నగరానికి చెందిన న్యాయవాదుల బృందం కొంచెంలో తప్పించుకుంది. వరదలో చిక్కుకున్న తమను సైనికులు కాపాడినట్లు తెలిపారు. మైసూరు తాలూకాలో మరటి క్యాతనహళ్లికి చెందిన ఎ.జె.సుధీర్, గుంగ్రాల్ శివరామ్, ఎస్.రఘు, మైసూరువాసి జి.కే.జోషి, హెబ్బాలవాసి కే.టి.విష్ణు. లోకేష్, తిలక్, ప్రదీప్‌కుమార్ తదితరులు జూలై నెల 4 వ తేదీన అమర్నాథ్లో పరమశివుని గుహ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఎగువన హిమాలయాల్లో ప్రచండమైన వరదలు రావడంతో గుహ వద్ద పెద్ద ప్రవాహం దూసుకొచ్చింది. కొండ చరియలు కూడాకొట్టుకొచ్చాయని తెలిపారు. ఇంతలో సైనికులు తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని ఫోన్లో తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్: 011–23438252, 011–23438253 కాశ్మీర్ హెల్ప్ లైన్: 0914–2496240 దేవాలయ పాలక మండలి సహాయవాణి:01914–2313149 కర్ణాటక కేంద్రం: 080–1070, 22340676 -
అమర్నాథ్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులు.. సీఎం జగన్ ఆరా.. కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ వారిని రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం చేస్తున్నారు. అకస్మాత్తుగా అమర్నాథ్లో వరదలు రావడంతో వేలాది యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయాణికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ రంగంలోకి దిగారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ కౌశిక్ శ్రీనర్‌కు వెళ్లారు. అమర్నాథ్లో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని హిమాన్షు కౌశిక్ తెలిపారు. శ్రీనగర్‌లోని టెంపుల్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ఏపీ వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఏపీకి చెందిన ఆరుగురి ఆచూకీ తెలియలేదు. వినోద్ అశోక్ (విజయవాడ), గునిసెట్టి సుధ, పార్వతి (రాజమహేంద్రవరం), బి.మధు (తిరుపతి), మేడూరు జాన్సిలక్ష్మి (గుంటూరు), వానపల్లి నాగేంద్ర కుమార్‌లు (విజయనగరం) కనిపించడం లేదని గుర్తించారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు ►ఢిల్లీ ఏపీ భవన్ హెల్ప్ లైన్ నంబర్స్: 011-23384016, 011-23387089 ►ఆంధ్ర ప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్: 1902 కాగా అమరానాథ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జల ప్రళయంలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందగా.. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు. -
గాలింపు చర్యలు ముమ్మరం
శ్రీనగర్: అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు. 11వ బ్యాచ్‌లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది. -
Amarnath Floods: ఆకస్మిక వరదలు.. అమర్నాథ్లో అసలేం జరుగుతోంది?
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. ఇప్పటిదాకా కనీసం 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో 40 మంది అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. చదవండి👉🏻గుజరాత్లో వరుణ విలయం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వరదల వల్ల ఆహార కేంద్రాలు, టెంట్లు దెబ్బతిన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమర్నాథ్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది యాత్రికులు మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని ప్రకటించారు. పదో బ్యాచ్ కింద శుక్రవారం ఉదయం 6,100 మందికి పైగా యాత్రికులు రెండు బేస్ క్యాంపుల నుంచి ఆమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. చదవండి👉🏻Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ -
ఆకస్మిక వరదలు.. అమర్నాథ్ యాత్ర ఆగమాగం! (ఫోటోలు)
-
CM YS Jagan: అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి
సాక్షి, అమరావతి/కైకలూరు: అమర్నాథ్లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్‌తో మాట్లాడారు. అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. ఆయన అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. కైకలూరు యాత్రికులు క్షేమం.. ఏలూరు జిల్లా కైకలూరు నుంచి యాత్రకు వెళ్లిన 10 మంది శుక్రవారం అక్కడ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో వరదల వార్తలను చూస్తున్న వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న కైకలూరు నుంచి బట్టు సీతారామయ్య, రెడ్డి, సింహాచలం, కోడూరు సుబ్బారావు, రాజు తదితరులు 10 మంది ఏజెంటు ద్వారా అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బోలేనాథ్ గుహ వద్ద వరద ముంచుకొచ్చింది. దీనిపై అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సింహాచలం కుమారుడు నాని మాట్లాడుతూ టీవీల్లో ప్రమాదవార్తను తెలుసుకుని తన తండ్రికి ఫోన్ చేసినట్లు చెప్పారు. తాము కొండ పైభాగంలో ఉన్నామని, ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా కిందికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారని తెలిపారు. అందరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారని చెప్పారు. -
అమర్నాథ్లో ఆకస్మిక వరదలు.. ఆ దృశ్యం కళ్లారా చూశా: రాజాసింగ్
అబిడ్స్ (హైదరాబాద్): అమర్నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శుక్రవారం దైవదర్శనం చేసుకున్నారు. కుండపోత వర్షంతో అమర్నాథ్లో వరదలు రావడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రాజాసింగ్ ‘సాక్షి’ తో ఫోన్లో మాట్లాడారు. కుటుంబంతో కలిసి అమర్నాథ్ దర్శనం చేసుకుని జమ్మూకశ్మీర్ వరకు తరలి వచ్చినట్లు తెలి పారు. హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడంతో గుర్రాలపై చేరుకున్నామన్నారు. వరదలు రావడం కొద్ది దూరం నుంచి కళ్లారా చూశానని, తన కళ్ల ముందే టెంట్లు కొట్టుకుపోయాయని వివరించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి తరలి పోయామని చెప్పారు. కాగా, శనివారం వైష్ణవీదేవి దర్శనానికి వెళ్తున్నట్లు రాజాసింగ్ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి👉🏾Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం -
అమర్నాథ్ యాత్రలో ఆకస్మిక వరదలు.. యాత్రికుల గల్లంతు!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 5.30గం. నుంచి కుంభవృష్టి మొదలైంది. భోలేనాథ్ గుహ సమీపంలోనే మొదలైంది కుంభవృష్టి. ఆకస్మిక వరద ఉదృతికి యాత్రికుల టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. పలువురు వరదల్లో కొట్టుకుపోగా.. ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే చాలా మంది కనిపించకుండా పోవడంతో వరదలో కొట్టుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విపత్తు నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు. ఆకాశం బద్ధలైనట్లుగా.. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Major cloud burst hit holy Amar nath cave,many tents washed Way, several people missing.. Cloudburst near Amarnath lower cave, #NDRF & SDRF teams start rescue operation.#Amarnath #AmarnathYatra #Jammu pic.twitter.com/03MhDB7MNY — Chaudhary Parvez (@ChaudharyParvez) July 8, 2022 #WATCH | J&K: Visuals from lower reaches of #Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies #cloudburst (Source: ITBP) pic.twitter.com/LEfOpOpxZO — NewsMobile (@NewsMobileIndia) July 8, 2022 J&K | #Exclusive visuals of flash floods at #Amarnath cave. pic.twitter.com/UM8KPgCTyg — News18.com (@news18dotcom) July 8, 2022 -
అమర్నాథ్ యాత్ర నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి భక్తులెవరినీ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వెళ్తుంటారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్లోని నున్వాన్ క్యాంప్, గందర్బల్ జిల్లా బాల్టాల్ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేసేవరకు 72,000 మందికిపైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి రోజున అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. -
అది భారత ఆర్మీ సత్తా.. రికార్డులు బద్దలు కొట్టారు
Army reconstructed two bridges.. ఇండియన్ ఆర్మీ తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు. అమర్నాథ్ యాత్రలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా భారత ఆర్మీ అద్భుతం సృష్టించింది. దీంతో, ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కరోనా తర్వాత ఎంతో వైభవంగా అమర్నాథ్ యాత్రలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ మార్పుల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య బల్తాల్ వద్ద కాళీమాతా ఆలయ సమీపంలోని నది ప్రవాహం వద్ద కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో, రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సంచలనం సృష్టించింది. బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు. దీంతో ఆర్మీ అందరిచేత శభాష్ అనుపించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "#Chinarwarriors to the Rescue - #AmarnathYatra." On 01 Jul, 02 bridges near Brarimarg on #Baltal Axis were damaged by landslides. #ChinarCorps mobilised assets & reconstructed the bridges overnight for resumption of route & avoiding an over 4 hour detour by #Yatris.@adgpi https://t.co/AwdxMAyKSs pic.twitter.com/DUQnjWAHTG — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 2, 2022 ఇది కూడా చదవండి: అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వానికి షాక్! -
Photo Feature: బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర
మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్నాథ్’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర గురువారం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ సంక్షోభాల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత యాత్ర ప్రారంభమవడంతో ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశముంది. -
Amarnath Yatra: అమరనాథ్ యాత్రపై కన్నేసిన ఉగ్రవాదులు
మూడేళ్ల విరామం తర్వాత మొదలవుతున్న అమరనాథ్ యాత్రపై ఉగ్రవాదులు కన్నేశారు. జూన్ 30 నుంచి మొదలై 43 రోజుల పాటు సాగే యాత్రను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా స్టికీ బాంబులతో విరుచుకుపడొచ్చని నిఘా వర్గాలకు ముందే ఉప్పందింది. ఇందుకోసం తరలిస్తున్న ఈ బాంబుల్ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో స్టికీ బాంబుల కథా కమామిషు... హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు స్టికీ బాంబులతో సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా వాటిని డ్రోన్ల ద్వారా తరలిస్తుండగా జమ్ము పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. జమ్ము శివార్లలో పాక్ డ్రోన్ ఒకటి ఓ పేలోడ్‌ను జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్ బాక్సులు అందులో దొరికాయి. 3, 8 గంటల్లో పేలేలా వాటికి టైమర్లు కూడా సెట్ చేశారు. వాటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. అమర్నాథ్ యాత్రలో భక్తులపై ప్రయోగించేందుకే వీటిని పాక్ నుంచి తరలించినట్టు చెప్పారు. తొలిసారి వాడిందెప్పుడు? స్టికీ బాంబుల్ని తొలిసారిగా బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించింది. అప్పట్లో ఇది గ్రెనేడ్‌లా ఉండేది. గోళాకారపు గాజు ఫ్లాస్క్‌లో నైట్రో గ్లిసరిన్ నింపి తయారు చేసేవారు. దాన్ని లోహంతో కవర్ చేసి అంటించేవారు. బాంబును ప్రయోగించేటప్పుడు దాని రక్షణ కవచాన్ని బయటకు లాగి విసిరేవారు. ఐదు సెకండ్లలో బాంబు పేలేది. అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో వీటిని బాగా వాడారు. గతేడాది అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించినప్పుడు అమెరికా సైనికులపై వీటిని ఎక్కువగా వాడారు. కాబూల్‌లో జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ స్టికీ బాంబులు పెటట్డంతో అమెరికా సైనికులు నిత్యం హడలిపోయేవారు. 2020 డిసెంబర్లో కాబూల్ డిప్యూటీ ప్రొవిన్షియల్ గవర్నర్‌ను స్టికీ బాంబుతోనే బలిగొన్నారు. చదవండి: (బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత) మన దేశంలో... ►2012 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై దాడిలో స్టికీ బాంబులు వాడారు. ►2012 ఫిబ్రవరిలో కశ్మీర్లో సాంబా సెక్టార్లో భద్రతా దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి. ►2021 ఏప్రిల్‌లో జమ్ము శివార్లలో సిధారా బైపాస్ దగ్గర, ఆగస్టులో పూంచ్‌లో ఇవి దొరికాయి. ►2021 మేలో కథువాలోని హరియా చౌక్ దగ్గర మినీ డ్రోన్‌ను కశ్మీర్ పోలీసులు కూల్చేశారు. అందులోనూ స్టికీ బాంబులు దొరికాయి. ►2021 మేలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న బస్సు పెట్రోల్ ట్యాంక్‌కు స్టికీ బాంబులు అతికించి నలుగురిని బలిగొన్నారు. భద్రతా వ్యూహంలో మార్పు స్టికీ బాంబులతో ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదమున్నందున ఈసారి అమర్నాథ్ యాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏమిటీ స్టికీ బాంబులు? చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక అదీ సులభంగా మారింది. పార్క్ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు. -
చిక్కుల్లో మరో ఐఏఎస్..: ఇంజనీర్లపై బూతులు, అరెస్టు
శ్రీనగర్: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో స్టేడియాన్నే ఖాళీ చేయించి, చివరికి శంకరగిరి మాన్యాలు పట్టిన ఓ ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకాన్ని మర్చిపోకముందే అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుడి భుజంగా చెప్పే ఐఏఎస్ అధికారి నితేశ్వర్ కుమార్ తమను అకారణంగా బూతులు తిట్టడమే గాక అక్రమంగా అరెస్టు చేయించారంటూ సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లు ఆరోపించారు. అమర్నాథ్ ఆలయ బోర్డు సీఈఓ అయిన నితేశ్వర్ మే 25న స్థానిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆ సందర్భంగా ఇంజనీర్లపై ఆయన అకారణంగా ఆగ్రహించారు. సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా తన వెంట ఉన్న ఎస్పీని ఆదేశించి ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు కూడా చేయించారు’’ అని ఇంజనీర్లు చెప్పారు. నితేశ్వర్ తీరును సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి లేఖ రాసింది. -
సరిహద్దుల్లో బయటపడ్డ సొరంగం
సాంబా: జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగబోయే అమర్నాథ్ యాత్రలో అలజడి సృష్టించేం దుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) గురువారం వెల్లడించింది. సాంబా జిల్లాలో సరిహద్దుల వెంట చాక్ ఫకీరా బోర్డర్ ఔట్‌పోస్టు వద్ద ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 2 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని గుర్తించామని తెలిపింది. అందులో 265 అడుగుల పొడవైన ఆక్సిజన్ పైపులను వెలికితీశామని పేర్కొంది. -
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ సర్టిíఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమర్నాథ్ 2022 యాత్ర జూన్ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉంటుంది. యాత్రకు వెళ్లేందుకు నిర్దేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర సర్టిఫికెట్లతో దగ్గర్లోని ప్రభుత్వ బోధనాసుపత్రికి యాత్రికులు వెళ్లాలి. అక్కడి రిసెప్షన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వరుస క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు దరఖాస్తు చేసుకున్న వారి వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెడికల్ సర్టిఫికెట్లు..) -
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు.. దరఖాస్తు ఇలా..
సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు నిర్ధేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర నిలిపివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతివారం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే వరుస క్రమంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ బోర్డు కమిటీ ఎంపిక చేశామని, నితిన్‌కాబ్రా (కార్డియాలజీ) సత్యనారాయణ (ఆర్ధోపెడిక్), కృష్ణమూర్తి(ఫల్మనాలజీ), రవీందర్ (జనరల్ మెడిసిన్) వైద్యులు బోర్డు సభ్యులుగా కొనసాగుతారని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. దరఖాస్తు ఇలా... యాత్రికులు ఆథార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో గాంధీ మెడికల్ రికార్డు సెక్షన్లో సంప్రదించాలి. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత వరుస క్రమంలో వచ్చే తేదీని నిర్ణయిస్తారు. సదరు తేదీ రోజు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తు ఎంఆర్డీ సెక్షన్ కార్యాలయంలో మెడికల్ బోర్డు వైద్యుల నిర్వహించే వైద్య పరీక్షలకు నేరుగా హాజరుకావాలి. (క్లిక్: సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు) చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవీ.. కంప్లీట్ బ్లడ్ ప్రొఫిల్లింగ్ (సీబీపీ), ఆర్థరైటీ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయు ఈ), గ్లూకోజ్ ర్యాండమ్ బ్లడ్ సుగర్ (జీఆర్బీఎస్) బ్లడ్ యూరియా, సీరం క్రియేటిన్, ఎలక్టోకార్డియా గ్రామ్(ఈసీజీ), ఎక్స్‌రే చెస్ట్ వైద్యపరీక్షల నివేదికలను కమిటీ ముందుంచాలి. యాభై ఏళ్ల వయసు పైబడినవారు పై నివేదికలతోపాటు రెండు మోకాలి (బోత్ నీస్) ఎక్స్‌రేలు జతచేయాలి. మెడికల్ బోర్డు సభ్యులు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. (క్లిక్: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!) -
భక్తులకు గుడ్ న్యూస్.. అమర్నాథ్ యాత్ర ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: భక్తులకు అమర్నాథ్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే అమర్నాథ్ యాత్రపై ఆదివారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆదివారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అమర్నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈసారి భక్తులకు దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు. Amaranth Yatra to start from June 30th, 2022, with all covid protocols in place & culminate, as per the tradition, on the day of Raksha Bandhan. The Amarnath Yatra will last for 43 days this year: Office of Lt. Governor of Jammu & Kashmir — ANI (@ANI) March 27, 2022 -
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత
డెహ్రాడూన్: హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేస్తారు. -
అమర్నాథ్ పూజలు జియో టీవీలో..
జమ్మూ: అమర్నాథ్ క్షేత్రానికి సంబంధించిన పూజలు జియో టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. లైవ్ స్ట్రీమింగ్ అవసరమైన పరికరాలను ఇప్పటికే జియో కంపెనీ అక్కడికి తరలించింది. కశ్మీర్‌లోని భౌగోళిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పటికీ, వాటిని విజయవంతంగా అక్కడికి చేర్చగలిగింది. ఈ నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ క్షేత్ర బోర్డు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం పూజలను లైవ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. పూజ, హవనం, ప్రసాదం వంటి వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. అక్కడ ఉండే పూజారులు బుక్ చేసుకున్న వారి పేరు మీద పూజ జరిపిస్తారని పేర్కొన్నారు. ప్రసాదం నేరుగా ఇంటికే వచ్చేలా డెలివరీ సదుపాయం తీసుకొచ్చినట్లు చెప్పారు. కోట్లాది మంది భక్తుల కోసం పూజాది కార్యక్రమాలన్నింటిని జియో టీవీకి చెందిన సర్వీసుల ద్వారా దైవానుభూతి కలిగించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ఆ క్షేత్ర బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
జియోటీవీలో అమర్ నాథ్ 'హారతి' ప్రత్యక్ష ప్రసారం
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది దైవ ప్రియలు తమ ఇష్ట దైవలను సందర్శించ లేకపోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమర్ నాథ్ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఒక శుభవార్త తెలిపింది. మనదేశంలో పవిత్రం మందిరం అయిన అమర్ నాథ్ పుణ్య క్షేత్రన్ని భౌతిక దర్శించలేని భక్తుల సహాయ పడటానికి జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. మనదేశంలో అత్యంత క్లిష్టమైన భూభాగంలో ఉన్న అమర్ నాథ్ దగ్గర ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికి ప్రత్యక్ష ప్రసారానికి సపోర్ట్ చేసే నెట్ వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ జియో పేర్కొంది. గత వారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భక్తులకు వ్యక్తిగత అనుభవాన్ని అందించడానికి అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు వివిధ ఆన్ లైన్(http://www.shriamarnathjishrine.com/) సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. "కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది శ్రీ అమర్ నాథ్ జీ పవిత్ర మందిరాన్ని సందర్శించలేని లక్షలాది మంది భక్తులకు, పుణ్యక్షేత్రం బోర్డు వర్చువల్ మోడ్ కింద దర్శనం, హవాన్, ప్రసాద్ సౌకర్యాన్ని అందిస్తుంది. భక్తులు తమ పూజ, హవాన్, ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. పవిత్ర గుహ వద్ద ఉన్న పూజారులు భక్తుడి పేరిట దానిని అందిస్తారు. ప్రసాదం తర్వాత భక్తుల ఇంటికి డెలివరీ చేయనున్నట్లు" బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు కొత్తగా ఆన్ లైన్ సేవలను ప్రారంభించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివుడి భక్తులు పవిత్ర గుహ వద్ద ఆన్ లైన్ లో వర్చువల్ గా 'పూజ', 'హవాన్' నిర్వహించవచ్చు. తాజాగా రిలయన్స్ జియో జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూర్చడం కోసం జియోకు చెందిన JioTV, JioMeet, JioSaavn, JioChat వంటి యాప్స్ ద్వారా ఈ సేవలను ప్రవేశపెట్టింది. జియోటీవీలోని ప్రత్యేక ఛానెల్ లో అమర్ నాథ్ హారతి ప్రత్యక్ష ప్రసారం, జియోమీట్ ద్వారా వర్చువల్ పూజ, హవాన్ అందిస్తుంది. భక్తులు పుణ్యక్షేత్రంలో పూజారితో వర్చువల్ రూపంలో పూజా గదిలో పాల్గొనడం, వారి పేరు, 'గోత్ర'లో హవాన్/పూజను నిర్వహించుకోవచ్చు. ఇక జియో సావన్ లో అమర్ నాథ్ పుణ్య క్షేత్రానికి చెందిన పాటలు ప్లే కావడం, జియో చాట్ ద్వారా ప్రత్యక్ష దర్శనంతో పాటు హారతి సమయం, విరాళాలు పంపవచ్చు. -
అమర్నాథ్ యాత్ర రద్దు..!
న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం సోమవారం ప్రకటించింది. కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర రద్దు కావడం ఇది రెండోసారి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని ట్విటర్లో తెలిపింది. వర్చ్యువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్నాథ్ బోర్డు తెలిపింది. 56 రోజులపాటు జరిగే అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై ఆగష్టు 22న ముగుస్తుంది. Shri Amarnathji Yatra cancelled in wake of Covid-19 Pandemic. Decision after threadbare discussion with Shri Amarnathji Shrine Board members. Yatra to be symbolic only. However, all the traditional religious rituals shall be performed at the Holy Cave Shrine as per past practice. — Office of LG J&K (@OfficeOfLGJandK) June 21, 2021 చదవండి: గడ్డకట్టే చలిలో.. 18 వేల అడుగుల ఎత్తున యోగాసనాలు -
జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా శివ భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారు అయ్యాయి. గతేడాది కోవిడ్–19 మహమ్మారి కారణంగా రదై్దన యాత్రను ఈ ఏడాది జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహించాలని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయించింది. శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన 40వ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో యాత్ర షెడ్యూల్‌తో పాటు, పలు కీలక అంశాలపై చర్చించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ కచ్చితంగా పాటిస్తూ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర బాల్టాల్ మార్గం ద్వారా మాత్రమే జరిగే అవకాశాలున్నాయి. ప్రయాణం పహల్గామ్, చందన్వాడి, శేష్నాగ్, పంచతర్ని గుండా సాగుతుంది. అమర్నాథ్ గుహలో మంచు స్ఫటికాలతో ఏటా 10–12 అడుగుల ఎత్తైన మంచు శివలింగం ఏర్పడుతుంది. అంతేగాక అమర్నాథ్ శివలింగం ఎత్తు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. పౌర్ణమి నాడు శివలింగం దాని పూర్తి పరిమాణంలో ఉండగా, అమావాస్య రోజున శివలింగ పరిమాణం కొంత తక్కువగా ఉంటుంది. అమర్నాథ్ గుహ శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ సుమారు 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉంటుంది. ఈ గుహ సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ: దేశవ్యాప్తంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ , యస్ బ్యాంక్‌ల 446 బ్రాంచుల్లో ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా అమర్నాథ్ యాత్రను సాధువులకు మాత్రమే పరిమితం చేశారు. 2019లో 3.42 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. -
ఎంఈఐఎల్కు జోజిల్లా పాస్ టన్నెల్ పనులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్- లడఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్లలో ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచింది. శుక్రవారం (21-08-2020) జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఐడీసీఎల్ (NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్ టన్నెల్‌కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీ వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచిన పనిని జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్‌ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపీసీ పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్‌ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండ ప్రాంతంతో పాటు మంచు తుఫాన్లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్‌గా ఉంది. సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్లా రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్ సుబ్బయ్య తెలిపారు. రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంచు తుఫాన్లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. -
కరోనా: అమర్నాథ్ యాత్ర రద్దు
-
అమర్నాథ్ యాత్ర రద్దు
న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముమ్రు అధ్యక్షతన మంగళవారం జరిగిన అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు 39 వ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్నాథ్ యాత్ర-2020 పై కరోనా ప్రభావం అంశం మీద ఈ వర్చువల్ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే పెరిగిపోతున్న కేసులకు తోడు యాత్రికులు కూడా కోవిడ్ బారినపడితే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కాగా, అమర్నాథ్ యాత్ర నిర్వహించకుండా అడ్డుకోవాలని సుప్రీం కోర్టులో జులై 13 వ్యాజ్యం దాఖలైంది. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసి జమ్మూకశ్మీర్ యంత్రాంగమే యాత్ర నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో అమర్నాథ్ దేవాలయ బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది. ఇక మంచు రూపంలో ఉన్న శివునికి నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయని బోర్డు సభ్యులు తెలిపారు. ఉదయం, సాయంత్రం జరిగే హారతి కార్యక్రమాలు టెలీకాస్ట్ చేస్తామని తెలిపారు. (కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్ ఇదే!) -
‘అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు’
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందినట్లు జమ్మూ కశ్మీర్ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం) ‘అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరులు ఉన్నాయి. యాత్రను శాంతియుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకుర్ తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారి 44ను అమర్నాథ్ యాత్రికులు ఉపయోగించుకుంటారని తెలిపారు. -
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 15 రోజులపాటు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు(ఎస్ఏఎస్బీ) ప్రకటించింది. యాత్రకు అంకురార్పణ చేస్తూ ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రను కుదించారు. సాధువులు మినహా 55 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించరు. అనంత్‌నాగ్ జిల్లాలో పవిత్ర గుహలో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు కలిగి ఉండడం తప్పనిసరి. యాత్ర కోసం వచ్చే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మంచు శివలింగం దర్శనానికి సాధువులు మినహా మిగతా యాత్రికులంతా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పవిత్ర గుహలో 15 రోజులపాటు ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు. బాల్తాల్ మార్గంలోనే యాత్ర జరుగుతుంది. పహల్గామ్ మార్గంలో ఎవరినీ అనుమతించరు. బెంగళూరులో భక్తుల రాకకోసం ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. శనివారం సిటీలో ఓ ఆలయంలో విగ్రహాలపై రసాయనాలు చల్లి క్రిమిరహితం చేస్తున్న అర్చకులు -
అమర్నాథ్ యాత్ర : లాటరీ పద్దతిలో భక్తుల ఎంపిక
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తీపికబురు అందించింది. యాత్రా ప్రణాళికను సిద్దం చేసిన ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది తరలివచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ఒకటి. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా యాత్రకు బ్రేక్ పడుతుందేమో అన్న సందేహాల నడుమ భక్తులకు శుభవార్త అందించింది. అమర్నాథ్ యాత్ర జులై 21న మొదలుకొని 15 రోజుల్లో తీర్థయాత్ర ముగియనుంది. సాధారణంగా అయితే 45 రోజుల వరకు యాత్ర కొనసాగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రోజుల వరకు భక్తులను అనుమతించడం ద్వారా మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రణాళికలో మార్పులు చేసింది. అంతేకాకుండా బాల్తాల్ మార్గంలోనే యాత్రకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి కేవలం నాలుగువేల నుంచి ఐదు వేల మంది యాత్రికులకు మాత్రమే అనుతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. (2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధం: ట్రంప్ ) సాధారణంగా అయితే బాల్తాల్ సహా పహల్గామ్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగేది. కానీ కోవిడ్ దృష్ట్యా పహల్గామ్ దారిని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తీర్థయాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు బసీర్ అహ్మద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన మంచు-లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఏటా దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. లక్షలసంఖ్యలో ప్రతీ ఏటా జులై చివరివారంలో 45 రోజులపాటు తీర్థయాత్ర కొనసాగుతుంది. అయితే గత ఏడాది ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో భద్రతా సమస్యల దృష్ట్యా యాత్రను మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా షెడ్యూల్లో కేవలం 15 రోజులకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు ) -
కోవిడ్-19 ఎఫెక్ట్ : అమర్నాథ్ యాత్ర రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రద్దయింది. గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అమర్నాథ్ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెననుతిరిగారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు అమర్నాథ్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471కి పెరిగింది. కరోనా బారినపడి బుధవారం 49 మంది మరణించడంతో మృతుల సంఖ్య 652కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చదవండి : కరోనాలో హెచ్ఐవీ వైరస్ ఆనవాళ్లు -
కశ్మీర్ ఉద్రిక్తత: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన విమాన ఛార్జీలను తగ్గించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమర్నాథ్ యాత్రను నిలపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యటకులను, యాత్రికులను ఉన్నపలంగా వెనక్కి తిరిగి రావాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిర్ ఇండియాలో ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో విమాన రేట్లు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిథి ధనుంజయ కుమార్ ఆదివారం ప్రకటించారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి సాధారణ ఛార్జ్ 9500 కాగా, ప్రస్తుత తగ్గింపుతో రూ.6715గా, అలాగే ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రూ.6,899 కానుంది. ఈ తగ్గింపు ఆగస్ట్ 15 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియ అథారిటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6,200 మంది ప్రయాణికులు శ్రీనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తమ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతున్నాయి. విమాన ఛార్జీల తగ్గింపుపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
కేంద్రం మౌనం వహిండం సరికాదు
-
కిక్కిరిసిన శ్రీనగర్ విమానాశ్రయం
శ్రీనగర్: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపేసి యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ లోయ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని కోరిన సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. తీర్థయాత్రకు వచ్చిన వారు, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా శ్రీనగర్ విమానాశ్రయానికి క్యూ కట్టడంతో వారికి టికెట్లు దొరకడం లేదు. భారీగా తరలి వచ్చిన యాత్రికులతో విమానాశ్రయం కిక్కిరిసింది. శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా జమ్మూకశ్మీర్ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా ప్రకటించాయి. కశ్మీర్ లోయలో ఎన్నడూ ఇటువంటి భయాందోళనక వాతావరణం చూడలేదని పలువురు యాత్రికులు పేర్కొన్నారు. దాల్ సరస్సు వద్ద షికారా ఎక్కుతున్న పర్యాటకులు కశ్మీర్ లోయలో శాంతి పెంపోందించేందుకు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. విద్యా సంస్థలను మూసివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో యథాతథంగా కొనసాగుతున్నాయి. కశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితుల్లో స్థానికులు నిత్యావసరాలను నిల్వ చేయడానికి స్టోర్స్, ఏటీఎంలు, ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. అంతేకాక పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచివుండాల్సి వస్తోంది. శ్రీనగర్‌లో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు -
యాత్రను నిలిపివేయాల్సిన అవసరమేంటి?
సాక్షి, గుంటూరు : జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అత్యవసరంగా 40వేల మంది సైనికులను కశ్మీర్‌కు ఎందుకు తరలించారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్లో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందన్నారు. అసలు కశ్మీర్లో ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాగా, అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
-
‘యాత్ర’కు బ్రేక్? ఏమిటా నిఘా సమాచారం!
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలనూ తరలించింది. ఒక్కసారిగా లోయలో భయాందోళన రేకెత్తించిన ఈ పరిణామాల వెనుక.. నిఘా వర్గాలు అందించిన కచ్చితమైన సమాచారమే కారణమని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు ఎలాంటి అవాంఛనీయ దాడులకు పాల్పడకుండా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని, సోపూర్ ప్రాంతంలో ఐఈడీ (ఇంప్రూవైస్డ్ పేలుడు పదార్థాల)లతో భద్రతా బలగాలను జైషే మహమ్మద్ (జేఈఎం) తదితర ఉగ్రమూకలు టార్గెట్ చేయవచ్చునన్న నిఘా వర్గాల సమాచారమే ఈ ఆకస్మిక పరిణామాలకు కారణమని ఈ వ్యవహారంతో పరిచయం కలిగిన ఇద్దరు విశ్వసనీయ వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ఏమిటా నిఘా సమాచారం! జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్ గత నెలలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కనిపించాడని జాతీయ భద్రతా సంస్థలకు కచ్చితమైన నిఘా సమాచారం అందింది. 1999 నాటి భారత్ విమానం హైజాక్ ప్రధాన సూత్రధారి అయిన ఇబ్రహీం అజార్ తన కొడుకు మృతికి ప్రతీకారంగా లోయలోకి చొరబడి.. ఇక్కడ భద్రతా దళాలపై జరిపే ఉగ్రదాడులకు నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇబ్రహీం అజార్ నేతృత్వంలో సుశిక్షితులైన జేఈఎం ఉగ్రవాదులు బార్డర్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి.. సరిహద్దు నియంత్రణ రేఖ మీదుగా ఉన్న పాక్ ఆర్మీ పోస్టుల దిశగా కదిలాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇబ్రహీం కొడుకు ఉస్మాన్ హైదర్ గత ఏడాది అక్టోబర్‌లో కశ్మీర్లోకి చొరబడి.. అదే నెల 30వ తేదీన పుల్వామాలోని అవంతీపురలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో బంధువు, మసూద్ అజార్ బావమరిది అబ్దుల్ రషీద్ కొడుకు తహ్లా రషీద్ 2017 నవంబర్ 6న పుల్వామా కండి అల్గార్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇబ్రహీం.. తన కొడుకు తరహాలోనే భారత బలగాలపై పోరాడుతూ చనిపోతానని జేఈఎం కేడర్‌కు చెప్పాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇబ్రహీం అజార్ కశ్మీర్లో పెద్ద ఎత్తున దాడులకు గ్రౌండ్‌వర్క్ చేయడంపై కచ్చితమైన సమాచారం అందడంతో కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్ భదత్రాధికారి వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన జేఈఎం, లష్కరే తోయిబా తమ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడాన్ని నిఘా వర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. అంతేకాకుండా అమర్నాథ్ యాత్ర మార్గంలో ఎం24 స్నిపర్ రైఫిల్, భద్రతా దళాలు లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు దొరకడంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించిన కేంద్రం వెంటనే అమర్నాథ్ యాత్రను నిలిపివేసిందని, దీంతో యాత్రకు రక్షణగా ఉన్న బలగాలు తిరిగి ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్‌కు సన్నద్ధమవుతాయని ఆ అధికారి తెలిపారు. కశ్మీర్లో హింసాత్మక దాడులే లక్ష్యంగా పాక్ సాయుధ మూకలు లోయలోకి పెద్ద ఎత్తున చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కశ్మీర్లో పలుచోట్ల ఆత్మాహుతి దాడులు నిర్వహించాలని అవి తలపోస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పెషావర్ నుంచి సుశిక్షితులైన జేఈఎం సాయుధ మూక కశ్మీర్లోకి చొరబడి.. భారత బలగాలపై మెరుపుదాడులు నిర్వహించాలని, ఉత్తర కశ్మీర్‌లోని సోపూర్లో ఐఈడీలతో భద్రతా దళాలను టార్గెట్ చేయాలని పథకాన్ని రచించినట్టు పేర్కొన్నాయి. పాక్ సైన్యంతోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలు కూడా ఈ దాడుల విషయంలో ఆ మూకలకు సహకారం, సమన్వయం అందించనున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. -
ఆ మాటలు వినకుండా.. గమ్మున ఉండండి
శ్రీనగర్: పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో లోయలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు కశ్మీర్‌కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దీనిపై కశ్మీర్‌లోని ప్రధాన పార్టీల నాయకులు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై వారిద్దరూ సుధీర్ఘంగా చర్చించారు. లోయలో ఏం జరగుతోందో తమకు తెలియజేయాలని, భారత ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను రచిస్తోందని గవర్నర్ వద్ద మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా వంటి నేతలు ప్రశ్నించారు. యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కశ్మీర్ నేతలపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా, టీవీల్లో వచ్చే వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని, దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండా సైలెంట్‌గా ఉండాలని గవర్నర్ వారితో వారించినట్లు సమాచారం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్మీ సహాయంతో ఉగ్రవాద కుట్రలను ఛేదిస్తున్నామని, దీనికి స్థానిక నేతలంతా సహాకరించాలని గవర్నర్ వారిని కోరారు. అలాగే గతకొంత కాలంగా వినిపిస్తోన్న ఆర్టికల్ 35ఏ రద్దుపై వదంతులు నమ్మవద్దని మాలిక్ వారికి సూచించారు. కాగా అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. -
కశ్మీర్ హై అలర్ట్!
కశ్మీరం వేడెక్కుతోంది. లోయలో భద్రతా బలగాల పెంపుపై ఊహాగానాలు కొనసాగుతుండగానే.. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తూ శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాత్రపై పాక్ ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రీకులు, ఇతర పర్యాటకులు తక్షణమే తమ పర్యటనను ముగించుకుని కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. యాత్ర మార్గంలో పాకిస్తాన్లో తయారైన మందుపాతర, అమెరికా మేడ్ స్నైపర్ రైఫిల్ లభించాయని భారత ఆర్మీ ప్రకటించింది. యాత్రపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని కచ్చితమైన నిఘా సమాచారం వచ్చినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు భారీగా బలగాలను పంపిస్తున్నారన్న వార్తలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదనీ, అంతర్గత భద్రత, సిబ్బంది మార్పిడి కోసం 10 వేల మందిని పంపేందుకు గత వారమే ఆదేశాలిచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల కన్నా.. భూభాగమే ముఖ్యమని తేలిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. శ్రీనగర్: అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితులు హింసాత్మకంగా మారే అవకాశం ఉందంటూ అక్కడి ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన నడుస్తుండటం తెలిసిందే. జూలై 1న మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. కాగా, యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుందని ఆర్మీ 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ చెప్పారు. అమర్నాథ్ యాత్ర సాగే బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహించగా, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, అమెరికాలో తయారైన ఎం–24 (స్నైపర్) తుపాకి లభించాయని వెల్లడించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. యాత్రికులపై దాడి చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ధిల్లాన్ వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో భద్రతా దళాలు జరిపిన సోదాల్లో, పాకిస్తాన్‌లోని ఆయుధ కర్మాగారంలో తయారైన మందుపాతర, భారీ స్థాయిలో ఇతర ఆయుధాలు దొరికాయని ధిల్లాన్ తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌తో కలిసి ధిల్లాన్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘గత మూడు నాలుగు రోజుల నుంచి మాకు నిఘా వర్గాల ద్వారా కచ్చితమైన సమాచారం వస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ నేతృత్వం, సాయంతోనే ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని చెప్పారు. మరోవైపు అవసరమైతే కశ్మీర్ విమానాశ్రయం నుంచి అదనపు విమానాలను నడపడానికి సిద్ధంగా ఉండాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. ఇక కేంద్రం సిద్ధమైంది: మెహబూబా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ప్రభుత్వం కశ్మీర్‌పై సైనిక శక్తిని ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించే విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రావొచ్చన్న వార్తల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ‘ఎట్టకేలకు కేంద్రం సిద్ధమైనట్లుగా ఉంది. ప్రజల కన్నా భూభాగమే ముఖ్యమని ఇండియా నిర్ణయించుకున్నట్లుంది. మీరు (ప్రభుత్వం) దేశంలోని ముస్లిం ఆధిక్య రాష్ట్రం ప్రేమను గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మతం ఆధారంగా దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక రాజ్యమైన భారత్‌తో కలిసుండాలని నిర్ణయించుకున్న రాష్ట్రమిది. కానీ ఇప్పుడు ఇండియా సిద్ధమైనట్లుగా ఉంది. జమ్మూ కశ్మీర్ ప్రజలను దోపిడీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది’ అని ఆరోపించారు. అలాగే మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా అంశాన్ని కదిలించవద్దని కేంద్రాన్ని కోరింది. భద్రత కోసమే బలగాలు: కేంద్రం కశ్మీర్లో అంతర్గత భద్రతా పరిస్థితుల దృష్ట్యానే పారా మిలిటరీ బలగాలను కశ్మీర్‌కు పంపుతున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. కశ్మీర్‌కు 10 వేల సిబ్బందిని కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు తరలిస్తోందనీ, వారం క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని హోం శాఖ వర్గాలు చెప్పాయి. భయం రేకెత్తిస్తున్నారు: ఎన్సీ, పీడీపీ యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్ లోయలో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందనీ, ఇలాంటి పరిస్థితిని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మండిపడ్డాయి. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్ చేస్తూ, ‘ఉన్నపళంగా వెళ్లిపోవాలని యాత్రికులు, పర్యాటకులకు ప్రభుత్వమే చెబితే వారిలో భయం కలగదా? వారంతా తక్షణం అన్నీ సర్దు కుని వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు విమానాశ్రయాలు, రహదారులు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతాయి’ అని అన్నారు. కశ్మీర్‌కు రాజ్యాంగం ఇస్తున్న హక్కులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్æ అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఓ భేటీ నిర్వహించిన అనంతరం కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేసింది. కశ్మీర్లో భయం భయం.. ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నందున అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులు వెంటనే కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు సరకులు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసి ముందస్తుగా భద్రపరచుకునేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ వరుసల్లో నిలబడుతున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించే విషయమై కీలక నిర్ణయం రానుందనీ, ఆ కారణంగా గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పుకార్లు వస్తున్నాయి. దీంతో సరకులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునేందుకు స్థానికులు క్యూలు కట్టారు. పోలీసు సోదాల్లో దొరికిన అమెరికా తయారీ అత్యాధునిక రైఫిల్ -
టార్గెట్ అమర్నాథ్పై స్పందించిన ముఫ్తీ
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రికులు, టూరిస్టులకు ఉగ్ర ముప్పుపై భద్రతా పరమైన సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కశ్మీర్‌ను వాడుకోరనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పతనావస్ధలో ఉందని, ప్రజలను వాస్తవిక అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీసి కశ్మీరీలను సంక్షోభ అంచులకు చేర్చుతాయని మెహబూబా ట్వీట్ చేశారు. కాగా, అమర్నాథ్ యాత్ర రూట్లో మందుపాతరలు, స్నిపర్ తుపాకులు లభించడంతో యాత్రికులకు, సందర్శకులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పలు సూచనలతో మార్గదర్శకాలను జారీ చేసింది. -
అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
-
‘ప్రభుత్వ అధికారినని చెప్పినా వినలేదు’
శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర ఆంక్షల కారణంగా జమ్మూ కాశ్మీర్లో సామాన్య పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ ఆర్థిక శాఖ డైరెక్టర్ ఇంతియాజ్ విమర్శలు గుప్పించారు. యాత్ర కారణంగా తన తండ్రి మృతదేహంతో చాలా గంటలు వేచి ఉండే పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. తన తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలో మరణించారని... అయితే ఆయన శవాన్ని సొంతూరికి తీసుకువెళ్లే క్రమంలో పోలీసుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని వెల్లడించారు. యాత్రికులను అనుమతిస్తాము కానీ మృతదేహాలను అనుమతించమని పోలీసులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీనియర్ ప్రభుత్వ అధికారినని చెప్పినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ఒక ప్రభుత్వ అధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా రెండు గంటలపాటు ఎదురుచూసిన తర్వాతే తన తండ్రిని శవాన్ని అనుమతి దొరికిందని ఇంతియాజ్ పేర్కొన్నారు. తాము అమర్నాథ్ యాత్రకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని అయితే యాత్ర పేరిట సామాన్య పౌరులకు ఇబ్బంది కలిగించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. కాగా ఈ విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన కశ్మీర్ డివిజనల్ కమీషనర్ బషీర్ ఖాన్ పౌరహక్కులను నియంత్రించాలనే ఉద్దేశ్యం తమకు లేదని... ట్రాఫిక్‌ను మాత్రమే తాము నియంత్రిస్తున్నామని వివరణ ఇచ్చారు. -
కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర
-
చిరకాల కోరిక తీరకుండానే..
సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : ప్రొద్దుటూరులోని బాలాజీనగర్–1కు చెందిన పెండ్లిమర్రి భాగ్యమ్మ (51) అమరనాథ్ యాత్రలో గుండె పోటుతో మృతి చెందింది. జూన్ 26న ఆమె భర్త శంకరయ్యతో కలిసి అమరనాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లింది. 12 మంది బంధువులు, కర్నూల్ నుంచి సుమారు 100 మంది భక్తులతో కడప నుంచి నిజాముద్ధీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లారు. 27న ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని వైష్ణవి ఆలయం, ద్వారక, స్వర్ణదేవాలయం, వాఘా సరిహద్దు, జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రదేశాలను సందర్శించారు. అమరనాథ్ కొండపైకి వెళ్లేందుకు ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కశ్మీర్లో ఉన్న బర్తాల్ బేస్ క్యాంపునకు చేరుకొని రాత్రి ఉండటానికి బాడుగ రూములు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి గురువారం ఉదయం అమరనాథుని దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం డోలీలకు డబ్బు కూడా చెల్లించారు. అయితే కొద్ది సేపటి తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో భాగ్యమ్మకు గుండె పోటు రావడంతో కుప్ప కూలిపోయింది. భర్తతో పాటు యాత్రికులు ఆమె వద్దకు చేరుకునే లోపు తుదిశ్వాస విడిచింది. భార్య అకాల మరణాన్ని చూసి భర్త శంకరయ్య తల్లడిల్లిపోయారు. తమకు బుధవారం సాయంత్రం 4.40 గంటలకు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కశ్మీర్లో ఫోన్లు పని చేయకపోవడంతో వీరికి ఆలస్యంగా తెలిసింది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు మృతదేహం బర్తాల్ బేస్ క్యాంపు సమీపంలోని సోనామార్గ్ ఆస్పత్రిలో గురువారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొని వచ్చారు. శుక్రవారం ఉదయం వారి స్వస్థలమైన ప్రొద్దుటూరుకు భాగ్యమ్మ మృతదేహాన్ని తీసుకొని వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉండేది భాగ్యమ్మ పూర్తి ఆరోగ్యంతో ఉండేదని, ఏ రోజు ఆస్పత్రికి వెళ్లలేదని కుమార్తె నాగవేణి తెలిపింది. తల్లి మరణ వార్త విని ఆమె బోరున విలపించసాగింది. శంకరయ్య, భాగ్యమ్మ దంపతులకు మంజుల, నాగవేణి అనే కుమార్తెలు, శరత్ అనే కుమారుడు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శంకరయ్య జమ్మలమడుగు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది అతను జమ్మలమడుగు డిపోకు బదిలీ అయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ పొందనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం 7.30 సమయంలో తల్లి భాగ్యమ్మ తమతో ఫోన్లో మాట్లాడిందని కుమార్తె నాగవేణి చెబుతూ విలపించసాగింది. కశ్మీర్లో ఉన్నామని, రేపు (గురువారం) ఉదయం అమరనాథ్ కొండపైకి వెళ్తామని తల్లి చెప్పినట్లు తెలిపింది. ఆమె ఫోన్ పని చేయకపోవడంతో ట్రావెల్స్ ప్రతినిధి ఫోన్‌తో మాట్లాడిందన్నారు. ఏదైనా అవసరం ఉంటే ఈ నంబర్‌కే ఫోన్ చేయాలని తల్లి చెప్పిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించింది. తల్లి మరణ వార్త విని కడపలో ఉంటున్న ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు శ్రీధర్, అర్జున్ ప్రొద్దుటూరుకు వచ్చారు. తల్లి మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చేందుకు కుమారుడు శరత్ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. -
అమర్నాథ్ యాత్రలో వైఎస్సార్ జిల్లా భక్తురాలి మృతి
సాక్షి, వైఎస్సార్ : అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహిళా భక్తురాలు భాగ్యమ్మ బల్తాల్ బేస్ క్యాంపులో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. భాగ్యమ్మ మృతదేహాన్ని రేపు విమానంలో స్వస్థలానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమర్నాథ్ యాత్రలో బుధవారం 15 మంది భక్తులు ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురయ్యారు. అయితే తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారికి ఆక్సిజన్ మాస్క్‌లు అందజేసి, మెడికల్ క్యాంపులకు తరలించారు. -
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
-
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లోని పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలి యాత్ర ప్రారంభమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం 5.30 గంటలకు అనంతనాగ్ జిల్ల అభివృద్ధి అధికారి ఖలీద్ జహింగీర్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరిన యాత్రికుల బృందం ఈరోజు యాత్రను ప్రారంభించారు. తొలి బృందంలో 2800మంది భక్తులు ఉన్నారు. 46 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి దేశ వ్యాప్తంగా 1.5లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దాంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిత్యం సీఆర్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాలు, డ్రోన్లతో దారి పొడవునా పహారా కాయనున్నట్లు అధికారులు తెలిపారు. అలానే అమర్నాథ్ బోర్డు ఈ ఏడాది నూతనంగా ‘యాత్రి నిర్వహణ వ్యవస్థ’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి యాత్రికుడి మార్గాన్ని లోకేట్ చేసేందుకు అవకాశం కల్గుతుందని అధికారులు తెలిపారు. -
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత
శ్రీనగర్/జమ్మూ: పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్‌గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్ మార్గం, గండేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. -
ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్‌నాథుణ్ని దర్శించుకునే వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బల్తాల్, పహల్గామ్ మీదుగా రెండు మార్గాల్లో సాగే 40 రోజుల అమర్నాథ్ యాత్రకు సీఆర్పీఎఫ్తోపాటు కశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. తీర్థయాత్ర సందర్భంగా భద్రతా ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించాలని హోం మంత్రి అమిత్ షా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర నీడలు
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రలో యాత్రికులను టార్గెట్ చేస్తూ అదును చూసి విరుచుకుపడాలని ఉగ్రవాదులు సన్నద్ధంగా ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. నిఘా సంస్థల సమాచారం ప్రకారం జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా సంస్థలు పసిగట్టాయి. జులై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత దృష్ట్యా వారి కదలికలను తెలుసుకునేందుకు ఉపకరించే బార్కోడ్ ఆధారిత స్లిప్‌లు జారీ చేయనున్నారు. యాత్రికుల భద్రతను పెంచేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పారామిలటరీ బలగాలు, సీఆర్పీఎఫ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు జమ్ము కశ్మీర్లో భద్రతా అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాత్రికుల భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
పుష్పదంతునికి పరమేశ్వరుని శాపం
పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి ఈ లోకాలకి దూరంగా కొంతకాలం పాటు ఏకాంతంగా ఉందామనిపించింది. వారు అందుకు అనువైన ప్రదేశం కోసం వెదుకుతూ అమరనాథ గుహకు వచ్చారు. అక్కడ కూర్చుని వారు ప్రాపంచిక బాధలు లేకుండా హాయిగా కథాకాలక్షేపం చేయసాగారు. తాముండే ఆ గుహ వద్దకు ఎవ్వరినీ రానివ్వకుండా నందిని కాపలాగా ఉంచి పరమేశ్వరుడు పార్వతీదేవికి రోజూ ఒక కథ అత్యంత రమణీయంగా కన్నులకు కట్టినట్లు చెప్పేవాడు. పార్వతీదేవి ఎంతో ఆసక్తితో ఆ కథలు వినేది. అయితే ఆ గుహలో పుష్పదంతుడనే యక్షుడు పావురం రూపంలో ఒక మూలన రహస్యంగా దాగి ఉండి ఆ కథలను వింటూ ఉండేవాడు. అతను అంతటితో ఆగక ఆ కథలను ఇంటికి వెళ్లి తన భార్యకు చెప్పేవాడు. ఆమె ఎంతో శ్రద్ధగా వినేది ఆ కథలను. పార్వతీపరమేశ్వరుల ఏకాంతవాసం అయిపోయింది. వారు తిరిగి కైలాసానికి వెళ్లి, యథావిధిగా లోకాలను పాలిస్తున్నారు. పుష్పదంతుని భార్య పార్వతీదేవికి భక్తురాలు. అనుంగు చెలికత్తె కూడా కావడంతో కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని కలుసుకుంది. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె పార్వతీదేవికి తాను భర్త ద్వారా విన్న కథలను చెప్పింది. పార్వతీదేవి ఆ కథలు విని నిర్ఘాంతపోయింది. ప్రపంచంలో ఎక్కడా వినని కథలు చెప్పమంటే అందరికీ తెలిసిన కథలు చెప్పాడేంటి అనుకుని పరమేశ్వరుడిని నిలదీసింది. పరమేశ్వరుడు దివ్యదృష్టితో చూసి జరిగిందేమిటో గ్రహించాడు. ఏకాంతంలో ఉన్న తమ రహస్యాలను బహిర్గతం చేసినందుకు కోపించి, పుష్పదంతుని పిలిచి, బేతాళుడిగా అంటే శవంలా పడుండమని శపించాడు. పుష్పదంతుడు తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి పరమేశ్వరుడి పాదాల మీదపడి తనను క్షమించి, శాపాంతం చెప్పమని వేడుకున్నాడు. భక్త వత్సలుడైన బోళాశంకరుడు కరుణించి ‘‘భూలోకంలో ఒక చెట్టుమీద శవంలా పడున్న నిన్ను విక్రమార్కుడనే రాజు దించి భుజానేసుకుని ఒక మాయా సన్యాసి వద్దకు మౌనంగా తీసుకు వెళుతుంటాడు. ఆ సమయంలో నువ్వు ఈ కథలు అసంపూర్తిగా చెప్పి, వాటి గురించి ప్రశ్నలు వేసి, ‘తెలిసి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది’ అని బెదిరించి మౌనభంగం చేస్తుండు. ఏ ప్రశ్నకైతే అతను సమాధానం చెప్పలేక మౌన ంగా ఉంటాడో, అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పాడు. ఆ తర్వాతి కథ అందరూ చిన్నప్పటినుంచి చందమామ కథల్లో చెప్పుకున్నదే, అందరికీ తెలిసిందే. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, రహస్యమంటూ చెబితే, దానిని పదిమందికీ చెప్పి బట్టబయలు చేయడం, ఇతరుల ఏకాంతాన్ని భంగపరచడం, చాటుగా దంపతుల మాటలు విని, వాటిని ఇతరులకు చేరవేయడం వంటివి పరమ నీచమైన పనులు. వాటిని ఎవ్వరూ అలవాటు చేసుకోకూడదు. అలా అలవాటు చేసుకుంటే, పర్యవసానాలు తీవ్రంగా వుండొచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర ముగిసింది. 2.85 లక్షల మంది భక్తులు అమర్నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇది గతేడాది కన్నా 25 వేలు ఎక్కువ. జూన్ 28న ఈ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది యాత్రలో వాతావరణ, అనారోగ్య కారణాలతో మొత్తం 38 మంది మరణించారని అధికారులు తెలిపారు. గత సంవత్సరం యాత్రీకుల బస్సుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 8 మంది చనిపోయిన నేపథ్యంలో ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసింది. -
భారీ వర్షాలతో నిలిచిన అమర్నాథ్ యాత్ర
జమ్మూ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం జమ్మూలో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను రద్దు చేశామని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి యాత్రికులను అమర్నాథ్ వైపు అనుమతించలేదని చెప్పారు. జూన్ 28న రెండు మార్గాల్లో ప్రారంభమైన 60 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్టు 26న రక్షా బంధన్ రోజు ముగియనుంది. కాగా ఆదివారం సాయంత్రం వరకూ 2,78,878 మంది యాత్రికులు అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. మరోవైపు అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడవచ్చనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో యాత్ర సాగే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
అగనంపూడి (గాజువాక): టీడీపీ పాలనకు చరమ గీతంపాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబా బు పాలనతో విసిగిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోకవర్గ ఇన్చార్జ్ వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, సామాన్యులు దగా పడ్డారన్నారు. పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు టీడీపీతో విసిగిపోయి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు సాలాపు నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, జన్మభూమికమిటీ సభ్యుడు సాలాపు అప్పారావు, మాజీ ఉప సర్పంచ్ సాలాపు కనకరాజు, వార్డు సభ్యుడు సాలాపు నూకరాజు, లారీ ఓనర్లు సాలాపు శ్రీనివాసరావు, నానాజీ, రామకృష్ణ, అప్పలనాయుడు, బాబూరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం నాయకులు పైలా శ్రీనివాసరావు, 56వ వార్డు పార్టీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ (పూర్ణ), పరవాడ మండల అధ్యక్షుడు సిరపురపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్ చుర్కా రామునాయుడు, నాయకులు సుందరపు అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, సేనాపతి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. జన్‌తోనే సుపరిపాలన పీఎంపాలెం(భీమిలి): మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన ఆదర్శపాలన ప్రజలకు అందించడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంసిద్ధంగా ఉన్నారన్నారని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. ఆదివారం శిల్పారామంలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని 4,5,6 వార్డుల బూత్ కమిటీల కన్వీనర్ల, సభ్యుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు పరచడంలో విఫలమైన బాబు ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. నాలుగేళ్ల పాలనలో పట్టించుకోకుండా... మరోమారు రాష్ట్ర ప్రజలను మోసగించడానికి చంద్రబాబు వేస్తున్న నక్కజిత్తులను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ టీడీపీ నాయకుల భూ కబ్జాలతో భీమిలి ప్రతిష్టను మసకబర్చారని మండిపడ్డారు. మాజీ ఉపసర్పంచ్ చేరిక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం మీద విశ్వాసంతో బక్కన్నపాలెం మాజీ ఉపసర్పంచ్ ఆర్. స్వామినాయుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తైనాల విజయకుమార్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు 150 మంది అనుచరులు చేరారు. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. -
అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి మృతి
సాక్షి, అమరావతి : అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి దుర్మరణం పాలైయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామానికి చెందిన గన్నమని కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఐదు రోజుల కిృతం స్నేహితులతో కలిసి అమరనాథ్ యాత్రకు వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో గుండెపోటు రావడంతో కోటేశ్వరరావు మృతి చెందాడు. పార్థివ దేహం మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటుందని, బుధవారం ఉదయానికి అతని స్వగ్రామానికి చేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి
శ్రీకాకుళం రూరల్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన వృద్ధుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. దీంతో నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సావూకారి రవీంద్రనాథ్ చౌదరి (72), భార్య భువనేశ్వరి గత నెల 18న శ్రీకాకుళం నుంచి ఓ ట్రావెల్ సంస్థ ఏర్పాటు చేసిన ప్యాకేజీతో బయలుదేరి వెళ్లినట్లు తమ రెండో కూతురు సుమన ఆదివారం తెలిపింది. ట్రావెల్ సంస్థ ఆధ్వర్యంలోనే పయనం వీరిద్దరూ గత నెల 20వతేదీ నాటికి అమనాథ్ చేరుకున్నారు. ఈ 3న అమర్నాథ్ దైవదర్శనం చేసుకున్నాక అక్కడ్నుంచి వారుండే చోటుకు తిరిగి చేరుకున్నారు. మరుసటి రోజు 4న ఉదయం టిఫిక్ చేస్తుండగా రవీంద్రనాథ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాస్పిటల్లో వైద్య సేవలందించారు. దీంతో వెంటిలేటర్ తీయడానికి వీలు లేకపోవడంతో ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం తరలించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదేక్రమంలో ఒక్కసారిగా హార్ట్స్ట్రోక్ రావడంతో ప్రాణాలు వదిలారని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఆర్జీ శ్రీకాంత్ ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మృతుడు కొడుకు కిరణ్ హైదరాబాద్ నుంచే హుటాహుటిన అమర్నాథ్ చేరుకున్నాడు. అయితే మృతదేహాం ఈ నెల 10వ తేదీకి శ్రీకాకుళానికి చేరుతుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుతెలిసింది. కుటుంబ నేపథ్యం ఇదీ.. మృతుడు రవీంద్రనాథ్ టీచర్ స్థాయి నుంచి ఎంఈవోగాను, డీఐవోగాను, హెచ్ఎంగా వివిధ హోదాల్లో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం పదవీవిరమణ పొందారు. ఈయన భార్య కుడా టీచర్‌గా పదవీ విరమణ చేశారు. ఈయన స్వస్థలం వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామం అయినప్పటికీ జిల్లా కేంద్రంలోనే స్థరపడ్డారు. వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్దమ్మాయి సృజన ఓంగోలు రిమ్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా, రెండో అమ్మాయి సుమన శ్రీకాకుళంలోనే స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి తమ్ముడు కిరణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన తండ్రికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, అమర్నాథ్ యాత్రలో ఒక్కసారిగా మృత్యువాత పడటం నమ్మలేక పోతున్నామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి
సాక్షి, జమ్మూకాశ్మీర్: అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ చౌదరి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. రవీంద్ర ఈ నెల 3న అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి శ్రీనగర్‌లోని షేర్-ఈ-కాశ్మీర్ హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటిలేటర్ తీయడానికి వీలు లేకపోవడంతో అతని కోసం ఎయిర్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ లోపే బ్రెయిన్ స్టోక్‌తో ఆదివారం మధ్యాహ్నం రవీంద్రనాథ్ మరణించారు. రేపు సాయంత్రం మృతదేహాన్ని వైజాగ్‌కు తరలించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్ ప్రత్యేక కమీషనర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. -
సరస్సులో మూత్ర విసర్జన.. ఇదిగిదిగో స్వచ్ఛ భారత్!
సాక్షి, న్యూఢిల్లీ : అమరనాథ్ యాత్ర కోసం కశ్మీర్లో అడుగుపెట్టిన ఉత్తర, దక్షిణాది భారతీయులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ఒడ్డున మూత్ర విసర్జన చేయడం పట్ల కశ్మీరీలు మండిపడుతున్నారు. మరోపక్క మహిళలు కూడా సామూహికంగా మూత్ర విసర్జనలు చేయడం ఏమిటని? ఇదెక్కడి సంస్కృతి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సరస్సు ఒడ్డున మగవాళ్లు మూత్ర విసర్జన చేస్తున్న ఫొటోను ప్రచురించిన ‘కాశ్మీర్ వాలా, ది సిటిజెన్’ లాంటి స్థానిక పత్రికలు ఈ తీరును తప్పుబట్టగా.. అలాంటి ఫొటోలతోని ట్విట్టర్, వాట్సాప్‌లలో కొందరు తమదైన శైలిలో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను చూసి మీరు నేర్చుకున్నది ఇదేనా ? అంటూ కొందరు.. ‘టాయ్‌లెట్’ బాలీవుడ్ సినిమా చూడలేదా అంటూ మరికొందరు స్పందించారు. అమర్నాథ్ యాత్ర కోసం భారీ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ భారీ ఎత్తున మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దాల్ లేక్‌ను ఎందుకు పాడుచేస్తున్నారని వారు ప్రశ్నించారు. ‘మేం బతకడానికి ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నామని చెప్పుకునే మీరు ఈ కుసంస్కారాన్ని ఎలా సమర్థిస్తారు?’ ఇంకొకరు ట్వీట్లు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నవారిలో కశ్మీర్ ముస్లింలతోపాటు హిందువులు, ముఖ్యంగా పండిట్లు కూడా ఉన్నారు. ‘ అమర్నాథ్ యాత్రికులను మా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు మా సహజ వనరులను కలుషితం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే మనస్తత్వాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఇది విచారకరమే కాదు, సిగ్గుచేటైన విషయం. అత్యున్నత ఆధ్యాత్మిక స్ఫూర్తితో వెళుతున్న యాత్రికులకు కూడా మీరు అగౌరవం తీసుకొచ్చారు. మీరు ఏ రాష్ట్రం వారైనా కావచ్చు. స్వచ్చ భారత్ అభియాన్‌కు మచ్చతెచ్చారు’ అని సామాజిక కార్యకర్త, కశ్మీర్ పండిట్ సంజయ్ పార్వ వ్యాఖ్యానించారు. దాల్ సరస్సు పక్కన పారిశుద్ధ్య పరిస్థితులు అంత సవ్యంగా లేకపోవడం వల్లనే అక్కడ యాత్రికులు మూత్ర విసర్జన చేశారని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముందు తమరు ముందు నేర్చుకోండంటూ కశ్మీరీలకు కొందరు కౌంటర్ ట్వీట్లు ఇచ్చారు. -
అమర్నాధ్ యాత్రకు మళ్లీ ఆటంకం
-
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/చాగల్లు/కాకినాడ: ఆధ్యాత్మిక యాత్రల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. కైలాస మానస సరోవరం, అమర్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ కురుస్తున్న మంచు తుపాన్ వల్ల చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న 1,500 మందికి పైగా ఉన్న భారతీయ యాత్రికుల్లో ఎనిమిది మంది మృతిచెందగా.. 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణమైన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రముఖ ఇంజినీర్, ఆర్కిటెక్చర్, బిల్డర్ గ్రంధి వీవీఎస్ఎల్ఎన్ సుబ్బారావు (58) టిబెట్ సరిహద్దులో గుండెపోటుతో మృతి చెందినట్లు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కేరళకు చెందిన నారాయణం లీలా(56) మృతి చెందినట్టు ఎంబసీ పేర్కొంది. మరోవైపు అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72), అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతపురానికి చెందిన మరో వ్యక్తి మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. కాగా, అమర్నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. బల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రైల్‌పత్రి, బ్రారిమార్గ్ మధ్య కొండచరియలు విరిగిపడడంతో ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు.. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ఏర్పాట్లు ఓ కొలిక్కి వస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న మంచు తుపాను వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్ర ముందుకు సాగలేదు. బేస్‌క్యాంపుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 1500 మందికి పైగా(సిమిల్‌కోట్525, హిల్సా550, టిబెట్ 500) యాత్రికులు ఉన్నారు. వీరిలో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా, విజయవాడకు చెందిన సుమారు 100 మంది, తెలంగాణకు చెందిన 110మంది తెలుగువారు ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి వాతావరణం అనుకూలించడంతో వీరందరినీ సిమిల్‌కోట్, నేపాల్ గంజ్‌కు తరలించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్ ఆర్మీ హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సిమిల్‌కోట్ నుంచి నేపాల్గంజ్కు 7 ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఏఆర్సీ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు నేపాల్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హిల్సా నుంచి సమికోట్కు అక్కడి నుంచి నేపాల్గంజ్కు తరలించి యాత్రికులను లక్నో చేరుస్తున్నారు. యాత్రికుల తరలింపునకు చర్యలు మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ట్వీటర్లో పేర్కొన్నారు. హాట్‌లైన్ ఏర్పాటు చేసి తెలుగు, మళయాళం, తమిళ్, కన్నడ భాషల్లో యాత్రికుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలుగు వారికోసం 977–9808082292 హాట్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర యాత్రికులు క్షేమం సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన రాష్ట్ర యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెల 27 నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల యాత్రకు ఆటంకం కలిగింది. కొందరు యాత్రికులు మార్గం మధ్యలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో పాటు అక్కడి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ యాత్రికులకు సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. యాత్రలో ఉన్న కరీంనగర్ వాసి గౌరెశెట్టి మునిందర్తో అధికారులు మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర యాత్రికుల కు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం సిమఖోట్ లో సురక్షితంగా ఉన్నట్లు మునిందర్ చెప్పారు. సిమఖోట్ నుంచి గమ్యస్థానానికి చేర్చేందుకు అక్క డి యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. మూడ్రోజుల్లో రాష్ట్ర యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశముందని తెలిసింది. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి సాక్షి, అమరావతి: మానస సరోవర్ యాత్రకు వెళ్లి హిల్సా శిబిరంలో చిక్కుకుపోయిన తెలుగువారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యాత్రికుల భద్రతపై ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులను క్షేమంగా తెచ్చే చర్యలను వేగవంతం చేయడంతో పాటుగా అవసరమైన వారికి ఆరోగ్య సేవలు కూడా అందించాలని వైఎస్ జగన్ కోరారు. -
మానస సరోవర్ యాత్రలో విషాదం
-
అమర్నాథ్ యాత్రలో అపశృతి
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): అమర్నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మానస సరోవర్ యాత్రలో విషాదం: మానస సరోవర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు యాత్రలో మృతిచెందారు. మానస సరోవరం నుంచి తిరుగి వస్తుండగా మార్గమద్యమంలోని టిబెట్ ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని హిల్సా నుంచి సిమిల్ కోట్కు తరలించారు. అక్కడి నుంచి అధికారులు మృతదేహాన్ని నేపాల్ గంజ్‌కు తరలిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని లక్నో మీదుగా స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. -
భారీ దాడికి లష్కరే స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో ఉగ్రసంస్థ లష్కరే తోయిబా దాడులకు తెగబడనుందన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కుల్గాంలోని వెసుమిర్ బజార్ వద్ద లష్కరే దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నిందని, లష్కరే ఉగ్రవాది మహ్మద్ నవీద్ అలియాస్ అబూ హంజాలా ఉగ్ర బృందానికి నేతృత్వం వహిస్తాడనే సమాచారంతో అధికారులు అమర్నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్ ఆస్పత్రి వెలుపల పోలీసు అధికారులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన క్రమంలో నవీద్ తప్పించుకుని పారిపోయాడు. ఇక అమర్నాథ్ యాత్రపై ఉగ్ర మూకలు విరుచుకుపడతారనే సమాచారంతో భద్రతను ముమ్మరం చేసిన అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ఎన్ఎస్జీ కమాండోలను నియోగించారు. వీరికి అత్యంతాధునిక ఆయుధాలను అప్పగించారు. అమర్నాథ్ యాత్రకు పటిష్ట భద్రతను కల్పించే క్రమంలో సీఆర్పీఎఫ్ సైతం ప్రత్యేక మోటార్‌సైకిల్ బృందాన్ని యాత్ర మార్గంలో మోహరించింది. మరోవైపు అమర్నాథ్ యాత్రికులను తరలించే ప్రతి వాహనానికి ప్రభుత్వం ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌ను జతచేసి జాయింట్ కంట్రోల్ రూం నుంచి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
-
సాహసం..శివం..సుందరం..
-
అమర్నాథ్ యాత్ర ప్రారంభం
జమ్మూ/శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని హిమా లయాల్లో ఉన్న ప్రఖ్యాత అమర్నాథ్ ఆలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకునే యాత్రికుల ‘అమర్నాథ్ యాత్ర’ బుధవారం మొదలైంది. రెండు నెలలపాటు సాగే ఈ యాత్రకు కశ్మీర్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దాదాపు 40వేల మందిని బందోబస్తులో వాడుతోంది. బుధవారం 3,000 మంది యాత్రికులతో తొలిæ విడత యాత్రను గవర్నర్ వోహ్రా సలహాదారులు విజయ్ కుమార్, బీబీ వ్యాస్లు జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూలోని భగవతి బేస్ క్యాంప్ నుంచి వేకువజామున 4.30 గంటల సమయంలో బయలుదేరిన ఈ బ్యాచ్‌లో యాత్రికులతో కూడిన 107 వాహనాలు, 4 బైక్‌లు ఉన్నాయి. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, బంకర్లు.. కశ్మీర్ పోలీసులతోపాటు పారామిలటరీ, ఎన్డీఆర్ఎఫ్(జాతీయ విపత్తు స్పందన దళం), సైన్యంతో కలిపి మొత్తం 40వేల మందిని యాత్రికుల భద్రత కోసం వినియోగిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికుల వాహనాలకు తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ట్యాగ్‌లను, సీఆర్పీఎఫ్ దళాలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, వారి హెల్మెట్లకు కెమెరాలను అమర్చారు. ప్రమాదాలకు గురైన యాత్రికులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, మొబైల్ బుల్లెట్ ప్రూఫ్ బంకర్లను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాహనాలకు ఆర్ఎఫ్ ట్యాగ్‌లను అమర్చామని, వీటి సాయంతో బెమినాలోని సెంట్రల్ కంట్రోల్ సెంటర్ నుంచి వాహనాల కదలికలు చూస్తామని 73వ బెటాలియన్ కమాండెంట్ పీపీ పౌలీ తెలిపారు. యాత్రికులు వెళ్లే మార్గంలో సీఆర్పీఎఫ్ బలగాలు పేలుడు పదార్థాలను పసిగట్టి ‘రోడ్ క్లియరింగ్’ ఏర్పాట్లను చూస్తాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్ లోయలో అల్లకల్లోల పరిస్థితులు, ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉన్నందున యాత్రికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటామన్నారు.ఉగ్రదాడుల్ని తిప్పికొట్టేందుకు 100 మందితో కూడిన అదనపు బలగాలను కూడా మోహరించారు. అనారోగ్యానికి గురైన యాత్రికులు, భద్రతా సిబ్బందిని వెంటనే చికిత్సకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే యాత్రికుల కోసం కూడా ఏర్పాట్లు చేపట్టామన్నారు. రెండు లక్షల మంది యాత్రికుల నమోదు హెలికాప్టర్లో వచ్చే యాత్రికులను మినహాయించి రెండు కాలినడక మార్గాల మీదుగా రోజుకు 7,500 మందిని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రను విజయవంతం చేయటానికి కశ్మీర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ప్రజల సహకారం, సైనిక, పోలీసు, పౌర అధికారుల సమన్వయంతో యాత్రికులకు వసతి, భద్రత కల్పించనున్నారు. యాత్రికుల్లో 1,904 మంది 36 కిలోమీటర్ల పొడవైన పహల్గామ్ మార్గాన్ని, 1,091 మంది 12 కిలోమీటర్ల బల్తాల్ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 26వ తేదీన ముగియనుంది. -
అమర్నాథ్ యాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు
-
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన ఎన్కౌంటర్లో జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌జేకే) చీఫ్ దావూద్ అహ్మద్ సోఫీ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో పౌరుడు మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు హత్య కేసు లు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనల్లో సోఫీ కీలక నిందితుడని తెలిపారు. వచ్చే వారం (జూన్ 28 నుంచి) అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ భద్రతాబలగాలకు నైతిక బలాన్నిచ్చింది. మరోవైపు, పుల్వామా జిల్లాలోని త్రాల్ మార్కెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తెల్లారేసరికి ఆపరేషన్ పూర్తి శుక్రవారం తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. తెల్లారేసరికి పనిపూర్తి చేశాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అర్థరాత్రే బలగాలు చేరుకున్నాయి. అయితే.. తెల్లవారాకే మృతుల్లో దావూద్ సోఫీ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఐఎస్‌జేకే సభ్యులైన ఆదిల్ రెహమాన్ భట్, మహ్మద్ అష్రఫ్ ఇటూ, మాజిద్ మంజూర్ దార్లుగా గుర్తించినట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి వెల్లడించారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్ర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సమన్వయంతో పని పూర్తిచేశారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఖిరం గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఓ ఇంట్లో దాక్కున్నారు. ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఆపరేషన్ పూర్తి చేశాయి’ అని ఆయన వెల్లడించారు. భారత్‌కు ఐఎస్ ముప్పు! ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్ ప్రభావం భారత్‌లో పెద్దగా లేదని.. మన ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. కశ్మీర్‌లోనూ మిగిలిన ఉగ్రవాద సంస్థలతో పోలిస్తే.. ఐఎస్ ప్రభావం అసలేమాత్రం లేదని చెప్పుకొస్తోంది. కానీ కొంతకాలంగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు కనబడుతున్నాయి. రాళ్లు రువ్విన ఘటనల చిత్రాల్లో యువకుల చేతిలో ఐఎస్ జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనంత్‌నాగ్‌లో శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌తో ఐఎస్ లోయలో ఐఎస్ ప్రభావం ఉన్నట్లు సుస్పష్టమైంది. జమ్మూకశ్మీర్ కోసం ఐఎస్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తేలింది. ఏ++ కేటగిరీ (ఉగ్రవాదుల స్థాయిని బట్టి భద్రతా బలగాలు ఇచ్చే రేటింగ్) ఉన్న జేకేఐఎస్ చీఫ్ దావూద్ సోఫీని హతమార్చటం ద్వారా.. లోయలో విస్తరించేందుకు ఐఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందనేది సుస్పష్టమైంది. హిట్ లిస్ట్‌తో ఆర్మీ ఆపరేషన్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ ఆలౌట్’ను ప్రారంభించాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని.. ఒక్కో ఉగ్రవాద సంస్థను, అందులోని ముఖ్యనేతలను పక్కాగా టార్గెట్ చేస్తూ 22మందితో జాబితాను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ (11 మంది), లష్కరే తోయిబా (7), జైషే మహ్మద్ (2), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్, జేకేఐఎస్ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. జేకేఐఎస్ చీఫ్ హతంతో ఈ జాబితా 21కి చేరింది. భద్రతను సమీక్షించిన విజయ్ జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహాదారుగా నియమితుడైన రిటైర్డు ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయమే ఆయన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. అటు, గవర్నర్ రూల్ అమల్లోకి రావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఒమర్ అబ్దుల్లా, పీడీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిలావర్ మిర్ సహా.. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ను కలిసి.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జూన్ 28 నుంచి 60 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో యాత్రికుల వాహనాలకు ట్రాకింగ్ చిప్స్‌ను అమర్చనున్నట్లు జమ్మూ రేంజ్ ఐజీ ఎస్డీ సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో యాత్రికులు, వారి వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా?: జైట్లీ న్యూఢిల్లీ: సామాన్య పౌరుల మానవహక్కుల్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. చంపడానికి, చావడానికి సిద్ధమై వస్తున్న ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యానించడంపై జైట్లీ మండిపడ్డారు. ‘ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు చావడానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఇతరుల్ని చంపడానికీ వెనుకాడడు. అలాంటివాళ్లు ఎదురుపడినప్పడు వారిని సత్యాగ్రహంతో ఎదుర్కోమంటారా? ఉగ్రవాది చంపడానికి ముందుకొస్తుంటే భద్రతాబలగాలు అతడిని చర్చలు జరిపేందుకు ఆహ్వానించాలా?’ అని ప్రశ్నించారు. మావోయిస్టుల మద్దతున్న మానవహక్కుల సంఘాలు వేర్పాటువాదం, హింసను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి గ్రూపుల్ని కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించినా జేఎన్‌యూ, హెచ్‌సీయూలో దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చినవారితో చేతులు కలిపేందుకు రాహుల్ గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని విమర్శించారు. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే కాంగ్రెస్ నేత సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలకు ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశమిస్తే వారు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపుతారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీకి దానితో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో సోజ్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీలు పాకిస్తాన్లో విలీనం కావాలనుకోవడం లేదని ముషార్రఫ్ చెప్పారు. ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అధికారం కశ్మీరీలకు ఇస్తే వారు స్వతంత్ర కశ్మీర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఆయన చెప్పింది అప్పటికీ, ఇప్పటికీ నిజమే. నేను కూడా అదే చెప్పాను. కానీ కశ్మీర్‌కు స్వాతంత్య్రం రావడం అన్నది అసాధ్యమని నాకూ తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్రనిరసన వ్యక్తమైంది. దీంతో సోజ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఖండించారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉందనీ, భవిష్యత్‌లోనూ ఉంటుందనీ స్పష్టం చేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న తన పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే సోజ్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని సూర్జేవాలా విమర్శించారు. కాగా సోజ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్‌ను డిమాండ్ చేసింది. -
ఉగ్రవేటకు బ్లాక్ క్యాట్ కమెండోలు
శ్రీనగర్/ న్యూఢిల్లీ/ ముంబై: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పుందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 24 మంది ఎస్ఎస్జీ కమెండోల బృందాన్ని కశ్మీర్‌కు పంపిందని తెలిపారు. వీరు త్వరలోనే భద్రతాబలగాలతో కలసి ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొంటారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి ఎన్ఎస్జీ కమెండోల సంఖ్యను 100కు పెంచే అవకాశముందని వెల్లడించారు. ఉగ్రవాదులు ప్రజల్ని బందీలుగా చేసుకుంటే లేదా విమానాల హైజాకింగ్‌కు పాల్పడితే వెంటనే ఘటనాస్థలికి చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం కమెండోలను శ్రీనగర్ విమానాశ్రయంలో మోహరించామన్నారు. ఎన్ఎస్జీ కమెండోల వద్ద ఉన్న గోడల్ని స్కానింగ్చేసే రాడార్లు, స్నైపర్ తుపాకులు, ఇంటి మూలల్లో నక్కిన ఉగ్రవాదుల్ని కాల్చగలిగే తుపాకులతో ఉగ్ర ఆపరేషన్లలో బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే యాత్రకు వాడే వాహనాల గమనాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ స్టిక్కర్లను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. 10–15 డ్రోన్లను వినియోగించడంతో పాటు ఎమర్జెన్సీ నంబర్ 1364ను యాత్రికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేర్పాటువాదుల అరెస్ట్ జమ్మూకశ్మీర్‌లో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారితో పాటు ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు కశ్మీరీల మృతికి నిరససగా వేర్పాటువాదులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను కోఠిబాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాజ్ ఉమర్ ఫారుఖ్‌ను ఆయన స్వగృహంలో నిర్బంధించారు. అతివాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఇప్పటికే గృహనిర్బంధంలో ఉన్నారు. సీఎం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా, వేర్పాటువాదుల పిలుపుతో కశ్మీర్ లోయలో మార్కెట్లు, దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శుక్రవారం అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. గవర్నర్ పాలన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, కశ్మీరీలను మరింత అణచేందుకే జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారని పాకిస్తాన్ విమర్శించింది. -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర నీడలకు చెక్
సాక్షి, శ్రీనగర్ : ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అమర్నాథ్ యాత్ర కోసం బల్టాల్, పహల్గాం రూట్లలో పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించామని, శాంతిభద్రతల పర్యవేక్షణ, కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జమ్ము కశ్మీర్ జోన్ సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ వీఎస్కే కౌముది తెలిపారు. కాగా, జమ్ము కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన మరుసటి రోజు భద్రతా దళాలు ఈ చర్యను చేపట్టాయి. మరోవైపు గవర్నర్ వోహ్రా ఉగ్ర కార్యకలాపాలను దీటుగా ఎదర్కోవడంలో పేరొందిన మాజీ పోలీస్ బాస్ విజయ్ కుమార్‌ను తన సలహాదారుగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. కశ్మీర్లో పాలక బీజేపీ-పీడీపీ సర్కార్ కుప్పకూలిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. రంజాన్ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను గత వారం పునరుద్ధరించారు. -
కశ్మీర్ గవర్నర్ పదవీకాలం పొడిగింపు?
శ్రీనగర్ : కశ్మీర్ గవర్నర్ నరీందర్‌నాథ్ వొహ్రా (82) పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చెడిపోవడంతో కశ్మీర్లో మంగళవారం నుంచి గవర్నర్ పాలన మొదలైన సంగతి తెలిసిందే. అయితే వొహ్రా పదవీకాలం జూన్ 27న ముగియనుండగా.. జూలైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. దక్షిణ కశ్మీర్ మీదుగా అమర్నాథ్ యాత్ర సాగనుండగా.. అక్కడ ఇప్పటికే ఉగ్రవాద కార్యకాలాపాలు పెరిగిపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తాయి. వొహ్రా అనంతరం కొత్త గవర్నర్‌ను నియమిస్తే కశ్మీర్ పాలనా, భద్రతా పరమైన వ్యవహారాలు తెలుసుకొనే సరికే నూతన గవర్నర్‌కు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వొహ్రా పదవీ కాలం పెంపు తథ్యమని పలువురు భావిస్తున్నారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్ సయ్యద్ మరణానంతరం కశ్మీర్లో ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పకుండా వొహ్రా చక్కదిద్దారు. మరోవైపు అమర్నాథ్ క్షేత్ర బోర్డులో వొహ్రా పరిపాలనా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆగస్టు 26న యాత్ర ముగియనుంది. -
పాక్ ప్లాన్ : భారత్‌పైకి తాలిబన్ మూక
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ) భారీ కుట్ర పన్నుతోంది. జైళ్లలో ఉన్న తెహ్రిక్ ఐ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాదులను విడుదల చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కశ్మీర్ లోయలో దాడులకు పంపేందుకు సిద్ధమవుతోందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ‘పవిత్ర యుద్ధం’ కోసం వెళ్లడానికి సిద్ధపడే ఒక్కరిని విడుదల చేస్తామని ఐఎస్ఐ జైళ్లలోని తాలిబన్లకు ఆఫర్ చేసినట్లు వివరించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని నయాలీ అటవీ ప్రాంతంలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఐఎస్ఐ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. దాదాపు 135 మంది ఉగ్రవాదులకు జైషే ఈ మహమ్మద్ ఉగ్రసంస్థ నయాలీలోని శిక్షణ కేంద్రంలో ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందని వివరించాయి. ప్రస్తుతం హిజ్బుల్ మొజాహిదీన్ కంటే జైషే ఈ మొహమ్మద్, లష్కర్ ఏ తైబాలనే పాకిస్తాన్ ఎక్కువ నమ్ముతున్నట్లు తెలిసింది. కశ్మీర్ లోయ గుండా సాగే అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ ఏడాది జూన్‌లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. దీనిపై హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించింది. అమర్నాథ్ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు సీఆర్పీఎఫ్ డీజీ రాజీవ్ భట్నాగర్ వెల్లడించారు. -
చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు
-
జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూ: దాదాపు రెండు నెలల పాటు సాగే పవిత్ర అమర్నాథ్ యాత్ర జూన్ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆశ్రమ బోర్డు వెల్లడించింది. ఈ యాత్ర గత ఏడాది కంటే ఈసారి 20 రోజులు ఎక్కువగా సాగుతుందని పేర్కొంది. హిందూ క్యాలండర్ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ రోజు ప్రారంభమై శ్రావణ పూర్ణిమ(రక్షాబంధన్) రోజు ముగుస్తుందని శ్రీ అమర్నాథ్జీ ఆశ్రమ బోర్డు (ఎస్ఏఎస్బీ) వివరించింది. అమర్నాథ్ ప్రవేశ ప్రదేశం నుంచి లోపలికి వెళ్లే మార్గాన్ని ఎన్జీటీ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన నిశ్శబ్ద జోన్‌గా ప్రకటించింది. అయితే, దీనిపై ఎస్ఏఎస్బీ కోర్టును ఆశ్రయించగా ఎన్జీటీ వివరణ ఇచ్చింది. అమర్నాథ్ గుహ లోపల భక్తులు భజనలు చేసుకునేందుకు మంత్రాలు జపించుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గురువారం జమ్మూకశ్మీర్ గవర్నర్, ఎస్ఏఎస్బీ చైర్మన్ ఎన్ఎన్ వోహ్రా అధ్యక్షతన భేటీ అయిన బోర్డు యాత్రపై నిర్ణయం తీసుకుంది. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుందని, అమర్నాథ్ గుహకు వెళ్లే రెండు మార్గాల్లోనూ రోజుకు 7,500 యాత్రికుల చొప్పున అనుమతించనున్నట్లు పేర్కొంది. -
గంటలు కొట్టినా.. భంభం భోలే.. అన్నా నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బుధవారం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఎన్జీటీ ఆదేశాలు అశనిపాతం లాంటివే. అమర్నాథ్ యాత్రలోనూ, అమర్నాథ్ గుహలోని భక్తులు భంభం బోలే అంటూ నినదించడం, బిగ్గరగా మంత్రాలు పఠించడం, పరమేశ్వరుడి దగ్గర గంట కొట్టడాన్ని ఎన్జీటీ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక యాత్ర చివరి చెక్‌పాయింట్ నుంచి అమర్నాథ్ గుహ వరకూ భక్తులను గుంపులుగా కాకుండా.. ఒకే వరుసలో పంపాలని అమర్నాథ్ బోర్డుకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ కొండ ప్రాంతాన్ని ‘సైలెన్స్ జోన్’గా ఎన్జీటీ ప్రకటించింది. అమర్నాథ్ గుహ ఉన్న ప్రాంతం.. మంచుతో కూడుకుని సహజ ప్రకృతితో ఉండే ఈ ప్రాంతాన్ని పరిరక్షించేదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, మంచు లింగాన్నిదర్శించుకునే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. భక్తులను వ్యాపారాత్మక దృష్టితో చూడడం అమర్నాథ్ బోర్డుకు మంచిది కాదని ఎన్జీటీ తెలిపింది. -
‘అమర్నాథ్ యాత్ర’కు ఆధునిక హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాత్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మంచు లింగాన్ని దర్శించి తరించాలని వేల సంఖ్యలో భక్తులు కోరుకుకుంటారు. అయితే అమర్నాథ్ యాత్ర అంత సులువుకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపయాలు, రవాణ వంటి సమస్యలు ఈ యాత్రలో భక్తులను విపరీతంగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అమర్నాథ్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అడిషనల్ సెక్రెటరీ హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అమర్నాథ్ యాత్రపై పరిశీలన చేసి.. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై ప్రణాళిక రూపోందిస్తుందని ఎన్జీటీ ప్రకటించింది. ఈ కమిటీ ప్రధానంగా రహదారి, దేవస్థానం సమీపంలో పరిశుభ్రత, భక్తులకు అవసరాలను పరిశీలిస్తుందని ఎన్జీటీ తెలిపింది. -
నూట పాతికేళ్ల క్రితం ఒకనాడు
అవి, భారతదేశంలో శ్వేత జాతి ప్రభుత్వం ఒకటిన్నర శతాబ్దకాలం పరిపాలించి, భారతీయులపై దాష్టీకం జరుపుతున్న రోజులు. భారతీయుల గుండెల్లో స్వాతంత్య్ర కాంక్ష రగులుతున్న రోజులు. బ్రిటిష్ వాళ్లు వారి పోలీసు బలగాలను ఒక చోటనుండి మరొక చోటుకు తరలించటానికి అనువుగా భారతదేశంలో తొలిసారి రైలుమార్గాన్ని నియమించారు. గుత్తి మార్గంలో కూడా ప్రతి రోజు రైలు వెళుతుంది. అక్కడ మనుషులు నడిచే బాట కలిసేచోట ఒక రైల్వేగేటు ఏర్పాటు చేసి కాపలాదారుణ్ణి నియమించారు. అతడి పేరు గూలపాళ్యం హంపన్న. అతడు విధులు నిర్వహించడానికి ఒక రాతిగూడును నిర్మించారు. గేటు కాపలాదారుడు రైలు వచ్చే సమయంలో గేటువేసి పచ్చజెండా చూపిస్తేనే కాని రైలు వెళ్ళదు. ఆ రైల్వే గేటుకు దగ్గర్లోనే గుత్తికొండ ఉంది. దానిపైన పడిపోయిన కోట కనిపిస్తూ ఉంటుంది. పలకరింపుతో ఆ దారినపోయే వారందరికీ దగ్గరయ్యాడు హంపన్న. గుత్తిలోని పల్లెపడుచు నాగులమ్మ. అందగత్తె. గుణవతి. పల్లెలో ఆమె లేకుండా ఏ పనీ జరుగదు. పెళ్ళి, పేరంటం, కొలుపులు అన్నిట్లోనూ నాగులమ్మ గలగల నవ్వుతూ కనిపించేది. ఆమె రూపం విశ్వంగారి వర్ణనలో ఇలా ఉంటుంది: కురులు ముడిచి ముద్ద కొప్పును జెక్కి, గో రంట పూలగుత్తి నంట దురిమి కోల దోసగింజ కుంకుమ బొట్టుతో లక్ష్మివోలె నాగులమ్మ వచ్చె. తెలుగు పడుచుల ముగ్ధ మనోహరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జడకొప్పులో గోరంటపూలు తురిమి, దోసగింజ కుంకుమ బొట్టుతో నాగులమ్మ లక్ష్మీదేవిలా ఉంది. ఆ బాటలో ప్రతిరోజు పొలం పనులకు వెళ్ళే నాగులమ్మ హంపన్న రూపానికీ గుణానికీ ముగ్ధురాలైంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు. హంపన్నను నాగులమ్మ ‘మామా!’ అని పిలిచేది. వారిద్దరు కలిసి ఆకువక్కలు వేసుకొనేవారు. ఆకు వక్క నమలటం రాయలసీమలో అప్పుడు సాధారణం. అందునా స్త్రీపురుషులు కలిసి ఆకు వక్క వేసుకోవటం ప్రేమికులకే చెల్లుతుంది. ఒకనాడు నాగులమ్మ తన స్నేహితురాలు లచ్చమ్మతో కలిసి సాయంత్రం వేళ ఆ బాటలో నడుస్తూ ఉంది. అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నిదానంగా నడుస్తుండటంతో వేగంగా నడిచే రైతుకూలిజనం వారి కంటే ముందుగా వెళ్ళిపోయారు. బాటలో వాళ్లిద్దరే మిగిలిపోయారు. చీకటి పడుతుందేమోనన్న భయంతో వడివడిగా నడవటం మొదలు పెట్టారు. అల్లంత దూరంలో రైలుగేటు కనిపిస్తోంది. ఈలోపు దారిలో ఆరుగురు తెల్ల సైనికులు ఎదురు పడ్డారు. వారి చేతిలో ఆయుధాలున్నాయి. తప్ప తాగి ఉన్నారు. పడుచులిద్దరూ భయంతో పరుగులు పెట్టారు. తెల్ల సైనికులు వెంట పడ్డారు. అది ఆడపడుచుల మానానికి హాని కలిగించే పరిణామం. నాగులమ్మకు హంపన్న గుర్తుకు వచ్చాడు. ‘మామా!’ అంటూ వెర్రికేక వేసి గసపెడుతూ రైలుగేటు దగ్గరికి చేరుకున్నారు. ఆ వెనుకనే తెల్ల సైనికులు. అక్కడ తెలుగు పౌరుషానికి నిలువెత్తు విగ్రహంలా మెలితిరిగిన మీసంతో తీక్షణమైన కళ్ళతో వీరభద్రుడిలా నిల్చొని ఉన్నాడు హంపన్న. నాగులమ్మ లచ్చమ్మ ఒక్క ఉదుటున రాతిగూడులో ప్రవేశించి తలుపులు వేసుకున్నారు. పరిస్థితిని కనురెప్పపాటుకాలంలో అర్థం చేసుకున్నాడు హంపన్న. అతడి చేయి గాలిలో లేచింది. ప్రక్కనున్న చెట్లపాదుకు నిలబెట్టిన వెదురుగడను అందుకొని గిరగిరా తిప్పుతూ తెల్ల సైనికులను ఎదుర్కొన్నాడు. ఈ పరిణామానికి తెల్ల సైనికుల మత్తు వదిలిపోయింది. మదం బుసలు కొట్టింది. హంపన్నపై దాడికి దిగారు. హంపన్న ప్రళయ కాల రుద్రుడిలా విజృంభించి ఒక్క కర్రతోనే వారందరినీ గాయపరిచాడు. హంపన్నను ఎదుర్కోవటం వారికి కష్టమైంది. వారు రెండుగా చీలిపోయి వెనుక నుండి, ముందు నుండి హంపన్న తలపై మోది తల పగులగొట్టారు. రక్తస్రావంతో హంపన్న నేలపై పడగా అతనిని వదిలిపెట్టి రాతిగూడులో దాక్కున్న పడుచులను ఎలాగైనా ఎత్తుకు పోవాలని దాని తలుపులు బద్దలు కొట్టసాగారు. లోపల లచ్చమ్మ, నాగులమ్మ భయంతో కేకలు వేయసాగారు. అబలల ఆర్తనాదం రక్తపు మడుగులో పడివున్న హంపన్నకు వినిపించింది. ఒంట్లోని నరాల శక్తినంతటిని కూడదీసుకొని ఉప్పెనలా లేచాడు. దాంతో చేతిలో ఆయుధంతో ఉన్న తెల్ల పిరికిపంద హంపన్నను గురిపెట్టి కాల్చాడు. పిస్తోలు శబ్దం, అబలల ఆక్రందనలతో ఆ పరిసరాలన్నీ మారు మ్రోగాయి. సూర్యుడు అస్తమించాడు. తెలుగు వీరుడు నేలకొరిగాడు. దూరంగా వెళుతున్న పల్లెజనం ఆ శబ్దానికి పరుగు పరుగున వచ్చారు. తెల్ల సైనికులు పారిపోయారు. తమ ఆప్తుడు హంపన్నను ఆ స్థితిలో చూసి జనం బావురుమన్నారు. అతని ప్రాణాలు దక్కించుకోవాలని వారి అమాయకపు ఆశ. దగ్గర్లో ఆసుపత్రి లేదు. అచేతనంగా ఉన్న హంపన్నను గుత్తి హాస్పిటల్‌కు చేర్చారు. అక్కడ మంచి మనసు గల మిషనరీలు, మిస్సమ్మలు హంపన్నకు వైద్యం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. తన మామను సజీవుడుగా చూడాలని పక్కనే ఉన్న నాగులమ్మ కనులు మూతపడలేదు. చివరికి అక్టోబర్ 5న హంపన్న తన నాగులమ్మను వదలి తుదిశ్వాస విడిచాడు. ఈ దయనీయ గాథను గేయ, పద్య రూపంలో కరుణరస స్ఫోరకంగా మలచిన విశ్వం శైలిని దేంతో పోల్చినా సరితూగదు. హంపన్న మరణించిన పిదప నాగులమ్మను వర్ణిస్తూ– హంస లేచిపోయె, హంపన్న లేడింక నాగులమ్మ వెఱి< బాగులమ్మ; మామ మామయన్న మాటొక్కటే కాని, వేఱుమాట పల్క నేరదయ్యె అని అంటాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించిన మామ ఇక లేడు అని తెలుసుకొని పిచ్చిదానిలా ‘మామా! మామా!’ అని అరుస్తూ నాగులమ్మ కొండల దారిపట్టింది. నాగులు మామా యనగా నగములు మామా యన్నవి. నాగులు మామా యనగా ఖగములు మామా యన్నవి. నాగులు మామా యనగా మృగములు మామా యన్నవి. నాగులు మామా యన భూ నభోంతరము దద్దరిల్లె. ‘మామా!’ అని నాగులమ్మ ఆర్తధ్వని చేయగానే కొండలు, పక్షులు, జంతువులు అంతేకాదు భూతలం కూడా తిరిగి మామా! అని అరిచాయి. అంటే ప్రతిధ్వనించాయి అని కవితా భావన. నాగులమ్మ ఏమైంది? మతి చలించిన నాగులమ్మలిక పడుచు కానలో బడిపోయె నెక్కటియె నపుడు ఆమె కనబడ దీనాటి కైన నచట వినబడును మామ యను మాట వీనులున్న. మతి చలించటంతో మామా అని అరుస్తూ అడవిలో కలిసిపోయిన నాగులమ్మ జాడ ఈనాటికీ తెలియదు. చెవులున్న వారికి అక్కడ మామా అనేమాట వినిపిస్తుంది. మనసు గల వారికి నాగులమ్మ దీనస్వరం హృదయంలో ప్రతిధ్వనిస్తుంది అని ఒక కొత్త భావాన్ని కవి సూచించారు. గుత్తి బాట ప్రక్కనే హంపన్న సమాధి చేయబడ్డాడు. తెల్ల దొరల్లో మంచి మనసు కలవారు నల్ల వారితో కూడా కలిసి వచ్చి నమ్రతతో ఆ వీర యోధునికి నివాళులు అర్పించారు. అతని వీరమరణానికి గుర్తుగా శిలాఫలకాన్ని ఆంగ్ల భాషలో చెక్కించారు. గుత్తి బాట ప్రక్క గడివోలె హంపన్న జ్ఞాపకమ్మ సేయు శాసనమ్ము కలదు నేడు గూడ, కంపల మధ్యలో నాటి సంఘటన కదోటు గుఱుతు. ఆ వీరగల్లు గుడిలో కావలి హంపన్న ఆత్మ కాపురముండన్ తావెక్కడ చాలును? భర తావనియే వాని ఆలయమ్మగును గదా? ఈనాటికీ హంపన్న సమాధి దర్శనమిస్తుంది. తెలుగు యోధుడు హంపన్న అతివల మానాన్ని రక్షించుట కోసం ప్రాణత్యాగం చేశాడు. విశ్వం గారు ఈ కావ్యాన్ని ముగిస్తూ– ధన్యుడు హంపన్న, ధన్యము గుత్తి ధన్యమాతని జీవితమ్ము, దివ్యమ్ము; ధన్యమీ కావ్యమ్ము, ధన్యుడు కవియు ధన్యుడు కృతిపతి, ధన్యము తెనుగు అన్నారు. నిజం చెప్పాలంటే ఈ కావ్యాన్ని చదివిన ప్రతి పాఠకుడూ ధన్యుడే. - శ్రీరామదాసు అమరనాథ్ 9603367178 -
డాక్టర్ కావాలనుకుని.. జడ్జినయ్యా!
హైదరాబాద్: దేశంలోని అత్యున్నత స్థాయి వ్యవస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి తొడుపునూరి అమర్నాథ్గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం లో ‘సాక్షి’తో మాట్లాడారు. కృషి, పట్టుదలతో శ్రమి స్తే తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వైద్యుడిని కావాలన్న ఉద్దేశంతో ఎంసెట్ రాశానని, అది వీలుకాకపోవడంతో డిగ్రీ చేసి ఎంబీఏ చదవాలని అనుకున్నానన్నారు. ఇలా మథనపడుతున్న నేపథ్యంలో తన బాబాయ్ సలహాతో న్యాయ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. పట్టుదలతో లా చదివి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టినట్లు వివరించారు. సమాజ సేవ కోసం కృషి..: సమాజ సేవ కోసం తన వంతు కృషి చేసేందుకు ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ స్థాపించినట్లు చెప్పారు. దానికి తానే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. దీని ద్వారా మూడేళ్లలో సుమారు 300లకుపైగా కేసులను పరిష్కరించినట్లు అమర్నాథ్గౌడ్ తెలిపారు. అలాగే 18 ఏళ్ల నుంచి లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో విధాలుగా ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. వృద్ధాశ్రమం, సికింద్రా బాద్ అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూల్‌ను దత్తత తీసుకుని కావాల్సిన సౌకర్యాలు సమకూర్చినట్లు తెలిపారు. సమాజానికి సేవ చేయడంలోనే అసలైన సంతృప్తి ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం, హైదరాబాద్‌లో బస్ షెల్టర్లు లేక విద్యార్థులు, సామాన్యులు ఇబ్బం దులు పడటం వంటి సమస్యలపై తాను స్పందించి న్యాయసేవ అందించానన్నా రు. ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులందరూ కలుపుగోలుగా ఉంటూ తన ఉన్నతికి సహకరించారన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి బెంచ్ వరకు వచ్చిన వారందరితో కలసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్యారడైజ్ ఫ్యామిలీగా..: 1965 మార్చి 1న తొడుపునూరి కృష్ణగౌడ్, సావిత్రమ్మకు రెండవ సంతానంగా అమర్నాథ్గౌడ్ జన్మించారు. వెస్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్, బేగంపేట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. మహారాష్ట్రలోని శివాజీ లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేసి 1980లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వంగ ఈశ్వరయ్య వద్ద వృత్తి జీవితం ప్రారంభించానన్నారు. తమకు ప్యారడైజ్ అనే థియేటర్ ఉండటంతో అంతా ప్యారడైజ్ ఫ్యామిలీగా పిలిచేవారన్నారు. -
అమర్నాథ్ దాడి: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: గత నెలలో జమ్ముకాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులపై దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులకు సాయం చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం వెల్లడించారు. తమ విచారణలో ముగ్గురు నిందితులు పూర్తిగా సహకరిస్తున్నారని, త్వరలోనే కాల్పులకు పాల్పడ్డ లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. బిలాల్ అహ్మద్ రేషి, ఐజాజ్ వాగే, జహూర్ అహ్మద్ అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు లష్కర్ గ్రూపునకు చెందిన నలుగురు టెర్రిరిస్టులకు ఖుద్వానీ, శ్రీగుఫ్ఫారాలో ఆశ్రయం కల్పించారు. వీరి వద్ద ఆశ్రయం పొందిన ఆ ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర ముగించుకుని వెళ్తున్న యాత్రికుల బస్సుపై అనంతనాగ్ జిల్లాలో జూలై 10న విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. అదే రోజు ఆరుగురు భక్తులు మృతిచెందగా, చికిత్స పొందతూ మరో ఇద్దరు యాత్రికులు చనిపోయారు. ఈ దాడి కేసులో ఇప్పటికే ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను గతవారం పోలీసులు మట్టుపెట్టారు. హతమైన ఇద్దరిలో టాప్ కమాండర్ అబు దుజానా ఉన్నాడు. నేడు పోలీసులు అరెస్ట్ చేసిన బిలాల్ అహ్మద్ అన్న అదిల్ లష్కర్ ఉగ్రవాది కాగా, ఈ ఏడాది భద్రతా సిబ్బంది కాల్పుల్లో హతమయ్యాడు. -
అమర్నాథ్ యాత్రల ఘోర విషాదం
- కశ్మీర్లో లోయలోపడ్డ బస్సు - ఇద్దరు మహిళలు సహా 17 మంది దుర్మరణం - 29 మందికి గాయాలు.. వారిలో 19 మంది పరిస్థితి విషమం రంబన్/జమ్మూ/న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారిపై యాత్రికులతో అమర్నాథ్ వెళుతున్న బస్సు రంబన్ వద్ద అదుపుతప్పి లోతైన లోయలో పడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు సహా 17 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 19 మందిని ప్రత్యేక చికిత్స కోసం హెలికాప్టర్లో జమ్మూలోని ఆస్పత్రికి తరలించినట్టు రంబన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మోహన్‌లాల్ చెప్పారు. మృతులు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, అస్సాం, హరియాణా, మధ్యప్రదేశ్‌లకు చెందినవారని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు మృతదేహాలతో పాటు గాయపడినవారిని బయటకు తీశారన్నారు. జమ్మూకశ్మీర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (జేకేఎస్ఆర్టీసీ) 3,603 మంది అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక బస్సుల్లో జమ్మూ నుంచి బల్టాల్, పహల్గామ్ బేస్ క్యాంపులకు తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందులోని ఓ బస్సు రంబన్ జిల్లాలోని నచ్లానా వద్ద అదుపు తప్పిందని, అనంతరం కొండపై నుంచి దొర్లుకుంటూ లోయలోని నీటిలో పడిందని ఎస్ఎస్పీ చెప్పారు. టైరు పంక్చర్ కావడంతో బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది. మోదీ విచారం... రాజ్‌నాథ్ ఆరా... బస్సు ప్రమాదంలో యాత్రికులు మరణించడం ఎంతో బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలికి వెళ్లిన వోహ్రాను అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్ ప్రభుత్వం యాత్రికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 0191–2560401, 0191–2542000ను ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు అమర్నాథ్ ఆలయ బోర్డు రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. పెరిగిన ‘ఉగ్రదాడి’మృతులు... శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఈ నెల 10న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న లలిత (47) ఆదివారం మృతిచెందారు. దీంతో ఈ దాడిలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగినట్టు పోలీసులు తెలిపారు. కాగా, బల్టాల్ బేస్‌క్యాంప్‌లో మహారాష్ట్రకు చెందిన వృద్ధుడు సదాశివ (65) శనివారం రాత్రి మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వెల్లడించారు. మొత్తం 40 రోజుల అమర్నాథ్ యాత్ర గత నెల 29న ప్రారంభమైంది. ఆగస్టు 7తో ముగుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్టు అంచనా. -
అమర్నాథ్ యాత్రలో విషాదం
జమ్మూ కశ్మీర్ : అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని రాంబస్ జిల్లా జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రకు బయలు దేరిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతిచెందగా, 19 మందికి గాయాలయ్యాయి. ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఎనిమిదికి చేరిన ‘అమర్నాథ్’ మృతులు
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికుల బస్సును లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొ యాత్రికురాలు మృతిచెందారు. గత సోమవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో గాయపడ్డ ఓ మహిళా యాత్రికురాలు లలిత చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మృతులంతా గుజరాత్, మహారాష్ట్రకు చెందినవారే. గత సోమవారం (జులై 10న) అమర్నాథ్ యాత్ర పూర్తిచేసుకుని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికులపై జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ సలీం వీరోచితంగా ప్రవర్తించి బస్సును వేగంగా నడిపినందుకు ప్రాణనష్టం తీవ్రత మరింత పెరగలేదన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో గాయపడ్డ ఓ యాత్రికురాలు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిది చేరగా, అందులో మహిళలే ఏడుగురు కావడం గమనార్హం. ఉగ్రదాడి అనంతరం భద్రతను మరింత పటిష్టం చేసిన అధికారులు అమర్నాథ్ యాత్రకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం అదుపులోకి తీసుకున్నాయి. -
మంచు దేవుడు
-
టెర్రర్ & టెన్షన్
జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ వెళుతున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది కాలంలోనే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందట. 2017 జూన్ 30 నాటికి ఏడాది కాలంలో టెర్రరిజం సంబంధిత మరణాల సంఖ్య 45 శాతం పెరిగాయట. ఇందులోనూ పౌరుల మరణాల సంఖ్య ఏకంగా 164 శాతం పెరిగిందట. ఢిల్లీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్(ఎస్ఏటీపీ) ఈ గణాంకాలను వెల్లడించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. పెరిగిన భద్రతా సిబ్బంది,పౌరుల మరణాలు 2016లో బుర్హాన్ వనీ మరణానికి ముందు ఏడాది 51 మంది భద్రతా సిబ్బంది మరణించగా.. వనీ మరణం తర్వాత ఏడాదిలో ఆ సంఖ్య 98కి పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఉగ్రవాదుల హింస రెట్టింపైందని ఎస్ఏటీపీ వెల్లడించింది. పౌరులు, భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మరణాల సంఖ్య 45 శాతం పెరిగింది. 2015–16లో ఈ సంఖ్య 216గా ఉంటే.. 2016–17కి వచ్చే సరికి అది 313కి చేరింది. గత ఐదేళ్లుగా ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందులోనూ ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో పౌరుల మరణాల సంఖ్య 164 శాతం పెరిగింది. 2015–16లో ఈ సంఖ్య 14గా ఉంటే.. 2016–17లో ఇది 37 శాతం పెరిగింది. ఇక 2016–17లో ఉగ్రవాదుల మరణాల సంఖ్య 18 శాతం పెరిగి 178కి చేరింది. యూపీఏ పాలన చివరి మూడేళ్లతో పోలిస్తే.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య 42 శాతం పెరిగింది. అమర్నాథ్ యాత్రికులపై దాడులు 18ఏళ్లు 5దాడులు 52మంది మృతి 2000వ సంవత్సరం ఆగస్టు 1న పహల్గావ్ దాడిలో 21 మంది మృతి తాజా దాడి కశ్మీర్ లోయలో కర్ఫ్యూ, సోషల్ మీడియా బ్యాన్‌ను ఎత్తేసిన కొద్ది గంటల్లోనే జరిగింది. హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు బుర్హాన్ వనీ చనిపోయి ఏడాదైన కారణంగా దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు కొద్దిరోజుల క్రితం ఆంక్షలు విధించారు. -
నలుగురు ఉగ్రవాదులు అరెస్టు
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో అమర్నాథ్ యాత్రికులపై దాడికి తెగబడిన ఉగ్రమూకను భద్రతాబలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం అదుపులోకి తీసుకున్నాయి. అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబూ ఇస్మాయిల్ (35) కోసం భద్రతాదళాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన ఇస్మాయిల్ వేటలో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్కు చెందిన దాదాపు 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి నలుగురు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఉగ్రదాడి సూత్రధారి అయిన లష్కరే తోయిబా కమాండర్ ఇస్మాయిల్‌ను పట్టుకోవడానికి అతను దాగి ఉన్నాడని భావిస్తున్న ప్రాంతంలోని 50 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వినియోగస్తున్నారు. నలుగురు ఈ ఉగ్రదాడిలో పాల్గొని ఉంటారని ఇందులో ఇద్దరు పాకిస్తాన్ జాతీయులను విచారణ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
ఉగ్ర వేట మొదలైంది!
► ఇస్మాయిల్ కోసం రంగంలోకి బీఎస్ఎఫ్, ఎన్ఐఏ, సీఆర్పీఎఫ్ ► 50 కిలోమీటర్ల మేర డ్రోన్లతో గాలింపు ► దాడిలో ఇద్దరు పాకిస్తానీలు.. ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు జమ్మూ: కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న అబూ ఇస్మాయిల్ (35) కోసం భద్రతాదళాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన ఇస్మాయిల్ వేటలో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీ స్, సీఆర్పీ ఎఫ్, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్కు చెందిన దాదాపు 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కశ్మీర్లో ఉగ్రవాద దాడులు చేస్తున్న లష్కరే తోయిబా కమాండర్ ఇస్మాయిల్ ఆచూకీపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇస్మాయిల్ రెండేళ్ల క్రితం పాక్ నుంచి దక్షిణ కశ్మీర్ వచ్చి లష్కర్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ఇస్మాయిల్ దాగి ఉన్నాడని భావిస్తున్న ప్రాంతంలోని 50 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వినియోగస్తున్నారు. నలుగురు ఈ ఉగ్రదాడిలో పాల్గొని ఉంటారని ఇందులో ఇద్దరు పాకిస్తాన్ జాతీ యులను విచారణ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటన అనంతరం వీరు ద్విచక్రవాహనాలపై పారిపోయి ఉంటా రని భావిస్తున్నారు. లష్కరే కమాండర్ బషీర్‌ను భద్రతా దళాలు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా అమర్నాథ్ యాత్రికుల ఊచకోతకు ఇస్మాయిల్ పథకం రూపొందిం చాడని భావిస్తున్నారు. అటు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం లోయలో హై అలర్ట్ ప్రకటిం చింది. మరోవైపు, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, హన్స్‌రాజ్ ఆహిర్ బుధవారం కశ్మీర్లో పర్యటించారు. భద్రతాదళ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తాలతో చర్చించారు. తాజా పరిస్థితులపై సమీక్ష జరిపారు. చావనైనా చస్తాం.. యాత్ర పూర్తి చేస్తాం! అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి ప్రభావం అమర్నాథ్ యాత్రికులపై ఏమాత్రం కనిపించటం లేదు. ఉగ్ర ఘటన నేపథ్యంలోనూ 3,791 మంది యాత్రికులు జమ్మూనుంచి అమర్నాథ్ బేస్ క్యాంప్‌నకు బయలుదేరారు. బుధవారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలో 150 వాహనాల శ్రేణి జమ్మూ నుంచి బయలుదేరింది. ‘భం భం భోలే’ నినాదాలు చేస్తూ యాత్రికులు ఉత్సాహంగా యాత్ర ప్రారంభించారు. ‘మేం భయపడం. ఎలాంటి సమస్యలు ఎదురైనా అమర్నాథ్ యాత్ర పూర్తి చేస్తాం. చావనైనా చస్తాం.. గానీ యాత్ర చేయకుండా ఇళ్లకు తిరిగి వెళ్లం’ అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సతీశ్ చందర్ అనే యాత్రికుడు తెలిపారు. బుధవారం వరకు 1,56,618 మంది యాత్రికులు అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో హై అలర్ట్ !
♦ ఇస్మాయిల్ కోసం ముమ్మర గాలింపు ♦ దక్షిణ కశ్మీర్లో ఉండొచ్చని అంచనా ♦ కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర శ్రీనగర్: అమర్నాథ్ యాత్రీకులపై ఉగ్రదాడిలో ఏడుగురు మరణించిన దుర్ఘటనను కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అంతటా బుధవారం హైఅలర్ట్ ప్రకటించింది. భద్రతా బలగాలన్నీ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కొందరు కేంద్రమంత్రులు కశ్మీర్లో మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కశ్మీర్ గవర్నర్, సీఎం, పారా మిలిటరీ దళా ల ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఘటన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఇస్మాయిల్‌ను పట్టుకునేందుకు భద్రతాదళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇతడు దక్షిణ కశ్మీర్లో ఉండొచ్చనే అనుమానంతో ఆ ప్రాం తమంతా తనిఖీలు చేపట్టారు. చాలా ఏళ్ల క్రితమే ఇస్మాయిల్ కశ్మీర్‌కు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది దక్షిణ కశ్మీర్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడంతో ఏడుగురు మరణించడం తెలిసిందే. ఇస్మాయిల్‌తోపాటు మరో ముగ్గురు దాడిలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల లష్కరే తోయిబాకు చెందిన కొందరు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతీకా ర చర్యతోనే ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన కేబినెట్ కమిటీ న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రీకులపై దాడితోపాటు చైనాతో ఏర్పడ్డ విభేదాలపై భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఢిల్లీలో బుధవారం చర్చించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్ సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది. ఉగ్రవాదుల కథ ముగిసినట్టే: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఉగ్రవాదుల దాడి జరిగినప్పటికీ అమర్నాథ్ యాత్ర మరింత భద్రతతో యథావిధిగా కొనసాగుతుందని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కశ్మీర్ ఉగ్రవాదం చివరిదశలో ఉందని, గత రెండు మూడు వారాలుగా భారత సైన్యం ఎంతో ప్రగతి సాధించిందని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హంస్రాజ్ అహిర్తోపాటు ఆయన శ్రీనగర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని వెల్లడించారు. జాతి మొత్తం కశ్మీర్‌కు బాసటగా నిలుస్తుందని మంత్రి అన్నారు. గో రక్షకులను యుద్ధానికి పంపండి అమర్నాథ్ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే ముంబై: గోసంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న గోరక్షకులను ఉగ్రవాదులతో యుద్ధం చేయడానికి పంపించాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి గురించి స్పందిస్తూ ఆయన పైవిధంగా అన్నారు. ‘రాజకీయాల్లో క్రీడలు, సాంస్కృతిక విషయాల గురించి చర్చించవద్దని బీజేపీ చెబుతుంది. ఇప్పుడు మతం, రాజకీయాలు కలిసి ఉగ్రదాడి రూపంలో వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద ఆయుధాలు కాకుండా గోమాంసం ఉండుంటే వారు ఈపాటికే గో రక్షకుల చేతిలో చచ్చేవారా? ఈ మధ్యకాలంలో గోరక్షకుల అంశం తీవ్రంగా మారుతోంది. అలాంటప్పుడు ఉగ్రవాదులతో పోరాడమని గోరక్షకులనే ఎందుకు పంపకూడదు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఠాక్రే. ముగ్గురు ఉగ్రవాదుల హతం జమ్ము కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలోని రాద్ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపుచర్యలు ముమ్మరం చేశాయి. మంగళవారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలవగా, బుధవారం కూడా కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా భద్రతాదళాలు ఒక ఇంటిలో సోదాలు జరపగా, అందులో ఉన్న ఉగ్రవాదులు సైనికులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు దాడిని తిప్పి ముష్కరులను హతమార్చారు. మృతులను జావిద్ షేక్, దావూద్, అఖిల్‌గా గుర్తించారు. జావిద్ హిజ్బుల్ జిల్లా కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు సైనికులూ బలి పాకిస్థాన్ సైన్యం మరోసారి దుస్సాహసం చేసింది. బుధవారం నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు హెచ్చరికలేవీ లేకుండా కాల్పులు జరిపింది. నేరుగా భారత జవాన్లపై గురి చూసి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. కేరన్ సెక్టర్లో కుప్వారా వద్ద ఈ దుర్ఘటన జరిగింది. హిజ్బుల్ ఉగ్రవాదులను భారత్ దళాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. -
'ఇంకా కలిసే ఉన్నాం.. అలాంటిదేం లేదు'
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఏదైనా బలమైన సంఘటన జరిగిన ప్రతిసారి చర్చలోకి వచ్చే అంశం అక్కడ ప్రభుత్వం మారుతుందా అని.. గతంలో మాదిరిగానే తాజాగా కూడా అదే అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ సరిగా పరిపాలనను నిర్వహించలేకపోతున్నారని, అందువల్లే అక్కడ అశాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని, నిత్యం అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ శ్రేణులతోపాటు ఇతర వర్గాలు పరోక్షంగా ఆమెను విమర్శిస్తున్నారు. తాజాగా అమర్నాథ్ యాత్రికులపై అనంతనాగ్ జిల్లాలో దాడి నేపథ్యంలో ఆ విమర్షలు ఎక్కువకావడంతోపాటు మరోసారి ఇక బీజేపీ ముఫ్తీని దింపేసి సీఎం పగ్గాలు చేపడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అలా జరగకుంటే దాడి విషయంపై ఆ పార్టీల మధ్య విభేదాలు వస్తాయని వదంతలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఎలాంటి మార్పులు జరగబోవని ముప్తీనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, దాడికి పీడీపీని బాధ్యురాలిగా చేయలేమంటూ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఇప్పటికే బలంగా ఉందంటూ స్పష్టత నిచ్చారు. ఈ మేరకు బీజేపీ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ 'పీడీపీని తప్పుబట్టడానికి ప్రస్తుతం మాకు ఏ కారణమూ కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న తప్పులకు, దాడికి పీడీపీది బాధ్యత కాదు. మేం ఇప్పటికీ కలిసే ఉన్నాం' అని చెప్పారు. -
ఉగ్రదాడి: బీజేపీకి శివసేన చీఫ్ సవాల్!
ముంబై: జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. తన మిత్రపక్షమైన బీజేపీకి చురకలింటిస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు బీజేపీకి చేతనైతే గో రక్షకులను పంపించాలని సవాల్ విసిరారు. రాజకీయాంశాల్లో సంస్కృతి, క్రీడలను తీసుకురావద్దని బీజేపీ ఎప్పుడూ చెబుతోందని, కానీ మతం, రాజకీయం జతకలిసి ఉగ్రవాదం రూపంలో చెలరేగిపోతుందని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులలో గుజరాత్ వాసులు ఐదుగురు కాగా, మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో ఉద్ధవ్ ఈ విషయంపై కాస్త సీరియస్‌గా ఉన్నారు. గణేష్ మండల్స్తో త్వరలో జరగనున్న పండగకు ఏర్పాట్లకోసం మంగళవారం ఉద్ధవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ప్రస్తుతం గో రక్షక్షులు అనే విషయం సమస్యాత్మకంగా మారింది. గోవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ సామాన్యులపై దాడులకు పాల్పడే గో రక్షకులు ఎంతో హాని తలపెడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కోగలరా. మీరు ఎంతగానో మద్ధతిచ్చే గో సంరక్షకులను ఉగ్రవాదులపై యుద్ధం చేసేందుకు పంపిస్తే బీజేపీకి సమస్య తీవ్రత అర్థమవుతోంది. కశ్మీర్లో వేర్పాటువాదులతో బీజేపీ ఎలాగైనా చర్చించి అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని' చెప్పారు. కొన్ని ప్రత్యేక పండుగల నేపథ్యంలో శబ్ధాల తీవ్రతపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించగా, వాటిని కాస్త సవరిస్తూ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కోరారు. -
ఉగ్రవాదుల దుశ్చర్య
అమర్నాథ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మహాశివుడు పార్వతీదేవికి అక్కడ ముక్తి రహస్యాన్ని బోధించాడని భక్తుల విశ్వాసం. నూటయాభైయ్యేళ్లక్రితం ఆ గుహనూ, అక్కడి హిమలింగాన్నీ బయటి ప్రపంచానికి వెల్లడించింది ఒక ముస్లిమే. ఆనాటి నుంచీ ఏటా లక్షలమంది భక్తులు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి బస్సులో తిరిగి వస్తున్న గుజరాత్ యాత్రికులపై సోమవారం రాత్రి 8.30 సమయంలో ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురిని పొట్టనబెట్టుకున్నారు. మరో 19మందిని గాయపరిచారు. అన్నివైపుల నుంచీ తూటాల వర్షం కురుస్తున్నా బస్సు డ్రైవర్ సలీం షేక్ సమయస్ఫూర్తితో, సాహసంతో, పెను వేగంతో బస్సు నడపడం వల్ల మరో 50మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. గత నెల 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు ఈసారి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం(సీఆర్పీఎఫ్), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)లకు చెందిన దాదాపు 25,000 మంది జవాన్లు కీలకమైన ప్రాంతాల్లో మోహరించి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. వారి వాహనాలకు వెనకా, ముందూ రక్షణగా వెళ్తున్నారు. ఇంతవరకూ 1,46,692మంది యాత్రికులు హిమలింగాన్ని సందర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ ఇన్ని ఏర్పాట్లు చేసినా ఉగ్రవాదులు యాత్రికులపై కాల్పులు జరిపి తప్పించుకు పోగలిగారు. దాడి జరిగిన ప్రాంతం మారుమూల అటవీ ప్రదేశం కాదు. అది జమ్మూ–కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జాతీయ రహదారిపై ఉంది. ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతా దళాలు కాల్చి చంపి ఏడాది కావస్తున్నందున ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చునని ఊహాగానాలున్నాయి. ప్రత్యేకించి అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు పథకరచన చేస్తున్నారని, కనీసం వందమందిని హతమార్చాలన్నది వారి లక్ష్యమని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని చెబుతున్నారు. అందువల్లే రెండురోజులపాటు యాత్రను ఆపి సోమవారం పునఃప్రారంభించారు. అమర్నాథ్ ఆలయాన్ని చేరుకోవడానికి ఉన్న బల్టాల్, పహల్గావ్ మార్గంలో జవాన్లు పహరా కాస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు ఎంత లోప భూయిష్టంగా ఉన్నాయో తాజా ఉదంతం చూస్తే అర్ధమవుతుంది. నిబంధనల ప్రకారం ఈ బస్సు అమర్నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. అలా రిజిస్టర్ చేయించుకున్న బస్సులు అయిదారింటిని ఒకేసారి పంపుతూ వాటికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తారు. కానీ ఈ బస్సుకు అలాంటి రిజిస్ట్రేషన్ లేదని చెబుతున్నారు. కాదు రిజిస్టర్ చేయించుకున్నామని డ్రైవర్ సలీం షేక్ అంటున్నాడు. ఇందులోని నిజానిజాలు నిలకడగా తెలుస్తాయి. రిజిస్టర్ కాకపోవడం నిజమైతే బస్సు అంత భద్రతా వలయాన్ని దాటుకుని అసలు బల్టాల్ వరకూ ఎలా వెళ్లగలిగింది? భద్రతా వాహనాల తోడు లేకుండా, కాన్వాయ్‌లో భాగం కాకుండా ఒంటరిగా సాగుతున్న బస్సుపై వెళ్లేటపుడూ, వెనక్కు వస్తున్నప్పుడూ కూడా ఎవరికీ అనుమానం ఎందుకు కలగలేదు? చెక్‌పోస్టుల వద్ద ఆరా ఎందుకు తీయలేదు? తిరుగు ప్రయాణంలో రిపేర్ అవసరంతో బస్సు మార్గమధ్యంలో దాదాపు గంటన్నర ఆగిపోయిందంటున్నారు. కేవలం ఏడు గంటల సమయం వరకూ మాత్రమే వాహనాలు ప్రయాణించడానికి అనుమతిస్తారని, ఆ తర్వాత నిలిపేస్తారని చెబుతున్నారు. అలాంటపుడు ఈ బస్సు ఎలాంటి రక్షణా లేకుండా అన్ని కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించింది? ఇప్పటికైతే ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు. పరిస్థితులు సరిగా లేవని గుర్తించి నిబంధనలు ఏర్పర్చుకున్నప్పుడే వాటిని ఉల్లంఘించిన సందర్భాలు ఎదురైతే ఏం చేయాలన్న అవగాహన ఉండాలి. రిజిస్టర్ చేయించుకోని వాహనాలను ఆపేయాలి. దాడికి గురైన వాహనం డ్రైవర్ చెబుతున్నట్టు రిజిస్టర్ చేయించుకుని ఉంటే వారికి ఎందుకు సరైన భద్రత లేదన్న సంగతి తేలాలి. సరిగ్గా పదిహేడేళ్లక్రితం 2000 సంవత్సరంలో ఉగ్రవాదులు పహల్గావ్లో దాడిచేసి 30మంది యాత్రికులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరకాలంలో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో కూడా ఏనాడూ ఉగ్రవాదులు ఇలా బరితెగించడం సాధ్యంకాలేదు. ప్రస్తుత దాడికి పాక్ ఆక్రమిత కశ్మీర్లో చురుగ్గా ఉన్న లష్కరే తొయిబా కారణం కావొచ్చని అంటున్నారు. దాదాపు అన్ని పార్టీలూ, సంస్థలూ ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించడం హర్షించదగ్గ విషయం. హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు సయ్యద్ అలీ షా గిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ మొదలుకొని నేషనల్ కాన్ఫరెన్స్ వరకూ అందరూ ఉగ్రవాదుల దుర్మార్గాన్ని నిరసించారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే వాళ్లు కొందరైతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి గవర్నర్ పాలన పెట్టాలని డిమాండ్ చేసేవారు మరికొందరు. ఇంకొందరు ప్రబుద్ధులు మూక దాడులను వ్యతిరేకిస్తూ ఈమధ్య జరిగిన ‘నాట్ ఇన్ మై నేమ్’ ఉద్యమాన్ని ఎత్తిచూపుతూ ఆ ముఠాలోని వారు మాట్లాడరేమిటని నిలదీశారు. నిజానికి ‘నాట్ ఇన్ మై నేమ్’ ఉద్యమకారులు ఈ దాడిపై మౌనంగా లేరు. దాన్ని ఖండించారు. అన్ని రకాల హింసకూ వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అందరూ ఏకమై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించాల్సిన సమయంలో సందు దొరికిందని రాళ్లేయాలని చూడటం అపరిపక్వతను చాటుతుంది. అటువంటి ప్రకటనల వల్ల అంతిమంగా లాభపడేది ఉగ్రవాదులే. సమాజంలో చీలికలు తెచ్చి దాన్ని ధ్వంసం చేయాలని, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చాలని ఉగ్రవాదుల పన్నాగం. కనుక ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల ఏడో తేదీ వరకూ ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి గుణపాఠం తీసుకుని, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గమనించుకుని, అవి పునరావృతం కాకుండా భద్రత, నిఘా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంగతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. -
ఉగ్రదాడి జరిగినా సడలని సంకల్పం
- కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర - పటిష్ట భద్రత నడుమ బయల్దేరిన భక్తులు - స్వరాష్ట్రానికి మృతదేహాలు.. కశ్మీర్లో విపక్షాల బంద్ - మోదీ వైఫల్యం వల్లే ఉగ్రదాడి: వీహెచ్‌పీ సంచలన ఆరోపణ శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర భక్తులపై ఉగ్రవాదులు సోమవారం రాత్రి దాడి చేసి బీభత్సం సృష్టించినా యాత్రీకులు మాత్రం జంకలేదు. తమ పట్టుదల సడలలేదని నిరూపిస్తూ మంగళవారం యథావిధిగా యాత్ర కొనసాగించారు. జమ్మూ నుంచి పలు యాత్రీకుల బృందాలు అమర్నాథ్ ఆలయానికి బయలుదేరాయి. భక్తుల వాహనాలకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కశ్మీర్ పోలీసులు దాడి కేసును విచారిస్తున్నారని, యాత్రకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన చేరుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల చర్యకు నిరసనగా విపక్షాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి. కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వోరాకు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ రాక్షసమూక చర్యను తీవ్రంగా ఖండించాయి. పవిత్ర హిమలింగాన్ని దర్శించుకుని స్వస్థలానికి వెళ్తున్న భక్తులపై సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమర్నాథ్ యాత్రీకుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందడం తెలిసిందే. మరో 32 మంది యాత్రీకులు గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. అనంతరం ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డా.. వారి యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అక్కడినుంచి వెళ్తున్న యాత్రీకుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మోదీ వైఫల్యం వల్లే : వీహెచ్‌పీ ఈ ఘటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిందించింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోయారని సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా కశ్మీర్ లోయను పూర్తిగా సైన్యానికి అప్పగించాలని, సమర్థుడిని రక్షణమంత్రిగా నియమించాలని తొగాడియా అన్నారు. ‘అమర్నాథ్’ మృతుల వివరాల వెల్లడి దాడిలో మృతి చెందిన ఏడుగురి పేర్లను జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ 32 మందిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను శ్రీనగర్ నుంచి సూరత్‌కు హెలికాప్టర్లో తరలించారు. మరణించిన వారిని హాసుబెన్ రాటిలా పటేల్, సురేఖ బెన్ పటేల్, లక్ష్మీబెన్ ఉషా మోహన్‌లా సొనాకర్, ఠాకూర్ నిర్మలాబెన్, రతన్ జినాభాయ్ పటేల్, ప్రజాపతి చంపాబెన్గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. కశ్మీర్ ప్రభుత్వం రూ.ఆరు లక్షలు, రూ.1.50 లక్షల చొప్పున, అమర్నాథ్ ఆలయ బోర్డు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బుల్లెట్లు దూసుకొచ్చినా ధైర్యంగా ముందుకు సాగిన డ్రైవర్ అమర్నాథ్ యాత్రీకులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా బస్సు డ్రైవర్ షేక్ గపూర్ దాదాపు కిలోమీటర్ వరకు ముందుకువెళ్లడంతో అతణ్ని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రాణనష్టం సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. యాత్రీకుల ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లారని ఉగ్రదాడిలో గాయపడ్డ మహారాష్ట్రకు చెందిన యాత్రీకురాలు భాగ్యమణి తెలిపారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ జమ్మూ ప్రభుత్వంతోపాటు అమర్నాథ్ ఆలయబోర్డు రూ.ఐదు లక్షల చొప్పున నజరానా ప్రకటించాయి. గపూర్ పేరును రాష్ట్రపతి ధీశాలి పురస్కారానికి సిఫార్సు చేస్తామని రూపానీ ప్రకటించారు. కుట్రపన్నింది లష్కరే తోయిబా.. దాడి చేసింది ఇస్మాయిల్ అనంతనాగ్: అమర్నాథ్ యాత్రీకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని కశ్మీర్ రేంజ్ ఐడీ మునీర్‌ఖాన్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారైన ఇస్మాయిల్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఇస్మాయిల్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఐజీ పేర్కొన్నారు. ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాలి: సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన పవిత్ర అమర్నాథ్ యాత్రలో జరిగిన ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడి ముస్లింలకు, కశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీలకు వందనాలు: రాజ్‌నాథ్ ఈ ఘటనపై సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిం చారు. జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు, నిఘా విభాగం, పారా మిలటరీ బలగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ విలేకరులతో మాట్లాడుతూ అమర్నాథ్ భక్తులపై జరి గిన ఉగ్రవాద దాడిని కశ్మీర్‌లోని అన్ని వర్గాలూ ఖండించాయని, అందుకు వారందరికీ వందనం చేస్తున్నానని ఆయన అన్నారు. దాడులకు భయపడం: రాహుల్‌గాంధీ పవిత్ర అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి ఘటనను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఉగ్రదాడులు భారత్‌ను ఎన్నటికీ భయపెట్టలేవని ఆయన ట్వీట్ చేశారు. ‘అమాయకులైన యాత్రికులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’ అంటూ రాహుల్ ట్విటర్ వేదికగా సానుభూతి వ్యక్తం చేశారు. కాగా.. భద్రతా లోపాల వల్లే దాడి జరిగిందని కేంద్రంపై విమర్శలు చేశారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించి.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
భద్రత పెంచండి
కేంద్ర హోం శాఖ ఆదేశం న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికులపై దాడి నేపథ్యంలో కశ్మీర్లో తాజా పరిస్థితిని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సమీక్షించారు. అమర్నాథ్ యాత్రకు భద్రతను మరింత పెంచాలని ఆయన ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశంలో.. అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాల వద్ద భద్రతా పరిస్థితిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ, నిఘా విభాగాలు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. యాత్రికుల భద్రత కోసం అమర్నాథ్ యాత్ర కొనసాగే మార్గాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు దాదాపు 21 వేల మంది పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. సూరత్‌కు మృతదేహాలు: అమర్నాథ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు యాత్రికుల మృతదేహాల్ని భారతీయ వాయుసేనకు చెందిన హెర్క్యులస్ విమానంలో సూరత్ ఎయిర్‌పోర్ట్‌కు తెచ్చారు. ఈ విమానంలోనే క్షతగాత్రులు కూడా గుజరాత్ చేరుకున్నారు. విమానం నుంచి ఒక్కో మృతదేహాం బయటికి తెస్తుండగా బంధువుల కన్నీటి రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. మృతుల్లో ఐదుగురు గుజరా త్ వాసులు కాగా, మరో ఇద్దరు మహారాష్ట్రీయులు. మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షలు, గాయపడ్డవారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం చెప్పింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ. 6 లక్షలు, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుం బాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించింది. ప్రపంచ దేశాల ఖండన అమర్నాథ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. యాత్రికులపై దాడిని గర్హిస్తున్నామని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ట్వీట్ చేశారు. జర్మనీ ప్రభుత్వం తరఫున ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆ దేశ రాయబారి మార్టిన్ చెప్పారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా ఖండించారు. -
హీరో.. డ్రైవర్ సలీం
53 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ శ్రీనగర్/సూరత్: జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా ఖానాబల్ ప్రాంతం... సోమవారం రాత్రి 8.20 గంటలు.. అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న వాహన శ్రేణి అప్పటికే ఆ ప్రాంతాన్ని దాటేసింది. టైరు పంక్చర్ కావడంతో ఓం ట్రావెల్స్ బస్సు ఆలస్యంగా అక్కడకు చేరింది. ఇంతలో బస్సుపై ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం... మరోవైపు కటిక చీకటిలో మంచు కొండలపై ప్రయాణం. బస్సును చుట్టుముట్టిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. బస్సు డ్రైవర్ సలీం ఎంతో సాహసం చేసి అనేక మంది ప్రాణాల్ని కాపాడాడు. బస్సును ఆపితే ఎంతటి ఘోరం జరుగుతుందో ఊహించిన సలీం తన వైపు దూసుకొస్తున్న బుల్లెట్ల నుంచి తప్పించుకుంటూనే స్టీరింగ్‌ను వదలకుండా.. బస్సును సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. అప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినా మరో 53 మందికి ప్రాణదాతగా నిలిచాడు. దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ పట్టణా నికి చెందిన ఓం ట్రావెల్స్ బస్సు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన 60 మందిని ఎక్కించుకుని అమర్నాథ్ యాత్రకు బయల్దేరింది. మంచు శివలింగాన్ని దర్శించుకుని ఖానాబల్కు చేరగానే తూటాల వర్షం మొదలైంది. ‘ప్రయాణికులంతా హాహాకారాలు చేస్తూ.. సీట్ల కింద తలదాచుకున్నారు. ఇంతలో బస్సు ముందు నుంచి కాల్పులు మొదలయ్యాయి. తలను కిందకు వంచి స్టీరింగ్ తిప్పుతూ బస్సును ముందుకు నడిపించాను. నా పక్కన కూర్చున్న బస్సు యజమాని హర్ష దేశాయ్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ బస్సు ఆపకుండా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. యాత్రికుల ప్రాణాల్ని కాపాడేందుకు దేవుడే నాకు ధైర్యమిచ్చాడ’ని సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో సలీం వెల్లడించారు. దేశాయ్ శరీరంలో తూటాలు దిగినా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో దేశాయ్ మాట్లాడుతూ.. ‘మేం దారి లో ఉండగా బాణా సంచా పేలుస్తున్నట్లు తూటాల శబ్దం వినిపించింది. ఇంతలోనే అది ఉగ్రదాడని మాకు అర్థమైంది. పెద్ద ఎత్తున కాల్పుల మోత కొనసాగుతున్నా ముందుకు సాగడం వల్లే అనేక మంది ప్రాణాల్ని కాపాడగలిగామ’ని చెప్పారు. సలీం తమ ప్రాణ దాత అంటూ తోటి ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపించారు. సలీంకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ. 3 లక్షలు, గవర్నర్ వోహ్రా రూ. 2 లక్షల పారితోషికం ప్రకటించారు. సలీంను జాతీయ సాహస అవార్డుకు సిఫార్సు చేస్తామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు. టైర్ పంక్చర్ కాకపోయుంటే.. యాత్రికుల బస్సు టైర్ పంక్చర్ కావడంతో దారి మధ్యలో ఆగిపోవాల్సి వచ్చిందని, పంక్చర్ కాకపోయుంటే ఉగ్రదాడి తప్పేదని అధికారులు తెలిపారు. ‘బస్సు సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీనగర్ నుంచి వంద కి.మీ. దూరంలోని జమ్మూకు బయల్దేరింది. హైవేపై రాత్రి 7 గంటలకు భద్రత ఉపసంహరించేలోపే జమ్మూ చేరుకోవాలి. అయితే దారి మధ్యలో సంగం వద్ద టైర్ పంక్చరైంది. డ్రైవర్ బస్సును ఆపి టైర్ మార్చాడు. ప్రయాణం గంట ఆలస్యమైంది’ అని భద్రతా అధికారులు వివరించారు. సంబంధిత కథనం బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. డ్రైవర్ సాహసం -
విలన్.. టెర్రరిస్టు ఇస్మాయెల్
► అమర్నాథ్ ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ ► స్థానిక ఉగ్రవాదుల సహకారం ► దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు ► మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.7 లక్షల పరిహారం మంచు కొండల్లో కొలువైన మహా శివ లింగాన్ని దర్శనం చేసుకుని సంతోషంతో తిరిగివస్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించి ఏడుగురు అమాయక భక్తుల మరణానికి కారణమైన లష్కరే ఉగ్రవాది ఇస్మాయెల్. కాగా, దూసుకొస్తున్న బుల్లెట్లకు భయపడక, సీట్ల కింద దాక్కోవాలని ఒకవైపు ప్రయాణికులకు సూచిస్తూ నే.. వేగంగా బస్సును మందుకు నడిపి 53 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది ఆ బస్సు డ్రైవర్ సలీమ్ షేక్. వీరిద్దరిలో ఒకరు హింసకు, అమానుషత్వానికి ప్రతీకగా నిలవగా.. మరొకరు ధైర్యానికి, మానవత్వానికి మరోపేరయ్యారు. నా దేవుడే నాకీ ధైర్యాన్నిచ్చాడని సలీం చెప్పడం కొసమెరుపు. శ్రీనగర్/న్యూఢిల్లీ: మంచుకొండల్లో ముష్కర దాడికి ప్రధాన సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది ఇస్మాయెల్ అని జమ్మూ కశ్మీర్ పోలీసులు తేల్చారు. ఏడుగురు అమర్నాథ్ యాత్రికుల్ని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడిలో అసలు విలన్ అతనేనని, కశ్మీర్లో లష్కరే ఉగ్రకార్యకలాపాల్లో గత కొద్ది కాలంగా ఇస్మాయెల్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి. సోమవారం రాత్రి అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రదాడికి వ్యూహరచన చేయడంతో పాటు స్వయంగా అతను పాల్గొన్నాడని గుర్తించారు. దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వారిలో ఇస్మాయెల్ మోటార్ బైక్‌పై నుంచి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కశ్మీర్లో లష్కరే కార్యకలాపాలకు అబు దుజానా చీఫ్‌గా ఉండగా.. అతని తర్వాతి స్థానం ఇస్మాయెల్దే. అతనికి హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రవాదుల మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా దాడిలో హిజ్బుల్ మొజాహిదీన్తో పాటు స్థానిక ఉగ్రవాదు ల హస్తం కూడా ఉండొచ్చని సీఆర్పీఎఫ్ బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి. త్వరలోనే మట్టుబెడతాం.. మంగళవారం ఉదయం జమ్మూ కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడ్డ ప్రధాన సూత్రధారుడ్ని ఇస్మాయెల్గా గుర్తించామని, ఇస్మాయెల్‌కు స్థానిక ఉగ్రవాదులు సాయపడ్డారని చెప్పారు. ఇస్మాయెల్ గురించి పూర్తి వివరాలు తెలియలేదని, అతను పాకిస్తాన్ జాతీ యుడని ఆయన తెలిపారు. ‘ఇస్మాయెల్తో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మరో ఉగ్రవాదిని అబూ దుజానాగా గుర్తించాం. వారిని దాడి ప్రాంతానికి తీసుకురావడంతో పాటు ఆయుధాల్ని సరఫరా చేసిన వ్యక్తులెవరో తెలిసింది. దాడి సమయంలో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు వారు కూడా అక్క డే ఉన్నారు. ఉగ్రవాదులు ఎటువైపు పారి పోయారో గుర్తించాం. వేట కొనసాగిస్తున్నాం. త్వరలో మట్టుబెడతాం’ అని కశ్మీర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పోలీసులు ఇస్మాయెల్ ఫొటోను విడుదల చేశారు. ప్రారంభమైన యాత్ర మరోవైపు, ఉగ్రదాడికి వెరవకుండా మంగళవారం 22,633 మంది భక్తులు జమ్మూ, శ్రీనగర్‌ల నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రి కుల వాహనశ్రేణికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని జమ్మూ డివిజనల్ కమిషనర్ చెప్పారు. -
లష్కరే ఉగ్రవాదులే దాడి చేసింది
న్యూఢిల్లీ: దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన అమర్నాథ్ యాత్రికులపై దాడిని ఎవరు చేశారనే విషయాన్ని జమ్మూకశ్మీర్ భద్రతా బలగాలు వెల్లడించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఈ దాడి వ్యూహం పన్నిని కీలక సూత్రదారుడు అబూ ఇస్మాయిల్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది అని కశ్మీర్ ప్రధాన పోలీసు అధికారి మునీర్‌ఖాన్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఇస్మాయిల్‌తో సహా మరో ముగ్గురు ఈ దాడులకు పాల్పడినట్లు వివరించారు. ఈ సందర్భంగా అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు. సైనికులు సంయుక్తంగా గాలింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో నేడు జమ్మూకశ్మీర్ అంతటా విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కార్యకర్తలు, జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోపక్క, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ లేఖలో పేర్కొన్నారు. -
దాడి హేయం.. ఉగ్రవాదులను గెలవనివ్వం: అసద్
న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కానివ్వబోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లష్కర్ అయినా, ఐసిస్ అయినా సరే వేటిని పై చేయి సాధించనివ్వబోమని, ఈ విషయంలో దేశమంతా ఐక్యంగా ఉందంటూ స్పష్టం చేశారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దాడిపై స్పందించిన అసదుద్దీన్ ఉగ్రవాదుల దాడిని హేయమైన చర్య అన్నారు. ఈ దాడి విషయంలో ఏ ఒక్కరు రాజకీయాలు చేయొద్దని సూచించారు. దాడికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇప్పుడు కాకపోయినా రేపయినా ప్రభుత్వం సమధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. -
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. డ్రైవర్ సాహసం
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా బస్సు డ్రైవర్ దాదాపు కిలోమీటర్ వరకు నడిపించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణనష్టం సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించినట్లు సమాచారం. యాత్రికుల ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లారని ఉగ్రదాడిలో గాయపడ్డ మహారాష్ట్రకు చెందిన యాత్రికురాలు భాగ్యమణి తెలిపారు. చనిపోయిన ఏడుగురు యాత్రికులలో తన మరదలు ఉన్నారని కన్నీటి ఆమె పర్యంతమయ్యారు. అమర్నాథ్ తర్వాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవాలకున్నామని, అంతలోనే ఈ ఘాతుకం జరిగిపోయిందని ఆమె వాపోయారు. 'అమర్నాథ్ యాత్ర నుంచి మా బస్సు తిరిగి వెళ్తోంది. బస్సు జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు సమీపించగానే వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నా.. ఆ చిమ్మ చీకట్లో మాకు ఏం కనిపించలేదు. అసలు అక్కడ మాకు ఏం జరగబోతుందో అర్థం కాని షాక్‌లో ఉన్నాం. కానీ కాల్పులు మొదలుకాగానే అప్రమత్తమైన మా డ్రైవర్.. ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తూ బస్సును కిలోమీటర్ వరకు ముందుకు తీసుకెళ్లారని' అనంతనాగ్ జిల్లా ఆ్పస్పత్రిలో చికిత్స పొందుతున్న యాత్రికురాలు భాగ్యమణి వివరించారు. అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందగా, మరో 32 మంది యాత్రికులు గాయపడ్డ విషయం తెలిసిందే. -
‘అమర్నాథ్’ మృతుల వివరాల వెల్లడి
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఏడుగురు అమర్నాథ్ యాత్రికుల పేర్లను జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను శ్రీనగర్ నుంచి సూరత్‌కు హెలికాప్టర్లో తరలించనున్నారు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఉదయం 9.45 గంటలకు ఢిల్లీలోని తన నివాసంలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. కశ్మీర్లో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా కూడా శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో నేడు పర్యటించనున్నారు. మృతుల వివరాలు 1. హాసుబెన్ రాటిలా పటేల్ 2. సురేఖ బెన్ 3. పటేల్ లక్ష్మీబెన్ 4. ఉషా మోహన్‌లా సొనాకర్ 5. థాకూర్ నిర్మలాబెన్ 6. రతన్ జినాభాయ్ పటేల్ 7. ప్రజాపతి చంపాబెన్ -
ఉగ్రదాడి: కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర భక్తులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా విపక్షాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రెండ్రోజుల పాటు విద్యాసంస్థలు కూడా మూసివేయనున్నారు. అయితే అమర్నాథ్ యాత్ర మాత్రం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. జమ్ము నుంచి పలు యాత్రికుల బృందాలు అమర్నాథ్ బయలుదేరాయి. నేటి నుంచి పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి నుంచే భద్రతా బలగాలు జుమ్ముకు చేరుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు దాడికేసును విచారిస్తున్నారని, యాత్రకు ఆటకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్ చెప్పారు. అనంతనాగ్‌లో నిన్న ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఆయన చేరుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పవిత్ర హిమలింగాన్ని దర్శించుకుని స్వస్థలానికి వెళ్తున్న భక్తులపై సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది యాత్రికులు గాయపడ్డ విషయం తెలిసిందే. మృతులంతా గుజరాత్ వాసులని సమాచారం. ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. అనంతరం ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డా.. వారి యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అక్కడినుంచి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర దాడి
ఏడుగురు యాత్రికుల దుర్మరణం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఘటన ► 32 మందికి గాయాలు.. మృతులంతా గుజరాత్‌కు చెందినవారే ► జమ్మూ–శ్రీనగర్ హైవేలో మొదట పోలీసు బంకర్‌పై ఉగ్రవాదుల కాల్పులు ► గట్టిగా తిప్పికొట్టిన పోలీసులు.. తర్వాత యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి ► ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్, జైట్లీ ఖండన శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర నెత్తురోడింది. పవిత్ర హిమలింగాన్ని శంభోహరహర అంటూ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వస్థలానికి పయనమైన అమాయక భక్తులపై ఉగ్రవాద రక్కసి పంజా విసిరింది. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. సోమవారం రాత్రి 8.20 గంటలకు ఉగ్రవాదులు మొదట జమ్మూ–శ్రీనగర్ హైవేపై బోటెంగూలోని బుల్లెట్ ప్రూఫ్ పోలీసు బంకర్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులిచ్చారు. తర్వాత ముష్కరులు ఖనాబల్ సమీపంలోని పోలీసు పికెట్‌పై కాల్పులకు తెగబడ్డారు. అక్కడా పోలీసులు గట్టిగా తిప్పికొట్టారు. ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతుండగా అక్కడికొచ్చిన యాత్రికుల బస్సుపై ముష్కరులు విచక్షణా రహితంగా తూటాల వర్షం కురిపించి పారిపోయారు. బస్సు అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న యాత్రికులను తీసుకుని సోనామార్గ్ నుంచి జమ్మూ వెళ్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులెవరూ గాయపడలేదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి.. దాడికి గురైన బస్సు అమర్నాథ్ యాత్రికుల వాహనశ్రేణిలో భాగం కాదు కనుక దానికి భద్రత కల్పించలేదని పోలీసులు తెలిపారు. ‘హైవేపై రాత్రి 7 గంటల నుంచి భద్రతను ఉపసంహరిస్తారు కనుక ఆ సమయం తర్వాత రోడ్డుపై యాత్రికుల బస్సులు రాకూడదన్న యాత్ర నిబంధనలను బస్సు డ్రైవర్ ఉల్లంఘించాడు. జీజే09జెడ్ 9976 నంబరున్న ఈ బస్సు అమర్నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేసుకోలేదు. సీఆర్పీఎఫ్ విస్తృత రక్షణ కల్పించే వాహన శ్రేణిలో ఇది భాగం కాదు. విడిగా వచ్చింది’ అని తెలిపారు. ఈ ఘటనతో జమ్మూ–శ్రీనగర్ హైవేను మూసేసి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భద్రతా బలగాలు హతమార్చిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాదులు హింసకు పాల్పడొచ్చన్న అనుమానంతో అధికారులు శని, ఆదివారాల్లో అమర్యాత్రను నిలిపేసి సోమవారం తిరిగి ప్రారంభించారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాలు సంయుక్తంగా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులపై 2000 ఆగస్టు 1న పహల్గావ్లో ఉగ్రవాదులు దాడి చేసి 30 మందిని బలితీసుకున్నారు. భారత్ బెదరదు: మోదీ న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రికులపై దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించారు. ‘శాంతియుతంగా సాగుతున్న యాత్రపై ఉగ్రవాదుల పిరికిపంద దాడి మాటలకందని బాధ కలిగించింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులు, ద్వేషపూరిత దుష్ట పన్నాగాలకు భారత్ ఎన్నటికీ బెదరబోదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. ఓహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీలతో మాట్లాడానని, అవసరమైన సాయమంతా అందిస్తానని హామీ ఇచ్చానని వెల్లడించారు. దాడి అత్యంత గర్హనీయమని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న తమ సంకల్పాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్.. ఓహ్రా, ముఫ్తీలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. యాత్రకు గట్టి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉగ్రవాదులు కశ్మీర్ సంప్రదాయాలు, విలువలపై దాడి చేశారని ముఫ్తీ మండిపడ్డారు. దాడిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా ఖండించారు. ముగ్గురు ఉగ్రవాదుల హతం శ్రీనగర్/న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ముగ్గు రు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఆదివారం తమ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు చనిపోయారని, రెండు బంకర్లను ధ్వంసం చేశామన్న పాక్ వాదనను ఆయన తోసిపుచ్చారు. భారత సైనికులు తీవ్రంగా గాయపడినా, చనిపోయినా దేశ ప్రజలకు తెలియజేసే జవాబుదారీతనం తమకు ఉందని స్పష్టం చేశారు. -
రాళ్ల దాడి అనుకున్నాం..
సాక్షి, కామారెడ్డి: ‘‘అప్పుడే భోజనం చేసి బస్సు ఎక్కి కూర్చున్నాం. ఒక్కసారిగా బస్సు అద్దాలు పగులుతున్న చప్పుడు వినిపించింది. ఎవరో రాళ్ల దాడి చేస్తున్నారనుకున్నాం. పగి లిన అద్దాల నుంచి దూసుకొచ్చిన గ్రెనేడ్ పేలింది. క్షణంలో గ్రెనేడ్ ముక్కలు వచ్చి పలు వురిని గుచ్చుకున్నాయి. మాలో ఒకరు తీవ్ర గాయాలతో చనిపోగా, మరికొందరు గాయాల పాలయ్యారు’ అంటూ అమర్నాథ్ యాత్రలో ఇబ్బందుల పాలై ఆదివారం ఉదయం తిరిగి ఇళ్లకు చేరిన బాధితులు తెలిపారు. గత నెల 27న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రావెల్స్ యజమాని ఓంప్రకాశ్ ద్వారా ఉత్తర భారత తీర్థయాత్రకు 44 మంది యాత్రికులు, ఇద్దరు వంట మనుషు లతో బయలుదేరారు. ఈ నెల 5న ఉదయం అమర్నాథ్కు వెళ్లి తిరుగు పయనమయ్యారు. అనంతనాగ్ జిల్లా ఖాజీగుండ్ ప్రాంతంలో 6వ తేదీ సాయంత్రం ఆగి భోజనాలు చేసుకు న్నారు. 6 గంటల సమయంలో బస్సు కదల గానే ఒక్కసారిగా దాడి జరిగింది. బస్సులో అరుపులు, బొబ్బలతో అందరూ ఒకరిపై ఒకరు పడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు బస్సును కొంత దూరంలో డ్రైవర్ ఆపారు. సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గ్రెనేడ్ పేలుడులో కరీంనగర్‌కు చెందిన శంకరశర్మ (60) మృతి చెందగా, జయంతి, విశ్వనాథం, విజయ, లక్ష్మీబాయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు అనంతనాగ్‌కు, అనంతరం శ్రీనగర్‌కు తరలించారు. తెలంగాణ ప్రభు త్వం, కామారెడ్డి జిల్లా యంత్రాంగం చొరవతో 38 మంది బాధితులను శనివారం రాత్రి హైద రాబాద్‌కు తరలించారు. గాయపడ్డ నలు గురు, నలుగురు సహాయకులు అక్కడే ఉండి పోయారు. చికిత్స పొందుతున్నవారిని తీసుకు రావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
అమర్నాథ్ యాత్రికుల రక్షణకు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రకు వెళ్లి జమ్మూ కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 44 మంది యాత్రికులను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాత్రలో చిక్కుకున్న వారు సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆదేశించారు. వీరందరినీ నేరుగా జమ్మూకశ్మీర్ లేదా ఢిల్లీ నుంచి స్వస్థలాలకు చేర్చాలని అధికారులకు తెలిపారు. -
అసలేం జరిగింది!?
► అమర్‌నాథ్‌యాత్రలో విషాదం ► బస్సు ప్రమాదంలో 13 మంది కామారెడ్డివాసులకు గాయాలు ► గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రభావం అంటున్న సర్కార్ ► టెర్రరిస్టులు దాడిచేశారంటున్న బాధితులు ► బాధిత కుటుంబాల్లో అయోమయం ► ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ ► త్వరగా రప్పిస్తామంటున్న ప్రభుత్వ విప్ గంప సాక్షి, కామారెడ్డి: అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండు ప్రాంతంలో బస్సు కదులుతున్న సమయంలో దాడి జరిగిందని బాధితులు అంటున్నారు. బస్సుకు ఒకవైపు నుంచి బాంబులు దూసుకురావడంతో గాయాలపాలయ్యామని తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోకుండా గ్యాస్ సిలిండర్ పేలుడు అన్న మాట చెబుతుండడంతో బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలి ఉంటే బస్సు మొత్తం కాలి బూడిదయ్యేదని, అందులో ఉన్న అందరం దహనం అయ్యేవారమని బాధితులు అంటున్నారు. యాత్రనుంచి తిరిగి వస్తుండగా.. గత నెల 27న కామారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీవెంకటేశ్వర టూర్స్ యజమాని ఓంప్రకాశ్ 45 మందితో కలిసి అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఆగ్రాకు చేరుకుని, అక్కడి నుంచి ట్రావెల్స్‌కు చెందిన బస్సును మాట్లాడుకుని వివిధ ప్రాంతాలను సందర్శించి, ఈ నెల 5న అమర్నాథ్కు చేరుకున్నారు. స్వామి దర్శనానంతరం 6న తిరుగు ప్రయాణమయ్యారు. అమర్నాథ్ నుంచి వస్తున్న సందర్భంలో ఖాజీగుండు ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. బస్సులోకి చొచ్చుకువచ్చిన ఇనుపు ముక్కలు అందులో ఉన్న యాత్రికులకు గుచ్చుకున్నాయి. చాలా మంది కాళ్లకు గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. ఇందులో కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డికి చెందిన జంగం జయంతి (52) అనే మహిళ కాలికి తీవ్ర గాయమైంది. కామారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మీబాయి(42) అనే మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతనాగ్‌లోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా పదహారు మందిని ఖాజీగండ్ సీఆర్పీఎస్ క్యాంపులో ఉంచారు. మిగతా వారిని మరో రెండు చోట్ల క్యాంపుల్లో ఉంచారు. అయితే ఈ సంఘటనకు టెర్రరిస్టుల దాడే కారణమని బాధితులు చెబుతున్నారు. ఇంటికి చేరేదాకా అయోమయమే.. అమర్నాథ్ యాత్రకు వెళ్లినవారిలో ఎందరు గాయపడ్డారు? గాయపడ్డవారి పరిస్థితి ఏంటి? అన్నదానిపై కూడా స్పష్టమైన వివరాలు వెల్లడి కావడం లేదు. తీవ్రవాదుల దాడిని ప్రభుత్వం ఎందుకు దాస్తుందోనని బాధిత కుటుంబాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామారెడ్డికి చెందిన ప్రభాకర్ భార్య జయంతి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిసింది. గురువారం రాత్రి క్షతగాత్రులు వీడియో కాల్ ద్వారా వారి పరిస్థితిని కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించారు. జమ్మూ అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీ.. గురువారం రాత్రి బాధిత కుటుంబాలకు ఈ విషయం తెలిసింది. వారు కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లను కలిసి తమ వారిని వెంటనే తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంఘటన జరిగిన జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. ఖాజీగడ్ సీఆర్పీఎఫ్ క్యాంపుతో పాటు మరో రెండు చోట్ల ఉన్న బాధితులందరినీ జమ్మూకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరగా.. అక్కడి అధికా రులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వారందరినీ ఒక్క చోటుకి చేర్చి జమ్మూకి తరలించాలని, అనంతరం వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు గాని, ఢిల్లీకి గాని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేటీఆర్‌తో మాట్లాడిన ప్రభుత్వ విప్.. అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న వారిని రప్పించేందుకుగాను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. సీఎం కార్యాలయ అధికారుల ద్వారా జమ్మూ కశ్మీర్ అధికారులతో మాట్లాడించారు. బాధితులందరినీ క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. క్షేమంగా తీసుకువస్తాం.. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడితో మాట్లాడారు. బాధితులందరినీ క్షేమంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. -
అమర్నాథ్ ఘటనలో 13 మందికి గాయాలు
సాక్షి, కామారెడ్డి: అమర్నాథ్ యాత్రలో ఉన్న 13 మంది కామారెడ్డి వాసులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గత నెల 27న కామారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టూర్స్ యజమాని ఓంప్రకాశ్ 45 మందితో కలసి అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. ఈ నెల 5న అమర్నాథ్కు వెళ్లారు. 6న తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అనంతనాగ్ సమీపంలోని ఖాజాగఢ్ ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. బస్సులోకి చొచ్చుకు వచ్చిన ఇనుçప ముక్కలు అందులో ఉన్న యాత్రికులకు గుచ్చుకున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డికి చెందిన జంగం జయంతి (52), కామారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మీబాయి(42) తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంత నాగ్‌లోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, 16 మందిని ఖాజాగఢ్ సీఆర్పీఎస్ క్యాంపులో ఉంచారు. నిజామాబాద్ జిల్లావాసులు ఇద్దరు పెర్కిట్(ఆర్మూర్): ఖాజాగఢ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఇద్దరు ఉన్నారు. ఆర్మూర్‌కు చెందిన రూప, గంగాప్రసాద్ దంపతులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ మేరకు వారు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
అమర్నాథ్ యాత్రలో విషాదం
కామారెడ్డి: అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు బయల్దేరిన వారి టూరిస్టు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి పట్టణం, రాజంపేట, మద్దికుంట చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 30మంది అమర్నాథ్ యాత్రకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. గురువారం సాయంత్రం జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా కుల్‌గా జిల్లా ఖాజీగఢ్ ప్రాంతంలో బస్సులో సిలిండర్ పేలింది. తొమ్మిదిమందికి గాయాలు కాగా, వారు అనంత్‌నాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సదాశివనగర్ జెడ్పీటీసీ రాజేశ్వర్ రావు ఈ విషయాన్ని జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర అధికారులకు సమాచారం అందించారు. తమ వారి పరిస్థితిపై ఆయా కుటుంబాల వారు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. -
నిలిచిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కశ్మీర్ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జమ్మూ- శ్రీనగర్ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శుక్రవారం భగవతి నగర్ నుంచి కశ్మీర్ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. రహదారి మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు. -
అమర్నాథ్ యాత్ర
మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ఓం నమఃశివాయ. శివ పంచాక్షరి మంత్రం. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన అదే అమర్నాథ్ యాత్ర. ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. తిరిగి వస్తామో, రామో అన్న భయం. ఇరుకైన దారి... ఇరుపక్కలా లోయలు.. కళ్లు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం.. తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మృత్యువు మన వెనకే నడుస్తుంటే... దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే వెళ్లటమే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది.. ఆ సమయంలో గుహను చేరుకోవటం అసాధ్యం... జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది.. మంచు విచ్చుకుంటుంది.. గుహ స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.. అందువల్లే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది.. విచిత్రమేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది.. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది? అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు. ఏడాదంతా గడ్డకట్టుకుపోయిన అమర్నాథ్ గుహ క్రమంగా తేటపడుతున్న సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడే చోట గుహ పైభాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కింద పడుతూ ఉంటుంది. సుమారు 45 రోజుల పాటు ఈ నీటిబొట్లు పడుతూనే ఉంటాయి. ఈ నీటి బొట్లు క్రమంగా మంచుగా మారి, లింగరూపంగా రూపాంతరం చెందుతుంది. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వెళ్లడానికి ఎన్నో వ్యయప్రయాసలు చేయాల్సిందే. ఇది మామూలు ప్రయాణం కాదు.. ఇదెంతో కష్టంతో కూడుకున్న ప్రయాణమని తెలిసినా... అంత దూరం వెళ్లటానికి ఎవరూ సంకోచించరు.... సరికదా... మరింత ఉత్సాహంతో అమర్నాథ్ యాత్రకు అపూర్వంగా, అపురూపంగా వెళ్తుంటారు భక్తులు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తిభావం. కొండంత నమ్మకం.మొత్తానికి మంచుకొండల్లో మహాదేవుని దర్శనం అనితర సాధ్యం. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు.. లయకారకుడి నిజరూపాన్ని కళ్లారా చూసి తరించి... తన్మయత్వం చెంది... తనవి తీరా ఆ రూపాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు భక్తులు. అమర్నాథ్ యాత్రలో RV టూర్స్ – ట్రావెల్స్ ప్రస్థానం ఎన్ని యాత్రలు చేసినా... ఎన్ని పర్యాటక ప్రాంతాలు తిరిగినా యాత్రికుల క్షేమమనేది ప్రధాన ఉద్దేశంతో, సేవే లక్ష్యం... ప్రేమే మార్గంగా మొదలైన RV టూర్స్ – ట్రావెల్స్. యాత్రికులకు పుణ్యక్షేత్రాల సందర్శనతో జన్మ పునీతం చేయాలనుకునే సంకల్పంతో ప్రారంభమైన ప్రయాణం. గత 16 సంవత్సరాలుగా నిరాటంకంగా అమర్నాథ్ యాత్రకు చిన్నా , పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా ఎన్నో వేలమంది ప్రయాణికులకు గమ్యస్థానంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ యాత్రికులు కోరుకున్న విధంగా యాత్రలను ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే, యాత్రికులకు ఎవ్వరూ ఇవ్వని విధంగా ప్రత్యేక సదుపాయాలను అందిస్తూ మరీ ముఖ్యంగా యాత్రికులకు తెలుగు భోజనం మంచి వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు తమ సంస్థ తరుపున ఒక్కో బందానికి ఒక్కో టూర్ మేనేజర్ని నియమించి... యాత్రికులకు తాము చేసిన యాత్రను అజన్మాంతం ఓ మధురానుభూతిని కల్గిస్తూ తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్‌గా తెలుగు ప్రజలందరి మదిలో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్.. ఎంతో మహిమాన్వితమైన అమర్నాథ్ యాత్రను మీరు కూడా RVటూర్స్ – ట్రావెల్స్ ద్వారా చేయనుకున్నట్లైతే మరిన్ని వివరాలకు హైదరాబాద్, కూకట్‌పల్లిలో , ఆఒ్క ఆఫీస్ ఎదురుగా ఉన్న RVటూర్స్ – ట్రావెల్స్ ఆఫీస్‌ను సంప్రదించి కానీ , ఫోన్ చేసి కానీ వివరాలు తెలుసుకోవచ్చు. -
పాదయాత్రకు రోజా పరిమళం
ఎనిమిదో రోజు ఆత్మగౌరవ యాత్రలో రోజా జోష్ కనిపించింది. విశాఖకు రైల్వేజోన్ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం నగరంలోని వేమన మందిరం వద్ద ప్రారంభమై రాత్రి చినగదిలిలో ముగిసింది. కాగా మధ్యాహ్నం నుంచి పాదయాత్రలో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యే రోజా సుమారు 12 కిలోమీటర్లు అమర్నాథ్ తదితరులతోపాటు నడిచి పాదయాత్ర బృందంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో ఉత్సాహం నింపారు. విశాఖపట్నం : ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల మాదిరిగా ఆత్మగౌరవయాత్రలో జనకెరటం ఎగసి పడింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో కలిసి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా పాదయాత్ర చేయగా వెల్లువలా కదంతొక్కింది. వారి అడుగులో అడుగు వేస్తూ పదం కలిపింది. రైల్వేజోన్ కోసం అమర్నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం 8వ రోజుకు చేరుకుంది. తొలుత ఉదయం ఆశీల్‌మెట్ట వద్ద వేమన మందిరం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన అమర్ సంపత్‌వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి సిరిపురం జంక్షన్, ఏయూ ఔట్‌గేట్, చినవాల్తేరు, పెదవాల్తేరు జంక్షన్, శివాజీపార్కు, కళాభారతి, మద్దిలపాలెం జంక్షన్, తెలుగుతల్లి విగ్రహం సమీపంలోని తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యాలయం వరకు సాగింది. చినవాల్తేరు, పెదవాల్తేరు, శివాజీ పార్కు పరిసర ప్రాంతాల్లో ప్రజలు అమర్నాథ్కు బ్రహ్మరథం పట్టారు. భోజన విరామనంతరం అమర్‌కు పార్టీ ప్రొగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా సంఘీభావం తెలిపారు. వామపక్షాల సంఘీభావం సాయంత్రం ఐదు గంటలకు వంశీకృష్ణ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మద్దిలపాలెం జంక్షన్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోగా అక్కడ సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్, నగర కార్యదర్శి మార్కెండేయులు తదితరులు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. జాతీయ రహదారి నుంచి కృష్ణా కళాశాల మీదుగా హెచ్‌బీ కాలనీ వరకు సాగింది. అక్కడ జరిగిన సభలో రోజాతో పాటు అమర్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు ప్రసంగించారు. రైల్వేజోన్ విషయంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆడుతున్న నాటకాలపై దుమ్మెత్తి పోశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు మద్యం బ్రాండ్స్ తప్ప రైల్వేజోన్ గురించి తెలియదన్నారు. బ్యాంకులకు వందల కోట్లు బురిడి కొట్టిన గంటా ఏనాడు జోన్ కోసం మాట్లాడలేదంటూ చురకలేశారు. అయ్యన్నకు ఏజెన్సీలో బాక్సైట్, గంజాయి సాగుపై శ్రద్ధ తప్ప ఈ ప్రాంత సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. అనంతరం పాత వెంకోజీపాలెం, వెంకోజీపాలెం, ఎంవీపీ డబుల్ రోడ్, గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి, అప్పుఘర్, తెన్నేటి పార్కు, జోడుగుళ్లపాలెం, హనుమంత వాక జంక్షన్ మీదుగా చినగదిలిలోని వంశీ కళాశాల వరకు పాదయాత్ర సాగింది. ఎనిమిదోరోజు 17 కిలోమీటర్ల నడిచిన అమర్ ఇప్పటివరకు 123 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేయగలిగారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, రాష్ట్ర మహిళా విభాగం ఉత్తరాంధ్ర ఇన్చార్జి వరుదు కళ్యాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి కాంతారావు, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, మహిళ, ఎస్సీవిభాగాల అధ్యక్షులు పసుపులేటి ఉషాకిరణ్, బోని శివరామకృష్ణ, నగర అధికార ప్రతినిధి మూర్తియాదవ్, తదితరులు పాల్గొన్నారు. 11.5 కిలోమీటర్లు నడిచిన రోజా.. అనంతరం అమర్‌తో కలసి రోజా ఆత్మగౌరవయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఏమాత్రం విరామం లేకుండా 11.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మద్దిపాలెం వంశీకృష్ణ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర చినగదిలి వంశీకి చెందిన కళాశాల వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్లకిరువైపులా బారులు తీరిన జనం జోన్ కోసం నినదించారు. పలుచోట్ల రోజాతో కరచాలనం చేసేందుకు అమర్‌ను అభినందించేందుకు పోటీపడ్డారు. మహిళలు మంగళహారతులు ఇస్తూ ఆశీర్వదించారు. మంత్రులకు పట్టదా? పెదవాల్తేరు : జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఏనాడు రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పాపానపోలేదని, ఈ ప్రాంత అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా దుయ్యబట్టారు. హెచ్‌బీకాలనీలో వార్డు మాజీ కార్పొరేటర్ నడింపల్లి కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎంతసేపు గిరిజన ప్రాంతంలో ఉన్న బాౖMð్సట్, గంజాయి సాగుపైన శ్రద్ధ తప్పితే ప్రజల మనోభావాలు అవసరంలేదన్నారు. మంత్రి గంటాకు ఎప్పడు నారాయణ స్కూల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చేందుకు పేపర్ లీకేజీలు, భూకుంభకోణాలే తప్పా ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి కృషి చేయడంలేదని మండిపడ్డారు. ఎంత సేపు నేను సీనియర్ని, చాలా గొప్పవాడిని అని చెప్పుకునే అశోక్‌గజపతిరాజు విభజన చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్ గురించి ఎందుకు నోరు మోదపడంలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసులు చిరకాల ఆకాంక్ష అయిన రైల్వేజోన్ కోసం వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. జోన్ సాధించి తీరుతాం అడుగడుగునా ప్రజలు చూపిస్తున్న ఆదరణ అభిమానాలు చూస్తుంటే రైల్వేజోన్ సాధించి తీరుతామని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజ ల కోసం చేస్తున్న పోరాటానికి తన వంతు సహకారం అందించిన రోజా ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారన్నారు. జోన్ సాధన కోసం చేపట్టిన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావడం శుభపరిణామమన్నారు. -
ఆత్మగౌరవయాత్రకు తరగని ఆదరణ
ఉత్తర,దక్షిణ నియోజకవర్గాల్లో కొనసాగింపు విశాఖపట్నం : రైల్వే జోన్ కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా గుడివాడ అమర్నాథ్కు నగరవాసులు బ్రహ్మరథం పడుతున్నారు. నీ సంకల్పం గొప్పది.. ఎలాగైనా రైల్వేజోన్ సాధించి తీరువావ్.. అంటూ పాదయాత్ర పొడవునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. దారిపొడవునా మహిళలు ఎదురేగి స్వాగతం పలుకుతూ మంగళహారతులిస్తూ దీవిస్తున్నారు. రైల్వేజోన్ కోసం అమర్నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర బుధవారం ఏడో రోజుకు చేరుకుంది. ఏడోరోజు 21.50 కి.మీ మేర నడిచిన అమర్ ఇప్పటివరకు 106 కి.మీ. మేర పాదయాత్రను పూర్తి చేయగలిగారు. తొలుత ఉదయం తాటిచెట్లపాలెం 80 అడుగుల రోడ్డు వద్ద బసచేసిన చోట దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తర కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరాగా అమర్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవధానుల అజశర్మతో పాటు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజశర్మ మాట్లాడుతూ హోదా మాదిరిగానే రైల్వే జోన్ ఎగ్గొట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన తెలుగుదేశం పట్టించుకోవడం లేదన్నారు. రైల్వేజోన్‌తో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 80 అడుగుల రోడ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తాటిచెట్లపాలెం మెయిన్‌రోడ్, మహారాణి పార్లర్, జగ్గారావు వంతెన, సంఘం ఆఫీస్, శంకరమఠం రోడ్, దుర్గాగణపతి ఆలయం, బీవీకే కళాశాల, డైమాండ్ పార్కు, దొండపర్తి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్ సర్కిల్, అల్లిపురం బజారు మీదుగా మనోరమ థియేటర్ ఎదురుగా కల్యాణ మండపం వరకు సాగింది. అక్కడ భోజన విరామం అనంతరం తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర దుర్గలమ్మగుడి, డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా జగదాంబ, అక్కడ నుంచి çహోటల్ దసపల్లా, పూర్ణామార్కెట్, పోస్టాఫీస్, వెలంపేట, ఎవీఎస్ కళాశాల, కలెక్టరేట్, జెడ్పీ సెంటర్ ఆంకోసా ఆడిటోరియం, పందిమెట్ట, గ్రీన్‌పార్కు హోటల్, సెవన్‌హిల్స్, రామ్‌నగర్ మార్కెట్ మీదుగా వేమన మందిరం వరకు సాగింది. బుధవారం పూర్తిగా సామాన్య, మధ్యతరగతి ప్రజలుండే ప్రాంతాల్లో సాగిన పాదయాత్రకు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించింది. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల్లో నివాసం ఉంటున్న వారు సైతం పాదయాత్రకు ఎదురేగి స్వాగతం పలుకుతూ విశాఖకు జోన్ రావాలంటూ తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. అమర్నా«థ్ కూడా పలుచోట్ల ప్రజలనుద్దేశించి తన ప్రాణాలనైనా ఫణంగా పెట్టి జోన్‌ను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. విభజన హామీల్లో ఇచ్చిన జోన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలుడుతున్నాయని కో ఆర్డినేటర్లు తైనాల విజయకుమార్, కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పాదయాత్రలో పార్టీ కో ఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు,సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫరూఖి, నగర అధికార ప్రతినిధి మూర్తియాదవ్, ఎస్సీసెల్ నగరాధ్యక్షుడు బోని శివరామకృష్ణ, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ కాంతారావు,యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అమర్నాథ్ యాత్ర
కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్నాథ్ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం. జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది.. అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు. అమర్నాథ్ యాత్రలో RV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం. క్షణంలో మారే వాతావరణం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్నాథ్ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగా పెరుగుతున్నారు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే... అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకు పోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. -
రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం
రాంబిల్లి (యలమంచిలి): విశాఖ రైల్వే జోన్ సాధించేవరకు పోరాటం ఆగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్ స్పష్టం చేశారు. గోకివాడలో గురువారం ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వే జోన్ సాధన కోసం ఈ నెల 22 నుంచి ఆత్మ గౌరవ యాత్ర పేరిట తాను పాదయాత్రను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పాదయాత్రకు అందరూ మద్దతు పలకాలని కోరారు. విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రైల్వే జోన్‌ను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు రైల్వే జోన్ హామీ ఇచ్చారని ఇప్పుడు అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. రైల్వే జోన్‌తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమర్నా«థ్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నానేపల్లి సాయివరప్రసాద్, ద్వారపురెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి
విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి నగర పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆది వారం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో పాటు పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కమిటీల నియామకాలపై చర్చిం చారు. పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి పార్టీ కేం ద్ర కార్యాలయానికి పంపించే ఏర్పాటు చేశారు. -
త్వరలోనే వైఎస్సార్ పాలన
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి ప్రేమ సమాజంలో వృద్ధులు, చిన్నారులకు పళ్ల పంపిణీ డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : త్వరలోనే రాష్ట్రంలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రాబోతుందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు మాసిపోగు రాజు, ఆళ్ల శివగణేష్, కనకల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు లాలం రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం ప్రేమసమాజంలో అనాధ వృద్ధులు, పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ సీపీ నమూనాలో ఉన్న కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం వృద్ధులు, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై ఉద్యమిస్తున్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..ఎప్పుడు వైఎస్సార్ పాలన చూస్తామా? అనే ఆశతో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించడం సరికాదన్నారు. రైల్వేజోన్ సాధనకై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఆత్మగౌరవ యాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విద్యార్థి నాయకుడు సలాంబాబు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, యువజన విభాగం కార్యదర్శి గాలి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకుడు పద్మశేఖర్, నాయకులు డి.వెంకట్రావు, ఇప్పిలి శ్రీను, ఇప్పాక శ్రీను, శంకర్‌రెడ్డి, పి.రెడ్డి, రమణారెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, మధు, సురేష్, 15వ వార్డు అధ్యక్షుడు లంకా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
1 నుంచి అమర్నాథ్ రిజిస్ట్రేషన్లు
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్రకు మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆలయ ముఖ్య నిర్వహణాధికారి పీకే త్రిపాఠి తెలిపారు. దేశవ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంకుల్లో ఎంపిక చేసిన 433 బ్రాంచీల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని సూచించారు. బాల్తల్, చందన్వారి మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టు 7న రాఖీపండుగ నాడు ముగుస్తుందని తెలిపారు. యాత్రికులు పాటించాల్సిన విధివిధానాల వివరాలు ఆలయబోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. -
హృదయంగమం.. పరమశివుని ధామం
కోనసీమకు దిగి వచ్చిన హిమగిరి క్షేత్రం అమలాపురంలో ఆకట్టుకుంటున్న ‘అమరనాథ్’ నమూనాలు శివరాత్రికి ఓం శాంతి ఆధ్వర్యంలో భారీ సెట్టింగులు అమలాపురం టౌన్ : హిమగిరి సీమలోని అమరనాథ్ గుహలు..వాటిలో మంచుతో రూపుదిద్దుకున్న అమరనాథు లింగం.. ఆ గుహల్లోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు.. ఇవి కాక వరసగా 108 శివలింగాలు.. ఇవన్నీ ఒకే చోట కొలువుదీరాయి. సాక్షాత్తు పరమశివుడే ముచ్చటపడేంత మనోహరంగా రూపొందిన ఆ దివ్యధామం భక్తులను పరవశింపజేస్తోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం (ఓం శాంతి) అమలాపురం కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మాచిరాజువీధిలోని తటవర్తి వారి స్థలంలో ఏర్పాటుచేసిన అమరనాథ గుహలు, శివలింగాల భారీ సెట్టింగ్‌లు రాత్రి సమయాల్లో విద్యుద్దీపాల కాంతులతో భాసిల్లుతూ భక్తులను అయస్కాంతాలుగా ఆకట్టుకుంటున్నాయి. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ దివ్యధామాల సెట్టింగ్‌లను ఆర్డీవో జి.గణేష్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్‌లు మంగళవారం రాత్రి ప్రారంభించారు. 81వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం పేరుతో అమలాపురం ఓం శాంతి కేంద్రం ఇన్‌ఛార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. తెల్లటి మంచు గడ్డలతో ఉన్న అమరనా«థ్ గుహలు.. ఆ గుహల్లోకి వెళ్లే అపురూప మార్గం... అందులో మంచుతో ఉన్న అమరనాథ శివలింగాన్ని రూపాందించారు. అదే గుహల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా తీర్చిదిద్దారు. మరో చోట 108 శివ లింగాలు ఒకే చోట కొలువుదీరిన సెట్టింగ్ ఏర్పాటుచేశారు. ఇంకో చోట భారీ శివలింగాన్ని అమర్చారు. సర్వం శివమయంగా మారిన ఆ తావుకు రాత్రయితే చాలు.. పట్టణంలో దారులన్నీ మాచిరాజువీధికే అన్నట్టు.. విద్యుద్దీప కాంతుల్లో వెలిగే ఆ శివధామ దర్శనం కోసం భక్తులు వెల్లువెత్తుతున్నారు. ఈనెల 25∙వరకూ ఈ ప్రదర్శనలు ఉంటాయి.