
మంచు స్పటిక శివలింగాన్ని దర్శించుకున్న 13 వేల మంది
శ్రీనగర్: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్‌నాథ్ యాత్ర మొదలైంది. మొదటి రోజైన శనివారం అమర్‌నాథ్ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
యాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం సాయంత్రం జమ్మూలోని భగవతి నగర్ నుంచి బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపులకు 4,603 మంది యాత్రికులు చేరుకోవడం తెల్సిందే. శనివారం ఉదయం వీరు బేస్ క్యాంపుల నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు.
అనంత్‌నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్– పహల్గాం సంప్రదాయ మార్గం ఒకటి కాగా, గండేర్‌బల్‌లోని ఇరుకైన 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం మరోటి. ఈ రెండు మార్గాల గుండా సాగే యాత్రను సీనియర్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నానికల్లా యాత్రికులు కశ్మీర్ లోయకు చేరుకున్నారు. అక్కడ వీరికి అధికారులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment