
చెన్నై: తమిళనాడు తూత్తుకూడిలో భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్కు నుంచి వేలాడుతున్న తాడు.. బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో అతను అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బైక్‌పై నుంచి ఎగిరిపడ్డ యువకుడ్ని శ్రీవైకుంఠంకు చెందిన ముత్తుగా గుర్తించారు. అతను కిందపడగానే స్థానికులు వెళ్లి సాయం అందించారు. అదృష్టవశాత్తు ముత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
லாரியில் இருந்து விழுந்த பாசக்கயிறு.. கழுத்தில் மாட்டி தூக்கி வீசப்பட்ட வாலிபர்!!#thoothukudi #accident pic.twitter.com/6MRkUjlFHA
— A1 (@Rukmang30340218) December 15, 2022
ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. లోడుపై నుంచి తాడు వేలాడుతున్నా.. దాన్ని పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వాహనాన్ని వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన బైకర్ మెడకు అది చుట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర..
Comments
Please login to add a commentAdd a comment