devotes
-
పవన్ గాలి మళ్లిందా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరలేపిన కొత్త డ్రామా ఆసక్తికరంగా ఉంది. దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శన పేరుతో ఆయన చేస్తున్న యాత్ర భక్తితో చేస్తున్నదా?లేక రాజకీయ ఉద్దేశాలతోనా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ యాత్ర సాగుతోందా? లేక చంద్రబాబు ముందు తన ప్రాధాన్యతను నిరూపించుకునేందుకు ఆయన చేస్తున్నారా? అని కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలియకుండా పవన్ ఈ యాత్ర చేపట్టడం... ఆయన ఫోన్లకూ స్పందించకపోవడం కచ్చితంగా గమనించదగ్గ అంశాలే. పవన్ బాబుల మధ్య భేటీ జరిగి ఇరవై రోజులవుతోందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. తనకు ఎదురైన అవమానాన్ని, అసమ్మతిని వ్యక్తం చేసేందుకే పవన్ మౌనవ్రతం చేపట్టారా? అన్న అభిప్రాయమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు.తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్ తాను, చంద్రబాబు సమానమే అన్న చందంగా ప్రవర్తించడం టీడీపీకి నచ్చలేదు. ఎల్లో మీడియాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కథనాలు రావడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో పవన్ ఆయా సందర్భాల్లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం కూడా జనసేనకు అంతగా రుచించలేదు. పవన్ కళ్యాణ్ మరీ అంతగా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదన్నది జనసేన కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. అంతేకాకుండా.. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశం టీడీపీ నుంచి వ్యక్తం కావడం... దాంతో తమ నేతకు ప్రాధాన్యం తగ్గిపోతుందని, భవిష్యత్తులో లోకేషే ముఖ్యమంత్రి అయితే పవన్ ఎన్నటికీ ఆ స్థానానికి ఎదగలేడని వీరు ఆందోళన చెందారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా యుద్ధమూ సాగింది. పవన్ అన్న అయిన నాగబాబును మంత్రిని చేయబోతున్నట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నట్లు లేరు. ఇది కూడా మిస్టరీగానే ఉంది.అయితే... తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ అపచారానికి పాల్పడ్డారనడంలో సందేహం లేదు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతుకొవ్వు కలిసిందన్న చంద్రబాబు మాటను పవన్ గుడ్డిగా నమ్మి అదే అబద్ధాన్ని చెప్పడం ద్వారా తప్పులో కాలేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, మంత్రి లోకేష్‌లు అసలు పవన్ కళ్యాణ్ ఎవరన్నట్టుగా వ్యవహరించారు. తొక్కిసలాటకు బాధ్యత వహించి టీటీడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న పవన్ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో పవన్ పరువు పోయినట్లయింది. ఆ తర్వాత చంద్రబాబు మంత్రులకు ప్రకటించిన ర్యాంకుల్లో పవన్‌కు పదో స్థానం దక్కడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడ్డ ప్రాతిపదికన ర్యాంకులిచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే పవన్ అప్పటికే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరైన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ నిజంగానే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమోలే, అందుకే రాలేదేమోలే అని పలువురు అనుకున్నారు. కానీ చంద్రబాబు కీలకంగా పరిగణించిన ప్రభుత్వ కార్యదర్శుల, మంత్రుల సమావేశానికి కూడా పవన్ రాకపోవడంతో వీరిద్దిరి మధ్య ఏదో గొడవ జరుగుతోందన్న చర్చ మొదలైంది.ఆ సమావేశంలోనే చంద్రబాబు డిప్యూటీ సీఎం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆరా తీయగా నడుంనొప్పి వల్ల రాలేకపోయారన్న సమాధానం వచ్చింది. తాను పోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదని చంద్రబాబు అనడం, ఆ విషయం తెలుగుదేశం పత్రిక ఈనాడులోనే రావడం సంచలనమైంది. టీడీపీ వర్గాలే ఈ సమాచారాన్ని ఎల్లో మీడియాలో వచ్చేలా చేశారా అన్న సందేహమూ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ సీఎంతో పద్ధతిగా వ్యవహరించలేదన్న సంగతి ప్రజలకు చెప్పాలని అనుకుని ఉండవచ్చు. దానివల్ల భవిష్యత్తులో పవన్ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకున్నా, తప్పు ఆయన వైపే ఉండేలా చేయడం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్లే చంద్రబాబు కార్యదర్శుల సమావేశంలో ఫైళ్ల అంశాన్ని ప్రస్తావించి, పైళ్ల పరిష్కారానికి ఆరు నెలలు, ఏడాదా అని ప్రశ్నించారు. నిజానికి ఫైళ్లు కేవలం కార్యదర్శులు మాత్రమే క్లియర్ చేస్తే సరిపోదని, మంత్రులు, సీఎం కూడా ఆమోదించాలని చంద్రబాబుకు తెలియంది కాదు. పవన్‌ను ఇరుకున పెట్టడానికి మాత్రమే ఈ సంగతిని ప్రస్తావించారు.గత నెల రోజులుగా పవన్ కళ్యాణ్ పేషీలో వందల కొద్ది ఫైళ్లు పేరుకుపోయాయని చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఫైళ్లు ఎప్పుడూ పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే సొంత శాఖలో ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఇతర శాఖలలో జోక్యం చేసుకోవడాన్ని టీడీపీ తెలివిగా వాడుకుంది. దీనిని టీడీపీ ఎక్స్ పోజ్ చేసిందని చెప్పాలి. జనసేన కు చెందిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్‌కు, కందుల దుర్గేష్‌కు మంచి ర్యాంకులు ఇచ్చి, పవన్ కళ్యాణ్‌ను పదో ర్యాంకుకు పడవేయడం ద్వారా టీడీపీ ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేసినట్లయింది. అంతకు ముందు హోం శాఖ, టూరిజం, సివిల్ సప్లయిస్ మొదలైన శాఖలలో వేలు పెట్టిన పవన్ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయిన విషయాన్ని, సీజ్ ద షిప్ ఘటనలో ప్రభుత్వ అసమర్థతను టీటీడీ యాజమాన్యం చేతకానీతనాన్ని ఆయన తనకు తెలియకుండానే బయట పెట్టేశారు. మరో వైపు మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తూ ఢిఫ్యాక్టో సీఎంగా ఉన్నారన్న భావన ఉంది. ఇది కూడా పవన్ కు నచ్చడం లేదు. తన పేషీలో అధికారులను కూడా లోకేష్ నియమించారని ఆయన ఆగ్రహం చెందినట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం పోలీసు శాఖ మొత్తం లోకేష్ చెప్పినట్లే వింటోందన్న భావన ఏపీ అంతటా ఉంది. ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా పిఠాపురంలో పోలీసుల పనితీరును, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయని పవన్ తప్పుపట్టారు. లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కూడా ఏపీలో గందరగోళం సృష్టిస్తోంది. లోకేష్ శైలిపై పవన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఇవన్ని ఒక ఎత్తయితే చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికపై నోరు విప్పలేని పరిస్థితి పవన్‌కు ఏర్పడింది. అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఏమి చేయాలో తోచక ఈ తీర్థయాత్ర పెట్టుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.అయితే సీఎంకు చెప్పకపోవడం, ఫోన్‌కు కూడా స్పందించకపోవడంతో పాత ఘటనలన్నిటికి ప్రాధాన్యత ఏర్పడింది. నడుం నొప్పి నిజంగానే అంత తీవ్రంగా ఉండి ఉంటే, కేరళ పర్యటనలో ఎక్కడా అలసట లేకుండా తిరుగుతారా అన్న డౌటు వస్తుంది. ఈ పరిణామాలతో ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేనల మధ్య ఏదో జరిగిపోతుందని చెప్పలేం .చంద్రబాబు, పవన్ ల మధ్య ఉప్పు, నిప్పులా పరిస్థితి మారిందని అనలేం. కాకపోతే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా నడుస్తోంది వెల్లడైంది. పవన్ ప్రస్తుతం పవర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో కొంతకాలం అలిగి, తనకు కావల్సినవి సాధించుకోవడానికి ఏమైనా ఇలా చేస్తుండవచ్చు.మరో వైపు బీజేపీ పవన్ కళ్యాణ్‌ను దక్షిణాది రాష్ట్రాలలో తిప్పి, రాజకీయ ప్రయోజనాల కోసం యత్నిస్తుందా అన్న సందేహం కూడా చాలామందిలో ఉంది. భవిష్యత్తులో దక్షిణాదిలో బీజేపీ ఎదగడానికి ఇలాంటి సినీ నటులు కొందరిని వాడుకుంటే వాడుకోవచ్చని చెబుతున్నారు. కేరళలో ఇప్పటికే ప్రముఖ నటుడు గోపికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఏపీలో పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తమవైపు ఉన్నట్లు చూపించే యత్నం చేస్తోంది. ఇవన్ని కూడా రాజకీయాలలో కీలకమైన అంశాలే అవుతాయి. పవన్ కళ్యాణ్‌కు భక్తి విశ్వాసాల మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఒకసారి క్రైస్తవ మతానికి, మరోసారి ముస్లిం మతానికి అనుకూలంగా మాట్లాడడం, తన కుటుంబంలోనే తన పిల్లలే క్రైస్తవం తీసుకోవడం వంటి అంశాలు ఆయనపై విమర్శలకు దారి తీస్తుంటాయి. అధికారం వచ్చాక తిరుమల లడ్డూ ఘటన సమయంలో సనాతని వేషం కట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు మామూలుగానే కనిపించినా, దక్షిణాది తీర్థయాత్రలో మళ్లీ సనాతని వేషంలోకి రావడం అంతా నాటకీయంగా ఉంది.తన కుమారుడు అఖిరా నందన్‌ను ప్రమోట్ చేయడానికి కూడా ఈ యాత్రను ఆయన వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.రాజకీయంగా అయినా, భక్తిపరంగా అయినా ఆయన చిత్తశుద్దితో చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రతిదానిని డ్రామా చేస్తూ పబ్బం గడుపుకుంటూ పోతే మాత్రం పవన్ కళ్యాణ్ కే నష్టం జరగవచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, 24మందికి గాయాలు
తిరువనంతపురం : కేరళలో విషాదం చోటు చేసుకుంది. పటాకుల శబ్ధానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తుల్ని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలో కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు రెండు ఏనుగుల్ని తీసుకువచ్చారు.ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ రెండు ఏనుగులు బెదిరిపోయాయి. భక్తుల్ని తొక్కుకుంటూ, దాడులు చేస్తూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా.. 24 మంది గాయపడ్డారు. ‘ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా, పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది’ అని కౌన్సిలర్ చెప్పారు.దేవాలయంలో దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు ఏనుగుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది. కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్ జమీలా మీడియాతో మాట్లాడుతూ.. క్రాకర్ల శబ్ధానికి ఏనుగులు బెదిరిపోయాయి. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరిగింది. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించాము’ అని అన్నారు. -
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) వెళుతున్నారా? అయితే జాగ్రత్త. కుంభమేళా ముగింపు తేదీ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫ్రిక్ జామ్ (world's biggest traffic jam) ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమ్ (గంగ, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద పవిత్ర స్నానమాచరించేందుకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. రోజుల సమయం పట్టనున్నడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమ్ రైల్వే స్టేషన్‌ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు.प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है? प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025 ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ సర్కార్‌పై సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి,దాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులను మనవత్వంతో చూడాలి. సామాన్య భక్తులు మనుషులే కదా? వారికి కనీస సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నలు సంధించారు. అంతకుముందు కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్‌లో ట్రాఫిక్ పరిస్థితి గురించి హైలైట్ చేస్తూ.. భక్తుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్‌లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు,వారణాసి మార్గంలో 12 నుండి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ వల్ల జనజీవనం స్తంభించింది.అందుకే ఉత్తర ప్రదేశ్‌లో వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి విముక్తి కల్పించాలి. తద్వారా ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌ను తగ్గించవచ్చు. సినిమాల్లా వినోదానికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌ను వసూలు చేయనప్పుడు, వాహనాలకు టోల్ ఫ్రీ ఎందుకు చేయలేరు? అని పునరుద్ఘాటించారు. -
TTD: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?
తిరుపతి: తిరుమలలో (ttd) శ్రీవారి భక్తుల రద్ది తగ్గింది. ఆదివారం స్వామివారిని 66,561 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,647 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.98 కోట్లను భక్తులు కానుకలుగా సమర్పిచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంటులో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి సుమారు 9 గంటల సమయం పట్టనుంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి ఒక కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 4 గంటల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపు (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (koil alwar thirumanjanam) జరగనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ ఆలయం శుద్ది చెయనుంది. రేపు మద్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేసిన ఆలయ అధికారులు మద్యాహ్నం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే?అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో అత్యంత పవిత్ర కైంకర్యమే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అంటే...తమిళంలో కోయిల్ అంటే కోవెల (గుడి) అని, ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. భక్తుని హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నట్టే కోవెలలో భగవంతుడు కొలువై ఉంటాడు. పవిత్ర గర్భాలయ స్థానాన్ని సంప్రదాయ, వైఖానస ఆగమోక్తంగా శుద్ధి చేసే కైంకర్యమే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం.మహాయజ్ఞం .. తిరుమంజనంక్రీ.శ.1535 నాటికి ఏడాదిలో పది దాకా బ్రహ్మోత్సవాలు జరిగేవట. ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది పర్వదినమైన ఉగాది, ఆణివార ఆస్థానం (జూలై), శ్రీవారి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆనందనిలయం నుంచి ఆలయమహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సునుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే ‘మలైగుడారం’ అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు.ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద.. పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం/ గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.ఆలయ ప్రాకారాలకు లేపనంనామంకోపు (సుద్దపొడి), శ్రీచూర్ణం, ముద్దకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి ఔషధ పదార్థాలతో లేహ్యంగా తయారుచేస్తారు. తిరుమంజనానికి ముందురోజే భారీ గంగాళాల్లో సిద్ధం చేస్తారు. ఈ లేహ్యాన్ని శుద్ధి చేసిన ప్రాకారాలకు లేపనం చేస్తారు. దీనివల్ల ప్రాకారాలు సుగంధ పరిమళాలు వెదజల్లటంతోపాటు ప్రాకారం పటిష్టతకు దోహద పడతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా సంవత్సరంలొ నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉగాది, ఆణివార ఆస్ధానం, బ్రహ్మొత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేయబడినది. -
అమర్నాథ్ యాత్ర ప్రారంభం
శ్రీనగర్: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్నాథ్ యాత్ర మొదలైంది. మొదటి రోజైన శనివారం అమర్నాథ్ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం సాయంత్రం జమ్మూలోని భగవతి నగర్ నుంచి బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపులకు 4,603 మంది యాత్రికులు చేరుకోవడం తెల్సిందే. శనివారం ఉదయం వీరు బేస్ క్యాంపుల నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. అనంత్‌నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్– పహల్గాం సంప్రదాయ మార్గం ఒకటి కాగా, గండేర్బల్లోని ఇరుకైన 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం మరోటి. ఈ రెండు మార్గాల గుండా సాగే యాత్రను సీనియర్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నానికల్లా యాత్రికులు కశ్మీర్ లోయకు చేరుకున్నారు. అక్కడ వీరికి అధికారులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. -
గంగా నదిలో స్నానానికి పోటెత్తిన జనం!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధార్మిక నగరమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండే వివిధ గంగా ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. మకర సంక్రాంతి వేళ గంగాస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితోపాటు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. అందుకే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం విశేషమైనదిగా భావిస్తారు. పురాణాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తరాయణ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పర్వదినాన మరణించిన వారికి మరుజన్మ ఉండదని చెబుతారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినంతనే ఉత్తరాయణ పర్వదినం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు పేర్లతో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మకర సంక్రాంతిగా, కొన్నిచోట్ల పొంగల్‌గా, మరికొన్ని చోట్ల ఉత్తరాయణ పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాయణంలో పూర్వీకులకు పిండప్రదానం చేస్తే, వారు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతారు. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
శ్రీశైల క్షేత్రానికి భారీగా వెళుతున్న భక్తులు
-
భక్తులతో కిటకిట లాడుతున్న శ్రీ కృష్ణ ఆలయాలు
-
కొట్టకుండానే మోగుతున్న గంట..
భోపాల్ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడంలో జూన్ 8 నుంచి దేవాలయాలు ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రార్థనాలయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్లో గల ప్రముఖ ప్రజాపతి ఆలయంలో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. గుడిలో గంటను ముట్టుకోవడం ద్వారా భక్తులకు వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావించారు. దీంతో గంట కొట్టకుండానే మోగేలా ఏర్పాట్లు చేశారు. వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా.. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి చూపించారు. భక్తులు గంట దగ్గరకు వెళ్లగానే సెన్సార్ల సహాయంతో మోగేలా బెల్‌ను రూపొందించారు. దీనికి స్థానిక ముస్లిం వ్యక్తి తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బెల్‌ను ఆవిష్కరించారు. (సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు) దీనిపై ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ‘గుడిలోకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భౌతిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తున్నాం. దానిలో భాగంగానే గంటను ఒకరుతాకిన తరువాత మరోకరు తాకడం మూలంగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందే గుర్తించాం. దానికి కూడా స్థానిక వ్యక్తి సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెన్సార్లను ఏర్పాటు చేశాం. భక్తులు గంట దగ్గర వచ్చి నిల్చుంటే చాలు దానంతట అదే మోగుతుంది.’ అని వివరించారు. ఇక ఆలయ అధికారులు వినూత్న ఆలోచనలకు ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్ కేసులు) -
విషాదం.. పదిమంది అయ్యప్ప భక్తుల మృతి
-
విషాదం.. పదిమంది అయ్యప్ప భక్తుల మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో పదిమంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం పాలైయ్యారు. మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులతో వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 16మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. మృతులు మెదక్ జిల్లా నర్సాపురం మండలానికి చెందిన నాగరాజు, మహేష్, శ్యామ్, కుమార్, ప్రవీణ్, కృష్ణసాయి, ఆంజనేయులు, సురేష్ ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి మృతదేహాలను స్వస్థలంకు పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంత్రి.. తమిళనాడు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. హరీష్‌రావు సంతాపం.. తమిళనాడు జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పుదుకొట్టై జిల్లా కలెక్టర్ గణేష్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. మృతదేహాలను వారి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరగటం దురదృష్టకరమని, వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేశారు. -
అన్నవరంలో భక్తుల అష్టకష్టాలు
-
కొండంతా జనం
మల్లాపూర్: మండల కేంద్రంలోని సోమేశ్వర కొండ భక్తజన సంద్రమైంది. శ్రావణ సోమవారం కావడంతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలనుంచి వేలాదిమంది తరలివచ్చారు. మొదటగా కోనేరులో పుణ్యస్నానం ఆచరించి మడి బట్టలతోనే శ్రీకనకసోమేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన వరద పాశంను వండి నైవేద్యంగా సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్పంచ్ గోపిడి రాజరెడ్డి, ఎంపీటీసీలు మొరపు గంగరాజం, డబ్బా రాజురాజరెడ్డి, గ్రామాభివద్ధి కమిటీ అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణగౌడ్ స్వామి వారికి వరద పాశం సమర్పించారు. బీజేపీ శాసనసభపక్ష మాజీనాయకుడు యెండల లక్ష్మీనారాయణ సోమేశ్వర కొండపైకి వచ్చి శ్రీ కనకసోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు బల్యపెల్లి ప్రభాకర్‌శర్మ, కష్ణప్రసాద్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. -
వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ : వేములవాడ రాజన్నను సోమవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు రావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడి దర్శనం నిలిపివేశారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కోడె మొక్కులు చెల్లించున్నారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్‌లు పరిశీలించారు. ఎస్సై సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పుష్కరాలకు లోటు లేకుండా బస్సులు
తిరుపతి అర్బన్: కృష్ణ పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తని విధంగా బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. పుష్కరాల స్పెషల్ బస్సును శుక్రవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి డిపో గ్యారేజీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాలకు 12 రోజుల పాటు 420 బస్సులను నడిపితే, ఈసారి కృష్ణ పుష్కరాలకు 500కు పైగా బస్సులను నడపాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా పుష్కర యాత్రికులకు సేవ చేయడమే ప్రధాన ధ్యేయంగా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి రోజుకు 40 నుంచి 50 బస్సుల వరకు పుష్కరాలకు నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా యాత్రికులు గ్రూప్‌గా వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చంద్రశేఖర్, డిపో మేనేజర్ విశ్వనాథ్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ పీఆర్వో కృష్ణారెడ్డి, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు. -
8 గంటల్లో శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 42,934 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 15 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 8 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.3.14 కోట్లు లభించాయి. శ్రీవారి ట్రస్టులకు రూ.18 లక్షల విరాళం తిరుమల శ్రీవారి ట్రస్టులకు శుక్రవారం రూ.18 లక్షలు విరాళంగా అందింది. ఇందులో నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 లక్షలు, వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.5 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.లక్ష, సిమ్స్ ట్రస్టుకు రూ.10 లక్షలు ఇచ్చారు. భక్తులు డీడీలు స్థానిక దాతల విభాగంలో అధికారులకు అందజేశారు. -
అంత్యపుష్కరాలు ఆరంభం
భరత భూమి వేద భూమి, కర్మ భూమి. ఇక్కడ జనం సృష్టికర్తపై విశ్వాసముంచుతారు. పాపపుణాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాలలో స్నానమాచరించి పునీతులవుతారు. పుష్కరాలు పూర్తి అయిన ఏడాదికి అంత్య పుష్కరాలు వస్తాయి. పుష్కరాలలో భక్తులు పవిత్ర గోదావరిలో మునిగి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మల శాంతి కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. వేద పండితులు గోదారమ్మకు మంగళహారతులు ఇస్తారు. రైతు పొలంలో జీవమై నిలచే జలం... సామాన్యుడి దాహం తీర్చే ‘అమృతం’ వరం జలం... పురాణాల్లో, ఇతిహాసాల్లో నదులను దేవతలుగా కీర్తించారు. దేశవ్యాప్తంగా గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాల్లో కోట్లాది భక్త జనం భక్తిప్రపత్తులతో పాల్గొంటారు. చెన్నూర్‌లో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కాశీ అంతటి ప్రాశస్త్యం గల పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో భక్తులు భక్తి భావంతో స్నానమాచరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. నియోజకవర్గంలోని మండలాలైన కోటపల్లి, జైపూర్, మందమర్రి పట్టణాల నుంచి భక్తులు వచ్చారు. ఉదయం 5 గంటల నుంచే నదీతీరానికి చేరుకొని పూజలు చేశారు. పుష్కరఘాట్ వద్ద అధికారులు ఏర్పాట్లను చేశారు. తొలి రోజు వేలాది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. పూజారులు భక్తులచే వారి పూర్వీకులకు పిండప్రదానం చేయించారు. మొదటి రోజు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పుష్కర స్నానం ఆచరించారు. – చెన్నూర్ -
భక్తిశ్రద్ధలతో బోనాలు
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో ఆదివారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. మున్సిపాలిటీలోని 14, 15 వార్డుల పరిధిలో ఉన్న అంబేద్కర్ రడగంబాలబస్తీలో మహా బోనాల జాతరలో మహిళలు, మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి బో నమెత్తుకొని పోచమ్మ దేవాలయం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లంగా చూడాలని గ్రామ దేవతను వేడుకున్నారు. తదనంతరం కోళ్లు, మేకలను బలిచ్చారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో.. పట్టణంలోని కన్నాలబస్తీ రైల్వేఫై ్లఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, బెల్లంపల్లిబస్తీ మీదుగా పోశమ్మ గడ్డ వరకు మహిళలు బోనాలతో ప్రదర్శన సాగించారు. పోచమ్మ దేవాలయానికి చేరుకుని మహిళలు పూజలు నిర్వహించారు. అక్కడనే వంటవార్పు చేసుకొని విందు భోజనాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు పిట్టల రాజమల్లు, మహిళలు, కుల పెద్దలు , యువకులు పాల్గొన్నారు. కాసిపేట : మండలంలోని సోమగూడెంలో ఆదివారం భక్తులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలివెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వీధి వీధిన కలిసికట్టుగా నిర్వహించడంతో గ్రామంలో పండగా వాతవరణం నెలకొంది. -
హరోం.. హరా..
–నేడు ‘ఆడికృత్తిక’ వేడుక – మొక్కులు తీర్చుకోనున్న భక్తులు – శ్రీకాళహస్తి, ఊట్లవారిపల్లె, తనపల్లెల్లో ఏర్పాట్లు – తిరుత్తణికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సాక్షి ప్రతినిధి, తిరుపతి : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల స్వామిగా పేరున్న శ్రీ వల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ‘ఆడి కృత్తిక’ పండుగ గురువారం వైభవంగా జరుగనుంది. జిల్లాలోని శ్రీకాళహస్తి, తనపల్లె, ఊట్లవారిపల్లె, గుడుపల్లె ప్రాంతాల్లోని స్వామివారి ఆలయాలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యాయి. ఏటా ఆడి మాసంలో వచ్చే భరణితోపాటు కృత్తిక రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి కావడి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలి వెళ్తుంటారు. ప్రధానంగా తమిళనాడులో వైభవోపేతంగా నిర్వహించుకునే ఈ కావడి పండుగను సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు వాసులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఇందులో భాగంగా రెండు జిల్లాల భక్తులు ఎక్కువ మంది తమిళనాడులోని తిరుత్తణి పుణ్యక్షేత్రానికి వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత చెంగల్రాయుని ఆలయం, ఇక్కడికి సమీపంలోని కొండ మీదున్న కుమారస్వామి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అదేవిధంగా పాకాల మండలం ఊట్లవారిపల్లె, తిరుచానూర్ పక్కనే ఉన్న తనపల్లె సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాల్లో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయని ఆయా ఆలయాల నిర్వాహకులు తెలిపారు. పూల, పాల,పన్నీరు కావళ్లతో వేలాది మంది భక్తులు ఆలయాలకు చేరి ప్రదక్షిణలు చేసి మనసారా దేవుని ప్రార్థించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. తిరుపతి, చంద్రగిరి, తిరుచానూరు, చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుత్తణి కూడా వెళ్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు గురు, శుక్రవారాల్లో ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. 22 ప్రత్యేక బస్సులు... తిరుపతి నుంచి తిరుత్తణి వెళ్లే భక్తుల కోసం పచ్చికాపలం, కార్వేటినగరం, పళ్లిపట్టు, బలిజకండ్రిగల మీదుగా ఏడు బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి తిరుత్తణి వెళ్లే భక్తుల కోసం వయా సత్యవేడు, బీఎన్ కండ్రిగల మీదుగా మూడు బస్సులు, తిరుపతి నుంచి పుత్తూరు, నగరి మీదుగా తిరుత్తణి వరకూ 15 బస్సులు నడుపుతున్నట్లు ఆయన వివరించారు. ఆలయాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసువర్గాలు తెలిపాయి. -
ర్యాలీగా సాగి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు