Prabhas Says Collaboration With Ram Charan At Kalki Launch - Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ స్టార్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్‌

Published Fri, Jul 21 2023 12:41 PM | Last Updated on Fri, Jul 21 2023 1:00 PM

Prabhas Says Confirm With Ram Charan Movie - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ప్రాజెక్ట్‌ కె టైటిల్‌,గ్లింప్స్‌ కోసం ఎదురు చూశారు. దానికి సంబంధించిన వివరాలను ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’  వేడుకలో ప్రదర్శించారు. ఈ సినిమాకు   ‘కల్కి 2898 ఏడీ’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. మేకర్స్‌. ఇప్పటికే విడుదలైన  సినిమా గ్లింప్స్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది.

(ఇదీ చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి)

కొద్దిరోజుల క్రితం ప్రభాస్‌ సినిమాలపై ఇలా పలు విమర్శలు వచ్చాయి. ఆదిపురుష్‌ కథ, సలార్‌లో కనిపించన ప్రభాస్‌ లుక్‌ , ప్రాజెక్ట్‌ కె సినిమా మొదటి పోస్టర్‌.. ఇలా పలు విషయాల్లో ఎన్ని వివాదాలు వచ్చినా ఇప్పటి వరకు ప్రభాస్‌ ఎక్కడా నోరు  విప్పలేదు. నేడు కల్కి సినిమా కార్యక్రమంలో  రాజమౌళి, రామ్ చరణ్‌ల గురించి ప్రభాస్‌ తొలిసారి మాట్లాడారు. భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరని ప్రభాస్‌ పేర్కొన్నారు. ఆయన నుంచి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చాలా గొప్పదని ఆ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం ఒక భారతీయుడిగా ఎంతగానో గర్వపడుతున్నట్లు చెప్పాడు.

(ఇదీ చదవండి: కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే: అల్లు అర్జున్‌)

ఆ సినిమాకు వచ్చిన ఆస్కార్‌ అవార్డు భారతదేశ ప్రజలందరికీ దక్కిన గొప్ప గౌరవంగా అందరూ భావించాలని తెలిపాడు. ఇలాంటి గొప్ప అవార్డులకు రాజమౌళి ఖచ్చితంగా అర్హుడేనని చెప్పాడు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తనకు మంచి స్నేహితుడని. అన్నీ కలిసి వస్తే ఏదో ఒక రోజు తామిద్దరం కలిసి కచ్చితంగా ఓ సినిమా చేస్తామని ప్రభాస్‌ ప్రకటించాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌-చెర్రీ కాంబినేషన్‌ అదిరిపోయింది. మళ్లీ ఇలా మరో కాంబోలో సినిమా వస్తే పండుగేనని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement