సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు మృతిచెందడం బాధాకరం. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం. తాన్యా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.
హైదరాబాద్‌లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు నేను చూపిస్తా. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు. కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలి’’ అని రాజాసింగ్ సూచించారు.
కాగా, సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతి చెందినవారిని తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తాన్యా సోని స్వస్థలం బీహార్ కాగా ఆమె తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment