మళ్లీ పెళ్లి
వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మరి సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
2018
కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు ( వరదలు ) వల్ల కేరళ రాష్ట్రము మొత్తం అతలా కుతలం అయ్యిందన్న విషయం తెలిసిందే . ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం 2018. మే 5న అక్కడ విడుదలైన ఈ చిత్రానికి కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళంలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మేమ్ ఫేమస్
షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత చాయ్ బిస్కెట్ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రమిది. లహరి ఫిల్మ్స్ చంద్రు మనోహర్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినూత్నమైన ప్రచారంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలందరూ ఈ సినిమా ప్రచారంలో పాలుపంచుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గ్రే మూవీ
ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు. అలా వెళ్లి 2022 నుంచి దాదాపుగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు అందుకున్న గ్రే సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ది బుడాపెస్ట్ ఫిలిం ఫెస్టివల్, జైపూర్ ఫిలిం ఫెస్టివల్, ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, సింగపూర్ వరల్డ్ ఫిలిం కార్నివాల్, యూరోపియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన గ్రే సినిమా ఎలా సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'సత్తిగాని రెండెకరాలు'
పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment