‘పీపుల్స్ ఆపరేషన్ పార్టీ’ పేరిట లేఖ
నిజామాబాద్ క్రైం: ‘మానవ జీవితంలో మనిషి విలువలను మరచిపోయి, డబ్బు పిచ్చితో మృగంగా మారుతున్నాడు... బీద, ధనిక, ఆడ, మగ తేడా లేకుండా మనిషి విలువలు, బాధ్యతలు మరచిపోయి స్వలాభం కోసం.. ధనదాహంతో అవినీతి, లంచగొండితనం, అన్యాయం, అత్యాచారాలు, జీవన విధానంలో ముఖ్య భాగంగా ఎంచుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఇక ఖబడ్దార్... ఇలాంటి ద్రోహల భరతం పట్టేందుకు ‘పీపుల్స్ ఆపరేషన్ పార్టీ’ (పీవోపీ)ని ఏర్పాటు చేశాం’ అంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గణపతి పేరిట ఒక ప్రకటనలో పలువురిని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి గణపతి పేరిట ఏడు పేజీల సుదీర్ఘ లేఖ జిల్లా కేంద్రంలోని పత్రికా కార్యాలయాలకు అందింది. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారుల అవినీతి, లంచగొండి తనం, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలపై విమర్శలు చేశారు. సుదీర్ఘ ప్రకటనలో పేర్లు చేర్చకుండా పలు రంగాలకు చెందిన వారిని హెచ్చరించారు. లంచగొండితనం, అవినీతి, అత్యాచారాలకు పాల్పడే వారు తమ చేతిలో శిక్షార్హులని, అలాంటి వారిని హతమార్చడానికి పీపుల్స్ ఆపరేషన్ పార్టీ వెనకాడబోదని పేర్కొన్నారు. కాగా, హఠాత్తుగా పీపుల్స్ ఆపరేషన్ పార్టీ పేరిట పలువురిని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల కాగా.. గణపతి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ ‘గణపతి’!
Published Mon, Aug 15 2016 2:57 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement