అబిడ్స్ (హైదరాబాద్): అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ శుక్రవారం దైవదర్శనం చేసుకున్నారు. కుండపోత వర్షంతో అమర్‌నాథ్‌లో వరదలు రావడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రాజాసింగ్ ‘సాక్షి’ తో ఫోన్‌లో మాట్లాడారు.
కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ దర్శనం చేసుకుని జమ్మూకశ్మీర్ వరకు తరలి వచ్చినట్లు తెలి పారు. హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడంతో గుర్రాలపై చేరుకున్నామన్నారు. వరదలు రావడం కొద్ది దూరం నుంచి కళ్లారా చూశానని, తన కళ్ల ముందే టెంట్లు కొట్టుకుపోయాయని వివరించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి తరలి పోయామని చెప్పారు. కాగా, శనివారం వైష్ణవీదేవి దర్శనానికి వెళ్తున్నట్లు రాజాసింగ్ తెలిపారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి👉🏾Hyderabad: కుండపోత.. సిటీలో రోజంతా వర్షం
Comments
Please login to add a commentAdd a comment