‘2018 ’చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమాకు కేరళలో మాత్రమే కాదు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై నా సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను’అని మలయాళ హీరో టొవినో థామస్ అన్నారు. టొవినో థామస్ ప్రధాన పాత్రధారిగా, అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’. జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న ప్రముఖ నిర్మాత బన్నివాసు రిలీజ్ చేయగా.. మంచి స్పందన లభించింది. తొలి రోజు రూ. కోటికి పైగా వసూళ్లను రాబట్టి దుసూకెళ్తోంది.
(చదవండి: 2018 మూవీ రివ్యూ)
ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాసు గారు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మందికి సినిమా ఎంటర్టైన్మెంట్. కానీ నా వరకు సినిమా జీవితం. ముందున్న రోజుల్లో ఇంకా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను’అన్నారు.
‘నేను 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేశాను.కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. .పబ్లిసిటి కి ఎక్కువ టైం లేకపోయినా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తుందని నమ్మాను. ఇప్పుడు అదే నిజమైంది. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.చాలా ఆనందంగా ఉంది’అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్ అని అపర్ణ బాలమురళి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment