సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో పదిమంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం పాలైయ్యారు. మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులతో వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 16మంది భక్తులు ఉన్నట్లు సమాచారం.
మృతులు మెదక్ జిల్లా నర్సాపురం మండలానికి చెందిన నాగరాజు, మహేష్, శ్యామ్, కుమార్, ప్రవీణ్, కృష్ణసాయి, ఆంజనేయులు, సురేష్ ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి మృతదేహాలను స్వస్థలంకు పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంత్రి..
తమిళనాడు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.
హరీష్‌రావు సంతాపం..
తమిళనాడు జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పుదుకొట్టై జిల్లా కలెక్టర్ గణేష్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాలను వారి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరగటం దురదృష్టకరమని, వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment