
సాక్షి,హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి సోమవారం(ఫిబ్రవరి 24) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. రెండు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు.
గతంలోనూ రాజాసింగ్‌కు పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్‌కు హత్యకు కుట్రపన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.