'2018' Movie Gets Huge Response From Telugu Audience - Sakshi
Sakshi News home page

2018 Movie: టాలీవుడ్‌లో ఊహించని రెస్పాన్స్‌.. దూసుకెళ్తున్న '2018'

May 26 2023 3:14 PM | Updated on May 26 2023 3:23 PM

2018 Movie gets Huge Response from Telugu audience - Sakshi

కేరళలో రీసెంట్ టైమ్స్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన '2018'. ఈ చిత్రం ఇవాళే తెలుగులో విడుదలైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్‌ను హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనూ ప్రదర్శించారు.  ప్రెస్ స్క్రీనింగ్, సెలబ్రిటీ ప్రీమియర్‌కు అనూహ్య స్పందన లభించింది.

(ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్‌ సైన్‌ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్‌)

అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్‌లో ప్రేక్షకుడిని సీటులోనే కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది.

(ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్‌ సెల్వన్‌-2'.. కానీ కండీషన్స్‌ వర్తిస్తాయి)

కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన  ఈ సినిమాకు ఇప్పటికే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోందని, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement