సినిమాల్లో స్టార్ కాంబోలు సరే.. మరి సక్సెస్ రేట్? | Star Combinations Movies Success Rate | Sakshi
Sakshi News home page

Pan India Movies: వేరే లెవల్ కాంబినేషన్స్.. కానీ హిట్ సంగతి?

Published Mon, Jun 26 2023 7:11 PM | Last Updated on Mon, Jun 26 2023 7:48 PM

Star Combinations Movies Success Rate - Sakshi

ఓ సినిమా నచ్చాలంటే ఏముండాలి అని అడగ్గానే చాలామంది 'హీరో' పేరే చెబుతారు. కానీ అన్నిసార్లు ఈ ఒక్కడి వల్లే హిట్ కొట‍్టలేరు. కరెక్ట్‌గా చెప్పాలంటే మూవీలో అంతకు మించి ఉండాలి. అందుకు తగ్గట్లే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టోరీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ యాక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ హీరో ఏమో గానీ అమితాబ్, కమల్ లాంటి ఉద్దండులూ ఇందులో ఉన్నారు. మరి ఇలా స్టార్ కాంబినేషన్స్ తో గతంలో వచ్చిన సినిమాలేంటి? వాటి సక్సెస్ రేట్ ఎంత?

బాహుబలి (2015, 2017)
తెలుగు సినిమా చరిత్రని మార్చేసిన సినిమాగా 'బాహుబలి' చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇక‍్కడ క్లియర్ చెప్పుకోవాల్సి పాయింట్ ఏంటంటే.. ఇందులో నటించిన యాక్టర్స్ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్ దగ్గర నుంచి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్.. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడంతమంది స్టార్స్ ఇందులో భాగమయ్యారు. సరైన కాంబినేషన్ పడాలే గానీ రిజల్ట్ ఏ రేంజులో ఉంటుందో నిరూపించారు.

(ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)

ఆర్ఆర్ఆర్ (2022)
ఈ సినిమాని మల్టీస్టారర్ అని చెప్పలేం. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు కానీ ఈ మూవీ తీసే సమయానికి వీళ్ల కంటే ఎక్కువ ఫేమ్ ఉన్న బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఇందులో కీలక పాత్రలు చేశారు. సినిమాకు మరింత బలం తీసుకొచ్చారు. గ్లోబల్ వైడ్ హిట్ కొట్టి, వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టడానికి ఓ విధంగా కారణమయ్యారు. 'బాహుబలి'తో ఇలాంటి థియరీ పాటించిన రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్‍'తోనూ మరోసారి అలాంటి సక్సెస్ నే అందుకున్నాడు.

విక్రమ్ (2022)
విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రస్తుత జనరేషన్ కి పెద్దగా తెలీదు. ఎందుకంటే 1990-2000 సమయంలో ఆయన‍్నుంచి అద్భుతమైన సినిమాలొచ్చాయి. ఆ తర్వాత సరైన మూవీ ఒక్కటి పడలేదు. ఆ లోటుని 'విక్రమ్' ఫుల్లుగా తీర్చింది. ఇందులో కమల్ తోపాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి అత్యద్భుతమైన యాక్టర్స్ కీ రోల్స్ ప్లే చేశారు. ఓ ఫెర్ఫెక్ట్ సినిమాకు ఏది ఎంత ఉంటే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చో వీళ్లు ముగ్గురు కలిసికట్టుగా ప్రూవ్ చేశారు.

దళపతి (1991)
ఇది తమిళ సినిమా, తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దానికి మణిరత్నం డైరెక్షన్ ఓ కారణమైతే.. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల‍్లో విజృంభించి మరీ నటించడం మరో కారణం. వీళ్లిద్దరే కాదు ఇదే చిత్రంలో అప్పటి స్టార్స్ శోభన, అరవింద స్వామి లాంటి వాళ్లు కూడా తమ యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేశారు. సౌత్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో దీని ప్లేస్ ఎప్పుడూ టాప్ లోనే.

(ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?)

పఠాన్ (2022)
నిరాశలో కూరుకుపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఈ ఏడాది కళకళలాడే చేసిన సినిమాల్లో 'పఠాన్' ఒకటి. షారుక్ ఖాన్ కమ్‌బ్యాక్ ఇచ్చిన మూవీ కూడా ఇదే. ఇందులో షారుక్ తోపాటు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. కానీ ఇతడు స్క్రీన్ పై కనిపించింది కొంచెం సేపే అయినా ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్. వీళ్లిద్దరే మళ్లీ 'టైగర్ vs పఠాన్', 'టైగర్ 3'లోనూ సందడి చేయనున్నారు. ఇద్దరు హీరోలున్నారని దీన్ని మల్టీస్టారర్ అనుకుంటారేమో? అస్సలు కాదు ఎందుకంటే దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం లాంటి స్టార్స్ కూడా 'పఠాన్'లో కనిపించారు. రాబోయే చిత్రాల్లో మరింత మంది కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

షోలే (1975)
మన దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సినిమా అనగానే 'షోలే' అని తడుముకోకుండా చెప్పొచ్చు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు చూసినా సరే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అంజాద్ ఖాన్.. ముగ్గురు ఒకరికి మించి మరొకరు అన్నట్లు యాక్టింగ్ చేశారు. వీళ్లకు తోడుగా జయా బచ్చన్, హేమా మాలిని లాంటి వాళ్లు తమదైన గ్లామర్ తో మెప్పించారు. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!)

అమర్ అక్బర్ ఆంటోని (1977) - హమ్ (1991)
బాలీవుడ్ కు దొరికిన అద్భుతమైన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు. అప్పట్లో హీరోగా చేసినప్పటికీ.. చాలామంది హీరోలతో కలిసి కూడా సినిమాలు చేశారు. వీటిలో 'అమర్ అక్బర్ ఆంటోని' ఒకటి. విడిపోయిన ముగ్గురు అన్నదమ్ముల కలిసే కథే ఈ సినిమా. అమితాబ్ తోపాటు రిషి కపూర్, వినోద్ ఖన్నా లాంటి ఇందులో నటించి మెప్పించారు. 'హమ్' చిత్రంలో అమితాబ్.. అప్పటి యంగ్ హీరోలైన రజనీకాంత్, గోవిందా లాంటి వాళ్లతో కలిసి నటించారు. స్టార్ కాస్టింగ్ ఉంటే హిట్స్ కొట్టొచ్చని ఆ సమయంలోనే నిరూపించారు. 

హమ్ సాథ్ సాథ్ హై (1999) - కబీ ఖుషీ కబీ ఘమ్ (2001)
స్టార్ కాంబోలు ఉంటే చాలామంది దర్శకులు యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీయాలని చూస్తారు. కానీ 90ల్లో బాలీవుడ్ దర్శకులు మాత్రం ఫ్యామిలీ స్టోరీలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఆ జాబితాలో 'హమ్ సాథ్ సాథ్ హై' కచ్చితంగా ఉంటుంది. సల్మాన్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తే.. 'కబీ ఖుషీ కబీ ఘమ్'లో ఏకంగా అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, జయా బచ్చన్, కాజోల్, కరీనా కపూర్ ఇలా లెక్కకు మించి స్టార్స్ నటించారు. ప్రేక్షకుల్ని మైమరచిపోయేలా చేశారు.

ఇలా పైన చెప్పిన సినిమాలే కాదు.. స్పేస్ కుదరక చెప్పుకోని మూవీస్ కూడా చాలానే ఉన‍్నాయి. స్టార్ కాంబినేషన్స్ ఉన్న సినిమాలు దాదాపు 90 శాతానికి పైగానే హిట్స్ కొట్టాయి. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కూడా అందుకున్నాయి. త్వరలో రాబోతున్న ప్రభాస్ 'సలార్', 'ప్రాజెక్ట్ K' మూవీస్ లో కూడా లెక్కకి మించి స్టార్స్ ఉన్నారు. మరి ఇవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి?

(ఇదీ చదవండి: నేషనల్‌ క్రష్‌ రష్మిక అందం కోసం ఏం చేస్తుందో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement