సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్‌ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి.
(ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...)
అలా కేజీఎఫ్‌తో ప్రశాంత్ నిల్‌తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది.
ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది.
(ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?)
తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment