పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. నేడు (డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సలార్ అర్ధరాత్రి నుంచే థియేటర్‌లోకి వచ్చేశాడు. దీంతో అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్టుకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే ప్రభాస్ భారీ హిట్ట్ కొట్టాడని తెలుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో సలార్‌కు పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
సలార్ ఈ రికార్డ్స్ కొట్టగలడా..?
ఈ ఏడాదిలో విజయ్,షారుక్ ఖాన్,రణబీర్ కపూర్ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేశారు. నేడు విడుదలైన సలార్ ఆ రికార్డ్స్‌ను దాటగలుగుతాడా అని చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఆ తర్వాత షారుఖ్ "జవాన్" మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'యానిమల్' చిత్రం కూడా మొదటిరోజు రూ. 116 కోట్లు రాబట్టింది.
ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల గ్రాస్‌గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తాజాగా విడుదలైన సలార్ మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఏ రికార్డ్ కొట్టగలుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. కానీ సలార్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 150 కోట్లు దాటుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రూ. 600 కోట్లు సేఫ్ మార్క్
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్‌కు రూ.150 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్ ఉంది.
(ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ)
ఇదే నిజమైతే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.250 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిందీ వర్షన్ హక్కులు మాత్రం రూ.75 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. ఏదేమైనా సలార్ ఫుల్ రన్లో టార్గెట్ రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే చాలా రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment