ఘోర ప్రమాదం.. కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ఏడుగురి మృత్యువాత | Seven Dead After speeding SUV Rams Bikes Auto Rickshaw in Odisha | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. కొంపముంచిన ఓవర్‌టేక్‌.. ఏడుగురి మృత్యువాత

Published Sat, Jan 27 2024 10:43 AM | Last Updated on Sat, Jan 27 2024 12:46 PM

Seven Dead After speeding SUV Rams Bikes Auto Rickshaw in Odisha - Sakshi

భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న ఓ కారు ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో  ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. మొత్తం రెండు బైక్‌లు, ఒక ట్రాక్టర్‌, ఎస్‌యూవీకారు, ఆటోరిక్షా ధ్వంసమయ్యాయి. కోరాపుట్‌ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

బోరిగుమ్మలో సింగిల్‌ రోడ్డుపై ఒక వైపు నుంచి ఎస్‌యూవీ కారు, ఆటో రిక్షా వస్తున్నాయి. ఎస్‌యూవీ వేగంగా దూసుకొచ్చి  ఆటోరిక్షాను ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆటోతోపాటు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ఎస్‌యూవీ కారు అక్కడి నుంచి పరారయ్యింది. ఆటో బోల్తా పడటంతో అందులోని 15 మంది ప్రయాణికులు రోడ్డుపై డిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. 

అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 13 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారిని కోరాపుట్‌లోని ఓ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మూడు లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. 
చదవండి: బిహార్‌ పాలిటిక్స్‌.. నితీశ్‌ సర్కారు కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement