చేతులు మారిన రూ.2కోట్ల ప్రజాధనం
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల పేరుతో దోపడీ
రికార్డులు స్వాధీనం చేసుకున్న చైర్మన్..?
పరకాల : నగర పంచాయతీ ఆదాయానికి గుండెకాయలాంటి టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిమయంగా మారిపోరుుంది. ఈ విభాగంలో అక్రమాలు రోజుకో తీరున కొత్తపుంతలు తొక్కుతున్నారుు. ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని వాటాల వారీ గా పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ క్రమంలో రూ.కోట్లలో చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కాస్త బయటపడడంతో సంబంధిత రికార్డులను చైర్మన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పరకాల నగర పంచాయతీగా మారి నాలుగేళ్లు అయ్యింది. ఈ సమయంలో పాలకవర్గం లేక పోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. ఇదే సమయంలో ఎక్కువ మంది ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ఇళ్లుకు అనుమతి కోసం ఎల్‌ఆర్‌ఎస్(ల్యాండ్ రెగ్యూలరిటీ సర్టిఫికెట్) ఫీజు, రీడెవలప్‌మెంట్ చార్జీలు, బిల్డింగ్ చార్జీలు కలిపి వసూలు చేయడంతోపాటు కొత్త ఇంటి నంబర్‌ను కేటాయించాల్సి ఉంది. అరుుతే కొత్తగా నిర్మించిన ఇళ్లకు ఫీజులు యధావిధిగా వసూలు చేసి పాత ఇంటి నంబర్లే కేటాయించినట్లు పలువురు బాధితులు తెలిపారు. కొన్ని చోట్ల ఫీజులు చెల్లించినా ఇంటి నంబర్ కేటాయించకుండా అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ రికార్డుల్లో రాశాని కొందరు తెలిపారు. ఇలా ఒక్కో ఇంటి అనుమతి కోసం రూ.60వేల నుంచి రూ.1లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన అక్రమ నిర్మాణాలుగా 2వేలకు పైగా ఉన్నట్లు గుర్తిం చారు. ఫీజుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని నగర పంచాయతీ ఖాతాలో జమచేయలేదు. ఫీజు చెల్లించినట్లు రశీదులున్న నిర్మాణాల పేర్లు అక్రమ జాబితాలోనే ఉండడం గమనార్హం. అక్రమాల విషయం బయటకు పొక్కడంతో రికార్డులు స్వాధీనం చేసుకున్న చైర్మన్ సంబంధిత విభాగానికి చెందిన అధికారులను సైతం తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు నగర పంచాయతీలో చర్చజరుగుతోంది.
ఆరోపణలపై విచారణ
చేస్తున్నాం : చైర్మన్
ఈ విషయంపై చైర్మన్ మార్త రాజభద్రయ్య వి వరణ కోరగా టౌన్ ప్లానింగ్ రికార్డులను స్వా దీనం చేసుకోలేదన్నారు. అవినీతి ఆరోపణపై విచారణ చేస్తున్నామని చెప్పారు. చాలా మం ది ఫీజులు చెల్లించినా అక్రమ నిర్మాణాల కిం దనే ఇళ్లు ఉన్నాయన్నారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, బాధితులు ఉంటే నేరుగా సంప్రదించాలని కోరారు. అధికారులు డబ్బులు చెల్లించినా ఇంటి నంబర్ కేటారుుంచకపోతే ఫిర్యాదు చేయాలని సూచించారు.
అవినీతి ‘ప్లానింగ్’
Published Sun, Feb 22 2015 2:18 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement