ప్రేమ- బ్రేకప్, పెళ్లి- విడాకులు.. ఇండస్ట్రీలో ఎంత సర్వసాధారణమో అందరికీ తెలుసు. బ్రేకప్ చెప్పుకున్న కొద్దికాలానికే మళ్లీ లవ్‌లో పడటం, విడాకులు తీసుకున్న కొంతకాలానికే మళ్లీ పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్. అయితే కొద్దిమంది మాత్రం గత బంధాన్ని మర్చిపోలేక, జీవితంలో ముందడుగు వేయలేక ఇబ్బందిపడుతుంటారు. తప్పు ఎక్కడ జరిగిందని పునరాలోచనలో పడతారు. బుల్లితెర నటి దివ్య అగర్వాల్ ఈ రెండింటి కోవలోకి వస్తుంది.
గతేడాది నటుడు వరుణ్ సూద్‌కు బ్రేకప్ చెప్పిన ఆమె రెస్టారెంట్ యజమాని అపూర్వ పడ్‌గోయెంకర్‌తో పెళ్లికి రెడీ అయింది. గతేడాది డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా తన బ్రేకప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది దివ్య అగర్వాల్. ఆమె మాట్లాడుతూ.. 'అపూర్వ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఒక బాధ్యత గల అమ్మాయిగా ప్రవర్తిస్తాను. అదే వరుణ్ ఉన్నప్పుడు నేను ఇంకోలా ఉండేదాన్ని. కుదురుగా ఉండేదాన్ని కాదు. బ్రేకప్ తర్వాత వరుణ్, అపూర్వలు కలుసుకునేలా చేశాను. ఏదైతే జరిగిందో అదంతా నావల్లే అని ఒప్పుకున్నాను.
ఎందుకంటే నేనెప్పుడూ ఒక రకమైన గందరగోళంలో ఉండేదాన్ని. ఏం చేస్తున్నానో తెలిసేది కాదు. దీనికంతటికీ పుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాను. ఈ క్రమంలోనే సడన్‌గా అర్ధాంతరంగా బ్రేకప్ చెప్పాను అని క్లారిటీ ఇచ్చాను. అయితే బ్రేకప్ తర్వాత బాధపడుతూ కూర్చోవద్దని అపూర్వ సలహా ఇచ్చాడు. ఇక్కడ నా బాధేంటంటే.. నా మూడ్ స్వింగ్స్ కారణంగా ఒకరి మనసు ముక్కలు చేశాను. అందుకు ఎంతో చింతించాను. అపరాధ భావనతో కుంగిపోయాను.
అపూర్వ మాత్రం.. మీరు మంచి పనే చేశారు, లేదంటే మీరు ఇలాగే ముందుకు సాగితే ఈ గొడవలు ఇంకా పెద్దవయ్యేవి అని చెప్పాడు. నా బాధను పోగొట్టేందుకు అపూర్వ నన్ను గోవాలో ఓ గుడికి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. ఇక్కడేమీ ఆలోచించకుండా సైలెంట్‌గా ఉండమని చెప్పాడు. ఆధ్యాత్మిక మార్గంలో నన్ను నడిపించి నాకు మా నాన్నను గుర్తు చేశాడు' అని చెప్పుకొచ్చింది దివ్య. కాగా వరుణ్-దివ్య.. ఏస్ ఆఫ్ స్పేస్, స్ప్లిట్స్‌విల్లా అనే రియాలిటీ షోలలో జంటగా పాల్గొన్నారు. గతేడాది వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే అపూర్వతో ప్రేమలో పడి, అతడితో పెళ్లికి సిద్ధపడింది.
Comments
Please login to add a commentAdd a comment