Town Planning Department
-
లంచాలకు మరిగారు.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్ సెల్లార్ మునిగి ముగ్గురు మృతిచెందడం బాధాకరం. అందులో తెలుగమ్మాయి కూడా ఉండటం ఇంకా బాధాకరం. తాన్యా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.హైదరాబాద్‌లోనూ అక్రమ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు నేను చూపిస్తా. కొత్తగా డైనమిక్ లేడీ కమిషనర్ వచ్చారు. కొంచెం టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణలోను ఢిల్లీ లాంటి ప్రమాదాలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫోకస్ పెట్టాలి’’ అని రాజాసింగ్ సూచించారు.కాగా, సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతి చెందినవారిని తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28)గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తాన్యా సోని స్వస్థలం బీహార్ కాగా ఆమె తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్నారు. -
‘టౌన్’లో ప్రక్షాళన
సాక్షి, అమరావతి: మునిసిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని పత్రాలున్నా ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించక విసిగెత్తిపోయే పరిస్థితులకు తెరదించి దరఖాస్తు ఏ దశలో ఉందో కిందిస్థాయి సిబ్బంది నుంచి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఉన్నతస్థాయి అధికారుల వరకు తెలుసుకునేలా మార్పులు చేశారు. ఐదేళ్ల క్రితమే ఆన్లైన్ విధానం వచ్చినా సాఫ్ట్ వేర్ లోపాలతో కొందరు సిబ్బంది దరఖాస్తు దారు లకు చుక్కలు చూపిస్తున్నారు. మున్సిపల్ ఉన్నతా ధికారుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ డెవలప్మెంట్ పర్మిషన్ మెనేజ్మెంట్ సిస్టం(డీపీఎంఎస్) లో సమూల మార్పులు చేశారు. మాన్యువల్ విధా నానికి స్వస్తి పలికారు. ఆన్లైన్ వల్ల దరఖాస్తు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఏ విభాగం అధికారి వద్ద ఎన్నిరోజులు ఉందో కూడా వెల్లడి కానుంది. ఒకవేళ ఏదైనా ఫైల్‌ను నిలిపివేస్తే దరఖాస్తుదారుడికి నిర్ణీత గడువులోగా కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పరిశీలన.. ఫీజుల చెల్లింపు సాధారణంగా ఇంటి నిర్మాణం లేదా లే అవుట్ పనులకు టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతి పొందిన తర్వాత స్థానిక అధికారులు సదరు ప్రాంతాన్ని పరిశీలించాలి. ఈ దశలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ‘పోస్ట్ వెరిఫికేషన్’ విధానాన్ని రద్దు చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తు పత్రాల పరిశీలన అనంతరం మాస్టర్ ప్లాన్ నిబంధనలకు లోబడి ఉంటే వెంటనే నిర్దేశించిన ఫీజు చెల్లించేందుకు అనుమతి లభిస్తుంది. ఆన్లైన్లో ఫీజు చెల్లించగానే ఆటోమెటిక్‌గా సంబంధిత ప్లాన్‌తోపాటు నిర్మాణ ఉత్తర్వులను సైతం దరఖా స్తుదారులు డౌన్లోడ్ చేసుకునేలా మార్పులు చేశా రు. ఈ విధానం రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సం స్థలు, 18 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అమ ల్లోకి వచ్చింది. నిర్మాణ ప్లాన్‌ను సైతం ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ మార్పులతో అనవసర జోక్యానికి, ఆలస్యానికి తావులేకుండా చేశారు. ఇప్పటివరకు ఉన్న పోస్ట్ వె రిఫికేషన్ విధానం, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కమిటీలను రద్దుచేసి క్షేత్రస్థాయిలో అక్రమాలు జరగకుండా వా ర్డు ప్లానింగ్ సెక్రటరీల సేవలను వినియోగిం చుకుంటున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆన్లైన్ విధానంలోనే నోటీసులు జారీ చేస్తున్నారు. 15 రోజుల్లోనే అనుమతులు టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులు తెచ్చి అనుమతులు వేగంగా ఇస్తుండడంతో నిర్మాణ రంగానికి మేలు జరుగుతోంది,. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పత్రాలు సరిగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయి. అక్రమ నిర్మాణాలతో సమస్యలను కొని తెచ్చుకోవద్దు. అవసరమైతే అధికారులను సంప్రదించవచ్చు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా, అనుమతులు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా వార్డు ప్లానింగ్ సెక్రటరీలు పర్యవేక్షిస్తున్నారు. – వీపనగండ్ల రాముడు, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ -
నెల్లూరు మున్సిపల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు కలకలం రేపాయి. నెల్లూరు పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సందర్బంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పలు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం. -
ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్లైన్ లోనే..
సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకుని రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యంగా నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధించేందుకు దోహదం చేసేలా టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు సంస్కరణలు తీసుకుని వస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు. భవన నిర్మాణాల అనుమతుల జారీ, కొత్త లే అవుట్లు నెలకొల్పడంలో ప్రస్తుతమున్న నిబంధనలను సరళీకృతం చేయడం, టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరులో జవాబుదారీ తనం పెంచడం వంటి అంశాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆయన ఆమోదం తెలిపారు. పూర్తి పారదర్శకతతో, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా సామాన్య ప్రజలు భవన నిర్మాణపు అనుమతులను పొందేట్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి) ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలకు భూములు ఇచ్చిన వారికి పరిహారంగా ఇచ్చే టిడిఆర్ ల జారీని సులభతరం చేయడంతోపాటు, నిబంధనలను సరళీకృతం చేయడం, భవన నిర్మాణపు అనుమతులు, లే అవుట్ల జారీ నిబంధనల్లో సవరణలు, ఇంపాక్ట్ ఫీజు చెల్లింపు, ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే నిర్వహించేట్లుగాను, పర్యవేక్షక తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించడం తదితర విషయాల్లో నిర్దిష్టమైన మార్గదర్శకాలతో మూడు ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నెంబర్లు 178,179,180) జారీ అయ్యాయి. ఇకపై అక్రమ కట్టడాలు, లే అవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తూ, అటువంటి వాటిపై ఉక్కుపాదం మోపనున్ననట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. (చదవండి: కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం) ఈ సంస్కరణలు అమలులోనికి తీసుకొచ్చే ముందు స్టేక్ హోల్డర్లతోనూ, రియిల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపామని, ఆ వర్గాల వారు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను క్రోడీకరించి, విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇలా అనేక విధాలుగా, అధ్యయనం చేసి టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ప్రభుత్వానికి చెందిన అన్ని పనులు గడప ముంగిట నుంచే జరిగేలా చూస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రజలకిచ్చిన మాటను అమలు చేసేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు మేలు చేసేలా, ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగానికి చేయూత నిస్తూ, ముఖ్యంగా అన్ని రకాల ఇళ్ల నిర్మాణపు పనులు మరింత జోరందుకునేందుకు ప్రభుత్వ నిర్ణయాలు దోహదం చేస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. జీవోల్లోని ముఖ్యాంశాలు: ►సిటీ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీ: స్టేక్ హోల్డర్ల విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకుని ఇంపాక్ట్ ఫీజును 6 వాయిదాల్లో 3సంవత్సరాల కాలపరిమితిలో అనుమతినివ్వడంతోపాటు, ఈ ఫీజు మొత్తాన్ని ప్రస్తుతమున్న దానికంటే సుమారు 50 శాతం మేర తగ్గించడం జరిగిందని మంత్రి వివరించారు. ►భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియ లో పోస్ట్ వెరిఫికేషన్ తొలగింపు: భవన నిర్మాణపు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్న, పిదప సిస్టం దానిని పరిశీలించి నిర్దేశిత ఫీజు / చార్జీలు చెల్లించిన అనంతరం సిస్టం ద్వారా ఆమోదం పొందిన, ప్లాను, ఉత్తర్వులు జనరేట్ అవుతాయి. ఇప్పటి వరకు ఉన్న పోస్ట్ వెరిఫికేషన్ ను మరియు మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కమిటీలను తొలిగించి, వీటి స్థానంలో పర్యవేక్షణ తనిఖిలు మరింత పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆన్ లైన్ వెరిఫికేషన్ లో అనవసరమైన మానవ జోక్యం నివారిస్తూ సరళకృతం చేయడమైనది. ►టిడిఆర్‌ల జారీ , వినియోగం, పర్యవేక్షణ లపై నిర్ణయాలు.. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల విస్తరణ, ఇతరత్రా ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాల నిమిత్తం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ఇచ్చే అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్ బ్యాక్ ల లో సడలింపులకు వీలు కల్పిస్తూ జారీ చేసే ట్రాన్సఫర్ బుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టిడిఆర్) లను ప్రస్తుతం మాన్యువల్ గా జారీ చేస్తున్నారు. ఈ టిడిఆర్లను రాష్ట్రంలోని ఏప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మాన్యువల్ గా జారీ చేసే ప్రక్రియలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలన్నిటిని అధ్యయనం చేసిన తరువాత ఇకపై వీటి జారీ, బదలాయింపు, వినియోగం వంటి అంశాలన్నీ పూర్తి పారదర్శకతతో ఆన్ లైన్ లోనే జరగాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అంతే కాకుండా, ఇంతవరకు టిడిఆర్ లను, భవన నిర్మాణపు అనుమతుల జారీ చేసేందుకు చెల్లించాల్సిన ఫీజుల రూపంలో సర్దుబాటు చేస్తున్నారు. ఇకపై టిడిఆర్ లను ఫీజుల రూపంలో సర్దుబాటు చేయడమనే ప్రక్రియను నిలిపివేస్తున్నారు. అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్ ల సడలింపుల నిమిత్తం వినియోగించే టిడిఆర్ ల ను కూడా అగ్నిమాపక భద్రతా చర్యలకు లోబడే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ఉపయోగం నిమిత్తం, పేదల గృహ నిర్మాణాలకు కూడా టిడిఆర్ ను వర్తింప చేయనున్నారు. ఏదైనా నిర్దేశిత ప్రజోపయోగం నిమిత్తం (గృహ నిర్మాణాలు, నీటి సరఫరా, డ్రైనేజి, విద్య, ఆరోగ్యం తదితర టికి) వినియోగించే భూములకు 400 శాతం టిడిఆర్ ను వర్తింపచేస్తారు. అలాగే ఏదైనా స్లమ్ ఏరియా కు సంబంధించి, దాని పునర్నిర్మాణానికి ప్రతిపాదించిన సందర్భాల్లో ప్రభుత్వ అనుమతితో టిడిఆర్ ను వర్తింప చేస్తారు. ►పారిశ్రామిక ప్రతిపాదనలకు కొన్ని సడలింపులు: పారిశ్రామిక పేరిఫరల్ రోడ్డు (ప్రాజెక్ట్ స్థలములో వెనుకవైపు స్థలముకు రహదారి నిమిత్తం వదలవలసిన రోడ్డు), ఓపెన్ స్పేస్ ల అంశాల్లో పరిశ్రమలకు రాకపోకలు సాగించేందుకు , అంతర్గత రహదారుల వెడల్పు, వదలవలసిన ఖాళీ స్థలాల విషయంలో, క్షేత్ర స్థాయిలో ఆచరణ యోగ్యంగా ఉండే విధంగా నిబంధనల్లో కొన్ని సవరణలు తీసుకుని వచ్చినట్లు మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. ►అనధికార కట్టడాలు లే అవుట్లపై చర్యలు: భవన అనుమతితో పాటు వేకేంట్ ల్యాండ్ టాక్స్ (విఎల్ టి) ఇంటిగ్రేషన్ ద్వారా, భవన నిర్మాణపు అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేసేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నాము. గతంలో ఉన్న విధానం ప్రకారం విఎల్ టి గణన, చెల్లింపు ప్రక్రియకు 2-3 నెలల సమయం పట్టేది, కానీ ప్రస్తుత నిర్ణయంతో ఈ సమయం ఆదా అవుతుంది. ►రిజిస్ట్రేషన్ విభాగంతో ఆన్ లైన్ పోర్టల్ ల అనుసంధానం: పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఇది ఒకటి. భవన నిర్మాణపు అనుమతుల సమయంలో తనఖా గా ఉంచిన వాటి విడుదల లో అనవసర జాప్యాన్ని నివారించేలా, అవినీతికి ఆస్కారం కలగకుండా, దరఖాస్తు దారు నుంచి నిర్దేశిత ఫీజు వసూలు అవ్వడంతోపాటు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల విడుదల వేగవంతం అవుతుంది. తద్వారా భవన నిర్మాతలకు మేలు కలుగుతుంది. చట్ట విరుద్దమైన భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్ ల ను నిలుపుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రణాళిక బద్దమైన పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాము. నిబంధనలను అతిక్రమిస్తూ వెలిసే నిర్మాణాలు, లే అవుట్లను నిర్మూలించే చర్యలను ముమ్మరంగా నిర్వహించనున్నారు. ►ఇకపై భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అందుతున్న సేవలన్నిటిపై పర్యవేక్షక తనీఖీలను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాము, అలాగే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ పనితీరును మెరుగు పరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం నిర్మాణ రంగంలో భాగస్వామ్యులైన వారితోనూ, ప్రజలతోనూ ప్రజా ప్రతినిధులతోనూ సంప్రదించి తీసుకున్న ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధిస్తుందని, పట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ వార్డుల్లోనూ వార్డు సెక్రటేరియట్ లు ఉన్న నేపథ్యంలో అక్రమ కట్టడాలు, అక్రమ లే అవుట్లు రాకుండా చూసే బాధ్యతలను ఆ వార్డులోని ప్లానింగ్ సెక్రటరి పర్యవేక్షిస్తారని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
భవనాలపై ‘భువనాస్త్రం’!
సాక్షి, హైదరాబాద్ : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి విన్నాం కానీ.. ఒకే దెబ్బకు ఆరేడు పిట్టలను కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పురపాలక శాఖలో పారదర్శక పాలనను శాస్త్రీయంగా అమలు చేయాలనే ఉద్దేశంతో నగరాలు, పట్టణాల్లోని భవంతులపై భువనాస్త్రం’ప్రయోగించనుంది. భువన్ పేరుతో డిజిటల్ యాప్‌ను తయారు చేసి.. పట్టణ ప్రాంతాల్లోని అన్ని భవనాల సమాచారాన్ని మొబైల్ ఫోన్లలో బంధించి.. ఆయా భవంతుల నుంచి ఏ శ్లాబ్ కింద ఎంత పన్ను వసూలు చేయాలనేది నిర్ణయించనుంది. ప్రతీ భవనాన్ని 360 డిగ్రీల కోణంలో డిజిటలైజ్ చేయడం ద్వారా ఏ భవంతికి ఏ శ్లాబ్‌లో ఆస్తి పన్ను, నల్లా చార్జీ విధించాలి.. ఆ భవంతిలో కరెంట్ వినియోగాన్ని గృహ, వాణిజ్య అవసరాల కేటగిరీలో చేర్చాలా? ఆయా బిల్డింగ్‌లపై అడ్వర్టైజింగ్ చేసుకునేందుకు, సెల్ టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయించనుంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, భువన్ యాప్ ద్వారా రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ మినహా మిగతా నగర, పురపాలక సంస్థల్లో ఉన్న భవనాలను నిక్షిప్తం చేసి.. తదుపరి కార్యాచరణ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఆదాయానికి గండి పడుతుండటంతో.. రాష్ట్ర జనాభాలో సగం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు లెక్కలున్నా.. ఆదాయం మాత్రం అంతంత మాత్రమే వస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఏటా రూ.1,123 కోట్ల (గ్రేటర్ హైదరాబాద్ మినహా) రాబడి మాత్రమే లభిస్తోంది. ఇందులో ప్రధానంగా ఆస్తి పన్ను రూపేణా రూ.671.33 కోట్లు, ఇతర ఆదాయం రూ.452.53. కోట్లు సమకూరుతోంది. ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత పాటించకపోవడం, గృహ, వాణిజ్య కేటగిరీల నిర్ధారణలో హేతుబద్ధీకరణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీనికి తోడు ప్రభుత్వ రికార్డుల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీగా కొనసాగతూ.. కమర్షియల్‌గా మారిన పాత పద్ధతుల్లోనే పన్నులు వసూలు చేస్తుండటం కూడా రాబడిలో తేడా రావడానికి దారితీస్తోంది. వాస్తవానికి గృహ సముదాయాలను వాణిజ్యావసరాలకు వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా.. క్షేత్రస్థాయిలో అవేమీ పట్టడం లేదు. దీంతో ఆస్తి పన్ను మాత్రమే కాదు.. కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్ సహా ట్రేడ్ లైసెన్సులు, జీఎస్టీలను ఎగ్గొడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి తోడు ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై పెనాల్టీలు వడ్డించాలని, అక్రమ నిర్మాణాల నుంచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని నిబంధనల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు మిన్నకుండి పోయింది. ఉపగ్రహ ఛాయచిత్రాలతో... నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ప్రాపర్టీని మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ఇప్పటికే తీసిన ఉపగ్రహ ఛాయచిత్రాల సహకారంతో భవనాల సమాచారాన్ని డిజిటలైజ్ చేయనుంది. ఈ క్రమంలో ఆ భవనం ఏ కేటగిరీలో ఉంది? ప్రస్తుతం ఏ కేటగిరీలోకి వస్తోంది.. భవనంలో జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సు కలిగి ఉన్నారా.. అనే సమాచారాన్ని సేకరించనుంది. దీనికి అనుగుణంగా జిల్లా ప్రణాళిక కార్యాలయం నుంచి గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం, ఎన్పీడీసీఎల్, సీపీడీసీఎల్ నుంచి విద్యుత్ కనెక్షన్లు, వాణిజ్య శాఖ నుంచి కమర్షియల్ ట్యాక్సులు, స్థానిక మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్సులు, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన వివరాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. భువన్ యాప్‌లో క్రోడీకరించిన ఈ సమాచారంతో భవనాల నిగ్గు తేల్చాలని పురపాలకశాఖ భావిస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఆగస్టు పదో తేదీవరకు ఈ సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ 360 డిగ్రీల కోణంలో భవనం కేటగిరీని నిర్ధారించడం ద్వారా మున్సిపాలిటీలు సహా అన్ని శాఖలకు భారీగా ఆదాయం సమకూరుతుందని, లీకేజీలకు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. -
టౌన్ ప్లానింగ్‌లో అవినీతిపై ఏసీబీ కొరడా
-
టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అనధికార నిర్మాణాలకు అండదండలు.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ.. అడుగడుగునా ఆమ్యామ్యాలు.. అడిగినంత ఇవ్వకపోతే వేధింపులు.. ఇవీ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో కొనసాగుతున్న బాగోతాలు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీరుపై విసిగి వేసారిపోతున్న జనం ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రారంభించిన డయల్ 14400 టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, ఉభయ తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో మంగళవారం సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగు చూశాయి. పలు కీలక ఫైళ్లు, రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. రెండేళ్లుగా టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చిన దరఖాస్తులు, మంజూరు చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రైవేట్ వ్యక్తుల పాగా సిటీ ప్లానింగ్ విభాగంలో సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో రూ.1,03,813, ఒంగోలులో రూ.8,940, తిరుపతిలో రూ.50,500, ప్రొద్దుటూరులో రూ.15,110, తాడేపల్లిగూడెంలో రూ.5,640, శ్రీకాకుళంలో రూ.14,690, నెల్లూరులో రూ.7,740, విజయవాడలో రూ.34,650, విశాఖపట్నంలో రూ.29,900... మొత్తం రూ.2,70,983 నగదు లభ్యమైంది. పలు టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పలువురు ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. అనుమతి లేకుండా పని చేస్తున్నారు. ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బుధవారం కూడా సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. సోదాల్లో ఏసీబీ గుర్తించిన అంశాలు.. చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ భవంతుల నిర్మాణానికి అనుమతులివ్వడం, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి రోజుల తరబడి అనుమతులు మంజూరు చేయకపోవడం, లంచాలు డిమాండ్ చేయడం, దరఖాస్తుదారులను వేధించడం వంటి అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. - మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని మధురవాడ(జోన్–1), గాజువాక(జోన్–5) కార్యాలయాల్లో పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని విచారించారు. వారివద్ద ఉన్న నగదును సైతం పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అక్కడ అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీశారు. - విజయనగరం టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. - నెల్లూరు నగరంలో గడిచిన ఏడు, ఎనిమిది నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంబంధిత భవనాలకు ఏ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారని టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిని ప్రశ్నించారు. - తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పలు రికార్డులను పరిశీలించారు. అనధికార కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది. - ప్రకాశం జిల్లా ఒంగోలులో సోదాలు నిర్వహించే సమయంలో సల్మాన్ బాషా అనే ప్రైవేట్ వ్యక్తి ఆ విభాగంలోని కంప్యూటర్ వద్ద కూర్చోవడం, అతని వద్ద కవర్లో రూ.8,940 ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. - చిత్తూరు జిల్లా తిరుపతిలో బీపీఎస్, ఆన్లైన్ భవన నిర్మాణ అనుమతుల రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయలేదని, అందులో తప్పుడు వివరాలు ఉన్నట్లు గుర్తించారు. - శ్రీకాకుళంలో కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. - గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో బిల్ కలెక్టర్ ఎస్.నాగేశ్వరరావు నుంచి రూ.69,620, టౌన్ ప్లానింగ్ ఔట్సోర్సింగ్ అటెండర్ అల్లంశెట్టి సుధాకర్ నుంచి రూ.29,093, డిప్యూటీ సిటీ ప్లానర్ బి.సత్యనారాయణ నుంచి రూ.5,100.. మొత్తం రూ.1,03,813 అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. బిల్డింగ్ ప్లాన్లు, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఇతర విషయాల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో భవనాల నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలను ఏసీబీ పరిశీలించింది. -
పేకమేడలా కట్టేస్తూ..
సాక్షి, అనంతపురం : కనీస ప్రమాణాలు వెతికినా కనపడవు.. నిబంధనల పాటింపులు అసలే ఉండవు.. అడ్డుకోవాల్సిన వాళ్లే సహకరించారనే ధీమానే ఏమో.. ఇష్టమొచ్చినట్లుగా అక్రమాలకు తెరలేపారు. కొద్దిపాటి స్థలంలోనే పేకముక్కలు పేర్చినట్లుగా నిర్మాణాలను పైకి లేపారు. గతంలో పాలకుల అండా ఉండడంతో ఇలాంటివి నగరంలో వీధికొకటి చొప్పున వెలిశాయి. ప్రస్తుతం కూడా కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణదారులు ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. కమర్షియల్ దందా నగరంలోని కమలానగర్, సాయినగర్, ఆర్టీసీ బస్టాండ్, కొత్తూరు తదితర ప్రాంతాలు కమర్షియల్ ఏరియా కింద వస్తాయి. ఇటువంటి ప్రాంతంలో సెంటు భూమి రూ. లక్షల్లో పలుకుతుంది. నిర్మాణదారులు కమర్షియల్ భవనాలు ఏర్పాటు చేసి రూ. లక్షల్లో బాడుగులకు ఇచ్చుకుంటారు. నగరపాలక సంస్థలో ఇటువంటి భవనాలకు అనుమతులు లభించవు. ఒక వేళ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా.. అక్కడి రోడ్డు విస్తీర్ణం కనుగుణంగా అనుమతులు లభించే పరిస్థితి లేదు. కానీ, నిర్మాణదారులు మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా అగ్గిపెట్టెల్లా నిర్మాణాలు చేపడుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. చర్యలేవీ? నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. గత కొన్నేళ్లుగా నగరంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా వారు పట్టించుకోవడం లేదు. నిర్మాణదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా భవనాలు నిర్మించుకోవాలని, బీపీఎస్‌లో అనుమతులు తీసుకోవచ్చని వారే చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. నేటి సమావేశంతోనైనా చెక్ పడేనా? నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన మార్క్‌తో దూసుకుపోతున్నారు. అక్రమాల ఆటకట్టించేందుకు తనదైన శైలిలో ముందుకుపోతున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అక్రమార్కులకు, వారికి సహకరిస్తున్న అధికారులకూ చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్ సోమవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నగరంలో వెలసిన, ప్రస్తుతం వెలుస్తున్న భవనాలపై ఈ సమావేశం ద్వారా ఆమె ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాల్సి ఉంది. అలాగే, గత ప్రభుత్వ హయాంలో నగరంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను కొందరు పాల కులు తమ స్వలాభం కోసం అన్యాక్రాంతం చేశారు. రెండు రోజుల క్రితం రామ్‌నగర్‌లో ఇలాంటి ఓ భవనాన్నే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో అనేక చోట్ల ఇలాగే అక్రమార్కుల చేతుల్లో ఉన్న భవనాలనూ స్వా«ధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఖాళీ అయిన పోస్టులను గత ప్రభుత్వం భర్తీ చేయకుండా నాన్చడంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పడుతోంది. బిల్డింగ్ ప్లాన్ల మంజూరు, ఆక్రమణల తొలగింపు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్ల తయారీ వంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఈ సమస్యపై ఆ విభాగం ఉన్నతాధికారులు మున్సిపల్ శాఖకు అనేకసార్లు నివేదికలు పంపినా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా పెరిగాయి. రియల్టర్ల అక్రమాలతో స్థలాలను కొనుగోలు చేసిన ప్రజలు మోసపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆదాయానికీ భారీగా గండిపడింది. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్ల మంజూరు విధానం అమలులోకి వచ్చినా, ఆ ప్లాన్లను క్షేత్ర స్ధాయిలో పరిశీలన చేయడానికి సిబ్బంది లేరు. రహదారుల ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించడానికి సిబ్బంది లేకపోవడంతో నగరాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. రహదారులు, అంతర్గత రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్ల తయారీ కూడా ముందుకు సాగడం లేదు. ప్రతిపాదనలు దాటని పోస్టింగ్‌లు రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు, 13 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. పెరిగిన జనాభా, ఆదాయం కారణంగా వీటిలో కొన్నిటిని అప్‌గ్రేడ్ చేయడానికీ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందుకు అనుగుణంగా ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బందిని నియమించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చేతులు దులిపేసుకుంది. రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో మొత్తం 1,851 మంది అధికారులు, సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 479 మందినే నియమించింది. మిగిలిన 1,372 పోస్టులను భర్తీ చేయడంలో మున్సిపల్ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 408 మంది ఉండాలి. అయితే కేవలం 11 మంది మాత్రమే పని చేస్తుండగా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే మిగిలిపోవడంతో రాష్ట్రంలో రియల్టర్లు బరితెగించారు. దాదాపు 18 వేల అక్రమ లే అవుట్లలోని నివేశన స్థలాలను అమ్మేసి, కొనుగోలుదారులను మోసగించారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లో అనధికార లే అవుట్లలోని స్థలాల అమ్మకాలు అధికంగా జరిగాయి. వీటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థలు గుర్తించాయి. వీటిని క్రమ బద్ధీకరిస్తే రూ.250 నుంచి రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రెండుసార్లు గడువు పొడిగించినా సిబ్బంది కొరత కారణంగా ముందుకు సాగడం లేదు. మాస్టర్‌ప్లాన్ తయారీ కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఒక్క రాయలసీమ రీజియన్ మినహా ఇతర రీజియన్లలో మాస్టర్ ప్లాన్ల తయారీ పూర్తికాలేదు. కొత్త ప్రభుత్వం మున్సిపల్‌శాఖలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వివిధ వర్గాలు కోరుతున్నాయి. కాగా సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రాముడు ‘సాక్షి’కి తెలిపారు. -
ఇళ్లు కట్టనీకి ఇన్ని తిప్పలా..!
► భవన నిర్మాణ అనుమతుల జారీలో తీవ్ర జాప్యం.. ► ఆన్లైన్ దరఖాస్తుల విధానం వచ్చినా మారని తీరు ► నెలలో అనుమతులు జారీ చేస్తామన్న ప్రభుత్వం.. ► 3 నుంచి 4 నెలలు పడుతున్న వైనం.. ► టౌన్ ప్లానింగ్ పోస్టులు సగానికి పైగా ఖాళీ.. దరఖాస్తులకు బూజు ఇల్లుగానీ, భవనం గానీ కట్టాలనుకుంటున్నారా.. అయితే నగర, పురపాలక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడానికి సిద్ధమైపోండి. అనుమతులు రావాలంటే ఆ మాత్రం తిప్పలు తప్పేలాలేవు మరి. సిబ్బంది లేక, ఆన్లైన్ సర్వర్ పని చేయక నిర్మాణ దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ఆన్లైన్లో 30 రోజుల్లో అనుమతుల జారీకి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) విధానం ప్రవేశపెట్టినా.. క్షేత్రస్థాయిలో అనుమతులు చేతికందేసరికి 3, 4 నెలలు పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ సిబ్బంది లేక.. వెబ్సైట్ పని చేయక.. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉండటంతో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 నగర, పురపాలక సంస్థల్లో 390 టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లు (టీపీఎస్), టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు (టీపీఓ), టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ (టీపీబీఓ) పోస్టులుండగా.. 183 మందే పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), ప్రాంతీయ టౌన్ ప్లానింగ్, జిల్లా టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ 180 పోస్టులకు 84 ఖాళీగా ఉన్నాయి. దీంతో అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. డీపీఎంఎస్ వెబ్సైట్ సర్వర్ గంటల తరబడి మొరాయిస్తుండటమూ జాప్యానికి మరో కారణమని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. కాగా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది లేని మున్సిపాలిటీల్లో పొరుగు మున్సిపాలిటీల టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వారంలో 3 రోజులు పని చేసేలా సర్కారు సర్దుబాటు చేసింది. పరిష్కరించరు.. అనుమతులివ్వరు.. లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద లే అవుట్ల క్రమబద్ధీకరణకు చేసుకున్న దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలకూ పురపాలికలు అనుమతులివ్వడం లేదు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి రూ.లక్షలు చెల్లించి అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సర్వేయర్ల సమ్మె.. ఆగిన దరఖాస్తులు బిల్డింగ్ ప్లాన్ ఉల్లంఘించి నిర్మాణాలు జరపబోమని ఇంటి యజమాని, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్టీపీ)లు దరఖాస్తుతో పాటు అఫిడవిట్ సమర్పించాలని నెల రోజుల కింద కొత్త నిబంధనను పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. ప్లాన్ ఉల్లంఘించి నిర్మాణం చేస్తే ఎల్టీపీ లైసెన్స్ రద్దు చేసి చర్య లు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఉంది. యజమానుల ఉల్లంఘనలతో తమకు సంబంధం లేదని, సంయుక్త అఫిడవిట్ విధానం రద్దు చేయాలని 20 రోజులుగా ఎల్టీపీలు సమ్మె చేస్తున్నారు. దీంతో కొత్త దరఖాస్తుల నమోదు ఆగింది. శ్రీ 3 నెలలైనా అనుమతి రాలేదు... జగిత్యాలలోని మోచీబజార్‌లో ఇంటి నిర్మాణం చేపట్టాను. అనుమతి కోసం 3 నెలల క్రితం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు అనుమతి పత్రం లేనిదే బ్యాంకు లోను ఇవ్వమంటున్నారు. ఇప్పటికైనా అనుమతి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొప్పు శ్రీధర్, జగిత్యాల శ్రీ అడ్డుగా ఎల్ఆర్ఎస్... కోదాడ మున్సిపాలిటీలో ఇళ్ల అనుమతులకు ఎల్ఆర్ఎస్ అడ్డంకిగా మారింది. రెండు విడతల్లో 2,100 మంది ప్లాట్ల రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ 350 దరఖాస్తులే పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులపై అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశా. కానీ పట్టించుకోవడం లేదు. – పొడుగు హుస్సేన్, కోదాడ -
మీకు భాగం ఇచ్చాం కదా
టౌన్‌ప్లానింగ్ అధికారిని నిలదీసిన సస్పెండ్‌కు గురైన అధికారులు కార్పొరేషన్లో మరోసారి తెరపైకి టౌన్‌ప్లానింగ్ వ్యవహారం నెల్లూరు నగరపాలక సంస్థ ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఒక వివాదం పోతే మరొకటి వెంటనే రంగ ప్రవేశం చేస్తుంది. తాజాగా టౌన్‌ప్లానింగ్‌లో ఓ వ్యవహారం రచ్చకెక్కింది. రెండు నెలల క్రితం సస్పెండ్ అయిన అధికారులకు ఓ అధికారికి చోటుచేసుకున్న వాగ్వాదం కార్పొరేషన్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. నెల్లూరు, సిటీ : కార్పొరేషన్ పరిధిలో 2015 సంవత్సరం డిసెంబరు వరకు నిర్మించిన అక్రమ భవనాలను క్రమబద్ధీకరించేందుకు బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కింద ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే 2016 జనవరి తర్వాత సుమారు 300 అక్రమ నిర్మాణాలు జరిపినట్లు టాఫ్క్ఫోర్స్ బృందం తేల్చింది. ఈ క్రమంలో అక్రమ భవన నిర్మాణాలకు బాధ్యులైన ఏడుగురు టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి తొలగిస్తూ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు ఉత్తర్వులు ఇచ్చారు. ఏం జరిగింది టౌన్‌ప్లానింగ్‌లో ఈ విషయం అంతటితో అయిపోయిందని అనుకున్న తరుణంలో నాలుగురోజుల క్రితం వేటుకు గురైన వారిలో కొందరు టీపీఎస్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అప్పటి టౌన్‌ప్లానింగ్ ఇన్చార్జి అధికారిగా వ్యవహరించిన టీపీఓ సుధాకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అప్పుడు మీకు వాటాలు ఇచ్చాం కదా.. కానీ ఒక్క మెమో కూడా మీకు రాలేదు. ఉన్నతాధికారులతో మీరు లాలూచీ అయినట్లుగా స్పష్టం అవుతోంది. మేం మాత్రమే బలయ్యాం.. మీరు పైస్థాయిలో చక్రం తిప్పి మాకేం సంబంధంలేదని చెప్పడం సరికాదని’ చెప్పారు. ‘నేను కావాలని చేయలేదు.. మంత్రి ఆదేశాలతో జరిగింది’ అని సుధాకర్ వారితో చెప్పారు. ఈలోగా మిగిలిన ఉద్యోగులు సర్దుబాటు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కార్పొరేషన్లో చర్చనీయాశంగా మారింది. ఆ అధికారిపై చర్యలేవీ? అక్రమ భవనాల నిర్మాణాల సమయంలో టౌన్‌ప్లానింగ్ సిటీ ప్లానర్ ఇన్చార్జిగా సుధాకర్ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై ఆయనకు సంబంధం లేనట్టుగా మిగిలిన వారిని సస్పెండ్ చేయడంతో వివాదం రాజుకుంది. సుధాకర్ ఆదేశాల ప్రకారమే తాము భవనాలకు మంజూరు చేయడం జరిగిందని, విధుల నుంచి సస్పెండ్ అయిన వారు చెబుతున్నారు. అయితే ఆయనకు ఒక్క మెమో జారీచేయలేదు. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. -
టౌన్‌ప్లానింగ్‌కు బ్యాండ్ బాజా!
- సెల్టవర్ల ముసుగులో అవినీతి బిజినెస్ - ‘చక్రం’తిప్పిన అధికారి - మున్సిపల్ కమిషనర్‌కు మరో మస్కా - ఏసీబీ తనిఖీలతో టెన్షన్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో బదిలీ అయిన అధికారులకు బాండ్ల ‘బ్యాండ్’ పడింది. బాండ్ల జారీలో జరిగిన కిరికిరిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కి స్పష్టమైన ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. ఈ పరిణామాలతో టౌన్‌ప్లానింగ్ విభాగంలో గతంలో పనిచేసి బదిలీ అయిన ముఖ్య అధికారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అవినీతి డొంక కదిలింది.. ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ బాండ్స్ ఇప్పిస్తామంటూ భారీగా కలెక్షన్లు చేశారు. సెల్టవర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కమిషనర్‌కు మస్కా కొట్టి ఫైల్‌పై సంతకాలు చేయించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల్లోని ముగ్గురు అధికారులు మెగా బిజినెస్ చేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌లోని అధికారులు ఇద్దరు బదిలీ అవుతున్న సందర్భంగా బాండ్లు ఇస్తామంటూ స్థల యజమానుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడ్డారు. వీరి మాయలోపడి లక్షలు సమర్పించుకున్న స్థల యజమానులు న్యాయం చేయాలంటూ మేయర్ కోనేరు శ్రీధర్‌ను ఆశ్రయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రోడ్ల విస్తరణ, నగరపాలక సంస్థ అవసరాల దృష్ట్యా ప్రైవేటు స్థలాలను సేకరిస్తే ఆస్థానే నష్టపరిహారంగా ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్మెంట్ బాండ్లను టౌన్‌ప్లానింగ్ విభాగం జారీ చేస్తుంది. ఇందులో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అర్హులకు బాండ్లు జారీ చేయకుండా, అడ్డదారిలో అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తోంది. బదిలీ అయిన ముఖ్య అధికారి, టీపీఎస్ సర్వం తామై వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. బాండ్ల జారీపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. చక్రం తిప్పారు సెల్టవర్ల ఏర్పాటులో ‘చక్రం’తిప్పిన అధికారి కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 సెల్టవర్ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. నగరపాలక సంస్థకు చెందిన వాటర్ ట్యాంకు స్థలాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు నెలకు రూ.2,300 అద్దె చెల్లిస్తే చాలంటూ ఆర్డరు ఇచ్చేశారు. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ సిటీప్లానర్ (ఏసీపీ) సంతకం ఉండాల్సి ఉన్నప్పటికీ తోసిపుచ్చారు. కమిషనర్‌తో గప్‌చుప్‌గా సంతకం చేయించారు. ప్రైవేటు స్థలంలో కనీసం రూ.10వేల చొప్పున సెల్ టవర్ కంపెనీలు అద్దె చెల్లిస్తున్నాయి. ఈ విషయం మేయర్ చెవిన పడటంతో విచారణ చేపట్టాల్సిందిగా కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కమిషనర్ పాత ఫైల్‌ను తెప్పించి పరిశీలించారు. ఇప్పుడేం చేయాలనే దానిపై కమిషనర్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. టెన్షన్ టెన్షన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో 2013 నుంచి పనిచేసిన అధికారులు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల జాబితాను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇటీవల విడతలవారీగా జరిగిన బదిలీల్లో 95 శాతం మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టీపీఎస్‌లు బదిలీ అయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం వారు విధులు నిర్వర్తిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించినట్లు పత్రికల ద్వారా సమాచారం తెలుసుకున్న వీరిలో కొందరు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్‌లో ఏం జరిగిందనే దానిపై ఆరా తీసే పనిలో వారంతా నిమగ్నమయ్యారు. మొత్తంమీద ఏసీబీ తనిఖీలు టౌన్‌ప్లానింగ్‌లో టెన్షన్ పుట్టించాయి. -
అవినీతి ‘ప్లానింగ్’
చేతులు మారిన రూ.2కోట్ల ప్రజాధనం ఎల్ఆర్ఎస్ ఫీజుల పేరుతో దోపడీ రికార్డులు స్వాధీనం చేసుకున్న చైర్మన్..? పరకాల : నగర పంచాయతీ ఆదాయానికి గుండెకాయలాంటి టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిమయంగా మారిపోరుుంది. ఈ విభాగంలో అక్రమాలు రోజుకో తీరున కొత్తపుంతలు తొక్కుతున్నారుు. ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని వాటాల వారీ గా పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ క్రమంలో రూ.కోట్లలో చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కాస్త బయటపడడంతో సంబంధిత రికార్డులను చైర్మన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరకాల నగర పంచాయతీగా మారి నాలుగేళ్లు అయ్యింది. ఈ సమయంలో పాలకవర్గం లేక పోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. ఇదే సమయంలో ఎక్కువ మంది ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ఇళ్లుకు అనుమతి కోసం ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యూలరిటీ సర్టిఫికెట్) ఫీజు, రీడెవలప్మెంట్ చార్జీలు, బిల్డింగ్ చార్జీలు కలిపి వసూలు చేయడంతోపాటు కొత్త ఇంటి నంబర్‌ను కేటాయించాల్సి ఉంది. అరుుతే కొత్తగా నిర్మించిన ఇళ్లకు ఫీజులు యధావిధిగా వసూలు చేసి పాత ఇంటి నంబర్లే కేటాయించినట్లు పలువురు బాధితులు తెలిపారు. కొన్ని చోట్ల ఫీజులు చెల్లించినా ఇంటి నంబర్ కేటాయించకుండా అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ రికార్డుల్లో రాశాని కొందరు తెలిపారు. ఇలా ఒక్కో ఇంటి అనుమతి కోసం రూ.60వేల నుంచి రూ.1లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన అక్రమ నిర్మాణాలుగా 2వేలకు పైగా ఉన్నట్లు గుర్తిం చారు. ఫీజుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని నగర పంచాయతీ ఖాతాలో జమచేయలేదు. ఫీజు చెల్లించినట్లు రశీదులున్న నిర్మాణాల పేర్లు అక్రమ జాబితాలోనే ఉండడం గమనార్హం. అక్రమాల విషయం బయటకు పొక్కడంతో రికార్డులు స్వాధీనం చేసుకున్న చైర్మన్ సంబంధిత విభాగానికి చెందిన అధికారులను సైతం తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు నగర పంచాయతీలో చర్చజరుగుతోంది. ఆరోపణలపై విచారణ చేస్తున్నాం : చైర్మన్ ఈ విషయంపై చైర్మన్ మార్త రాజభద్రయ్య వి వరణ కోరగా టౌన్ ప్లానింగ్ రికార్డులను స్వా దీనం చేసుకోలేదన్నారు. అవినీతి ఆరోపణపై విచారణ చేస్తున్నామని చెప్పారు. చాలా మం ది ఫీజులు చెల్లించినా అక్రమ నిర్మాణాల కిం దనే ఇళ్లు ఉన్నాయన్నారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, బాధితులు ఉంటే నేరుగా సంప్రదించాలని కోరారు. అధికారులు డబ్బులు చెల్లించినా ఇంటి నంబర్ కేటారుుంచకపోతే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
‘ఈ-టౌన్ ప్లానింగ్’కు కసరత్తు
* రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి * రూపకల్పనలో కొత్త సాఫ్ట్వేర్ * ఇకపై ఆన్లైన్లోనే దరఖాస్తుల పరిశీలన సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే ‘ఈ-ఆఫీస్’ అమల్లోకి రాగా.. తాజాగా టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించేందుకు కసరత్తు జరుగుతోంది. భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు సైతం ఆన్లైన్లోనే పరిశీలించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ-ఆఫీస్‌తో అనుసంధానం చేసి ‘ఈ-టౌన్ ప్లానింగ్’ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీకి వచ్చే అన్ని దరఖాస్తులను స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారానే సంబంధిత అధికారులకు పంపుతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో భవనాల అనుమతుల దరఖాస్తుల పరిశీలన సమయంలో నిర్మించబోయే భవనం ఎత్తు, రహదారి వెడల్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత విస్తీర్ణంలో.. ఎన్ని అంతస్తుల భవనానికి ఎన్ని అడుగుల సెట్‌బ్యాక్ వదలాలి వంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు. ఈ-ఆఫీస్ అమల్లోకి వచ్చినా.. ప్లాన్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ పరిశీలన తప్పనిసరి. ఈ పరిశీలన (స్క్రూటిని) సైతం ఆటోమేటిగ్గా జరిగేందుకు సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. ఉదాహరణకు 200-300 చ.మీ.లలో నిర్మించే 12 మీటర్ల లోపు భవనాలకు ముందువైపు రెండడుగులు.. మిగతా మూడు వైపులా ఒకటిన్నర అడుగు సెట్‌బ్యాక్‌గా వదలాల్సి ఉంటుంది. స్థల విస్తీర్ణం.. అంతస్తులు.. తదితర అంశాలను ఇకపై కొత్త సాఫ్ట్వేర్ పరిగణనలోకి తీసుకొని నిర్మించబోయే భవనానికి ఎటు వైపు ఎన్ని అడుగుల సెట్‌బ్యాక్ వదలాలో సూచిస్తుంది. నిబంధనల మేరకు ప్లాన్ ఉందో లేదో దరఖాస్తు స్కానింగ్ సమయంలోనే తెలుస్తుంది. ఈ-ఆఫీస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇప్పటికే 3,314 ఫైళ్లు, సెంట్రల్‌జోన్‌లో 1,215 ఫైళ్లు, నార్త్‌జోన్‌లో 735, ఈస్ట్‌జోన్‌లో 191 ఫైళ్లు స్వీకరించినట్లు సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని కార్యాలయాల్లో వెరసి పది లక్షలకుపైగా పేజీలు స్కాన్ చేసినట్టు చెప్పారు. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే ఈ-ఆఫీస్‌తో అనుసంధానం చేయడం ద్వారా టౌన్‌ప్లానింగ్ ఫైళ్లు మరింత త్వరగా పరిష్కారం కాగలవన్నారు. -
అనుమతులన్నీ ఆన్లైన్లోనే...
5 నుంచి అమలుకు జీహెచ్ఎంసీ సిద్ధం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లోనూ కాగితపు రహిత(పేపర్‌లెస్) విధానాన్ని..‘ఈ-ఆఫీస్’ (ఆన్లైన్ ద్వారానే అన్ని ఫైళ్లు)ను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత టౌన్‌ప్లానింగ్ విభాగంలో అమలు చేయనున్నారు. భవన నిర్మాణాలు పూర్తయ్యాక జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్‌ను ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేయనున్నారు. ఈ నెల 5 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించేందుకుఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇదంతా కాగి తాల ద్వారా సాగేది. భవన నిర్మాణాలు పూర్తయిన యజమానులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం తమ దరఖాస్తులు, అవసరమైన పత్రాలు, ఫొటోలను ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆన్లైన్ ద్వారానే జారీ చే స్తారు. సంబంధిత అధికారి డిజి టల్ సంతకంతో కూడిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ విధానం ద్వారా ప్రజలు తమ ఫైల్ ఏ సమయంలో.. ఎవరి వద్ద ఉందో ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. తొలుత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేసి...క్రమంగా భవన నిర్మాణ అనుమతులు సహా అన్ని అంశాలనూ ఆన్‌లైన్‌తో ముడిపెట్టనున్నారు. దీనికోసం ఎన్ఐసీ నుంచి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు. దరఖాస్తు దారులు ఇకపై జీహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత ఫారంలో వివరాలు నమోదు చేసి, ఫీజును ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ల ద్వారా చెల్లిం చవచ్చు. ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునేవారికి ఎంతో సమయం కలిసి వస్తుంది. జీహెచ్ ఎంసీలోని అన్ని విభాగాల్లోనూ ఈ-ఆఫీస్ అమలుకు అవసరమైన సాఫ్ట్వేర్లు తీసుకోవడం.. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల్లో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్సు, జనన మరణ ధ్రువీకరణ తదితర అన్ని విభాగాల్లోనూ ఆన్లైన్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోనే ఏ కార్పొరేషన్లో లేని విధంగా అన్ని పనులనూ ఆన్లైన్ ద్వారా చేసేం దుకు సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ అందుకు తగిన విధంగా సిద్ధమవుతోంది.