2018
-
ఆ హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా..!
జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ జోరు పెంచారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా సినిమాలు తీసేందుకు తన షెడ్యూల్స్ ఉంటున్నాయి. అక్టోబర్ 10న వేట్టైయాన్ విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.వెట్టైయాన్‌తో పాటు 'కూలీ' చిత్రాన్ని కూడా ఆయన పట్టాలెక్కించారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ కూడా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' ప్రాజెక్ట్‌లో రజనీ ఎంట్రీ ఇస్తారు.ఈ సినిమాల తర్వాత కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో '2018' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్‌తో రజనీ సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జూడ్ ఆంథనీ జోసెఫ్ ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నటించమని మొదట శింబును సంప్రదించారట. అయితే, ఈ కథకు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే సెట్ అవుతారని మేకర్స్ అభిప్రాయానికి వచ్చారట. దీంతో ఇప్పటికే సినిమా కథను కూడా రజనీకి వినిపించారట. అయితే, త్వరలో చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. -
7వ తరగతి పరీక్షలు రాసిన 68 ఏళ్ల నటుడు
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్.. ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అది కూడా 68 ఏళ్ల వయసులో. చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇతడు.. పుస్తకాలు, వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో టైలర్‌గా మారిపోయాడు. స్కూల్ కి వెళ్లకపోయినప్పటికీ.. చదువుకోవడం నేర్చుకున్నాడు. అలా పెద్దయిన తర్వాత నటుడిగా మారాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)1980 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో ఇంద్రన్ నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన '2018' అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించాడు. ఇందుకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.ఇక 10వ తరగతి పాస్ కావాలనే కోరిక ఇంద్రన్కి కలిగింది. ఇది జరగాలంటే తొలుత 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఏదేమైనా 68 ఏళ్ల వయసులో చదువుకోవాలని ఇతడి ఉత్సాహాన్నfి చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
Manushi Chhillar: బ్యూటీ క్వీన్, ఆపరేషన్ వాలెంటైన్ భామ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
ఘోర ప్రమాదం.. కొంపముంచిన ఓవర్టేక్.. ఏడుగురి మృత్యువాత
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న ఓ కారు ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. మొత్తం రెండు బైక్‌లు, ఒక ట్రాక్టర్, ఎస్‌యూవీకారు, ఆటోరిక్షా ధ్వంసమయ్యాయి. కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బోరిగుమ్మలో సింగిల్ రోడ్డుపై ఒక వైపు నుంచి ఎస్యూవీ కారు, ఆటో రిక్షా వస్తున్నాయి. ఎస్యూవీ వేగంగా దూసుకొచ్చి ఆటోరిక్షాను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆటోతోపాటు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ఎస్యూవీ కారు అక్కడి నుంచి పరారయ్యింది. ఆటో బోల్తా పడటంతో అందులోని 15 మంది ప్రయాణికులు రోడ్డుపై డిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 13 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారిని కోరాపుట్‌లోని ఓ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మూడు లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. చదవండి: బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం Seven people were killed in an #accident in #Odisha’s Borigumma earlier today. Who is in fault in this video?? 😭😭pic.twitter.com/dE8NBX9CfP — Sann (@san_x_m) January 27, 2024 -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
ఆస్కార్ రేసు నుంచి 2018 చిత్రం అవుట్
భారతీయ సినీ ప్రేమికులకు నిరాశ ఎదురైంది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లిన మలయాళ సినిమా ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 10న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేశారు అకాడమీ నిర్వాహకులు. ఇందులో భాగంగా.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా మొత్తం పది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్ బరిలో ఉన్న షార్ట్ లిస్ట్‌ను ప్రకటించారు మేకర్స్. హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ, ఓపెన్ హైమర్’ల హవా ఈ షార్ట్‌లిస్ట్ జాబితాలో కనిపించింది. ఇక ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ కోసం 88 దేశాల చిత్రాలు పోటీ పడగా, 15 చిత్రాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ లిస్ట్‌లో మలయాళ ‘2018’ సినిమాకు చోటు దక్కలేదు. కాగా ఇండో–కెనెడియన్ ఫిల్మ్‌మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘టు కిల్ ఏ టైగర్’ అవార్డ్స్లతో సత్తా చాటింది. జార్ఖండ్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన తన కుమార్తెకు న్యాయం జరగాలని ఓ తండ్రి చేసే పోరాటం నేపథ్యంలో ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ కథనం ఉంటుంది. అస్కార్ నామినేషన్ కోసం పదిహేను డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్స్‌తో ‘టు కిల్ ఏ టైగర్’ పోటీ పడాల్సి ఉంది. ఇక అన్ని విభాగాల్లోని ఆస్కార్ నామినేషన్స్ జనవరి 23న వెల్లడి కానున్నాయి. ఇందుకోసం జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రకటించిన ఆస్కార్‌లోని పది విభాగాల షార్ట్ లిస్ట్ జాబితాలో ఒక్క ఇండియన్ చిత్రానికి కూడా చోటు లభించలేదు. ఇక ‘2018’ విషయానికొస్తే కేరళలో 2018లో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేశారు. టొవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, వినీత్, తన్వి రామ్, అజు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈ చిత్రం వసూలు చేసింది. ఆస్కార్ బరిలో నిలిచి నామినేషన్ దక్కించుకోలేకపోయిన నాలుగో మలయాళ చిత్రంగా ‘2018: ఏవ్రీ వన్ ఏ హీరో’ చిత్రం నిలిచింది. గతంలో 70వ ఆస్కార్ అవార్డ్స్‌కు ‘గురు (1997)’, 83వ ఆస్కార్ అవార్డ్స్‌కు ‘అదామింటే మకాన్ అబు (2011)’, 93వ ఆస్కార్ అవార్డ్స్ కోసం ‘జల్లికట్టు (2019)’, 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘2018: ఏవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ చిత్రాలను ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగపు నామినేషన్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీకి పంపింది. -
ఆస్కార్ నుంచి '2018' సినిమా ఔట్.. ఆ చిత్రానికి దక్కిన ఛాన్స్
ఆస్కార్ 2024 అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘2018’ అధికారికంగా ఎంపిక కావడంతో భారతీయ చిత్రపరిశ్రమలోని అందరూ చాలా సంతోషించారు. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో 2018 సినిమా పేరు లేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. జార్ఖండ్ గ్యాంగ్‌రేప్ ఆధారంగా తీసిన 'టు కిల్ ఎ టైగర్' అనే చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరీలో చోటు దక్కింది. టొరంటో ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దీన్ని డైరెక్ట్ చేశాడు. 2018 సినిమా ఆస్కార్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఇన్‌స్టా ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 88 అంతర్జాతీయ భాషా చిత్రాలు పోటీ పడ్డాయని ఆయన తెలిపారు. కానీ ఫైనల్ చేసిన 15 చిత్రాల్లో 2018 సినిమా స్థానాన్ని దక్కించుకోలేకపోయిందని చెప్పారు. అవార్డు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అందరినీ ఎంతగానో నిరాశపరిచానని. అందుకు గాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా ఆస్కార్ బరిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన తెలిపాడు. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో '2018'ని ఎంపిక చేశారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కిన ఈ చిత్రం అందరి అభిమానాన్ని పొందింది. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రియల్స్టిక్గా జరిగిన కొన్న సంగటనల ఆధారం చేసుకుని ఈ కథను వెండితెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమాను భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆస్కార్-96 నుంచి ఈ సినిమా తప్పుకోవడంతో భారతీయ చలనచిత్ర అభిమానుల్లో కొంతమేరకు నిరాశ కలిగింది. View this post on Instagram A post shared by Jude Anthany Joseph (@judeanthanyjoseph) -
ఎగుడు దిగుడు దారిలో కారు!
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)’రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఉద్యమ సమయంలో రాజీనామాలు, ఉప ఎన్నికలను అ్రస్తాలుగా ప్రయోగించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీ నేతృత్వంలోని కూటమితో జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచింది. రాష్ట్ర అవతరణ తర్వాత తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారినట్టు అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీకి వీలుగా టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల దిశగా రంగం సిద్ధం చేసుకుంటూనే.. తెలంగాణలో మూడోసారి అధికారం సాధించి ‘హ్యాట్రిక్’సీఎంగా రికార్డు సృష్టించాలని భావించారు. తర్వాత ‘తెలంగాణ మోడల్’ఆలంబనగా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలు కలుపుకొని మొత్తం 65 ఎంపీ సీట్లలో పోటీచేస్తామని బీఆర్ఎస్ గతంలో ప్రకటించింది. కొత్త రాష్ట్రంలో అధికార పీఠం: తెలంగాణ ఏర్పాటుతోపాటు జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 119 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసి 63 సీట్లు సాధించింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి కాలంలో రాజకీయ పునరేకీకరణ పేరిట టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, సీపీఐల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే 2018 సెపె్టంబర్ 6న అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారు. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెల్చుకుని కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. తర్వాతి కాలంలోనూ వివిధ పార్టీల నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని అసెంబ్లీలో 104 సంఖ్యాబలానికి చేరుకున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు 2022 అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రస్థానం, పై ఆసక్తి నెలకొంది. నాడు ఉప ఎన్నికలతో బలోపేతమై.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్ 2001లో టీడీపీకి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ను స్థాపించారు. అదే ఏడాది 2001లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగి గెలుపొందారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని..46 అసెంబ్లీ సీట్లలో పోటీచేసి, 26 స్థానాలును గెలుచుకుంది. రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ మాట తప్పిందంటూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. 2006 కరీంనగర్ లోక్‌సభకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2008లో టీఆర్ఎస్కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే వాటికి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడుగురే టీఆర్ఎస్ అభ్యర్థులు తిరిగి గెలిచారు. ఈ క్రమంలో 2009 సాధారణ ఎన్నికల్లో మహా కూటమితో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుని 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది. కానీ పది సీట్లే సాధించింది. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది, 2011 ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. 2012లో టీడీపీ, కాంగ్రెస్‌లకు రాజీనామా చేసిన జోగు రామన్న, గంప గోవర్ధన్, జూపల్లి కృష్ణారావు, తాటికొండ రాజయ్య కూడా టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. -
ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?
కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం భారత్ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 2018 మూవీ రివ్యూ) ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. 2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ చిత్రంగా ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటేనే ఈ చిత్రం అవార్డుకు అర్హత సాధిస్తుంది. కాగా.. 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరగనున్నాయి. (ఇది చదవండి: ఈ అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!) ఆస్కార్-2023 ఏడాదిలో ఎంట్రీకి ఛెలో షో (2022), కూజాంగల్ (2021), జల్లికట్టు (2020), గల్లీ బాయ్ (2019), విలేజ్ రాక్‌స్టార్స్ (2018), న్యూటన్ (2017), విసరాని (2016) చిత్రాలు ఎంపిక కాగా.. ఏది ఎంపిక అవ్వలేదు. ఇప్పటివరకు మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాలు మాత్రమే ఆస్కార్‌కు నామినేట్ భారతీయ సినిమాలుగా నిలిచాయి. ఆస్కార్ 2023లో ఇండియా సినిమాలు రెండు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ రాగా.. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో దక్కించుకుంది. -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ..
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నేడు(శుక్రవారం) ప్రగతి భవన్లో సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా పార్టీ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. ప్రధానికి, సీఎం కేసీఆర్ లేఖ : బీసీ (ఓబీసీ) కులాలను సామాజిక విద్య ఆర్థిక రంగాల్లో దేశవ్యాప్తంగా మరింత ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద ఉన్నదని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది. ముఖ్యంగా రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీ (ఓబీసీ)లకు పార్లమెంటు అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. మహిళా రిజర్వేషన్‌పై ఏకగ్రీవ తీర్మానం సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది. మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా రిజర్వేషన్లపై లేఖ రాశారు. చదవండి: ‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’ -
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కె టైటిల్,గ్లింప్స్ కోసం ఎదురు చూశారు. దానికి సంబంధించిన వివరాలను ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో ప్రదర్శించారు. ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మేకర్స్. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. (ఇదీ చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి) కొద్దిరోజుల క్రితం ప్రభాస్ సినిమాలపై ఇలా పలు విమర్శలు వచ్చాయి. ఆదిపురుష్ కథ, సలార్‌లో కనిపించన ప్రభాస్ లుక్ , ప్రాజెక్ట్ కె సినిమా మొదటి పోస్టర్.. ఇలా పలు విషయాల్లో ఎన్ని వివాదాలు వచ్చినా ఇప్పటి వరకు ప్రభాస్ ఎక్కడా నోరు విప్పలేదు. నేడు కల్కి సినిమా కార్యక్రమంలో రాజమౌళి, రామ్ చరణ్‌ల గురించి ప్రభాస్ తొలిసారి మాట్లాడారు. భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరని ప్రభాస్ పేర్కొన్నారు. ఆయన నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా చాలా గొప్పదని ఆ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడం ఒక భారతీయుడిగా ఎంతగానో గర్వపడుతున్నట్లు చెప్పాడు. (ఇదీ చదవండి: కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే: అల్లు అర్జున్) ఆ సినిమాకు వచ్చిన ఆస్కార్ అవార్డు భారతదేశ ప్రజలందరికీ దక్కిన గొప్ప గౌరవంగా అందరూ భావించాలని తెలిపాడు. ఇలాంటి గొప్ప అవార్డులకు రాజమౌళి ఖచ్చితంగా అర్హుడేనని చెప్పాడు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తనకు మంచి స్నేహితుడని. అన్నీ కలిసి వస్తే ఏదో ఒక రోజు తామిద్దరం కలిసి కచ్చితంగా ఓ సినిమా చేస్తామని ప్రభాస్ ప్రకటించాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్-చెర్రీ కాంబినేషన్ అదిరిపోయింది. మళ్లీ ఇలా మరో కాంబోలో సినిమా వస్తే పండుగేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. Charan is my friend we are going to work one day 🔥🔥 :) #Prabhas If it happens it will be a biggest collaboration in indian cinema 💥@AlwaysRamCharan #RamCharan pic.twitter.com/I7iouTzSmh — ₵₳₱₮₳ł₦ 𝕀𝕟𝕕𝕚𝕒™ (@captain_India_R) July 21, 2023 -
చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా.. -
ప్రశాంత్ నిల్ మాదిరే మరో డైరెక్టర్ని టార్గెట్ చేసిన సౌత్ నిర్మాతలు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి. (ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...) అలా కేజీఎఫ్‌తో ప్రశాంత్ నిల్తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది. ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
రూ.200 కోట్ల దర్శకుడితో మెగాస్టార్ సినిమా?
మెగాస్టార్ చిరంజీవి మరో స్టార్ డైరెక్టర్ కి అవకాశమిచ్చారనే వార్త వైరల్ గా మారిపోయింది. అతను తెలుగువాడు కాదనేది ఇక్కడ ఆసక్తికర విషయం. 'భోళా శంకర్'తో బిజీగా ఉన్న చిరు.. తర్వాత ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్. ప్రస్తుతం స్టోరీలు వింటున్నారని, త్వరలో రెండు కొత్త చిత్రాల్ని ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారని అనిపిస్తుంది. 'బంగార్రాజు' ఫ్రాంచైజీతో నాగార్జునకు హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ.. చిరుతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. చాలారోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి టాక్ నడుస్తోంది. ఇది ఖరారైనప్పటికీ మంచిరోజు చూసి అధికారికంగా ప్రకటించాలని ఆగుతున్నారు. మరోవైపు ఈ మధ్యే '2018' మూవీతో మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జూడ్ ఆంటనీ జోసెఫ్.. ఇప్పుడు చిరుతో కలిసి పనిచేయబోతున్నారట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) గత పదేళ్లలో నాలుగే సినిమాలు చేసిన ఈ డైరెక్టర్.. 2018 మూవీతో దేశవ్యాప్తంగా క్రేజు తెచ్చుకున్నాడు. ఓ రియలస్టిక్ స్టోరీని కూడా ఇంత బాగా తీయొచ్చా అని నిరూపించాడు. ఓవరాల్ గా ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది. అలా ఈయన వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ అనుకుని, చిరంజీవిని కలిసి దాన్ని చెప్పారట. అది మెగాస్టార్ నచ్చి ఓకే చేశారని తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్, దానికి తోడు '2018' డైరెక్టర్.. చిరుతో కలిసి పనిచేయబోతున్నారు అని వినిపించేసరికి బహుశా 2014 అక్టోబరులో వైజాగ్ ని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాన్ ఆధారంగా ఏమైనా సినిమా తీస్తున్నారా అనే సందేహం వస్తోంది. అదే నిజమైతే మాత్రం మెగాఫ్యాన్స్ కి సంతోషమే. ఎందుకంటే ఈ మధ్య చిరు ఎక్కువగా రీమేక్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం ఒరిజినల్ మూవీ అవుతుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
వివాదంలో ఇండస్ట్రీ హిట్ 2018
-
ప్రియుడితో బ్రేకప్.. అతడి మనసు ముక్కలు చేశా, బాధేసింది: నటి
ప్రేమ- బ్రేకప్, పెళ్లి- విడాకులు.. ఇండస్ట్రీలో ఎంత సర్వసాధారణమో అందరికీ తెలుసు. బ్రేకప్ చెప్పుకున్న కొద్దికాలానికే మళ్లీ లవ్‌లో పడటం, విడాకులు తీసుకున్న కొంతకాలానికే మళ్లీ పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్. అయితే కొద్దిమంది మాత్రం గత బంధాన్ని మర్చిపోలేక, జీవితంలో ముందడుగు వేయలేక ఇబ్బందిపడుతుంటారు. తప్పు ఎక్కడ జరిగిందని పునరాలోచనలో పడతారు. బుల్లితెర నటి దివ్య అగర్వాల్ ఈ రెండింటి కోవలోకి వస్తుంది. గతేడాది నటుడు వరుణ్ సూద్‌కు బ్రేకప్ చెప్పిన ఆమె రెస్టారెంట్ యజమాని అపూర్వ పడ్గోయెంకర్తో పెళ్లికి రెడీ అయింది. గతేడాది డిసెంబర్లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా తన బ్రేకప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది దివ్య అగర్వాల్. ఆమె మాట్లాడుతూ.. 'అపూర్వ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఒక బాధ్యత గల అమ్మాయిగా ప్రవర్తిస్తాను. అదే వరుణ్ ఉన్నప్పుడు నేను ఇంకోలా ఉండేదాన్ని. కుదురుగా ఉండేదాన్ని కాదు. బ్రేకప్ తర్వాత వరుణ్, అపూర్వలు కలుసుకునేలా చేశాను. ఏదైతే జరిగిందో అదంతా నావల్లే అని ఒప్పుకున్నాను. ఎందుకంటే నేనెప్పుడూ ఒక రకమైన గందరగోళంలో ఉండేదాన్ని. ఏం చేస్తున్నానో తెలిసేది కాదు. దీనికంతటికీ పుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాను. ఈ క్రమంలోనే సడన్‌గా అర్ధాంతరంగా బ్రేకప్ చెప్పాను అని క్లారిటీ ఇచ్చాను. అయితే బ్రేకప్ తర్వాత బాధపడుతూ కూర్చోవద్దని అపూర్వ సలహా ఇచ్చాడు. ఇక్కడ నా బాధేంటంటే.. నా మూడ్ స్వింగ్స్ కారణంగా ఒకరి మనసు ముక్కలు చేశాను. అందుకు ఎంతో చింతించాను. అపరాధ భావనతో కుంగిపోయాను. అపూర్వ మాత్రం.. మీరు మంచి పనే చేశారు, లేదంటే మీరు ఇలాగే ముందుకు సాగితే ఈ గొడవలు ఇంకా పెద్దవయ్యేవి అని చెప్పాడు. నా బాధను పోగొట్టేందుకు అపూర్వ నన్ను గోవాలో ఓ గుడికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేశాడు. ఇక్కడేమీ ఆలోచించకుండా సైలెంట్‌గా ఉండమని చెప్పాడు. ఆధ్యాత్మిక మార్గంలో నన్ను నడిపించి నాకు మా నాన్నను గుర్తు చేశాడు' అని చెప్పుకొచ్చింది దివ్య. కాగా వరుణ్-దివ్య.. ఏస్ ఆఫ్ స్పేస్, స్ప్లిట్స్‌విల్లా అనే రియాలిటీ షోలలో జంటగా పాల్గొన్నారు. గతేడాది వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే అపూర్వతో ప్రేమలో పడి, అతడితో పెళ్లికి సిద్ధపడింది. చదవండి: బుల్లెట్ బైక్ నడిపిన వరలక్ష్మి శరత్ కుమార్ -
'2018' సినిమాపై వివాదం.. ఆ విషయంలో తీవ్ర అభ్యంతరం!
మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం '2018'. మాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 7న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) ఓటీటీ రిలీజ్‌పై అభ్యంతరం హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై కేరళలోని థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్‌ల చేయడంపై 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను కేవలం ఐదు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్‌తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!) -
నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!
నా ద్వారా పైకి వచ్చిన దర్శకులు చాలామంది గీత దాటారన్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. కెరీర్లో కొంత సక్సెస్ కాగానే ఆ విషయం మర్చిపోయి గీత దాటి వేరే సినిమాలు చేశారని పేర్కొన్నాడు. మే 5న మలయాళంలో రిలీజైన 2018 మూవీ అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గురువారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేశాడు. 2018 మూవీ చూశా, ఇది మనం తెలుగులో రిలీజ్ చేయాలి అని చెప్పాడు. ఇతర భాషల్లో వస్తున్న మంచి సినిమాలన్నీ మనమే చేస్తున్నం కదా.. ఇది కూడా మనమే చేద్దాం అంటే సరేనన్నాను. అయితే ఇక్కడ నేను గానీ, దిల్ రాజుగానీ.. సీనియర్స్ అందరం జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి. అందులో వాళ్లను ఎదగనివ్వాలి. మొత్తం మనమే ఆక్రమించేసి మనమే పైకొచ్చేయాలనేది సరి కాదు. పక్కవాళ్లకు స్పేస్ ఇవ్వడమే నా ఆటిట్యూడ్. ఇప్పటికీ నాకోసం నిలబడ్డాడు చందూ మొండేటి కార్తికేయ 2 తీసి ఏడాది దాటిపోయింది. అయితే ఆ సినిమా రిలీజవకముందే నాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్మెంట్ ఉంది. కార్తికేయ 2 రిలీజ్ కాకముందే అతడో గొప్ప డైరెక్టర్ అని గ్రహించి బుక్ చేసుకున్నాను. నాద్వారా పైకొచ్చినవాళ్లలో చాలామంది గీత దాటారు. వాళ్ల పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ చందూ మొండేటి మాత్రం నాతో సినిమా చేయడానికే నిలబడ్డారు' అని వ్యాఖ్యానించాడు అరవింద్. అయితే అల్లు అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: అమ్మాయిలపై అత్యాచారం... నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష -
2018మూవీ కి బిగ్ షాక్..
-
ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
మలయాళంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!) ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ! The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV 2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory @ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j — Sony LIV (@SonyLIV) May 29, 2023 -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
టాలీవుడ్ లో 2018 మూవీ సంచలనం తొలి రోజే కోటి రూపాయల గ్రాస్
-
సౌత్ సైడ్ మరో సెన్సేషన్
-
గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!
‘‘గీతగోవిందం’ సినిమాను కేరళలో విడుదల చేసి, వసూళ్లను అక్కడ విరాళంగా ఇచ్చాం(కేరళలో 2018 వచ్చిన వరదలను ఉద్దేశిస్తూ). బాహుశా.. అందుకేనేమో మలయాళ హిట్ మూవీ ‘2018’ ని తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్‌గార్లకు థ్యాంక్స్. హృదయాన్ని హత్తుకునే సినిమా ‘2018’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజైంది. ఈ మూవీని ఈ నెల 26న తెలుగులో ‘బన్నీ’ వాసు విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో టోవినో థామస్ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు జూడ్ ఆంథోనీ జోసెఫ్. ఈ కార్యక్రమంలో అపర్ణా బాలమురళి, నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
కంటెంట్ నచ్చితే డబ్బింగ్ సినిమానా, రీమేక్ చిత్రమా అని చూడకుండా థియేటర్స్‌కి బారులు తీస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘2018’ చిత్రానికి కూడా టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండో రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది. ఈ రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
2018 Movie: ‘2018’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ చేస్తా: టొవినో థామస్
‘2018 ’చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కేరళలో మాత్రమే కాదు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను’అని మలయాళ హీరో టొవినో థామస్ అన్నారు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న ప్రముఖ నిర్మాత బన్నివాసు రిలీజ్ చేయగా.. మంచి స్పందన లభించింది. తొలి రోజు రూ. కోటికి పైగా వసూళ్లను రాబట్టి దుసూకెళ్తోంది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్. కానీ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను’అన్నారు. ‘నేను 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేశాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. .పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని నమ్మాను. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.చాలా ఆనందంగా ఉంది’అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్ అని అపర్ణ బాలమురళి అన్నారు. -
ఈ వారం రిలీజైన సినిమాలు ఎలా ఉన్నాయంటే..
మళ్లీ పెళ్లి వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మరి సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2018 కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందన్న విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం 2018. మే 5న అక్కడ విడుదలైన ఈ చిత్రానికి కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళంలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మేమ్ ఫేమస్ షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గ్రే మూవీ ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 'సత్తిగాని రెండెకరాలు' పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ మూవీకి తెలుగులో ఊహించని రెస్పాన్స్!
కేరళలో రీసెంట్ టైమ్స్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన '2018'. ఈ చిత్రం ఇవాళే తెలుగులో విడుదలైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్‌ను హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనూ ప్రదర్శించారు. ప్రెస్ స్క్రీనింగ్, సెలబ్రిటీ ప్రీమియర్‌కు అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్‌లో ప్రేక్షకుడిని సీటులోనే కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి) కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోందని, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోనంటూ హరీశ్ స్ట్రాంగ్ వార్నింగ్
2018 సినిమా.. మలయాళ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాసు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో 2018 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని, ఇది తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు. తర్వాత ఓ విలేఖరి మాట్లాడుతూ.. 'మన తెలుగు దర్శకనిర్మాతలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా చూశాక మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలరా? ఇక్కడి నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?' ప్రశ్నించాడు. దీనికి హరీశ్ శంకర్ స్పందిస్తూ.. 'ప్రెస్మీట్స్ జరిగిన ప్రతిసారి ఆయన(విలేఖరిని ఉద్దేశిస్తూ) సాహసోపేతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరూ అడగని ప్రశ్నలు అడుగుతూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచి యూట్యూబ్‌లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రపంచ సినిమా మన చేతికొచ్చేసింది(తెలుగు సినిమాను ఉద్దేశిస్తూ). అలాంటి టెక్నాలజీలో ఉన్నాం. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కేజీఎఫ్‌లను ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా! డబ్బింగ్, రీమేక్ అదంతా ఏమీ లేదు.. కేవలం సినిమా అంతే! ఏ సినిమా ఎక్కడికెళ్లినా సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని అడుగుతున్నావ్.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారంటే జాలేస్తోంది. అతడు కేరళ డైరెక్టర్ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను. గీతా ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా.. నేనే వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు చేయిస్తా.. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఈ సినిమాను ముందు మీకే చూపించాలని వాసు(నిర్మాత) అన్నాడు. ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్స్ నిర్మాత కూడా చేయలేడు. డబ్బింగా? రీమేకా? అన్నది కాదు.. మంచి సినిమాలు చేస్తాం. తెలుగు, తమిళ, హిందీ దర్శకుడు అని భాషాబేధాలు చూడట్లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్. దానికి భాషతో సంబంధం లేదు' అని చెప్పుకొచ్చాడు హరీశ్ శంకర్. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుందని ట్వీట్ చేశాడు. చులకన చేసే నోరు ఉన్నపుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుంది.. Can’t take insult to our industry. By all means please appreciate every film maker from every industry but for that sake don’t belittle our industry. Whole world is looking towards us. https://t.co/l5yZRZZgjZ — Harish Shankar .S (@harish2you) May 24, 2023 చదవండి: టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్ -
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 2018
‘‘2018’లాంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్‌లోనే చూడాలి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని మాట ఇస్తున్నా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. టొవినో థామస్, కుంచక్కో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిలి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో కొన్ని ప్రధాన ఏరియాల్లో ‘బన్నీ’ వాసు ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘కేరళలో 2018లో వచ్చిన వరద బాధితుల్లో నేనూ ఒక్కణ్ణి. ఈ కథని ప్రపంచానికి చెప్పాలనుకుని ‘2018’ తీశాను. భాషతో సంబంధం లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. -
‘2018’ మూవీ రివ్యూ
టైటిల్: 2018 నటీనటులు: టొవినో థామస్, అసిఫ్ అలీ, లాల్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ తదితరులు నిర్మాతలు : వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ తెలుగులో విడుదల : 'బన్నీ' వాస్ దర్శకత్వం: జూడ్ ఆంథనీ జోసెఫ్ సంగీతం: నోబిన్ పాల్ సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్ విడుదల తేది: మే 26, 2023 ఆ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంటలన్నీ నాశనం అయ్యాయి. రైతుల గోసలు.. ఉద్యోగస్తుల తిప్పలు.. ఇవన్నీ టీవీల్లో చూసి చలించిపోయాం. రెండు, మూడు రోజుల పాటు కురిసి వానకే ఇంత నష్టం వాటిల్లితే.. మరి ఎడతెరపి లేకుండా కొన్ని వారాల పాటు వర్షం పడితే? వరదలు వస్తే? ఆ వరదల్లో కట్టుకున్న ఇళ్లతో పాటు అన్ని కొట్టుకొనిపోతే?.. ఇలాంటి ప్రకృతి విపత్తులు నిత్యం ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉంటాయి. టీవీల్లో వాటికి సంబంధించి వార్తలు చూసి కాసేపటికే చానెల్ మార్చేస్తాం. కానీ అలాంటి ప్రకృతి విపత్తే మన దగ్గర సంభవిస్తే? నిండు గర్భిణీ అయిన మీ భార్య వరదల్లో చిక్కుకొని పోతే? అంగవైకల్యంతో బాధపడుతున్న నీ కొడుకు ఉన్న ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరితే? కష్టపడి డిగ్రీ చదివిన నీ కూతురు సర్టిఫికేట్స్ వరద నీటీలో తడిసిపోతే? ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నీ కళ్లముందే కూలిపోతే? తాగడానికి గుప్పెడు మంచి నీళ్లు కూడా లభించపోతే?.. ఇవన్నీ కేరళ ప్రజలు చూశారు. చరిత్రలో ఇంతవరకు చూడని వరదలను 2018లో అక్కడి ప్రజలు చూశారు. ఒకరిఒకరు సహాయం చేసుకొని ప్రకృతి ప్రళయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ సంఘటలనే కథగా మలిచి ‘2018’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్. మే 5 కేరళలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటికే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అదే చిత్రాన్ని తెలుగులో 'బన్నీ' వాసు ఈ శుక్రవారం (మే 26) రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ‘2018’ కథేంటంటే.. కేరళలోని అరువిక్కుళం అనే గ్రామానికి చెందిన అనూప్ (టోవినో థామస్) ఎంతో ఇష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే అక్కడి కష్టాలు చూసి భయపడి ఉద్యోగం మానేసి ఊరిగి తిరిగొస్తాడు. అతన్ని చూసి జనాలంతా నవ్వుకుంటారు. ఇక మనోడు మాత్రం అవేవి పట్టించుకోకుండా దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన స్కూల్ టీచర్ మంజు(తన్విరామ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు నిక్సన్(అసిఫ్ అలీ) మోడల్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని తండ్రి(లాల్), అన్నయ్య(నరైన్) సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తుంటారు. వారిది సముద్ర తర ప్రాంతం కావడంతో వర్షం పడినప్పుడల్లా ఇంటిని వదిలి క్యాంపుల్లోకి వెళ్తుంటారు. ఇక కోషీ(అజు వర్గీస్) ఓ టాక్సీ డ్రైవర్. కేరళ పర్యటనకు వచ్చిన విదేశీయులను తన క్యాబ్‌లో అన్ని ప్రాంతాలు తిప్పి చూపిస్తుంటాడు. సేతుపతి(కలైయారసన్) లారీ డ్రైవర్. డబ్బు కోసం బాంబులను అక్రమంగా సరఫరా చేయడానికి వెళ్తుంటాడు. ఇలా ఒక్కొక్కరిది అక్కడ ఒక్కో జీవితం. వీరందరి జీవితాలను 2018 వరదలు ఎలా తారుమారు చేసింది? ప్రకృతి కన్నెర్ర చేస్తే.. అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకొని ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? వరదల సమయంలో కేరళ ప్రజలు పడిన కష్టాలు ఏంటి? వేలాది మంది ప్రజలు అనుభవించిన బాధలు ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమానే ‘2018’. ఎలా ఉందంటే.. 2018 ఆగస్టులో కేరళలో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. కేరళ చరిత్రలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని ‘జూడ్ ఆంథనీ జోసెఫ్’ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రానికి అక్కడి ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇది అక్కడ జరిగిన సంఘటన కాబట్టి అందరికి కనెక్ట్ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది? తెలుగు ప్రజలే కాదు మనుషులంతా ఈ కథను కనెక్ట్ అవుతారు. అయ్యో పాపం.. ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదే? అక్కడ నేనున్నా వెళ్లి వారిని కాపాడేవాడిని అనిపించేలా కొన్ని వరద సన్నివేషాలను తీర్చిదిద్దారు. సినిమా చూస్తున్నంత సేపు వరదల్లో మనవాళ్లు చిక్కుకున్నట్లుగా.. వారికి సహాయం చేసినప్పుడు హమ్మయ్యా.. వాళ్లు సేవ్ అయ్యారు’ అనే పీలింగ్ కలుగుతుంది. కథ మన ఊహకు అందినట్లుగా సాగితే బోరు కొడుతుంది. కానీ మనం కోరుకునేది తెరపై జరిగితే సంతోషం కలుగుతుంది. ఈ సినిమాలో మనం కోరుకునేవి చాలా జరుగుతాయి. కొన్ని సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా వికలాంగుడైన కొడుకుని కాపాడుకోవడం కోసం ఓ జంట పడే కష్టం.. గర్భవతిని హెలిక్యాప్టర్‌లో ఎక్కించే సీన్... సర్టిఫికెట్స్ కోసం ఇంట్లోకి నిక్సన్ వెళ్లే సీన్.. అక్కడ పాము కనిపిస్తే.. నిక్సన్ చేసిన పని.. ఇలా చాలా సన్నివేశాలు మన మనసుల్ని హత్తుకుంటాయి. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి. మరికొన్ని సనివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడకోసం మేమున్నామంటూ మత్స్యకారులు ముందుకొస్తే.. ‘ఇది కదా మానవత్వం’ అనిపిస్తుంది. మొత్తంగా 2018 సినిమా ఆడియన్స్‌ని టెన్షన్ పెడుతుంది. భయపెడుతుంది. బాధపెడుతుంది. చివరకు కులమతాల కంటే మానవత్వం గొప్పదని తెలియజేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించేశారు.ప్రతి ఒక్కరు తమ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాకొస్తే.. నోబిన్ పాల్ నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సీన్‌ని చాలా సహజంగా, అద్భుతంగా చిత్రీకరించాడు. చమన్ చాకో ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు అన్ని అద్భుతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘2018’ థియేటర్స్‌లో టెన్షన్ పెడుతుంది..క్లాప్స్ కొట్టిస్తుంది: బన్నీవాసు
‘‘2018’ సినిమా తెలుగు కాపీ చూశాను.. నచ్చింది. సెకండాఫ్‌లో మనకు తెలియకుండానే మనం కన్నీళ్ళు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాల్లో మనిషి జీవితం తాలూకు విలువ ఏంటో తెలుస్తుంది. 2018లో కేరళలో వరదల సమయంలో అక్కడి ప్రజలు వారి జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇలాంటి రియలిస్టిక్ ఘటనలను కూడా కమర్షియల్ అంశాలతో దర్శకుడు చక్కగా చెప్పారు. ఈ సినిమా ఆడియన్స్‌ను థియేటర్స్‌లో టెన్షన్ పెడుతుంది.. క్లాప్స్ కొట్టిస్తుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలై ఇప్పటికే రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో గీతా డిస్ట్రిబ్యూషన్, వైజాగ్‌లో ‘దిల్’ రాజు, మిగతా ఏరియాల్లో ‘బన్నీ’ వాసు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘బన్నీ’ వాసు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2018’ అందర్నీ మెప్పించే విధంగా ఉంటుంది. ఇక అల్లు అర్జున్‌గారి ‘పుష్ప: ది రూల్’ని డిసెంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. షారుక్ ఖాన్ ‘జవాన్’లో అల్లు అర్జున్‌గారు నటించారన్నది అవాస్తవం. బాలీవుడ్ మూవీ ‘అశ్వథ్థామ ఇమ్మోర్టల్’ ప్రపోజల్ అల్లు అర్జున్‌గారికి వచ్చింది కానీ ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు’’ అన్నారు. -
చిరుధాన్యాల సాగు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్–2 (ఎస్డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్‌లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు. (చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
డీఎస్సీ–18 అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2018కి సంబంధించి నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుండడంతో కొత్తగా ఎంపిక కాబోతున్న ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 20 నుంచి విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రారంభమై సెప్టెంబర్ 4 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విశాఖ జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ వెరసి 642 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తొలుత సెలెక్టయిన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో ఉంచుతారు. వీటిని విద్యాశాఖ అధికారులు డౌన్లోడ్ చేసి వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను సరైనవో కాదో పరిశీలిస్తారు. ఈనెల 27 నుంచి సర్టిఫికెట్లను పరిశీలించే పనిని జిల్లాలో ప్రారంభిస్తారు. అనంతరం ఆయా అభ్యర్థులు ఏ రోజున హాజరు కావాలో వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపుతారు. స్కూల్ అసిస్టెంట్లకు విశాఖ నగరం గురుద్వారా సమీపంలోని వసంతబాల విద్యావిహార్ పాఠశాలలో ఎంపిక ప్రక్రియను చేపడతారు. తుది ఎంపిక జాబితా అనంతరం స్కూలు ప్రాంతాల ఎంపిక వె»Œబ్ ఆప్షన్లతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సరికొత్తగా ఆన్లైన్లోనే పోస్టింగు ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంటు తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులు (ఐదు కేటగిరీలు) మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టులు ఖాళీగా ఉండిపోయిన పక్షంలో జాబితాలో తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులు నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా ఆభర్థులు సంబర పడుతున్నారు. కేటగిరీ వారిగా చూస్తే ఎస్జీటీ పోస్టులు మైదానంలో 294, ఏజెన్సీలో 153 ఖాళీలు భర్తీ కానున్నాయి. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 63 ఉన్నాయి. వాటిలో నాన్ ల్యాంగ్వేజీలతో పాటు పీఈటీ, మ్యూజిక్ ఉపా«ధ్యాయ ఖాళీలున్నాయి. ఇందులో మైదాన ప్రాంతంలో 56 కాగా, మిగిలిన 7 పోస్టులు ఏజెన్సీలో భర్తీ కానున్నాయి. మైదానంలో.. ఐదు గణితం ఉపాధ్యాయ పోస్టులు, బయాలాజికల్ సైన్స్‌కు 9, సాంఘికశాస్త్రం 13, సంగీతం 3, పీఈటీలు 20, లాంగ్వేజిలు 6తో పాటు మరికొన్ని పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. -
శ్రీమతి అండ్ శ్రీవారిగా!
బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా 2018 ది బెస్ట్ ఇయర్ అనొచ్చు. గతేడాది ‘పద్మావత్’తో సూపర్ హిట్ అందుకుని, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి కొత్త ఏడాదిని హ్యాపీగా ఆరంభించారు. అంతేకాదు గతేడాది ఫోర్బ్ మేగజీన్‌లో అత్యధికంగా సంపాదించే హీరోయిన్గా టాప్ 5లోను, ఐయండీబీ మోస్ట్ పాపులర్ స్టార్‌గా టాప్ చైర్లోను కూర్చున్నారు. 2019 కూడా బెస్ట్‌గా ఉండాలనుకుం టున్నారామె. ఈ ఏడాది నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 5న దీపిక బర్త్‌డే. ఈ సందర్భంగా తన పేరు మీద ‘డబ్ల్యూడబ్ల్యూదీపికాపదుకోన్డాట్కామ్’ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారు. ప్రస్తుతం యాసిడ్ బాధితురాలు లక్ష్మీ జీవితం ఆధారంగా ‘చప్పక్’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక. రణ్వీర్ సంకల్పం బలమైనది ‘రామ్‌లీల, భాజీరావ్ మస్తానీ’ సినిమాల్లో రణ్వీర్ సింగ్, దీపికాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి జంటగా స్క్రీన్ పంచుకోవాలనుందంటున్నారు ఆమె భర్త రణ్వీర్. ‘‘దీపికాతో కలసి యాక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. నటిగా తన సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించలేదనుకుంటున్నాను. దీపిక ఎమోషనల్‌గా ఇంకా బాగా నటించగలదు. మేమిద్దరం మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తామో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారాయన. రణ్వీర్ అలా సంకల్పించుకున్నారో లేదో దర్శకుడు కబీర్ ఖాన్ తథాస్తు అన్నారని బాలీవుడ్ మీడియా టాక్. ప్రస్తుతం1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా కబీర్ ఖాన్ ‘83’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించనున్నారు. కపిల్ భార్య రోమీ భాటియా పాత్ర కోసం దీపికను సంప్రదించినట్టు సమాచారం. ఇండియా ఓడిపోతుందని భావించి రోమీ భాటియా స్టేడియంను విడిచి బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగొచ్చే సమయానికి ఇండియా గెలిచే స్టేజ్‌లో ఉండటం వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉండబోతాయట. చిన్న పాత్ర అయినప్పటికీ ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి దీపిక అయితే బావుంటుందని టీమ్ భావించిందట. -
ప్రపంచమంతా సందడిగా న్యూఇయర్ సెలబ్రేషన్స్
-
వెండితెర 2018
-
2018 టాప్ న్యూస్
-
వన్ఇయర్ ఇండస్ట్రీ ఇక్కడ
ఈ ఏడాది విడుదలైన సినిమాల జయాపజయాలను బేరీజు వేసుకుంటే, తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘గీత గోవిందం’ చిత్రాల ఘనవిజయం కొత్తదనంపై తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అద్దంపట్టాయి. ‘భరత్ అనే నేను’, ‘అరవింద సమేత..’ వంటి మాస్ సినిమాలు ఎటూ హిట్లు కొట్టాయి. అలాగని తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి పట్టం కట్టకుండా ఉండలేదనడానికి ఈ ఏడాది బాక్సాఫీస్ ఫలితాలే నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమకు మిశ్రమ ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. సగటున ప్రతినెలా ఓ సినిమా విజృంభించింది. ఇప్పటి వరకు 120కి పైగా తెలుగు సినిమాలు విడుదలైతే, వాటిలో విజయవంతమైనవి దాదాపు 20 లోపే. గతంలో పోలిస్తే డబ్బింగ్ సినిమాల హవా తగ్గిన ట్లే. డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకాదరణ కొరవడటంతో ఈసారి దాదాపు 30 నుంచి 35 సినిమాలు మాత్రమే తెలుగులోకి దిగుమతి అయ్యాయి. గతంలో ఆ సంఖ్య దాదాపు రెండు రెట్లు ఎక్కువగానే ఉండేది. భాగమతితో హిట్ల బోణీ జనవరి నెల అనగానే కొత్త సంవత్సరం హడావిడి మొదలవుతుంది ఏ పరిశ్రమకైనా. సినిమా అభిమానులకైతే మరీను. సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఫరవాలేదు అన్నీ ఆడేస్తాయి అనే ధోరణిలో ఉంటారు సినీ పరిశ్రమ వర్గాలు. కానీ ఈ జనవరి కొంచెం ట్రేడ్‌ని నిరాశపరచిందనే చెప్పాలి. ఈ నెలలో మొత్తం 6 సినిమాలు విడుదలయ్యాయి. ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన పవన్ కల్యాణ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’, తమిళ దర్శకుడు కె.యస్.రవికమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ సినిమాలతో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘రంగులరాట్నం’ కూడా పండక్కి విడుదలయ్యాయి. ఈసారి జనవరి చాలా నిరాశ కలిగింది అనుకునే లోపు నెలాఖరున వచ్చిన ఆఖరు శుక్రవారం అనుష్క నటించిన ‘భాగమతి’ విడుదలై మంచి ఫలితాన్నే రాబట్టింది. ఈ చిత్రాన్ని ‘పిల్ల జమీందారు’ ఫేమ్ అశోక్ తెరకెక్కించారు. ఇవికాక నెల మొదటి వారంలో ‘చిలుకూరి బాలాజీ’ మూడవ వారంలో ‘త్రిముఖి’ విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. మొత్తానికి మొదటి నెల ఓ మంచి హిట్‌తో ముగిసింది. ‘తొలిప్రేమ’కు ప్రేక్షకులు ‘ఛలో’ ఈ నెలలో మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి నెల రెండో రోజే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించారు. రెండో చిత్రం హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఈ చిత్రానికి ‘ఛలో’ అన్నారు. సినిమా కొన్న బయ్యర్లు భలే అన్నారు. తర్వాత రోజే ‘హౌరా బ్రిడ్జి’ అంటూ ప్రేక్షకుల ముందు కొచ్చారు రాహుల్ రవీంద్రన్. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరుసటి వారం మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. మదన్ దర్శకత్వంలో విడుదలైన ‘గాయత్రి’ ఓ సినిమా అయితే, మరో చిత్రం వినాయక్ దర్శకత్వంలో తయారైన ‘ఇంటిలిజెంట్’. ‘గాయత్రి’ చిత్రంలో గాయత్రి పటేల్, దాసరి శివాజీ రెండు పాత్రలను మోహన్‌బాబు పోషిస్తే, ఆయన యువకునిగా (దాసరి శివాజీ) ఉన్నప్పటి పాత్రను మంచు విష్ణు పోషించారు. ‘గాయత్రి’ మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలి పోయింది. ఇక ‘ఇంటిలిజెంట్’ విషయానికొస్తే సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఆయన ఆ సినిమా చేయటం ‘ఇంటిలిజెంట్’ కాదని జనం తేల్చేశారు. ఆ మరుసటి రోజు మరో ప్రేమకథా చిత్రం ‘తొలిప్రేమ’తో హిట్ ఎంట్రీ ఇచ్చారు వరుణ్‌తేజ్. వెంకీ అట్లూరికి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే తన సత్తా చాటుకున్నాడు. ఫిబ్రవరి మూడో వారంలో ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. తరుణ్ చాలాకాలం తర్వాత ఓ లవ్ స్టోరీలో నటించారు. నాని మొదటిసారి ప్రొడ్యూసర్‌గా పరిచయం అయిన చిత్రం ‘అ!’. ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేశారు నాని. సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా క్రిటిక్స్ దగ్గర శభాష్ అనిపించుకుంది. ఇండస్ట్రీకి కొత్త జోనర్‌ను ‘అ!’ చిత్రం ద్వారా పరిచయం చేశారు నిర్మాత, దర్శకులు. సందీప్ కిషన్ హీరోగా నటించగా, మహేశ్ బాబు సోదరి మంజుల మొదటిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం ‘మనసుకు నచ్చింది’ ప్రేక్షకులకు నచ్చలేదు. రంగస్థలం కలెక్షన్ల ‘మార్చి’oగ్ మార్చి నెల అనగానే అందరికీ పరీక్షలు గుర్తొస్తాయి. పిల్లలు పరీక్షల హడావిడిలో ఉంటే ప్రతి ఇల్లు బిజీగా ఉన్నట్లే. అందుకే చాలామటుకు సినిమాలను విడుదల చేయరు. అయిన అంతకుముందు రిలీజు డేట్లు దొరక్కుండా ఉన్న సినిమాలు ఈ నెలలో విడుదలకు నోచుకున్నాయి. మొత్తం 13 సినిమాలు విడుదలయ్యాయి. మార్చి 9న ‘ఏం మంత్రం వేశావే’, 16న ‘ఐతే 2.0’, దండుపాళ్యం–3తో పాటు మరో మూడు సినిమాలు వచ్చాయి. 17న మరో సినిమా విడుదలైంది. వాటి గురించి ప్రస్తావించాల్సిన పని లేదు. 23న నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘యంఎల్‌ఏ’, శ్రీవిష్ణు నటించిన ‘ నీదీ నాది ఒకే కథ’ చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు వచ్చాయి. అన్నింటిలోకి ‘నీది నాది ఒకే కథ’కు మాత్రమే ప్రేక్షకలు ఓకే అన్నారు. చివరి శుక్రవారం రిలీజైంది ‘రంగస్థలం’. రామ్ చరణ్ కెరీర్ మొత్తం ఒక ఎత్తు, ఈ సినిమాలోని రామ్‌చరణ్ నటన ఒక ఎత్తు అన్నట్టుగా ప్రేక్షకులు ఫిక్సయ్యారు. అబ్బురపరచే కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ అయిందనేంతగా కలెక్షన్లతో విరుచుకుపడింది. బాహుబలి తర్వాత టాప్ కలెక్షన్ల లిస్ట్‌లో మొదటిస్థానంలో ఈ సినిమా నిలిచింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సుకుమార్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టికి మంచి పేరు వచ్చింది. పాటలు ఇప్పటికీ టాప్ లిస్ట్‌లోనే ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా డీఎస్పీ మంచి ఫోక్ సింగర్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ‘ఆ గట్టునుంటావా నాగన్నా.. ఈ గట్టుకొస్తావా..’ పాట ద్వారా శివనాగులును, ‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ పాట ద్వారా రేలా కుమార్, వెంకటలక్ష్మిలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదటి మూడు నెలలు ముగిసే సరికి ‘రంగస్థలం’ పెద్ద హిట్‌గా మిగిలిపోయింది. ఏప్రిల్ అనే నేను... ఏప్రిల్ నెలలో సినిమా పరిశ్రమకు పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలు పరీక్షలు ముగించుకుని సినిమా థియేటర్ల వైపు చూస్తుంటారు. ఈ నెలలో మొత్తం పది సినిమాలు విడుదలయ్యాయి. మొదటివారం ఏప్రిల్ 5న త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఛల్ మోహన రంగ’. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనా, పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత రోజు ‘సత్యాగ్యాంగ్’ రిలీజై వెళ్లిపోయింది. రెండో వారంలో రిలీజైన పెద్ద సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. అప్పటి వరకు వరుస విజయాలతో జైత్రయాత్ర చేసిన హీరో నానికి చిన్న స్పీడ్ బ్రేకర్ పడిందనే చెప్పాలి. తను ఎంతో కష్టపడి ద్విపాత్రాభినయం చేశారు. పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడే పాత్ర ఒకటి, రాక్‌స్టార్ పాత్ర మరొకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది. ఏప్రిల్ మూడో వారంలో ‘భరత్ అనే నేను’ అంటూ వచ్చిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు భారీ హిట్ కొట్టారు. కొరటాల శివ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మహేశ్‌బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి కియరా అద్వాణీ తెలుగు తెరకు దిగుమతి అయ్యారు. ఏప్రిల్ నాలుగో వారంలో ‘ఆచారి ఆమెరికా యాత్ర’తో మంచు విష్ణు వచ్చినా, పెద్దగా సందడి చేయలేదు. మార్చిలో రామ్ చరణ్ సందడి చేస్తే ఏప్రిల్‌లో ఆ బాధ్యతను మహేశ్ కంటిన్యూ చేశారు. ‘మహానటి’ని ‘కీర్తి’ంచడ‘మే’ రామ్‌చరణ్, మహేశ్‌బాబుల తర్వాత నేను వస్తున్నానంటూ మే మొదటివారంలో వచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన నటించిన ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. చాలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్‌తో ప్రారంభమైనా, కలెక్షన్ల జోరును నిలుపుకోలేకపోయింది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మాటల రచయిత వక్కంతం వంశీ తన పనితనాన్ని నిరూపించుకోలేకపోయారు. ఈ ఏడాది విడుదలైన గొప్ప చిత్రాల్లో ఒకటైన ‘మహానటి’ 9న వచ్చింది. తెలుగువారి ఆరాధ్యనటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ సావిత్రే నటించిందా అన్నంత గొప్పగా నటించారు చిత్ర కథానాయిక కీర్తి సురేశ్. ఈ చిత్రం ద్వారా ఎనలేని కీర్తి సంపాదించారు నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్ అశ్విన్. ‘నా పేరు నిలబెట్టింది నా కూతురు’ అని మురిసిపోయారు వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్వనీదత్. సినిమాపై ఎన్నో రకాల విమర్శలు వినిపించినా, అవేవీ ప్రేక్షకులను థియోటర్లకు రప్పించకుండా ఆపలేక పోయాయి. ఈ నెల అంతా ఆ సినిమా పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా రిలీజైన రెండు రోజులకు అంటే మే 11న దర్శక–నిర్మాత పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘మెహబూబా’ విడుదలైంది. పూరి గారబ్బాయి ఫరవాలేదనిపించినా, కథలో ఉన్న కంటెంట్‌తో జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా ఎన్నో రోజులు నిలవలేక పోయింది. తర్వాత వారం ఎర్రసూర్యుడు ఆర్.నారాయణమూర్తి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు ఆవశ్యకతను తెలుపుతూ తీసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’ మే 18న విడుదలై, ఫరవాలేదనిపించుకుంది. మే చివరి వారంలో మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. హీరో రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, నాగశౌర్య హీరోగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’. ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. ‘సమ్మోహనం’ తొలకరింత జూన్ నెలలో మొత్తం తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి. నెల మొదటిరోజు రెండు చిత్రాలు విడుదలయ్యాయి. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆఫీసర్’. చాలా సంవత్సరాల తర్వాత వాళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రమిది. అనుకున్నంతగా సినిమా ఆడలేదు. నాగ్ ఫ్యాన్స్ ఆర్జీవీతో చేసిన సినిమా చూడనవసరం లేదనుకున్నారు. అదేరోజు రాజ్‌తరుణ్ నటించిన ‘రాజుగాడు’ విడుదలైంది. జర్నలిస్ట్ సంజనారెడ్డి ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆశించిన ఫలితం రాలేదు. మరుసటి వారం పెద్ద సినిమా ఏదీ రాలేదు. ఈ నెల 14న కళ్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’ ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. ఆ మర్నాడే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘సమ్మోహనం’ విడుదలైంది. సుధీర్ బాబు. అదితీరావు హైదరీ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్నన లు పొందింది. ఈ చిత్రంతో సుధీర్‌బాబు ఖాతాలో మరో హిట్ చేరింది. మే 21న కమేడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జంబలకిడి పంబ’ విడుదలైంది. ఇది పెద్దగా హడావిడి చేయలేదు. చివరి వారం మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో ట్రేడ్‌లో హల్చల్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన రెండో ప్రయత్నంగా తీసిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. మంచి సినిమాగా క్రిటిక్స్ మార్కులు వేసినా, యావరేజ్ అనిపించుకుంది. మాన్సూన్ ప్రిస్క్రిప్షన్ ఆర్ఎక్స్–100 జూలై నెలలో మొత్తం పదకొండు చిత్రాలు రిలీజయ్యాయి. గోపీచంద్ హీరోగా నటించిన ‘పంతం’ 5న విడుదలైంది. ఆ మర్నాడే మరో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్యూ’. కరుణాకరన్ దర్శకత్వంలో కె.యస్ రామారావు నిర్మించారు. ఇవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మరుసటి వారం 12న విడుదలైన చిత్రాలు ‘ఆర్ఎక్స్–100’, ‘విజేత’. వీటి ద్వారా ఇద్దరు కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఓ హీరో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి వచ్చారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. కంటెంట్ పరంగా బావున్నా ఇంకా ఏదో కావాలనిపించింది ప్రేక్షకులకి. మరో సినిమా ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా నటుడు కార్తికేయ పరిచయమయ్యాడు. యదార్థ సంఘటన ఆధారంగా లె రకెక్కిన ఈ చిత్రాన్ని పేక్షకులు ఆదరించారు. ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతికి చక్కటి అవకాశాలు వస్తున్నాయి. మూడో వారంలో విడుదలైన సినిమాలు ‘ఆట గదరా శివ’, ‘లవర్’, ‘వైఫ్ ఆఫ్ రామ్’ చిత్రాలు వచ్చాయి. ‘ఆ న లుగురు’ చిత్ర దర్శకుడు చంద్రసిద్ధార్థ చాలా కాలం తర్వాత ‘ఆట గదరా శివ’ చిత్రంతో బరిలోకి దిగాడు. ‘లవర్’ చిత్రం ద్వారా రాజ్‌తరుణ్ విజయం కోసం మరో ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం రాలేదు. మంచు లక్ష్మి నటించిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ఫరవాలేదనిపించింది. జూలై చివరి వారంలో ‘సాక్ష్యం’ చిత్రంతో పలకరించాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ప్రకృతి తలచుకుంటే ఎంతటి వినాశమైనా జరుగుతుంది అనే కాన్సెప్ట్‌తో పంచభూతాల సాక్షిగా శత్రు సంహారమే లక్ష్యంగా యాక్షన్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. ‘రా’సిపెట్టిన ‘గీత’ ఆగస్టు 3న ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రెండు చిత్రాల గురించి చెప్పుకోవాలి. అందులో ఓ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరు ‘చి.ల.సౌ’. సుశాంత్ హీరోగా నటించారు. చాలా కాలం తర్వాత హీరో సుశాంత్ మంచి కథను ఎన్నుకున్నాడనే చెప్పాలి. 24 గంటల వ్యవధిలో జరిగే సంఘటనలతో అల్లుకున్న చిత్రం ‘చి.ల.సౌ’. ఈ చిత్ర దర్శకునిగా మంచి మార్కులు కొట్టేసిన రాహుల్ రవీంద్రకు లడ్డూ లాంటి ఆఫర్ వచ్చింది. ఈ చిత్ర విజయంతో హీరో నాగార్జున తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్‌కు అవకాశం ఇచ్చారు. అదేరోజు విడుదలైన మరో చిత్రం ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా నటిస్తూ తను సొంతంగా రాసుకున్న కథతో ఈ సినిమా చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడమే కాకుండా, క్రిటిక్స్ దగ్గర మంచి పేరు సంపాదించింది. ‘గూఢచారి’ చిత్రంతో అడివి శేషు ‘రా’ ఏజంట్‌గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున మేనకోడలు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్ సుప్రియ 22 సంవత్సరాల తర్వాత ‘గూఢచారి’లో నటించటం విశేషం. ఈ చిత్రం ద్వారా శోభిత దూళిపాళ్ల హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ నెల రెండో వారం 9న విడుదలైన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వేగేశ్న సతీష్ దర్శకుడు. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ దర్శక, నిర్మాతల కాంబినేషన్లో గత ఏడాది విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తమ కాంబినేషన్లో మరోసారి ఈ ఫీట్‌ను రిపీట్ చేద్దామనుకున్నా, అది సాధ్యం కాలేదనే చెప్పాలి. మంచి నిర్మాణాత్మక విలువలతో రిలీజైన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తర్వాత వారం ఆగస్టు 15న రిలీజైంది విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’. ఏ అంచనాలు లేకుండా విడుదలైనా ట్రేడ్‌లో సంచలనంగా నిలిచింది. గీతా ఆర్ట్స్ పతాకంపై పరశురాం (బుజ్జి) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...’ పాట శ్రోతలను ఉర్రూతలూగించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్‌కు మరచిపోలేని విజయాన్ని మిగిల్చింది ‘గీత గోవిందం’. ఈ చిత్రం ద్వారా ‘ఛలో’ ఫేమ్ రష్మికా మండన్నా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. మరుసటి వారం 24న మరో మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం ‘నీవెవరో’. తాప్సీ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించారు. కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. సినిమా మంచి ప్రయత్నంగా మిగిలింది. చివరి వారంలో మరో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అవి: ‘సూపర్ స్కెచ్, ఃనర్తనశాల, పేపర్ బాయ్, సమీరం’ చిత్రాలు. వీటిలో నాగశౌర్య నటించిన ‘ఃనర్తనశాల’ మంచి హోప్‌తో విడుదలైనా, అంతగా ఆకట్టుకోలేకపోయింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘పేపర్ బాయ్’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణ బాధ్యతలు చేయటంతో ఆ చిత్రం మీద కొంత పాజిటివ్‌గానే ఓపెనింగ్స్ సాధించినా, యావరేజ్‌గా నిలిచింది. సక్సెస్ కేరాఫ్ రానా సెప్టెంబర్ మొదటివారం 7న ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘కేరాఫ్ కంచెరపాలెం’తో పాటు ‘అల్లరి’ నరేశ్, సునీల్ నటించిన ‘సిల్లీ ఫెలోస్’ మంచి పబ్లిసిటీతో విడుదలయ్యాయి. మిగతా సినిమాల గురించి పెద్దగా చర్చ అక్కరలేదు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమా విషయానికొస్తే ఒక మనిషి జీవితంలోని నాలుగు దశలను ఎంతో అద్భుతంగా దర్శకుడు వెంకటేశ్ మహా ఆవిష్కరించారని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన హీరో రానా గొప్పగా అనిపించడంతో ఈ సినిమాను తన భుజాలపై మోశాడనే చెప్పాలి. ఆ చిత్రంలో నటించిన ఒక్క నటుడూ ప్రపంచానికి తెలియకపోయినా ఆ సినిమాకి అంత గొప్ప మైలేజీ వచ్చిందంటే దానికి కారణం రానానే. మిగతా చిత్రాలు పెద్దగా ఆడలేదు. తరువాత శుక్రవారం మరో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో భార్య భర్తలు నాగచైతన్య, సమంతలు వారిద్దరి పెళ్లయ్యాక మొదటిసారి పోటీ పడ్డారు. ఈ ఇద్దరూ విడివిడిగా నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలై పోటీ పడ్డాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్గా విడుదలయ్యింది. సమంత నటించిన కన్నడ రీమేక్ మూవీ ‘యూటర్న్’ థ్రిల్లర్‌గా విడుదలై మంచి పేరు సంపాదించింది. కానీ రెండో వారంలో కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. నాగచైతన్య సినిమా కమర్షియల్‌గా ఫరవాలేదనిపించినా, కంటెంట్ పరంగా మంచి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. మూడో వారంలో మరో మూడు సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఓ చిత్రం ఎన్నో చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించిన విజయ్ మాస్టర్ తన కొడుకు రాహుల్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ ప్రేక్షకులను మాయ చేయలేకపోయింది. సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ మంచి ఎంటర్టైనర్ అనిపించుకున్నా, బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. ఈ నెల చివరి వారంలో నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ ‘దేవదాస్’ 27న విడుదలైంది. విడుదలైన అన్నిచోట్ల మంచి రిపోర్ట్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన మూడవ ప్రయత్నంగా తీసిన చిత్రంతో ఫుల్ హ్యాపీ. ఈ సినిమాలో నాని సరసన నటించిన ‘రష్మికా మండన్నా’ ‘దేవదాస్’ చిత్ర విజయం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. ‘విజయ’దశమి సమేత.. అక్టోబర్‌లో పది సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల మొదటివారంలో మూడు చిత్రాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ నటించిన మొదటి ద్విభాషా చిత్రం ‘నోటా’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. రెండు చోట్ల వ్యాపరపరంగా మంచి బిజినెస్ చేసిన ఈ చిత్రం నిరాశపరచింది. ఈ చిత్రం ద్వారా నిర్మాతలు బాగానే లాభాలు సంపాదించారు. కానీ సినిమా కొన్న బయ్యర్లు నష్టపోయారు. పబ్లిసిటీ పరంగా ఈ చిత్రం మార్మోగిపోయింది. ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులకు దసరా సందర్భంగా విడుదలైంది ‘అరవింద సమేత వీర రాఘవ’. యన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే మొదటివారం బెస్ట్ కలెక్షన్లను రాబట్టింది. యుద్ధం వల్ల వచ్చే నష్టాలను, యుద్ధం జరిగిన తరవాత పరిస్థితులను, యుద్ధంతో ఆరంభించి తన స్టైల్ ఆఫ్ విజన్‌ను కొత్తగా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు త్రివిక్రమ్. ఈ సినిమాలోని యన్టీఆర్ నటన పరిణతి చెందినట్లు కనపడింది. ఈ సినిమాలోని సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని, తన అనుభవాన్నంతా జోడించి, టాలెంట్‌తో ఒడిసిపట్టి ప్రేక్షకులకు వీనుల విందైన సంగీతాన్ని అందించారు తమన్. నెల మూడో వారంలో ‘హలో గురూ ప్రేమ కోసమే’ అంటూ వచ్చారు హీరో రామ్. క్యూట్ లవ్ స్టోరీస్‌ను చక్కగా తెరకెక్కించే ‘దిల్’ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా, నానీతో ‘నేను లోకల్’ తీసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ఫలితాన్నే సాధించింది. రామ్, ప్రకాశ్‌రాజ్, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత సుభాష్ నటనను అందరూ ప్రశంసించారు. చివరి వారంలో మరో నాలుగు చిత్రాలు విడుదలైనా, అవేవీ ఏమాత్రం రాణించలేదు. చక్రం తిప్పిన ట్యాక్సీవాలా నవంబర్ 2న మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీమూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా తమిళ హీరో మాధవన్‌ను విలన్‌గా పరిచయం చేశారు. ఒక మనిషి రెండు చేతుల్లో రెండు రకాలైన స్పందనలు ఉంటే ఆ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో, తన రెండు చేతుల్లో రెండు రకాలైన మనుషులు, రెండు చేతులకు రెండు రకాలైన ఆలోచనలు ఉండే మనిషి ఏ విధంగా ఉంటాడో నాగచైతన్య క్యారెక్టర్ ద్వారా చెప్పటానికి ప్రయత్నించారు దర్శకుడు చందూ. అయితే, ఈ సినిమా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. మంచి హిట్ మూవీస్‌తో ముందుకెళ్తున్న మైత్రీమూవీస్ సంస్థకు ఈ చిత్రంతో తన మొదటి ఫ్లాప్‌ను మూటకట్టుకుంది. ఈ నెల 7న నటుడు, దర్శకుడు రవిబాబు పందిపిల్లతో చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీ ‘అదుగో’ విడుదలైందని జనాలకు తెలిసే లోపే వెళ్లిపోయింది. 8న ‘కర్త కర్మ క్రియ’ అనే చిన్న సినిమాను కోటి రూపాయల ఖర్చుతో తీసుకొచ్చారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నాగు గవర దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రిటిక్స్ మంచి ప్రయత్నం అన్నారు గానీ ప్రేక్షకులు ఆదరించలేదు. తర్వాత వారం రవితేజ, ఇలియానా జంటగా నటించగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మాణంలో విడుదలైన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత రోజు విడుదలైంది ‘టాక్సీవాలా’. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ నటించిన ఈ చిత్రానికి జీఏ2, యూవీ పిక్చర్స్ పతాకంపై ఎస్కెఎన్ నిర్మించారు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హవాతో మొదటిరోజు వచ్చిన కలెక్షన్‌తో సినిమాకి పెట్టిన ఖర్చంతా వచ్చేసిందని చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాతో 2018లో విజయ్ దేవరకొండవి ముచ్చటగా మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నెల 22న ‘శరభ’ చిత్రం విడుదలయ్యింది. కత్తి కథ నాదంటూ తమిళ నిర్మాతలపై కేసు వేసి గెలిచిన నరసింహారావు ఈ చిత్రంతో మొదటిసారి దర్శకునిగా పరిచయమయ్యారు. ప్రముఖ నటి జయప్రద ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా రాణించలేదు. నవంబర్ 23న ఐదు చిత్రాలు వచ్చాయి. వాటిలో హెబ్బా పటేల్, అదిత్ జంటగా నటించిన బోల్డ్ సినిమా ‘24 కిస్సెస్’ ఒకటి. సినిమా బోల్డ్‌గా ఉన్నా ప్రేక్షకులు అంత బోల్డ్‌నెస్‌ని ఒప్పుకోలేదు. కొత్త దర్శకుల హవా ఈ ఇయర్ కొత్త దర్శకులు టాలీవుడ్లో మోత మోగించారు. ‘ఛలో’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఆ చిత్రవిజయంతో ఇమ్మిడియేట్‌గా హీరో నితిన్ సినిమాను పట్టాలెక్కించారు. ‘తొలిప్రేమ’ ఇచ్చిన కిక్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి రెండో ప్రయత్నంగా ‘మిస్టర్ మజ్ను’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటిస్తున్నారు. ‘అ!’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మొదటి ప్రయత్నంతోనే శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు హీరో రాజశేఖర్‌తో సినిమా రూపొందిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ కిక్ తో మంచి హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ ఇచ్చిన హిట్‌తో వెంకటేశ్ మహా మరో సినిమా బిజీలో ఉన్నారు. ‘టాక్సీవాలా’తో హిట్ కొట్టిన మరో దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 2018లో సీనియర్ దర్శకులు గడ్డుకాలాన్నే ఎదుర్కొన్నారు. సీనియర్ దర్శకుల్లో వీవీ వినాయక్ ‘ఇంటిలిజెంట్’, పూరీ జగన్నాథ్ ‘మెహబూబా’ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘తేజ్ ఐ లవ్యూ’లతో పాటు శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ అంటోని’తో నిరాశపరచారు. ‘రంగస్థలంతో’ ఫెయిర్ íß ట్ను అందుకున్నారు సుకుమార్. త్రివిక్రమ్ 50–50 మార్కులతో ఓ పెద్ద ఫ్లాప్ ‘అజ్ఞాతవాసి’కి, ‘అరవింద సమేత’ లాంటి మంచి హిట్‌తో లెక్క సరిచేశారు. 2019ని హ్యాపీగా ప్రారంభించటానికి రెడీ అయ్యారు. కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తన రెండవ సినిమా ‘మహానటి’తో సంచలనం సృష్టించారు దర్శకుడు నాగ్ అశ్విన్. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సినిమా ఇండస్ట్రీలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘గీత గోవిందం’తో విజయ్ దేవరకొండకు కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్‌ను ఇవ్వడం ద్వారా దర్శకుడు పరశురాం (బుజ్జి) తన సత్తా నిరూపించుకున్నారు. ‘గీత’ తారుమారు అనూ ఇమ్మన్యుయేల్ ఈ సంవత్సరం అన్నీ టాప్ హీరోల సినిమాల్లోనే నటించింది. పవన్‌కళ్యాణ్ సరసన జనవరిలో విడుదలైన ‘అజ్ఞాతవాసి’, మేలో విడుదలైన అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’చిత్రంలోను, ‘శైలజారెడ్డి అల్లుడు’లో నాగచైతన్య సరసన నటించారామె. మామూలుగా అయితే ఈ ఇయర్ టాప్ హీరోయిన్ ఆమె అనుకోవాలి. కానీ ఫలితాలు తారుమారవడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయనే అనుకోవాలి. కంటితుడుపు ఏంటంటే 2018 బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారామె. ‘ట్వంటీ ప్లస్’ డిసెంబర్ ఏడాది చివరి నెల అయిన ఈ డిసెంబర్లో దాదాపు ఇరవైకి పైగా చిత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన ‘కవచం’ ఒకటి. ఇదివరకటి సినిమాల కంటే ఈ చిత్రంలో హీరో శ్రీనివాస్ నటనలో పరిణతి కనిపించింది. కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. నూతన దర్శకుడు మామిళ్ల శ్రీనివాస్ ఈ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో సుమంత్ ప్రధాన పాత్రలో విడుదలైన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. నూతన దర్శకుడు సంతోశ్ జాగర్లమూడి దర్శకత్వంలో, నూతన నిర్మాత బీరం సుధాకర రెడ్డి నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో సందీప్ కిషన్, నవదీప్ , శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 7న విడుదలైన మరో చిత్రం ‘శుభలేఖ+లు’. ఈ చిత్రాన్ని నూతన నటీనటులు, నూతన దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఇవికాకుండా ఈ నెలలో రెండో శుక్రవారం రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ‘భైరవగీత’ విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నారు. అదేరోజు ‘హుషారు’, ‘అనగనగా ఓ ప్రేమకథ’, మరుసటి వారం వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘అంతరిక్షం’, శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘పడిపడిలేచె మనసు’లు విడుదలవుతున్నాయి. ఇవికాక చివరి వారంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లఫ్‌మాస్టర్’, నిఖిల్ నటించిన ‘ముద్ర’తో పాటు ఈ నెలలో డబ్బింగ్ వాటితో కలుపుకొని మరో పది చిత్రాల దాకా విడుదల కానున్నట్లు సమాచారం. డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ అంతంతే! 2018లో మొత్తం 34 డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 26 తమిళ చిత్రాలు, 4 మలయాళ చిత్రాలు, 2 కన్నడ, 2 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. పేరుకి డబ్బింగ్ చిత్రాలే కానీ, సినిమా బాగుంటే తెలుగు వారికి భాషాబేధం ఉండదు అనే విషయం చాలాసార్లు రుజువయ్యింది. గత ఏడాది రిలీజైన ‘బిచ్చగాడు’ చిత్రమే ఉదాహరణ. గతంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గినట్లే. క్వాలిటీ చిత్రాలు ఏ భాషలో అయినా 15 నుంచి 20 శాతం మాత్రమే. ఈ సంవత్సరం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ అంటూ జూన్ 7న, ‘2.ఓ’తో నవంబర్ 29న రెండుసార్లు దర్శనమిచ్చారు. ‘కాలా’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయకపోయినా, ‘2.ఓ’ భారీ బిజినెస్ చేసింది. ఒక ఫ్లాప్, ఒక హిట్‌తో లెక్క సరిచేశారు రజనీకాంత్. ఆయన దారిలోనే హీరో విక్రమ్ నటించిన ‘స్కెచ్’ ఫిబ్రవరి 23న, ‘సామి’ సెప్టెంబర్ 21న విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచాయి. తమిళ మాస్ హీరో విశాల్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేశారు. జూన్ 1న వచ్చిన ‘అభిమన్యుడు’ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. అలాగే తనని మాస్ హీరోగా తెలుగు తెరపై సెటిల్ చేసిన చిత్రం ‘పందెంకోడి’. 2005లో వచ్చిన ఈ చిత్ర సీక్వెల్ పదమూడేళ్ల తర్వాత ఈ ఏడాది ‘పందెంకోడి–2’గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కూడా 2018లో రెండుసార్లు తెలుగు తెరపై సందడి చేశారు. ఈసారి ఆయన చిత్రాల్లో ఒకటి ‘కాశి’, మరోటి ‘రోషగాడు’. రెండు చిత్రాలూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ హీరోలే కాకుండా కమల్ హాసన్, సూర్య, కార్తీ, ప్రభుదేవా చిత్రాలు కూడా విడుదలైనా, అవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ‘జయం’రవి నటించిన ‘టిక్ టిక్ టిక్’ చిత్రం మంచి ప్రయత్నం అన్నారు ప్రేక్షకులు. విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం ట్రేడ్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మలయాళం నుండి 4 చిత్రాలు విడుదలైతే అందులో మమ్ముట్టి ఓ చిత్రం (ది ట్రైన్), ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్వి రెండు చిత్రాలు ‘అతడే’, ‘జనతా హోటల్’ విడుదలయ్యాయి. వీటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. హిందీ చిత్ర సీమ నుంచి రెండు చిత్రాలు ‘పద్మావత్’, ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ వచ్చాయి. దీపికా పదుకొనే పద్మావతిగా మురిపిస్తే, ఆమిర్ ఖాన్ తన హిట్ ఫార్ములా చార్మ్‌ను నిలుపుకోలేకపోయాడు. లక్కీ రష్మికా ఫిబ్రవరిలో విడుదలైన ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు కన్నడ నటి రష్మికా మండన్నా. ఆ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆమె తన తదుపరి చిత్రం ‘గీత గోవిందం’ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘దేవదాస్’ చిత్రంలో నాని సరసన నటించిన ఆమె ముచ్చటగా మూడు విజయాలను సొంతం చేసుకున్నారామె. – శివ మల్లాల -
ఘనంగా ప్రారంభమైన ఇండీవుడ్ 2018 ఫిల్మ్ కార్నివల్
-
టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: హిట్టా.. ఫట్టా?
ఒక బ్లాక్ బస్టర్ హిట్. మరొక బంపర్ హిట్. చరిత్రలో నిలిచిపోయే ఒక క్లాసిక్ హిట్. మరికొన్ని సూపర్హిట్లు, ఇంకొన్ని యావరేజ్ మూవీలు, కొన్ని డిజాస్టర్లు.. ఈ ఏడాది ప్రథమార్థం టాలీవుడ్ ప్రస్థానం ఇలా సాగింది. లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా.. అన్నట్లు ఈ ఏడాది సమర్లో, ప్రథమార్ధం చివర్లో వచ్చిన సినిమాలు ఇచ్చిన కిక్‌ను ఎప్పటికీ మరిచిపోలేరు సినీ అభిమానులు. ఈ ప్రథమార్దంలో టాలీవుడ్ పరిస్థితి ఏంటో ఓ సారి లుక్కేద్దాం. మరిచిపోలేని దెబ్బ... ఈ ఏడాది ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమా కేవలం అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కు మరిచిపోలేని దెబ్బ. ఈ సినిమా పేరేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే రికార్డులకు చిరునామాగా ఉంటుందని ఆశిస్తారు అభిమానులు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసి అతి పెద్ద డిజాస్టర్‌గా రికార్డుకెక్కింది. అజ్ఞాతవాసి చిత్రంతో తివిక్రమ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. పవన్ కూడా సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు వచ్చేశారు. ఈ దెబ్బను కొంతవరకు మరిపించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. ‘జై సింహా’తో వచ్చి పర్వాలేదనిపించారు. మూస ధోరణి కథతో వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అజ్ఞాతవాసి దారుణంగా బెడిసికొట్టడం.. పండుగ సీజన్ కావడం.. ఈ సినిమాకు కలిసొచ్చింది. అయితే టాలీవుడ్‌కు సంక్రాంతి సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ సంక్రాంతి మాత్రం ప్రేక్షకుల దాహాన్ని తీర్చలేకపోయింది. సరైన బ్లాక్‌బస్టర్ లేక సినీ అభిమానులు నిరాశ చెందారు. రంగుల రాట్నం, ఇగో చిత్రాలు వచ్చినట్టు కూడా తెలియలేదు. విజయానికి బాట వేసిన అనుష్క... రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ‘భాగమతి’ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు నడిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి విజయాలు సాధిస్తున్న అనుష్క ఖాతాలో సూపర్‌హిట్‌గా నిలిచింది భాగమతి. హారర్, మెసెజ్ ఓరియెంటెడ్, అనుష్క అభినయం.. ఇలా సినిమాన హిట్ బాట పట్టించాయి. పిల్ల జమీందార్ సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ అశోక్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. రికార్డుస్థాయి కలెక్షన్లు కాకపోయినా... హౌస్‌ఫుల్‌తో థియేటర్లు కలకలలాడాయి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్... చిన్న సినిమానే అయినా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపి ‘ఛలో’ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరవడమే ఈ సినిమా మొదటి సక్సెస్. నాగశౌర్య తన సొంత బ్యానర్‌పై చేసిన మొదటి ప్రయత్నమే భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. కామెడీకి పెద్ద పీట వేస్తూ.. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ ఏడాదిలో బెస్ట్ సాంగ్స్ లిస్ట్‌ను తీయాల్సి వస్తే.. అందులో కచ్చితంగా ఈ సినిమాలోని చూసి చూడంగానే.. అనే పాట ఉండాల్సిందే. ఎందుకంటే అంతలా ఈ పాట యూత్‌కు దగ్గరైంది. మొదటి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా వెంకీ కుడుముల తన ప్రతిభను చాటుకున్నారు. ఇక ఇదే నెలలో వచ్చిన రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఆయన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రాహుల్ రవీంద్రన్ హీరోగా వచ్చిన ‘హౌరాబ్రిడ్జ్’ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది. మోహన్‌బాబు మళ్లీ తమ కుటుంబ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాయత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది దారుణంగా దెబ్బకొట్టింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్, మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ కాంబోలో వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమా ఇద్దరి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా టాలీవుడ్‌కు ఫిబ్రవరిలో దెబ్బ మీద దెబ్బ పడుతుంటే.. మళ్లీ మెగా హీరో రూపంలోనే టాలీవుడ్ పైకి లేచింది. వరుణ్‌తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమా హిట్‌గా నిలిచింది. వెంకీ అట్లూరి సినిమాను మలిచిన విధానం అందరికీ నచ్చింది. ఈ సినిమా క్లాస్ హిట్‌గా వరుణ్ కెరీర్లో స్థిరపడిపోయింది. ఇక తరువాతి వరుసలో ఉన్న సినిమా.. నాని నిర్మాతగా వ్యవహరించి తీసిన ‘అ!’. ఈ సినిమా అందరికీ ఎక్కకపోవడంతో యావరేజ్ టాక్‌తో ఓ మోస్తరుగా నడిచింది. ఈ సినిమా ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చింది. చాలా కాలం తరువాత మళ్లీ తరుణ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’.. కానీ తన లవ్ స్టోరీ ఎవ్వరికీ నచ్చలేదు. తరుణ్ చేసిన ఈ ప్రయత్నం వృథాగా పోయింది. ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తుర్ జంటగా నటించిన ‘మనుసుకు నచ్చింది’ సినిమా ప్రేక్షకులకు నచ్చకుండాపోయింది. ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రచయిత’ సినిమా బాగానే ఉన్నా.. ఇలాంటి చిన్న సినిమాలకు ఆదరణ అంతగా ఉండదు. సోడా గోలిసోడా, చల్తే చల్తే, హైద్రాబాద్ లవ్‌స్టోరీ, జువ్వా, రా..రా.., ఏ మంత్రం వేశావే, ఐతే 2.0, దండుపాళ్యం 3, అనగానగా ఒక ఊళ్లో.. ఇలా హీరోలు ఎవరో కూడా తెలియని సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. దీంట్లోనే ఒక ఆశాకిరణంలా.. నిఖిల్ ‘కిరాక్‌పార్టీ’ సినిమా వచ్చినా పార్టీ చేసుకుని ఆనందించేంతగా సినిమా మెప్పించలేకపోయింది. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన ‘ఎమ్మెల్యే’ సినిమా కాస్త పర్వాలేదనిపించినా.. రొటిన్ ఫార్మూలాతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా చేరుకోలేకపోయింది. కన్నడ రీమేక్‌గా రానా వాయిస్ ఓవర్‌తో సినిమాకు హైప్ తీసుకొచ్చినా.. ‘రాజారథం’ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘నీదీ నాదీ ఒకే కథ’ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎంతైనా చిన్న సినిమా కాబట్టి దాని పరిధిలో విజయం సాధించింది. హీరోగా శ్రీవిష్ణు తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ సినిమా వచ్చిన సమయం మాత్రం కరెక్ట్ కాదేమో. అదే ఈ సినిమా ఇంకొంచెం ముందుగా వస్తే కలెక్షన్లు కూడా బాగానే వచ్చేవి. ఎందుకుంటే మార్చి చివరి నుంచి బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ మొదలైంది. మార్చి చివర నుంచి టాలీవుడ్ అలుపెరుగకుండా రికార్డులను మార్చుకుంటూ ఉంది. మార్చి చివరి తేదీన వచ్చి ఏప్రిల్ మొత్తం కలెక్షన్ల తుఫాను తెచ్చింది రంగస్థలం. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పింది. థియేటర్స్‌కు రిపిటెడ్ ఆడియెన్స్‌ను రప్పించడం కష్టమవుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఇదంతా సుకుమార్ మాయ. రామ్‌చరణ్, సమంతల అద్భుతమైన నటన, దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం, 1980నాటి గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన రత్నవేలు.. ప్రతీ పాత్రకు జీవం పోసిన ఆయా నటీనటులు వెరసి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. ఈ ప్రవాహంలో వచ్చి కొట్టుకుపోయిన సినిమా ‘ఛల్ మోహనరంగా’. నితిన్ హీరోగా.. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ఎంటర్టైనింగ్గా పర్వాలేదనిపించినా.. రిలీజ్ చేసిన టైమ్ కరెక్ట్ కాకపోయే సరికి.. ప్రేక్షకులకు ఎక్కలేదు. ఎందుకంటే అప్పటికే రంగస్థలం ఫీవర్‌తో టాలీవుడ్ ఊగిపోతూ ఉంది. రంగస్థలంతో చెర్రీ కొత్తగా ట్రై చేశాడని అందరూ చెప్పుకుంటూ ఉన్న ఆ తరుణంలో.. న్యాచురల్స్టార్గా.. చేసే ప్రతీ సినిమాలో కొత్త దనం ఉండేలా చూసుకుంటాడని పేరున్న నాని ‘కృష్ణార్జున యుద్దం’ లాంటి మూస ధోరణి సినిమాను చేసి దెబ్బతిన్నాడు. మొదటిసారిగా నానిపై విమర్శలు మొదలయ్యాయి. ఈ విధంగా రంగస్థలం ఎఫెక్ట్ నానిపై కూడా పడింది. ఇలా రంగస్థలం హవా కొనసాగుతూ ఉంటే.. దానికి అడ్డుకట్ట వేసే పనిని మహేష్ బాబు తీసుకునే ప్రయత్నం చేశాడు. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా వచ్చి మళ్లీ టాలీవుడ్ రికార్డులకు పని చెప్పింది. కేవలం తెలుగులోనే కాక ఓవర్సిస్లో కూడా రికార్డులు పరిగెత్తేలా చేశాయి రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు. ఇవి రెండూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. దానికి తగ్గట్లే నిర్మాతలు కలెక్షన్లను ప్రకటించేవారు. ఇక సోషల్ మీడియాలో అభిమానుల హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ.. ఇరు వర్గాల అభిమానులు దాడికి దిగడం జరిగింది. అయితే లాంగ్ రన్లో రంగస్థలం నెలకొల్పిన రికార్డులకు అతి చేరువలో భరత్ అనే నేను నిలవడం గమనార్హం. విచిత్రమేమిటంటే.. అమెజాన్ ప్రైమ్‌లో రంగస్థలం సినిమాను విడుదల చేసినా.. ఇంకా కొన్ని థియేటర్లరో విజయవంతంగా నడుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ పనిపడుతుండగా.. ఆచారి అమెరికా యాత్ర, కణం, ఎందరో మహానుభావులు లాంటి సినిమాలు నిలవలేకపోయాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వచ్చిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. పెద్దగా ప్రభవాన్ని చూపలేకపోయింది. వరుస విజయాలతో ఊపుమీదున్న అల్లు అర్జున్ కెరీర్లో యావరేజ్‌గా మిగిలిపోయింది. టాలీవుడ్లో క్లాసిక్ హిట్.. రంగస్థలం, భరత్ అనే నేను రెండు సినిమాల వైపే జనం వెళ్తుండగా.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సావిత్రి జీవిత గాథ ‘మహానటి’ సినిమాతో అందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ ఏడాదిలోనే కాక.. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మహానటి అందరి మనుసుల్లో నిలిచిపోయింది. కీర్తి సురేశ్ మహానటి సావిత్రిగా అభినయించిన తీరుకు ప్రేక్షక లోకమే కాకుండా సెలబ్రెటీ ప్రపంచం కూడా స్తంభించిపోయి.. ప్రశంసల జల్లును కురిపించింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరపై ఆవిష్కరించిన తీరుకు సినీలోకం ఆశ్చర్యపోయింది. ఇక బయోపిక్ చిత్రాలను తెరకెక్కించాలంటే మహానటి సినిమా ఓ నిఘంటువుగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని వివాదాలు చుట్టిముట్టినా...అవేవీ సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. నేటికీ ఈ సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతోంది. మూడు సినిమాల ప్రభంజనంలో... రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లలో పాగా వేసి కూర్చున్నాయి. అయితే వీటి తరువాత వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాయి. వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోయాయి. చాలా గ్యాప్ తరువాత పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా మెహబూబా. ఇది మళ్లీ తనకు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని పూరీ అభిప్రాయపడ్డారు కానీ.. ఈ సినిమా కూడా పూరికి ఏమాత్రం కలిసిరాలేదు. ఆర్ నారాయణ మూర్తి నటించిన అన్నదాత సుఖీభవ, రవితేజ నేల టిక్కెట్టు ఏ మాత్రం ప్రేక్షకులను థియేటర్ల వైపు వచ్చేలా చేయలేకపోయాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో సినిమా అంటే అప్పుడెప్పుడో వచ్చి ట్రెండ్‌సెట్ చేసిన శివ సినిమా రేంజ్లో ఊహించుకుంటారు అభిమానులు. కానీ ఈ ఏడాది వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా చూస్తే.. మళ్లీ వర్మ సినిమా అంటే ప్రేక్షకులు భయపడేలా చేశాడు. నాగార్జున కెరీర్‌నే దెబ్బకొట్టేంతగా బెడిసికొట్టింది ఈ సినిమా. కనీసం వారం తిరక్కముందే థియేటర్స్ నుంచి తీసేసే పరిస్థితి వచ్చింది. నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ ఓకే అనిపించగా, రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ మళ్లీ బోర్ కొట్టించాడు. కళ్యాణ్ రామ్ కాస్త విభిన్నంగా ట్రై చేసిన ‘నా నువ్వే’ ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయింది. సమ్మోహితుల్ని చేస్తోన్న సినిమా... ఇంద్రగంటి మోహన్‌కృష్ణ సినిమాలకు ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్మెన్, అమీ తుమీ ఇలా ప్రతి సినిమాను ఓ ప్రత్యేకమైన శైలిలో తెరకెక్కించారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’.. నిజంగానే సినిమా చూసిన ప్రతిఒక్కరినీ సమ్మోహితుల్ని చేస్తోంది. సినిమాను తెరకెక్కించిన విధానం, హీరో హీరోయిన్ల నటన, సీనియర్ నటుడు నరేష్ పండించిన హాస్యం ఈ సినిమా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా మాత్రమే ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. కమెడియన్ కమ్ హీరో అయిన శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన చిత్రం జంబలకిడిపంబ.. అప్పటి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా జూన్ చివరి వారంలో దాదాపు పదకొండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో చెప్పుకోదగ్గవి ఓ రెండు మూడు సినిమాలే. పెళ్లి చూపులు సినిమా తరువాత తరుణ్ భాస్కర్ నుంచి మళ్లీ ఇంకో సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంది. అయితే పెళ్లి చూపులు నాటి మ్యాజిక్ రిపీట్ కాలేదంటూ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఇంకో రెండు వారాలు గడిస్తే కానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటో చెప్పలేం. షకలక శంకర్ కమెడియన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో హీరోగా మారి చేసిన చిత్రం ‘శంభో శంకర’. కానీ ఈ సినిమా శంకర్‌ను హీరోగా నిలబెట్టడంలో ఏమాత్రం సహాయపడలేదు. ఈ ప్రథమార్దంలో వచ్చిన డబ్బింగ్ చిత్రాల్లో అంతగా జోరు చూపించినవి రెండు సినిమాలే. అందులో ఒకటి సూపర్‌స్టార్ సినిమా ‘కాలా’, విశాల్ ‘అభిమన్యుడు’. కాలా సినిమా అంచనాలు అందుకోలేక చతికిలపడిపోయింది. కబాలి రేంజ్ కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఇక విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు విశాల్ సినీ కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించి, రికార్డు కలెక్షన్లు సాధించింది. డబ్బింగ్ సినిమా అయినా.. ఒరిజినల్ తెలుగు సినిమా రేంజ్లో కలెక్షన్లను సాధించింది. ఇలా ఈ ప్రథమార్దం.. టాలీవుడ్ ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. ఎంత పాతాళానికి తోసేసే సినిమాలు వచ్చినా.. ఆకాశంలో తారగా ఎప్పటికీ నిలిచిపోయే.. ఎప్పటికీ తలెత్తుకునేలా చేసే సినిమాలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈసారి కొందరు హీరోలకు, హీరోయిన్లకు బాగానే కలిసివచ్చింది. మరికొందరికి నిరాశే మిగిలింది. ప్రథమార్దానికి వీడ్కోలు చెబుతూ.. ద్వితీయార్దానికి స్వాగతం చెబుతాం. కాకపోతే... ఈ ద్వితీయార్దంలో ఎలాంటి ఆసక్తి ఉండకపోవచ్చు. పెద్ద హీరోలు సినిమాలేవీ రిలీజ్ కాకపోవచ్చు. దసరాకు కేవలం ఎన్టీఆర్ అరవిందసమేతగా రానున్నాడు. ఇది మినహా ఇంతవరకు ఏ పెద్ద సినిమా కూడా దసరాకు రాబోతున్నట్లు ప్రకటించలేదు. టాలీవుడ్‌కు సెకండాఫ్ కూడా కలిసిరావాలని ఆశిద్దాం. - బండ కళ్యాణ్ టాలీవుడ్లో ఈ ఏడాది ప్రథమార్థం వచ్చిన సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమిటి? మీ అభిప్రాయం పంచుకోండి -
కేజీబీవీల్లో ఇంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, కరీంనగర్ ఎడ్యుకేషన్ : బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఇంటర్ బోధనకు ఈవిద్యా సంవత్సరం నుంచే గ్రీన్‌సిగ్నల్ లభించింది. అనాథలు, పేద కుటుంబాల బాలికలకు పాఠశాలస్థాయి విద్యను అందిస్తున్న వీటిలో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కస్తూరిభా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించేందుకు చొరవ చూపారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేలా విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లల్లో మునిగింది. నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొదటిగా నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నియోజకవర్గంలోని సప్తగిరికాలనీ లో కేజీబీవీ పాఠశాల, చొప్పదండిలోని గంగాధర, మానకొండూర్‌లోని శంకరపట్నం, హుజూరాబాద్‌లోని జమ్మికుంట కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్, శంకరపట్నం, జమ్మికుంట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, గంగాధర కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. వీటిల్లోను రెండింట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు, రెండింట్లో సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులను ఏర్పాటు చేశారు. ఒక్క కోర్సులో 40 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పాఠశాలల్లో 160 సీట్లను భర్తీ చేయనున్నారు. పదో∙తరగతి పూర్తి చేసినవారితోపాటు, ఇతర పాఠశాలల్లో చదివిన వారు కూడా ప్రవేశాలు పొందవచ్చు. బోధనతో పాటు ఉచిత వసతి, భోజనం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పించనుంది. 13 వరకు దరఖాస్తుల గడువు కేజీబీవీల్లో ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 13లోగా దరఖాస్తులు సమర్పించాలని డీఈవో వెంకటేశ్వర్లు సూచించా రు. అనాథలు, నిరుపేదలు పదో తరగతి పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాస్టల్ వసతి కల్పిస్తామని, ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 25నుంచి తరగతులు తెలుగు మీడియంలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. సిబ్బంది నియామకం ప్రస్తుతం కేజీబీవీల్లో సిబ్బంది కొరతతో సతమ తం అవుతున్నారు. కొత్తగా నాలుగుచోట్ల ఇంటర్ ప్రవేశపెడుతుండడంతో బోధకుల కొరత సమస్యగా మారింది. పోస్టుగ్రాడ్యుయేట్ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(పీజీసీఆర్టీ)లను నియామకం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒప్పంద పద్ధతిలో నియామకాలు ఉంటాయని, గౌరవ వేతనం రూ.23 వేల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఆంగ్లం, బోటనీ, జువా లజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, జనరల్ ఫౌం డేషన్ నర్సింగ్ కోర్సులతోపాటు 28 పోస్టులు ఉ న్నాయని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.