Kerala Floods 2018
-
ఆ మూవీకి తెలుగులో ఊహించని రెస్పాన్స్!
కేరళలో రీసెంట్ టైమ్స్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన '2018'. ఈ చిత్రం ఇవాళే తెలుగులో విడుదలైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్‌ను హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనూ ప్రదర్శించారు. ప్రెస్ స్క్రీనింగ్, సెలబ్రిటీ ప్రీమియర్‌కు అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్‌లో ప్రేక్షకుడిని సీటులోనే కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి) కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోందని, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఇది సిసలైన కేరళ స్టోరీ.. పది రోజుల్లో వందకోట్ల క్లబ్‌లోకి..!
భారత చలన చిత్ర పరిశ్రమల్లో మాలీవుడ్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చిన్న కథలు.. విలేజ్ డ్రామాలే అయినా సూపర్ సక్సెస్ అవుతుంటాయి. అయితే గత కొంతకాలంగా అక్కడి కలెక్షన్ల విషయంలో వరుసగా చిన్నాపెద్ద చిత్రాలు నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘2018’ పెనుసంచలనం సృష్టించింది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘2018’.. మే 5వ తేదీన రిలీజ్ అయ్యింది. కేవలం పదిరోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదీ పాన్ ఇండియా సినిమాగా కాదు.. కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యి మరి. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ఆడియొన్స్. జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన ‘2018’ చిత్రం.. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నా ఫుల్ రన్లో ఆ ఫీట్‌ను సాధించాయి. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ ఆంథనీ. సామాన్యుడు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. 2018.. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్. క్యాప్షన్‌కు తగ్గట్లే కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో అందరూ హీరోలే. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా చిత్ర కథ నడుస్తుంది. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలం అయిన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి?. వాటిలో అక్కడి ప్రజలు ఎలా భాగం అయ్యారు? చివరికి ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథ. రెండున్నర గంటలపాటు సాగే కథలో.. ద్వితియార్థం సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ప్రేమ, ధైర్యం, సాహసం, త్యాగాలు.. రకరకాల భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించడంతో ఈ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ అనూప్ పాత్రలో అలరించాడు. బిజీ గవర్నమెంట్ ఉద్యోగి చివరికి వరదల్లో చిక్కుకున్న తన కుటుంబం కోసం తాపత్రయపడే షాజీ రోల్లో కున్చాకో బోబన్, ఎన్నారై రమేష్‌గా వినీత్ శ్రీనివాసన్, నిక్సన్ పాత్రలో అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి పేరున్న ఆర్టిస్టులు మాత్రమే కాదు, సినిమాలో చిన్నపాత్ర కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతుంది. -
‘కేరళకు లేవన్నారు.. స్టాచ్యూకి రూ. 3000 కోట్లు ఎక్కడివి’
బెంగళూరు : వరదలతో అతాలకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పీఎం విగ్రహం నిర్మాణం కోసం మాత్రం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇలాంటి విచక్షణ లేని నాయకున్ని మీరు ఎక్కడైనా.. ఎప్పుడైనా చూశారా అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని తప్పు పడుతూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. కేరళను వరదలు ముంచేత్తినప్పుడు ముందు కేవలం 100 కోట్ల రూపాయలు.. ఆపై రూ. 500 కోట్ల సాయాన్ని ప్రకటించిన మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విచక్షణ జ్ఞానం ఉన్న నాయకుడేవరైనా ఇలాంటి పని చేస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. STATUE or HUMAN BEING.. Dear TROLLS..and FAKE NEWS FACTORY OWNERS who distorted what I said in an interaction on GOD.. WOMEN n RELIGION.... will you try DISTORTING this one too OR does it not serve your purpose ..#justasking pic.twitter.com/MT9360f8Qf — Prakash Raj (@prakashraaj) November 9, 2018 -
రెడ్అలర్ట్ : కేరళలో మలంపుజ డ్యామ్ గేట్ల ఎత్తివేత
కొచ్చి : కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పలక్కాడ్‌లోని మలంపుజ డ్యామ్ గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. మలంపుజ డ్యామ్‌కు చెందిన నాలుగు గేట్లను 9 సెంమీ చొప్పున అధికారులు ఎత్తివేశారు. ఐఎండీ సూచనల నేపథ్యంలో మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈనెల 5 నాటికి మత్స్యకారులు సురక్షిత తీర ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం కోరిందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
కేరళకు మరో ప్రళయ హెచ్చరిక
తిరువనంతపురం : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో ప్రళయ భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శనివారం, ఆదివారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యం కేరళ సీఎం పినరయి విజయన్ తీరంలోని మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీనిపై కేంద్రంతో ఇప్పటికే చర్చలు జరిగిన సీఎం.. వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలకు ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని, రెడ్ అలర్ట్ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కాగా ఇటీవల సంభవించిన వరద బీభత్సం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రజలకు వర్ష సూచన భయాందోళనకు గురిచేస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షలకు 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. -
కథగా కేర ళ ట్రాజెడీ
మొన్నే వచ్చిన కేరళ వరదల విషాదం నుంచి కేరళ ఇంకా కోలుకోలేదు. ఆ వరదలను ఎదుర్కోడానికి ఒక్క తాటిపై నిలిచారు కేరళ వాసులు. ఈ ప్రకృతి బీభత్సాన్ని విజువల్‌గా చూపించడనికి సిద్ధమయ్యారు మలయాళ దర్శకుడు జూడ్ ఆంటొనీ జోసెఫ్. ‘2043 ఫీట్’ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా తీయడానికి గల కారణాలను దర్శకుడు వివరిస్తూ– ‘‘ఈ వరదల మీద ఇన్స్పైరింగ్గా ఏదైనా వీడియో తీయమని స్వచ్ఛంద సేవా సంస్థలు అడగ్గా ఈ ఐడియా వచ్చింది. భావితరాలకు చెప్పడానికి ఎన్నో ప్రేరణ తెప్పించే కథలు ఉన్నాయి. ఇందులో సహాయార్థాల నిమిత్తం పాల్గొన్న ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలే. ఈ సినిమాకు చాలా వీయఫ్‌ఎక్స్ పని ఉంటుంది. ఆల్రెడీ ఓ హాలీవుడ్ సంస్థతో మాట్లాడుతున్నాం’’ అని పేర్కొన్నారు. జూడ్ ఇది వరకు ఇరాక్‌లో జరిగిన నర్సుల కిడ్నాప్స్ ఆధారంగా ‘టేకాఫ్’ అనే చిత్రాన్ని రూపొందించారు. -
జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే...
న్యూఢిల్లీ: వరద బీభత్సంతో ధ్వంసమైన కేరళను పునర్నిర్మించేందుకు ఆ రాష్ట్రంలోని మూడు ప్రధానమైన ఆలయాల బంగారం, సంపదను వినియోగించాలని వాయవ్య ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ సలహా ఇచ్చారు. కేరళలోని పద్మనాభ స్వామి, శబరిమల, గురువాయూర్ ఆలయాల అధీనంలోని బంగారం, ఆస్తులను కలిపితే దాదాపు రూ.1లక్ష కోట్లకుపైగా ఉంటుందని, కేరళకు జరిగిన రూ.20వేల కోట్లకంటే ఈ మొత్తం చాలా ఎక్కువని ఆయన లెక్కకట్టారు. ‘ఓ వైపు జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే, మరోవైపు ఆలయాలకు రూ.లక్ష కోట్ల సంపద ఉండి ఏం ఉపయోగం?’ అంటూ ఉదిత్ ట్వీట్ చేశారు. ఆలయాల సంపదను వాడాలన్న తమ డిమాండ్‌కు ప్రజలు మద్దతు పలకాలని ఆయన కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గత నెలలో కేరళలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ భారీఎత్తున పునర్నిర్మాణపనులు జరుగుతున్నాయి. కేరళకు తక్షణసాయంగా ప్రధాని మోదీ రూ.600 కోట్లు మంజూరుచేయగా, పలు రాష్ట్రాలు, సంస్థలు, లక్షలాది మంది ప్రజలు తమ వంతు సాయమందించారు. రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, కనీసం రూ.2,000 కోట్ల సాయం చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరడం తెల్సిందే. -
కేరళలో నదులెండిపోతున్నాయి..!
తిరువనంతపురం: ఇటీవల సంభవించిన భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోయి బావులు ఎండిపోయాయి. నేలను గుళ్లబారేలా చేసి రైతన్నలకు సాయపడే వానపాముల జాడే లేకుండా పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు. నీటిమట్టం తగ్గిపోవడంపై రాష్ట్ర జనవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్‌లు అధ్యయనం చేస్తాయని విజయన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 491 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
చిన్నసాయం.. పెద్దమనసు
కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో వేలాది జీవితాలు కొట్టుకుపోయాయి. బతికి బట్టకట్టిన వారికి జీవనం ప్రశ్నార్థకమైంది. ఆ భీకర ప్రకృతి విలయం.. దైనందిన జీవితాల్లో కల్లోలం రేపింది. దేశానికి దక్షిణంలో వచ్చిన ఆ వరదల తాకిడి తూర్పున ఉన్న జార్ఖండ్ మహిళలను కదిలించింది! దేశవ్యాప్తంగా.. చేతినిండా డబ్బున్న వాళ్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. రోజు కూలితో జీవించే తమకు అంతంత డబ్బు జమ చేయడం సాధ్యమైన పని కాదు. ఆ డబ్బును బాధితులకు పంపించడం ఎలాగో కూడా చేతకాదు. అయినా సరే.. తాము చేయగలిగిన ఉడుత సాయమైనా చేయాలనుకున్నారు జార్ఖండ్ మహిళలు. తాము తయారు చేస్తున్న చెప్పులతోనే కేరళ వరద బాధితుల కాళ్లకు రక్షణ కల్పించినా చాలనుకున్నారు. అంతే. వెయ్యి జతల రబ్బరు స్లిప్పర్స్‌తో ఓ లారీ జార్ఖండ్ నుంచి బయలుదేరింది. దాయాలన్నా దాగని సాయం! జార్ఖండ్ రాష్ట్రం, దుమ్కా జిల్లాలో బాలిజోర్ గ్రామం. ఆ గ్రామంలో మూడు వందల మంది మహిళలు బాలి ఫుట్‌వేర్ కంపెనీలో పని చేస్తారు. వారికి రోజు కూలి 250 రూపాయలు. ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు సహాయంగా ఇవ్వాలనుకున్నారు. ఆ వేతనానికి వచ్చినన్ని చెప్పుల జతలను సహాయార్థం సమకూర్చారు. వాళ్లు తయారు చేస్తున్న ఫుట్‌వేర్ కంపెనీలో ఒక చెప్పుల జత ఖర్చు 70 రూపాయలవుతుంది. శ్రామికుల వేతనం కాకుండా కేవలం మెటీరియల్ ఇతర ఖర్చులు మాత్రమే. మొత్తం 75 వేల రూపాయల డబ్బుతో వెయ్యి జతల చెప్పులను కేరళకు పంపించారు. నిజానికి ఈ మహిళలు పేరు కోసం తాపత్రయపడకుండా నిస్వార్థంగా సహాయం చేశారు. కానీ సహాయం పొందిన వాళ్లకు తమకు సహాయం చేసిన వాళ్ల ఊరి పేరును చెప్పులే చెబుతున్నాయి. బాలిజోర్ పేరు మీదనే బాలి ఫుట్‌వేర్ కంపెనీకి ఆ పేరు పెట్టారు. ఉన్నదాంట్లోనే కొంత ‘రిలీఫ్’ ‘‘కేరళలో ఇలా జరిగిందని వార్తల్లో చూసి తెలుసుకున్నాం. ‘ఎంత ఘోరం, వాళ్ల పరిస్థితి ఏమిటి, తిరిగి వాళ్ల బతుకులు తేరుకునేదెలా’ అని పనిచేస్తూ మాట్లాడుకునే వాళ్లం. పెద్దవాళ్లు ఎవరెవరు ఎంత సహాయం చేస్తున్నారో కూడా మా కబుర్లలో తెలుస్తుండేది. రిలీఫ్ ఫండ్‌కి డబ్బు ఇచ్చేటంత పెద్ద ఉద్యోగులం కాదు. రోజుకు 250 రూపాయలు వస్తే... అందులోనే ఇంట్లో తిండి గడవాలి, కొంత దాచుకోవాలి. మేమే పేదవాళ్లం, మాదే పేదరికం అనుకుంటుంటే, వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం కదా. వాళ్లు మా కంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. అందుకే మనం తయారు చేస్తున్న చెప్పులనే వారికిద్దామని అందరం ఒక్కమాట మీదకు వచ్చాం. మా కంపెనీకి మెటీరియల్ ఇచ్చే అధికారులతో ఇదే మాట చెప్పాం. చెప్పులను వరద బాధితులకు పంపే ఏర్పాట్లు జిల్లా అధికారులే చేశారు’’ అని చెప్పింది బాలి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్న మిథియా తాదు. ఆ కార్మికుల్లో చురుకైన మిథియా, మంజుదేవి, మోనికా తాదుతోపాటు మిగిలిన వాళ్లంతా ముందుకొచ్చారు. దాంతో కేరళకు సాయం అందింది. సమాజం స్వార్థపూరితంగా మారిపోయింది, మనుషుల్లో మానవత్వం లోపించింది, కాఠిన్యం రాజ్యమేలుతోంది... ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. ఇన్నింటి మధ్య కూడా ఎదుటి వారికి కష్టం వస్తే అది తమ కష్టంగా స్పందించే సున్నితమైన మనసులు, చలించే స్నేహపూరిత హృదయాలు ఉన్నాయి. మరేం ఫర్వాలేదు.. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది అనే భరోసానిస్తున్నారు ఈ మహిళలు. – మంజీర -
రియల్ హీరో ఈ ఐఏఎస్ అధికారి
తిరువనంతపురం : కేరళ సహాయ శిబిరాల వద్ద కొన్ని రోజులుగా ఓ యువకుడు మూటలు మోస్తూ.. అక్కడివారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సహాయక శిబిరాలకు వచ్చిన వస్తువులను ట్రక్కులనుంచి కిందకు దించి వాటిని అవసరమైన వారికి చేరుస్తున్నాడు. గత ఎనిమిది రోజులుగా అతడు ఇవే పనులు చేస్తున్నాడు. తొమ్మిదో రోజు ఆ వ్యక్తిని కాస్తా పరిశీలనగా చూసిన ఓ అధికారి ఆశ్చర్యంతో ‘సార్.. మీరు ఏంటి ఇక్కడ, ఇలా..?’ అని అడిగాడు. అంతవరకూ అతన్ని తమలాంటి ఓ సాధరణ వాలంటీర్ అనుకున్న వారికి ఆ వ్యక్తి గొప్పతనం గురించి తెలిసింది. దాంతో ఆ వాలంటీర్‌తో సెల్ఫీ దిగడానికి వారంతా ఎగబడ్డారు. మూటలు మోసే వ్యక్తితో సెల్ఫీ దిగడం ఏంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే మూటలు మోస్తున్న ఆ వాలింటీర్ ఓ జిల్లా కలెక్టర్. కలెక్టర్ ఏంటి.. ఇలా మూటలు మోయడమెంటీ అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరి చదవండి. కేరళకు చెందిన కన్నన్ గోపీనాథన్(32) 2012 బ్యాచ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి. శిక్షణ అనంతరం అతనికి కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో కేరళలో సంభవించిన వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కేరళను ఆదుకోవడానికి దేశమంతా తరలి వచ్చింది. అందులో భాగంగా పలు రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని అందించాయి. అలా సాయం చేసిన వాటిలో దాద్రా నగర్ హవేలీ కూడా ఉంది. ప్రస్తుతం అక్కడే కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథన్ దాద్రా నగర్ హవేలీ తరపున కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించేందుకు వచ్చాడు. ఆ పని ముగిసిన తర్వాత తిరువనంతపురం నుంచి తన సొంత ఊరు పుతుపల్లికి వెళ్లాల్సిన గోపీనాథన్ కాస్తా వరదల ధాటికి తీవ్రంగా నష్టపోయిన చెంగన్నూర్‌కి వెళ్లి సహాయక శిబిరాల్లో ఉంటూ వాలంటీర్‌గా బాధితులకు సేవ చేయడం ప్రారంభించాడు. ఇలా 8 రోజులు గడిచిపోయింది. అనంతరం ఓ అధికారి గోపీనాథన్‌ని గుర్తుపట్టడంతో అతని గురించి అక్కడివారికి తెలిసింది. దీంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాలంటీర్‌గా పని చేయడం గురించి గోపీనాథన్ మాట్లాడుతూ.. ఇక్కడి అధికారులు పడిన శ్రమతో పోలిస్తే.. నేనేం గొప్ప పని చేయలేదని వినయంగా చెప్పుకొచ్చాడు. నన్ను హీరో చేయొద్దు, క్షేత్ర స్థాయిలో ఇక్కడెంతో మంది సాయం చేస్తున్నారు. వారే రియల్ హీరోలు. ఇదే స్ఫూర్తితో అంతా కష్టపడితే.. త్వరలోనే కేరళ తన పూర్వ వైభవాన్ని పొందుతుందని గోపినాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కలాలతో కలలకు ఊపిరి..!
కేరళ విద్యార్థులపై వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చెరిపేసే ఈ కార్యక్రమం వినూత్నమేకాదు అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. భారీ వర్షాలు, వరదల తదనంతర పరిణామాల్లో భాగంగా ఆ విద్యార్థులు తమకిష్టమైన చదువును కొనసాగించేందుకు భరోసా ఇస్తోంది. వరదనీళ్లలో వారు కోల్పోయిన క్లాస్ పుస్తకాలు, వివిధ సబ్జెకుల వారీగా ఇప్పటికే పూర్తయిన క్లాస్‌లకు నోట్స్‌లు (స్టడీమెటీరియల్) రాసి అందించడం ద్వారా వారి చదువులకు ఊపిరిపోస్తున్నారు. అనాథశరణాలయానికి చెందిన పిల్లలిచ్చిన సలహాలు, సూచనలతో కాలికట్కు చెందిన ‘ఇన్క్యుబేషన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పనిని భుజానవేసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువు నష్టపోకుండా ఉండేందుకు వరదల్లో వారు కోల్పోయిన క్లాస్ నోట్స్‌ను అందించేందుకు నడుం బిగించారు. ముందుగా వివిధ తరగతుల విద్యార్థులకు సంబంధించిన క్లాస్‌నోట్స్ రాసివ్వాలంటూ సామాజికమాధ్యమాల ద్వారా మెసేజ్ పంపించారు. అది వైరల్‌గా మారింది. ఈ ఆలోచననను వ్యక్తులు, కంపెనీలు, విద్యాసంస్థలు స్వాగతించాయి. వివిధ తరగతులు,సబ్జెక్టుల వారీగా సోషల్ మీడియా వేదికగా పీడీఎఫ్ ఫార్మాట్లో నోట్స్ పంపిణీలోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి ఇవి ఫార్వర్డ్ అయ్యాయి. దీనిపై ఇతరజిల్లాల నుంచి స్పందించే వారి సంఖ్య పెరిగింది. ఒక్క కేరళకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఈ వినూత్న అభ్యర్థన చేరుకుంది. ఫలితంగా వేలాది పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులకు పంపిణీ అయ్యాయి. దాదాపు రెండువారాల పాటు కొనసాగించిన క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ వివిధ జిల్లాల్లో దాదాపు పదివేలకు పైగా నోట్‌పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసినట్టు ‘ఇన్క్యుబేషన్’కు చెదిన నాబీల్ మహ్మద్ తెలియజేశారు. ‘జిరాక్సో, ప్రింట్ చేసిన నోట్ పుస్తకాల కంటే చేతిరాతతో రాసిన పుస్తకాల ద్వారా ప్రేమాభిమానాలు పంచాలనేది మా అభిప్రాయం ’ అని ఈ సంస్థ సమన్వయకర్త ఇల్యాస్ జాన్ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఈ నోట్స్రాసి రాయడం ఒక ఎత్తయితే. ఓ శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న నమితా హర్ష్ అనే మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా ఎనిమిది నోట్‌పుస్తకాలు రాయడం మరో విశేషం. ఈ నోట్‌పుస్తకాలను కేరళలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా అందించడానికి కొన్ని కొరియర్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థయితే పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ›ప్రాంతాలకు రవాణా చేసింది. దీని కోసం వివిధ జిల్లాల్లోని తమ బస్సుడిపోల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నోట్స్ రాసే కార్యక్రమంలో తాము పాలుపంచు కుంటామంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటికీ ఈ సంస్థలకు విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. -
నడిగర్ సంఘానికి కేరళ సీఎం ప్రశంసలు
తమిళ సినిమా : దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ఇటీవల కేరళపై విరుచుకుపడిన భారీ వర్షాల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూశారు. ఆర్థిక సాయం చేసి కేరళను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజయన్ పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. తమ వంతు సాయం చేయాల్సిందిగా సంఘ సభ్యులకు, ఇతర సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. నాజర్ పిలుపు మేరకు నడిగర్ సంఘ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సంఘం కృషిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసిస్తూ నాజర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను నడిగర్ సంఘం మంగళవారం మీడియాకు విడుదల చేసింది. -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరువనంతపురం : ప్రకృతి సృష్టించిన విలయానికి గురైన కేరళకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. భారీ వరదల కారణంగా కేరళ తీవ్ర నష్టానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఏడాది వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ, యూత్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు వెచ్చించే నిధులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు తరలించాలని నిర్ణయించింది. ఆ నిధులు కేరళ పునర్నిర్మాణంకు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వదలకు 350పైగా పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదారు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రకృతి విలాయానికి గురైన కేరళను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు 1,036 కోట్లు విరాళాలు అందాయని ప్రభుత్వం వర్గాలు ప్రకటించాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాట్ ఫీవర్‌తో సోమవారం మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వరదలు తెచ్చిన కొత్త వైరస్‌తో కేరళ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను రంగంలోకి దింపింది. వైరస్ లక్షణాలతో భాదపడుతున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. Kerala Government has decided to cancel all official celebrations for one year. Programs including International Film Festival of Kerala and other youth festivals stand cancelled #KeralaFloods pic.twitter.com/r5aJGHYW8c — ANI (@ANI) September 4, 2018 -
‘మీరంతా ప్రభాస్‌ని చూసి నేర్చుకొండి’
తిరువనంతపురం : ‘మీరంతా ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని విన్నాను. అంత సంపాదిస్తున్న మీరు కేరళ ప్రజలను ఆదుకోవడానకి చాలా తక్కువ మొత్తం సాయం చేశారు. మీకంటే తెలుగు హీరో ప్రభాస్ నయం. అతన్ని చూసి నేర్చుకొండి’ అంటూ కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా కేరళ అతాలకుతలమయిన సంగతి తెలిసిందే. వరద బాధితుల సంరక్షణ నిమిత్తం సోమవారం కేరళ ప్రభుత్వం ‘కేర్ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సురేంద్రన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్స్టార్లు ఉన్నారు. వారు ప్రతీ సినిమాకు 4 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. అంత సంపాదించే వారు వరద బాధితులకు చాలా తక్కువ మొత్తంలో సాయం చేశారు. మీలాంటి వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన ఇంతవరకూ మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే సాయం చేయడానికి ముందుకొచ్చి.. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారంటా’ అంటూ సురేంద్రన్ మలయాళ నటులపై మండిపడ్డారు . మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే ఎక్కువ నగదు సాయం చేశారని సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ప్రభాస్ కేరళ వరద బాధితులకు సాయం చేసింది కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే. ఈ విషయం సదరు మంత్రి గారికి తెలియకపోవడంతో ప్రభాస్‌ని చూసి నేర్చుకొండి అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇటీవల కమల్‌హాసన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ధనుష్, రజనీకాంత్, శివకార్తికేయ, నయనతార, విశాల్, విక్రమ్, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు కేరళ కోసం తమవంతు సాయం చేశారు. -
కేరళను పీడిస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద బీభత్సం అనంతరం కేరళలో ర్యాట్ ఫీవర్ (లెప్టోస్పైరోసిస్) విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 9 మంది చనిపోగా, 71 మందికి చేసిన రక్తపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో మరో 123 మంది ఇవే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. పాలక్కడ్, కోజికోడ్ జిల్లాల్లో ర్యాట్ ఫీవర్ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది. వరదలు తగ్గుముఖం పట్టాక వివిధ రకాల జ్వరాలతో రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందిన వారి సంఖ్య 13,800 దాటింది. ర్యాట్ ఫీవర్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అలప్పుజ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. చాలాచోట్ల పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
కేరళ వరద బాధితులకు రూ.కోటి విరాళం
కేరళ రాష్ట్రం ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు ఆర్థిక సాయాన్ని విరాళంగా అందిస్తున్నారు. నటుడు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, విజయ్, విశాల్, విక్రమ్.. ఇలా పలువురు విరాళం అందించారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ తన వంతు సాయంగా కోటి రూపాయలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో తన బృందంతో సంగీత కచేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ప్రజల సహాయార్థం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో ఫ్లోరిడాలో కేరళ ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
కేరళను కుదిపేస్తున్న ర్యాట్ ఫీవర్
తిరువనంతపురం: వరద ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి ఆదివారం వరకు ఏడుగురు ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ర్యాట్ ఫీవర్‌తో ఆదివారం ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ర్యాట్ ఫీవర్‌తో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఎక్కువగా కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జ్వరం కేసులు కూడా పెరిగిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వరదబాధితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పునర్నిర్మాణ పనుల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. -
కేరళ : దక్షిణాది తారల భారీ విరాళం
కేరళ వరద బాధితులకు ప్రపంచ నలుమూలలనుంచీ భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. దేశీయంగా రాజకీయ, సినీ, క్రీడారంగ,ఇతర ప్రముఖుల కూడా స్పందన కూడా విరివిగానే లభిస్తోంది. తాజాగా దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా స్పందించారు. ‘80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' పేరుతో కేరళ వరద బాధితుల సహాయార్ధం భారీ విరాళాన్నిచ్చింది. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ‘80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' పేరుతో వసూలు చేసిన 40 లక్షల రూపాయల విరాళం అందజేశామని సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం కేరళ సీఎంను కలిసి ఈ నగదును అందజేసామంటూ, ఆమె ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి హీరోయిన్లు కుష్బు , లిజీ కూడా పాల్గొన్నారు. 80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' ఆధ్వర్యంలో స్నేహితులు, బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించామని నటి లిజి మీడియాకు తెలిపారు. గాడ్స్ ఓన్ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.ఈ ఆపద సమయంలో తామంతా వారికి అండగా ఉన్నామనే భరోసా కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు. Handed over 40 lakhs to cm Kerala..from 80 s reunion and friends today at 3 pm pic.twitter.com/v0tvvgKFSc — Suhasini Maniratnam (@hasinimani) August 31, 2018 80s re union list of contributors to Kerala pic.twitter.com/e7RZUGzGZP — Suhasini Maniratnam (@hasinimani) August 31, 2018 -
పూలూ – పడగలూ
చాలాసార్లు చిన్నపిల్లలకి వచ్చేలాంటి సందేహాలు పెద్దవాళ్లకి రావు. ఎందు కంటే పెద్దవాళ్ల అభిప్రా యాలు, ఆలోచనలు లక్కలా బిడిసి, గట్టిగా స్థిర పడి పోయి ఉంటాయి. ప్రతి కల్పాంతంలోనూ భయంక రమైన జలప్రళయం వస్తుంది. అప్పుడీ సృష్టి మొత్తం జల సమాధి అయిపోతుంది. మళ్లీ నూతన సృష్టికి అంకురార్పణ జరుగుతుంది. అందుకు దేవుడు సృష్టి లోని సమస్త జీవకోటి శాంపిల్స్‌ని, విత్తనాలని ఒక పెద్ద పడవలోకి చేర్చి జాగ్రత్త పరిచాడు. ఈ పురాణ గాథని మరింత ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఉన్న ట్టుండి క్లాసులో ఓ పిల్లవాడు లేచి, ‘టీచర్ మరైతే పడవలో ఉన్న పులి అందులోనే ఉన్న మేకని తినె య్యదా?’ అని అడి గాడు. నిజమే, వాడొక శాంపిల్ చెప్పాడు గానీ ఇంకా కప్పని పాము, పాముని గద్ద మింగేస్తాయి కదా. అప్పుడు చాలా శాంపిల్స్ అడ్రస్ లేకుండా పోతాయి గదా. పిల్లలంతా నా జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేనేవన్నా ప్రవచనకారు డినా అప్పటి కప్పుడు ఆశువుగా వాడి సందేహం తీర్చ డానికి. కనీసం రెండు శ్లోకాలైనా పఠిస్తే, వాటిని గడగడ పుక్కిలించి, తోచిన అర్థంతో తరగతిని భయపెట్టి బయ టపడేవాణ్ణి. ఓ క్షణం దిక్కులు చూసి, ‘అఘో రించావ్. ఈ తెలివి మాత్రం ఉంది. కూర్చో’ అని గద్దించి, ఆ గండం గట్టెక్కాను. మొన్నామధ్య టీవీ వార్తలు చూస్తుంటే, పది పన్నెండేళ్ల పక్కింటి పిల్ల నాకూడా ఉంది. కేరళ వరదల్ని చూసి భయపడింది. చాలా జాలిపడింది. చూస్తున్నంత సేపూ అయ్యో పాపం అనుకుంటూనే ఉంది. మళ్లీ తర్వాత వేరే వేరే వార్తలు వచ్చాయి. చివరంటా నాతో పాటు వార్తలు చూసింది. ‘మరి... అయితే ఢిల్లీలో ఉండే మంత్రులు గొప్పవాళ్లా, ఇక్కడ ఉండే మన మంత్రులు గొప్పవాళ్లా’ అని అడిగిందా అమ్మాయి. ‘అంతా ఒకటే, కాకపోతే వాళ్లు అక్క డుండి దేశం సంగతులు చూస్తారు. వీళ్లు ఇక్కడ ఉండి రాష్ట్రం సంగతులు చూసుకుంటారు’ అని చెప్పాను. ‘మరైతే... మనవాళ్లు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా డోలంత పెద్ద పూలగుత్తుల్ని తీసికెళ్లి వాళ్లకిచ్చి దణ్ణం పెడతారెందుకు’ అని సూటిగా అడిగింది. వెంటనే జవాబు స్ఫురించలేదు. ‘మర్యాద.. అదొక మర్యాద’ అన్నాను. ‘ప్రతిసారీ మంచి ఖరీదైన పట్టు శాలువా కూడా ఢిల్లీ మంత్రులకు కప్పుతారు’ అన్నది. అవి లాంఛనాలు... అలాగే ఉంటాయన్నాను. మనలో మనకి అవన్నీ దేనికని ఎదురుప్రశ్న వేసింది. ఏదో సర్దిచెప్పి, ఒడ్డున పడ్డాను. పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్ల కాబట్టి, హాయిగా సందేహాలు అడిగింది. నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క మంత్రి చేతుల్లోకి ఎన్నెన్ని ఖరీదైన బొకేలు వస్తాయో.. ఒక్క క్షణం కూడా ఆయన చేతిలో ఉండదు. శాలువా కప్పగానే, అదేదో మిడతో, పురుగో భుజంమీద వాలి నట్టు దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఈ రాజ లాంఛనాలేమిటో అనిపి స్తుంది. దేవాలయాల్లో దేవు డికి వచ్చే వస్త్రాలను ఏటా వేలం వేస్తారు. ఈ శాలు వాలు కూడా అలా వేసి, ప్రభుత్వ ఖజానాకి జమ వేస్తే బాగుండు. సగటున ప్రతి మంత్రి నిత్యం పది శాలువాలు కప్పించుకుంటాడు. పదిహేను పూల గుచ్ఛాలు అందుకుంటాడు. మనలో మనకి ఈ మర్యాదలేంటని అందరూ ఒక్కమాట అను కుంటే, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవు తుంది. పోనీ, వీళ్లకి వాళ్లకి మధ్య నిజంగా గౌర వాలు, అభిమానాలు ఉంటాయా అంటే రవ్వంత కూడా ఉండవు. బయటకు రాగానే మీడియా మైకుల్లో నిర్భ యంగా చెరిగి పడేస్తారు. రాష్ట్ర గవర్నర్ ఉన్నతస్థాయి అధికారి. ఆయన కూడా ప్రజా సేవకే ఉన్నారు. ఆయనని కలవడానికి లేదా దర్శించడానికి వెళ్లినప్పుడల్లా మద్దెలంత పూల గుచ్ఛం స్వయంగా మోసుకు వెళ్లాలా? ఇవన్నీ ఎవరు నిర్దేశించారు. వీటి అమలు వెనుక అంతరార్థమేమిటి? ప్రధాని మోదీ ‘మనసులో మాట’ పేరుతో చాలా అర్థ వంతమైన ప్రసంగాలు ఆకాశవాణిలో చేస్తుంటారు. సందేశాలు, సలహాలు ఇస్తారు. ఇలాంటి కృత్రిమమైన మర్యాదల్ని, లాంఛనాల్ని ఎందుకు నిశ్శేషంగా వదిలిం చరో అర్థం కాదు. ముందసలు అన్నిచోట్ల కుప్పలుగా పడివున్న శాలువాలని వెంటనే కేరళకి పంపండి. కొంత పాపం శమిస్తుంది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
రిలీఫ్ ఫండ్‌కు 14 రోజుల్లో రూ.713 కోట్లు
-
కేరళకు కేంద్ర సాయం కంటే.. విరాళాలే ఎక్కువ!
తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు, టెక్ దిగ్గజాలు మొదలుకొని సామాన్యుల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆగస్టు 29 వరకు 730 కోట్ల రూపాయలు అందాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల అనంతర పరిస్థితులపై, పునరావాస చర్యలపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. 730 కోట్ల రూపాయల సాయం అందిందని ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో ఈ మొత్తం జమ అయినట్టు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం(600 కోట్ల రూపాయలు) కన్నా ఇది 21.7 శాతం ఎక్కువని పేర్కొన్నారు. తమ అంచనాల కన్నా మూడు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. కేరళను పునర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ నలుమూలల నుంచి కేరళను ఆదుకోవడానికి అనేక మంది ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రకృతి విలయం కారణంగా కేరళలో 20వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఊహించని వర్షం.. అపార నష్టం వరదల కారణంగా 483 మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. వరదల సమయంలో 14.50 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం 59,296 మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని చెప్పారు. 57 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. వరదల కారణంగా సంభవించిన నష్టం దాదాపుగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను దాటిపోయిందని భావిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేయగా ఏకంగా 352.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. -
సాధారణ మనిషిలా మూటలు మోసిన కేరళ మంత్రి
-
కేరళలో దళితులను ఆదుకోవాలి: చుక్కా రామయ్య
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో శ్రీమంతులు నిలదొక్కుకుంటున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీలు మాత్రం నిరాశ్రయులయ్యారని అలాంటి వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఇటీవల చుక్కా రామయ్యకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును అందచేయగా, ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. కేరళకు చెందిన దళిత ఫ్యాంథర్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అంబుజాక్షన్‌కు ఆయన ఈ చెక్కును అందించారు. కేరళకు విదేశాల నుంచి వచ్చే సాయాన్ని తిరస్కరించరాదని, దాన్ని పేదల కోసం వినియోగించాలని రామయ్య సూచించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీ నర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఐఏఎస్ కాకి మాధవరావులు మాట్లాడుతూ.. కేరళలో నిమ్నవర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష తగదని, అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేరళలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ సి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. -
అవసరం –ఆత్మగౌరవం
యాభై అరవై సంవత్స రాల కిందట– మేం రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో ‘రీడర్స్ డైజెస్ట్’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. అందులో చివర ఒక సంక్షిప్త నవల ఉండేది. నిజంగా జరిగిన సంఘటన మీద ఒక నవల వచ్చింది. స్విట్జర్లాండ్‌లో ఒక విమాన ప్రమాదం జరిగింది. బాగా ఎత్తుగా ఉన్న ఆల్ఫ్స్ పర్వతశ్రేణి మధ్య ఆ విమానం కూలిపోయింది. నరమానవులు వెళ్లలేని మంచు శ్రేణులవి. అందులో 22 మంది ఉన్నారు. అందరూ వారిమీద ఆశలు వదులుకున్నారు. కానీ కొద్ది రోజులకు ఆ కూలిన ప్రదేశం నుంచి సంకేతాలు రాసాగాయి. అంతా తుళ్లిపడ్డారు. వెంటనే వారిని రక్షించడానికి పరుగులు తీశారు. తీరా 22 మందిలో 16మంది మరణించగా ఆరుగురు బతికారు. వారి మొదటి సమస్య బయటి ప్రపంచానికి తమ ఉనికిని తెలియజేయడం. మరి ఈ ఆరుగురు 16 రోజులు ఎలా జీవించారు? వారి చుట్టూ 16 శవాలు మంచులో నిక్షేపంగా ఉన్నాయి. ఆ నవల చివరి వాక్యం ఇన్నేళ్లూ నా మనస్సులో తలచుకున్నప్పుడల్లా తుపాకీలాగ పేలుతూనే ఉంది. ‘థాంక్గాడ్! వారి చుట్టూ మంచులో 16 దేహాలు ఉన్నాయి!’ ఇంతే కథ, ఆ కథ వివరాలు ఇప్పుడేమీ గుర్తులేవు. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒక జాతీయ రూపక కార్యక్రమంలో ఒక నాటకం ప్రసారం చేసి నట్టు బాగా గుర్తు. ఇక్కడా వివరాలు గుర్తు లేవు. కానీ ఒక బృందం కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరూ సంస్కారవంతులు. విద్యాధికులు, నగర సంస్కృతిలో జీవించేవారు. ప్రాణాంతకమైన ప్రమా దంలో ఎన్నో రోజులు ఇరుక్కున్నారు. కొందరు పోయారు. మిగిలినవారు ఎన్నో రోజులు జీవించాలి. ప్రాథమికమైన ‘బ్రతకాలనే’ ఆర్తి క్రమంగా వారి సంస్కారాన్ని అటకెక్కిస్తుంది. వారు అతి ప్రాథమి కమైన– కేవలం ‘ఉనికి’ కోసం విలువల్ని విస్మరించే స్థితికి వస్తారు. ఇది భయంకరమైన వాస్తవానికి ప్రతి బింబం. ఎన్నో నెలలపాటు కొత్త ప్రాంతాల అన్వేషణకు బయలుదేరిన అలనాటి కొలంబస్, వాస్కోడీగామా వంటి వారి బృందాలు సముద్ర మధ్యంలో ఆహార పదార్థాలు కొరవడగా– తమ నౌకల్లోని ఎలుకలను పట్టి తినడాన్ని మనం చదివాం. ఈ మూడు కథలూ– ఒక అనూహ్యమైన మలు పులో మానవునిలో సంస్కారవంతమైన విలువలు లుప్తమై కేవలం Suటఠిజీఠ్చిl∙లక్ష్యమైపోతుంది అన్న సత్యానికి నిరూపణలు. ఇప్పుడు కేరళలో ఎదురైన విపత్తు అలాంటిది. ఇక్కడ ‘ఆత్మ గౌరవం’ ఆలోచన లకు బహుదూరం. కేరళలో గత 100 సంవత్సరాలలో కనీవినీ ఎరు గని వర్షాలు పడ్డాయి. 32 డ్యామ్‌లు నీటితో ఊపిరి బిగించాయి. 10వేల కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపో యాయి. లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎందరో మరణించారు. ఇప్పుడు వీరి పునరావాసానికి గుంజాటన జరుగుతోంది. ఒక విలేకరి ఒక ఇంటిని చూపి– ఇక్కడ నీరు తగ్గాక– వర్షం తెచ్చిన మట్టి, ఇతర చెత్త నుంచి ఈ ఇంటిని పరిశుభ్రం చేయాలంటే కనీసం 2 నెలలమాట– అన్నారు. ఒక ఉదాహరణ. చెంగల్పట్టు సమీపంలో మామండూరు అనే ఊరిలో– రోడ్డుపక్క ఒక ఫ్యాక్టరీ షెడ్డు ఉంది. పక్కనే ఏరు. ఫ్యాక్టరీ మూతపడింది. ఎన్నో నెలల తర్వాత– కొత్త వ్యాపారి దానిని అద్దెకి తీసుకున్నాడు. శుభ్రం చేయడానికి మనుషుల్ని పుర మాయించాడు. లోపలికి మనుషులు వెళ్లగా రెండు పాములు కనిపించాయి. వాళ్లు బెదిరి పాములు పట్టేవారిని పిలిపించారు. తీరా ఆ షెడ్డులో కేవలం మూడు వేల పాములున్నాయట! కేరళ ఇళ్లలో శవాలే ఉన్నాయో, చెత్తే ఉందో, మరేం ఉందో ఇంకా తెలీదు. ఈలోగా విదేశాల వారు కూడా స్పందించి సహాయానికి నడుం కట్టారు. యునైటెడ్ ఆరబ్ రిపబ్లిక్ 700 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ కేంద్రం పరాయి దేశాల సహాయం వద్దంది. ‘మా అవసరాల్ని మేమే తీర్చు కుంటాం. మీ పెద్ద మనస్సుకి జోహార్’ అంటూ విదేశాంగ శాఖ విదేశాలకు సమాధానం ఇచ్చింది. కేరళ ముఖ్యమంత్రి ‘వారినయినా ఇవ్వనివ్వండి, మీరయినా ఇవ్వండి’ అన్నారు. కష్టంలో, సుఖంలో ప్రపంచమంతా చేతులు కలపాలన్న ‘వసుధైక కుటుంబం’ ఆదర్శం పాటించే దేశం– చెయ్యి అందించే పరాయి దేశం సహాయాన్ని ఎందుకు తిరస్కరించాలి? ఆత్మగౌరవం అరుదైన విలువ. కానీ అవసరం ప్రాథమికమైన ఉప్పెన. ఆపదలో ఆదుకునే సహృదయానికి ఆత్మగౌరవం ఆటంకం కాకూడదు. కాగా, సౌజన్యానికి ఎల్లలని నిర్ణయించడం ‘ఆత్మగౌరవానికి’ దక్కవలసిన కితాబు కాదు. ఔదార్యానికి ఆంక్ష పెద్ద మనసు అనిపించుకోదు. మన పెరట్లో మూడువేల పాములున్నాయి. బూరా ఊదే మనిషిని దూరంగా ఉంచకండి. గొల్లపూడి మారుతీరావు -
కేరళ వరదలు: హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ విరాళం
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేరళ వరద బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించింది. పదికోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే కేరళలో వరదలకు గురైన 30 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటు ఆగస్టు మాసానికి సంబంధించి పలు లోన్లపై చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులపై లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో హెచ్డీఎఫ్సీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని డొనేట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలకు అండగా నిలబడాలని తాము భావించామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి చెప్పారు. త్వరలోనే కేరళ ప్రజలు కోలుకొని సాధారణమైన స్థితికి చేరుకోవాలని ప్రార్థించారు. గ్రామాల దత్తతలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని బ్యాంకు తెలిపింది. దీంతోపాటు ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అంతేకాదు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నామని బ్యాంకు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు లాభాపేక్ష లేని స్థానిక భాగస్వాముల సహాకారం ఈ కార్యక్రమాలను సుదీర్ఘ ప్రణాళికగా చేపడతామని వివరించింది. -
అరకొర వరద సాయంపై రాహుల్ రుసరుస..
కొచ్చి : వరదలతో దెబ్బతిన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎంతమాత్రం సరిపోదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ కేంద్రం అరకొర సాయం చేస్తూ దక్షిణాది రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. కేంద్రం ఆరెస్సెస్ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం రెండు వైరుధ్య సిద్ధాంతాలున్నాయని, ఒకటి నాగ్‌పూర్ ఆదేశాలతో పనిచేసే కేంద్రీకృత విధానమైతే మరొకరి అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతులు, ఆలోచనలను సమాదరిచే విధానం మరొకటని రాహుల్ పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న బాధితులకు బాసటగా నిలిచేందుకే తాను ఇక్కడికి వచ్చానని, రాజకీయాల కోసం కాదని చెప్పారు. వరదలతో నష్టపోయిన ప్రజలు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారని, వారికి పాలకులు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తాను కేరళ సీఎంతో మాట్లాడానని రాహుల్ చెప్పుకొచ్చారు. బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని సత్వరమే వారికి అందించాలని కోరారు. -
వరదలనూ వదలని రాజకీయాలు
విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహాయక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశ ముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదు. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులే అయినప్పటికీ యూఏఈ వరదసాయాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావనిపిస్తోంది. మరికొందరు దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివారణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడటం దురదృష్టకరం. కేరళలో వచ్చిన వర దలు గత వందేళ్లలో ఆ రాష్ట్రం చూడని వర దలు. ఈ ప్రకృతి వైప రీత్యాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పూర్తి అవగాహన, పరస్పర సహకా రంతో పనిచేశాయి. బాధితులను రక్షించడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్), స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయి. పూర్తి సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు చేతనైతే తమవంతు సహాయం అందించడం లేదా నైతిక మద్దతు ప్రకటించడం వదిలేసి కొంతమంది అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. దక్షిణ భార తదేశంలో జరిగే ఉపద్రవాలకు కేంద్రం సరైన సహ కారం అందించడం లేదని బాధ్యతారహితంగా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉపద్రవ సహాయక కార్యక్రమాలతో సంబంధంలేని, అవగాహన లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపద్రవlసహా యక కార్యక్రమాలను పర్యవేక్షించే వ్యక్తి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటికి ప్రాధాన్యం సంతరిస్తుంది. ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ట్విట్టర్లో రాష్ట్రప్రభుత్వం వరదల సహాయం కోసం కేంద్రాన్ని రూ. 2,200 కోట్లు అడిగిందని. కేంద్రం రూ. 600 కోట్లు ఇచ్చిం దని, యూఏఈ ప్రభుత్వం రూ. 700 కోట్లు ఇస్తా మంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యానాల ఉచితాను చితాలను విశ్లేషించే ముందు భారతదేశంలో విప త్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యవస్థీకృత విధానం ఉన్నదో పరిశీలిద్దాం. ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలలో లేని విధంగా విపత్తులను ఎదుర్కోవడానికి భారత దేశంలో చక్కని విధివిధానాలు రూపొందించారు. అమెరికా కత్రినా తుపాను ఎదుర్కొన్న విధానంతో పోల్చుకుంటే భారతదేశం వరదలు–తుపాన్లు వంటి ఉపద్రవాలు చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నది. 2005లో కేంద్ర ప్రభుత్వం విపత్తుల పర్యవేక్షణ చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ ప్రణాళిక తయారుచేశారు. ఈ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి విపత్తుల నివారణ, నిర్వహణ కోసం రూపొందించిన సెండాయ్ సమావేశపు విధి విధానాలకు అనుగుణంగా రూపొందించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ ఉప ద్రవ పర్యవేక్షణ వ్యవస,్థ రాష్ట్రస్థాయిలో ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఉపద్రవ సమయాలలో సహాయ రక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక బలగం ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేశారు. ఉపద్రవ సహాయ రక్షణ కార్యక్రమాలలో శిక్షణనిచ్చి సామర్థ్యాలు పెంచ డానికి ఒక ప్రత్యేక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ దక్షిణభారత కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం సమీపంలో రూపుదిద్దుకుం టోంది. వీటన్నిటికీ మించి ఉపద్రవ సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వ ర్యంలో ఒక కమిటీ, రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో కమిటీ, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తాయి. ఈ కమిటీలు రోజువారీగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ద్వారా మీటింగులు నిర్వహించుకొని ఉపద్రవ నివారణ రక్షణ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి. ఉప ద్రవ నివారణ, రక్షణ కార్యక్రమాలను నిర్వహించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు, అధికా రులు పూర్తి సమన్వయంతో సహకారంతో పనిచేయ డంలో ఈ కమిటీలు చాలా ప్రధాన పాత్ర పోషి స్తాయి. హుదూద్ తుపాన్ సందర్భంలో ఈ కమిటీల పాత్రను, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల నుంచి పూర్తి సహాయ సహకారాలను నేను ప్రత్యక్షంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా చూశాను. రక్షణ హోం శాఖ కార్యదర్శులను అర్ధరాత్రి అపరాత్రి సమ యాల్లో కూడా ముఖ్య విషయాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. వారి స్పందన కూడా సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉండేది. నేడు కేరళ వరదలు ఎదుర్కోవడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అనుకోవటానికి అవకాశాల్లేవు. వివాదమంతా ఆర్థిక సాయం గురించే! ఇక ఎటొచ్చి సమస్యంతా ఆర్థిక సహాయం గురించే. విపత్తుల నివారణకు, నిర్వహణకు కావాల్సిన ఆర్థిక సదుపాయాలకోసం విధి విధానాలను ఆర్థిక సంఘాలు నిర్దేశిస్తాయి. 2005 విపత్తుల నిర్వహణ చట్టం తర్వాత వచ్చిన 13, 14 ఆర్థిక సంఘాలు ఈ అంశంపై దృష్టి పెట్టి విపత్తు నిర్వహణకు కేంద్ర స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ఎస్, డీఆర్ఎఫ్ అనే రెండు నిధులను ఏర్పాటు చేశాయి. కేంద్రం కొన్ని ప్రత్యేక డ్యూటీల ద్వారా కేంద్ర స్థాయి నిధికి వనరులు సమీకరిస్తోంది. అదనంగా బడ్జెట్ నుంచి అవసరాన్నిబట్టి కేటాయిస్తోంది. రాష్ట్రస్థాయి నిధికి ఈ కేంద్ర నిధి నుంచే ఆర్థిక సంఘం నిర్ణయించిన విధంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ముందు ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం భరించేవి. 14వ ఆర్థిక సంఘం కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భరించేటట్లు నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును అనుసరించి 2015 –20 మధ్య వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి విపత్తుల నిర్వహణకు రూ. 55 వేల కోట్ల కేటాయింపులు జరి గాయి. గత సంవత్సరాల్లో విపత్తు నిర్వహణలో రాష్ట్రాలు పెట్టిన ఖర్చు ఆధారంగా ఈ కేటాయిం పులు జరిగాయి. ఇది శాస్త్రీయ విధానం కాదని గుర్తించి విపత్తుల సూచికను రాష్ట్రాలవారీగా తయా రుచేయాలని 14వ ఆర్థిక సంఘం అభిలషించింది. ఇది కష్టసాధ్యమైన విషయంగా గుర్తించి అంతకు ముందు విపత్తులపై రాష్ట్రాలు చేసిన ఖర్చులను కొలబద్దగా తీసుకుని రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఇందువల్ల ఇంతకుముందు ఉపద్రవాలు ఎదుర్కొన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరి గాయి. ఉదాహరణకు ఈ ఐదేళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2020 దాకా కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రూ. 2,186కోట్లు మధ్యప్రదేశ్‌కు రూ. 4,363 కోటు,్ల మహారాష్ట్రకు రూ. 7,376కోట్లు కేటా యించగా, కేరళకు ఈ ఐదేళ్లలో ఈ నిధి కింద కేటాయింపు రూ. 919 కోట్లు మాత్రమే. ఇంతకు ముందు సంవత్సరాల్లో కేరళలో ఉపద్రవాలు లేనం దువల్ల అవి ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి కేటాయింపులు తక్కువే జరిగాయి. అందు వల్ల ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కేరళ ఎక్కువ ఆర్థిక సహాయం అడగటానికి హేతుబద్ధమైన ప్రాతి పదిక ఉంది. ఎక్కువ కేటాయింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉపద్రవాలు రానప్పుడు కేటాయించిన నిధులను వెనుకకు తీసుకునే వెసులుబాటునూ 14వ ఆర్థిక సంఘం కల్పించినట్టు లేదు. అలాంటి వెసు లుబాటు ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా ఖర్చు కాని రాష్ట్రాల నుంచి ఈ నిధులను కేరళ లాంటి రాష్ట్రానికి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక 15వ ఆర్థిక సంఘం అయినా ఈ అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ఏదైనా విపత్తు సంభ వించినప్పుడు ప్రధానమంత్రి విపత్తు ప్రాంతాలు పరిశీలించి ప్రకటించే సాయం తాత్కాలికమైనది. పూర్తి సహాయాన్ని నిపుణుల బృందం వచ్చి పరిశీ లించాక నిర్ధారిస్తారు. వెంటనే నిర్వహించవలసిన రక్షణ, సహాయ కార్యక్రమాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. విదేశీ సాయంపై అధికారం కేంద్రానిదే విదేశీ సహాయం విషయాల్లో ఈ అంశాల్లో నిర్ణయా« ధికారాన్ని విపత్తుల నివారణ ప్రణాళిక కేంద్రప్రభు త్వానికి వదిలేసింది. విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే మరో సారి ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహా యక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకో లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు విదేశీ సాయం లేనప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలన్నిం టిని సమగ్రంగా పరిశీలించి జాతీయ విపత్తులకు విదేశీ సహాయం తీసుకోలేదు. అదే సంప్రదాయాన్ని ఈనాడు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించాక కొనసాగించడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. యూఏఈ ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న సహాయం ఊహా పరమైనదేనని తెలిసిపోయింది. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులు. పై అంశాలేవి వారికి తెలియనివి కావు. ఈ పై అంశాల దృష్ట్యా వారు చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావ నిపిస్తోంది. మరికొందరు ఉత్తర, దక్షిణ భారత అంశాలను ప్రస్తావించి దక్షిణాది రాష్ట్రాల విష యంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివా రణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడ టం దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఇలాంటి విపత్తే తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ప్రాంతా ల్లో వస్తే దేశం ఇంత నిశితంగా చూసి ఉండేది కాదు. సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉండి ఉండేవి. కారణం ఆ రాష్ట్రాల వెనుకబాటుతనం. సమర్థ నాయకత్వ లోపం. దక్షిణాది రాష్ట్రాల్లో పరి స్థితులు వేరు. భవిష్యత్తులో తమ సమస్యలను స్పష్టంగా వినిపించగల, సాధించుకోగల సమర్థ నాయకత్వాలు కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఈ విషయాల్లో ముందే ఉంటాయి. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
బాహుబలిలా మూటలు మోసిన మంత్రి
తిరువనంతపురం: ప్రకృతి సృష్టించిన విలయం నుంచి కేరళ ప్రజలను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి కేంద్రబలగాలతో పాటు, ఉన్నతాధికారులు కూడా శ్రమించారు. మత్య్సకారులైతే స్వచ్ఛందగా తమ సేవలందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదోరకంగా తమకు తోచిన సహాయం చేశారు. కేరళ వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేయడానికి ఐఏఎస్ అధికారులు సైతం మూటలు మోసిన సంగతి విదితమే. సహాయక చర్యల్లో కేరళ మంత్రి రవీంద్రనాథ్ వ్యవహరించిన తీరు పలువురికి ఆదర్శంగా నిలిచింది. కేవలం సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా.. బాధితులకు కావాల్సిన సామాగ్రిని ఆయన తన భుజంపై మోసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. ఆయన బాహుబలిలా కష్టపడ్డారని అభినందిస్తున్నారు. కాగా కేరళలో సంభవించిన వరదల్లో చిక్కుకుని 400 మందికి పైగా మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని అంచనా వేస్తున్నారు. -
కేరళ వరదలు: మూటలు మోసిన మంత్రి
-
కేరళకు గూగుల్ భారీ సాయం..!
సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు గూగుల్ భారీ సాయం ప్రకటించింది. రూ. 7 కోట్లు విరాళమిస్తున్నట్టు గూగుల్ ఇండియా ట్విటర్లో వెల్లడించింది. సంస్థ వితరణలో ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపింది. కాగా, గత శతాబ్ద కాలంలో కేరళ ఇంతటి భారీ ప్రకృతి విలయాన్ని చూడలేదు. 1924లో ముంచుకొచ్చిన వరద ముప్పు నుంచి తేరుకున్న దేవభూమి కేరళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాగా, ఈ నెల (ఆగస్టు) మెదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండిపోవడంతో ఒకేసారి 34 ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీంతో రాష్ట్రం వరద ముంపునకు గురైంది. కేరళ వ్యాప్తంగా 400 పైగా జనం వరదల్లో చిక్కుకుని మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు, ఈ విపత్తు పక్కకున్న కర్ణాటకను కూడా తాకింది. వరదల కారణంగా కొడగు జిల్లా నీట మునిగి 17 మంది చనిపోయారు. కేరళను ఆదుకోవడానికి దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రపంచంలోని కేరళీయులు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చి కేరళను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని పలు విశ్లేషణలు చెప్తున్నాయి. .@Googleorg and Google employees are contributing $1M, to support flood relief efforts in Kerala and Karnataka. #GoogleForIndia@RajanAnandan — Google India (@GoogleIndia) August 28, 2018 -
కేరళ కోసం జడ్జీల గానం
న్యూఢిల్లీ: సంక్షోభ సమయాల్లో మానవీయంగా స్పందించగలమని, అందుకు అవసరమైతే మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరూపించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం సోమవారం సుప్రీంకోర్టు జర్నలిస్ట్‌లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ గాత్ర ప్రావీణ్యాన్ని చూపారు. ఈ ఇద్దరు జడ్జీలు కేరళకే చెందినవారు కావడం గమనార్హం. మలయాళ క్లాసిక్ సినిమా ‘అమరం’లోని మత్స్యకారుల జీవనాన్ని వర్ణించే ఓ పాటను కేఎం జోసెఫ్ పాడారు. ‘కేరళలో వరద బాధితుల సహాయానికి ముందు స్పందించింది మత్స్యకారులే. అందుకే వారి కోసం ఈ పాట’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గాయకుడు మోహిత్ చౌహాన్‌తో కలిసి ‘వి షల్ ఓవర్‌కమ్ సమ్‌డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆలపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, పలువురు ఇతర జడ్జీలు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 లక్షలకు పైగా విరాళాలు వసూలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ. 25 వేల చొప్పున, కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. -
ఇక సినీ వెల్లువ
వరద విలయం సృష్టించింది.చేయీ చేయీ కలిపిన జనం దానిని ఎదిరించి నిలబడ్డారు.కొన్ని చోట్ల కరెంటు లేదు.కొన్ని చోట్ల నీళ్లు లేవు.కొన్ని చోట్ల నీడ.కాసింత నిరాశ ఉంటుంది.కాని ఈ నిరాశకు రిలీఫ్‌గా అక్కడ కొత్త సినిమాలు రానున్నాయి.మా సినిమాలు చూసి రీచార్జ్ అవ్వండి అంటున్నారు అక్కడి పెద్ద హీరోలు. నిజమే. ఆ వరదకు జవాబు ఈ వెల్లువే కదా అభిమానులకు. మనకు సంక్రాంతి, దసరాలానే కేరళకు ఓనమ్. ఇది ఓనమ్ సీజన్.ఈ సీజన్లో సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసి జోరుగా బిజినెస్ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. కాని అనూహ్యంగా ఈ ఏడాది ఈ సీజన్లోనే కేరళకు వరద వచ్చింది. రాష్ట్రం చాలా దెబ్బ తినింది. సినిమా ఇండస్ట్రీ కూడా. ఆగస్ట్‌లో ఓనమ్ సీజన్లో రిలీజ్ కావల్సిన 5–6 సినిమాలు ఇప్పుడు డేట్ చూసుకొని షోకు సిద్ధం అవుతున్నాయి. ముందు వసతి తర్వాతే వినోదం కేరళ ప్రజలకు ఉండటానికి చోటు, తినడానికి సరైన తిండి కూడా లేనప్పుడు సినిమాల రిలీజు సరిౖయెన పని కాదని అనుకుంది అక్కడి ఇండస్ట్రీ. కనీస వసతుల మీద దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి తానూ చేయ దగ్గ సాయం చేసింది. మరోవైపు ఈ వరదల ద్వారా ఎంతో మంది బాధకు గురవుతుంటే మిగతా వాళ్లు పండగ సంబరాల్లో మునిగి తేలడం కూడా కరెక్ట్ కాదని స్టేట్ గవర్నమెంట్ కూడా పేర్కొంది. అందుకనే కేవలం సినిమా రిలీజ్‌లనే కాదు కేరళలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చాలా సినిమాల షూటింగ్‌లు ఆపేశారు. ఫాహద్ ఫాజల్ లేటెస్ట్ సినిమా కోసం వేసిన సెట్ వరదల్లో కొట్టుకుపోయిందని చిత్రబృందం పేర్కొంది. ఈ పండక్కు రిలీజ్ కావల్సిన కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేశారు చిత్రబృందాలు. ఈ సినిమాలను వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి రీ షెడ్యూల్ చేశారు. మలయాళ సినీ చరిత్రలో ఓనమ్‌కు సింగిల్ సినిమా కూడా రిలీజ్ లేకపోవడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఓనమ్‌కు కేరళ మార్కెట్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా... మలయాళం క్రేజీ ప్రాజెక్ట్.. ‘ప్రేమమ్’ ఫేమ్ నివీల్ పౌలీ హీరోగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘కాయమ్‌కులమ్ కొచ్చున్ని’. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో నివసించిన కాయమ్‌కులమ్ కొచ్చున్ని అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్న వాళ్ల దగ్గర దోచుకొని పేదవాళ్లకు పంచే రాబిన్‌హుడ్ క్యారెక్టర్. ఈ పాత్రను నివీన్ పౌలీ పోషించగా అతని గురువుగా మోహన్‌లాల్ కనిపిస్తారు. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. వరదల కారణంగా పోస్ట్ పోన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అల్లరి చేసే మమ్ముట్టి.. పండక్కి స్టార్ హీరో సినిమా లేకపోతే కచ్చితంగా ఆ వెలితి కనిపిస్తుంది. అయితే ఈసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’ సినిమాతో వస్తున్నారు. ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి గ్యాంగ్‌కి లీడర్‌గా కనిపిస్తారు మమ్ముట్టి. చేసిన పనికి, చేయని పనికి కచ్చితంగా బ్యాడ్ నేమ్ మాత్రం మన హీరోకే వస్తుందట. ఇలాంటి లైట్ హార్ట్ కామెడీతో రూపొందిన చిత్రం ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’. ‘అవును’ ఫేమ్ పూర్ణ, రాయ్ లక్ష్మీ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. శేతు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్ట్ 24న విడుదల కావల్సింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న రిలీజ్ కానుంది. హార్రర్ థ్రిల్లర్‌గా.. ఫాహద్ ఫాజిల్ ‘వరతాన్’ చిత్రం కుడా ఓనమ్‌కు వస్తుందని చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు చిత్రబృందం. కెమెరామేన్, డైరెక్టర్ అమల్ నీరాద్ తెరకెక్కించిన ఈ సినిమాను అమల్ నీరద్‌తో కలసి ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నిర్మించారు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సినిమాలో ఓ రొమాంటిక్ పాటను కూడాపాడారు నజ్రియా. చైన్ స్మోకర్ సెటైర్ 2017లో మలయాళం సూపర్ హిట్ ‘మాయనది’తో మంచి పేరు సంపాదించుకున్న టోవినో థామస్ ఈ ఓనమ్‌కు ‘తీవండి’తో వస్తున్నారు. తీవండి అంటే చైన్ స్మోకర్ అని అర్థం. పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్ ఫెస్టివల్‌కి చాన్స్ లేకపోవడంతో సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఓనమ్‌కి రావాలనుకున్న కొన్ని సినిమాలు ‘కామెడీ పడయోట్టమ్’, ‘జానీ జానీ యస్ పాప్ప’, ‘మాంగళ్యం తంతూనానేనా’ సినిమాలను కూడా వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాల కోసం థియేటర్లు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. వరదల కారణంగా పలు థియేటర్లు నీట మునిగిపోయాయి. కేవలం థియేటర్స్ ఏరియా నష్టమే సుమారు 30 కోట్లు వరకూ ఉండొచ్చని కేరళ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటు షూటింగ్ నిలిపివేత, అటు కొత్త చిత్రాల విడుదల ఆపివేత.. మొత్తంగా కేరళ ఎంటర్టైన్మెంట్ ఇండ్రస్టీకి తీరిన నష్టమే అని చెప్పాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మళ్లీ కేరళ కళకళలాడాలని, కొత్త రిలీజులతో థియేటర్లు సందడి చేయాలని, ఎప్పటిలా షూటింగ్స్ జోరుగా జరగాలని కోరుకుందాం. కాలం మన నేస్తం కేరళ ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ‘ప్రేమదేశం’ కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్ లిరిక్‌ని మార్చి తన కాలిఫోర్నియాలో షోలో పాడారు ఏఆర్ రెహమాన్. ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడారు. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్ పాట ద్వారా తన సందేశం పంపారు. మేమున్నామని... కేరళకు మేమున్నాం అంటూ మోహన్‌లాల్, మమ్ముట్టి చేరో 25 లక్షలు సీయం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. కొంత మంది హీరోలు డబ్బు రూపంలో సహాయం చేస్తే మరికొందరు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కేరళకు సహాయంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, విజయ్ దేవరకొండ ఇలా పలువురు కళాకారులు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్ తదితరులు విరాళం అందజేసినవారిలో ఉన్నారు. పలువురు కథానాయికలు సైతం కేరళకు మేమున్నామని సహాయానికి ముందుకొచ్చారు. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి వారు కూడా చేయూతనిచ్చారు. కేరళ వరదలపై డాక్యుమెంటరీ 2018లో వచ్చిన వరదలు గత వందేళ్లలో కేరళ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని విజువల్‌గా చూపించదలిచారు దర్శకుడు మధుసూదనన్. వరద సమయాల్లో ఫోన్ లేదా కెమెరాతో షూట్ చేసిన వీడియోస్ అన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. కెమెరామేన్, దర్శకుడు రాజీవ్ రవి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టెక్నికల్ విషయాలను చూసుకుంటారట. ‘ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌తో వచ్చే డబ్బులను కేరళను మళ్లీ రీ–బిల్డ్ చేసే పనులకు వినియోగిస్తాం’ అని దర్శకుడు మధుసూదనన్ పేర్కొన్నారు. రానా 2 సినిమాలకు బ్రేక్ రానా నటిస్తున్న బహు బాషా చిత్రాలు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ కూడా కేరళలోని వరదల కారణంగానే ఎఫెక్ట్ అయ్యాయి. ‘హాథీ మేరీ సాథీ’ సినిమా ఎక్కువ శాతం ఏనుగులు, అడవికి సంబంధించిన కథ. ఈ సినిమాకు సంబంధించిన చాలా పోర్షన్ కేరళ దట్టమైన అడవుల్లో షూట్ చేయాలి, కానీ ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించాయి అని రానా పేర్కొన్నారు. అలాగే 1945 కోసం వేసిన సెట్ వరదల కారణంగా ధ్వంసం అవడంతో యూనిట్ డైలమాలో పడింది. అయితే ఈ బ్రేక్ తాత్కాలికమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లుడు ఆలస్యం అయ్యాడు కేరళలోని వరదల ప్రభావం కొన్ని తెలుగు సినిమాలపైన కూడా పడింది. హీరో నాగచైతన్య దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసుకోవల్సి వచ్చింది. కేరళ సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకుడు మారుతి లాస్ట్ మినిట్ వరకూ కేరళ వాతావరణంతో ఫైట్ చేసి రీ–రికార్డింగ్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దాంతో ఈ సినిమాను వచ్చే నెల 13న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్రబృందం. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
‘కేరళ వరదలకు కారణం అదే’
కొచ్చి: వాతావరణ మార్పుల కారణంగానే ఇటీవల కేరళలో భారీ వర్షాలు, వరదలు పెను విధ్వంసం సృష్టించాయని ప్రముఖ పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్ర భూషణ్ తెలిపారు. గత కొన్నేళ్లలో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, చెన్నైలో కుంభవృష్టితో పాటు అకస్మాత్తుగా భారీ వరద పోటెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న డ్యాముల నిర్వహణ వ్యవస్థను పునఃసమీక్షించాల్సిన అవసరముందని భూషణ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులతో పశ్చిమ కనుమల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగానే కేరళలో కుంభవృష్టి సంభవించిందనీ, కాంక్రీటు నిర్మాణాలు, ఇతర మానవ చర్యల కారణంగా వరద పోటెత్తి అపార నష్టం సంభవించిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా పశ్చిమ కనుమల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిటీ లేదా కస్తూరిరంగన్ కమిటీ చేసిన సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) సంస్థ భూషణ్‌కు గతేడాది ఓజోన్ అవార్డును అందజేసింది. మాంట్రియల్ ప్రోటోకాల్‌ను సవరిస్తూ కిగాలీలో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం చర్చల సందర్భంగా చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. -
కేరళకు విరాళంగా వైఎస్సార్సీపీ శాసనసభ్యుల నెల వేతనం
సాక్షి, అమరావతి: వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు నెల వేతనంతో పాటు అలవెన్సులను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. కేరళ రాష్ట్ర సీఎం సహాయ నిధి కోసం ఆ మొత్తం అందేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) తీసి దానిని వైఎస్సార్సీపీ శాసనసభ కార్యాలయం ఇన్చార్జి ఎస్.శివప్రసాద్‌కు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. చదవండి: కేరళకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం -
కేరళ పునర్నిర్మాణం: సీఎం వినూత్న సూచన
తిరువనంతపురం: ప్రపంచంలోని కేరళీయులందరూ నెలజీతాన్ని విరాళమివ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా కొత్త కేరళను పునర్నిర్మించుకోడానికి సాయపడాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి దాతలకు ఆయన వినూత్న సూచన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు నెల వేతనం సహాయం చేయడానికి ముందుకొస్తారని తమ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. ముఖ్యంగా దాతలు నెలకు మూడు రోజుల జీతం చొప్పున పదినెలలపాటు ఆర్థిక సహాయాన్ని అందించాలనే సూచన చేశారు. దీని వల్ల దాతలకు పెద్ద భారం ఉండదని పేర్కొన్నారు. కేవలం వరద ప్రభావిత ప్రాంతాలను బాగుచేయడం మాత్రమే కాదు కేరళను పునర్నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధించడం సవాలే, కానీ సాధించి తీరాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది, ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలలా ఉన్న మలయాళీలంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి అభిలషించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆదివారం సమీక్షించిన కేరళ సీఎం ఇప్పటివరకూ మూడు లక్షలకు పైగా ఇళ్ళు శుభ్రపరిచినట్టు చెప్పారు. దీనితోపాటు ఇళ్లకు చేరిన బాధితులకు 10వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వివరించారు. 1,435 సహాయక శిబిరాలలో రాష్ట్రంలో మొత్తం 4.62 లక్షల మంది ఇప్పటికీ ఉన్నారని వెల్లడించారు. వీరికి తగినంత ఆహార నిల్వలు ఉన్నాయి, అలాగే పాఠశాలలు బుధవారంనుంచి తిరిగి ప్రారంభించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పాఠశాలలోని అన్ని సహాయక శిబిరాలను ఇతర సమీప ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు కేరళ వరదల్లో 357మంది చనిపోగా, లక్షలాదిమంది ప్రజలలు నీడ కోల్పోయి అనాధలుగా మిగిలిలారు. దాదాపు 2వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోవైపు వరద బీభత్సంనుంచి కోలుకునే పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రజలు గుండె నిబ్బరంతో శ్రమిస్తున్నారు. -
కేరళ వరదలు : సల్మాన్ భారీ విరాళం..?
కేరళ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎందరో ముందుకు వస్తున్నారు. వీరిలో సిని పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కేరళ వాసులకోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిలోకి అతి ‘భారీ విరాళా’న్ని ప్రకటించిన హీరో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ కేరళ బాధితుల కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు నటుడు జావేద్ జాఫెరీ తన ట్విటర్లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ అభిమానులు ఆయన మంచి మనసును అభినందిద్దామనుకునేలోపే జావేద్ ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. దాంతో అభిమానుల్లో గందరగోళం మొదలయ్యింది. అనంతరం జావేద్ మరో ట్వీట్ చేశారు. ‘కేరళ వరద బాధితుల కోసం సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారనే వార్తను నేను కేవలం విన్నాను అంతే. సల్మాన్ లాంటి సూపర్ స్టార్‌కి అది ఏమంత పెద్ద విషయం కాదు. అలానే బాధితులను ఆదుకోవడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి వెంటనే ఈ విషయం గురించి ట్వీట్ చేశాను. అయితే ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం నాకు తెలియదు’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు. I had tweeted that I had ‘heard’ about @BeingSalmanKhan ‘s bcontribution. Because it was a very strong possibility given his track record, I put forward my thoughts and admiration. Taking the tweet off till I can confirm it — Jaaved Jaaferi (@jaavedjaaferi) August 26, 2018 ఇదిలా ఉండగా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ 1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించగా, ‘గోల్డ్’ నటుడు కునాల్ కపూర్ రూ. 1.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. మరో నటుడు రణ్‌దీప్ హుడా వాలంటీర్లతో కలిసి కేరళలోని ఖల్సా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనడమే కాక బాధితులకు స్వయంగా ఆహారం వండి పెట్టారు. -
‘బీఫ్ తిన్నందుకే కేరళకు ఈ శిక్ష’
సాక్షి, బెంగుళూరు : బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. దేవభూమిగా పేరొందిన గడ్డపై ఆవు మాంసం తినడంతోనే ఇంతటి ప్రకృతి విపత్తుకు గురైందని అన్నారు. పశుమాంసం తినేవారెవరైనా దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ‘చూడండి కేరళలో ఏం జరిగిందో..! దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్ ఫెస్టివల్‌తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించింద’ని శుక్రవారం జగిరిన విలేకర్ల సమావేశంలో ఎద్దేవా చేశారు. బసనగౌడ విజయపుర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, పశు మాంసం అమ్మకాలను నిషేదిస్తూ 2017లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కేరళకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీఫ్ ఫెస్టివల్ పేరిట కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య స్పందించారు. ప్రజల్ని రెచ్చగొట్టే, వారి మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడడం బీజేపీ నేతలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయన్నారు. ప్రజల అలవాట్లతో ప్రకృతి విధ్వంసానికి ముడి పెట్టొద్దని హితవు పలికారు. జేడీఎస్ జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ కూడా బసనగౌడపై మండిపడ్డారు. సమాజానికి ఉపయోగపడని బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తారని చురకలంటించారు. -
ఫేస్బుక్ లైవ్‌తో కేరళకు రూ.5లక్షలు సాయం
హిమాయత్ నగర్: కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఫేస్బుక్ సెలబ్రిటీ, దిల్షుక్నగర్ వాసి కొమ్మరాజు దివ్య అన్వేషిత ఇచ్చిన పిలుపునకు అనేకమంది స్పందించారు. సుమారు గంటన్నర్ర పాటు ఆమె ఫేస్బుక్ లైవ్ షో నిర్వహించింది. రూపాయి నుంచి మీ శక్తి మేరకు ఎంతైనా సాయం చేయోచ్చని కోరిందిం. స్పందించిన నెటిజన్లు పేటీఎం ద్వారా రూ.10 నుంచి రూ.20వేల చొప్పున తోచినంత నగదును ట్రాన్స్ఫర్ చేశారు. సుమారు రూ.5లక్షలు దివ్య అన్వేషిత ఫేస్బుక్ లైవ్‌ద్వారా కేరళకు సాయం చేయడం గమనార్హం. -
కేరళ బాధితులకు శారదాపీఠం సాయం
పెందుర్తి: ఇటీవల కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న గిరిజన ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంకల్పించారని, ఆయన ఆదేశాల మేరకు అనేక మంది దాతలను సహాయసహకారాల కోసం సంప్రదించినట్టు ఆ పీఠం ట్రస్ట్ రొబ్బి శ్రీనివాస్ తెలిపారు. ఐపీపీ సెంచరీ క్లబ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విలయతాండవంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలుసుకుని రుషికేష్‌లో చాతుర్మాసదీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర సరస్వతి అక్కడి ప్రజలకు దుస్తులు, పప్పుదినుసులు తదితర వాటిని అందించాలని శ్రీశారదాపీఠం ట్రస్ట్ సభ్యులను ఆదేశించారన్నారు. కేరళలో కూడా శంకర సేన సేవా ట్రస్ట్ శారదాపీఠానికి అనుబంధంగా ఉందని పేర్కొన్నారు. సేవలందించేవారు శారదాపీఠానికి తెలియజేస్తే శంకర సేన సేవా ట్రస్ట్, శారదాపీఠం ట్రస్ట్ సభ్యులు, శారదాపీఠం భక్తులు అంతా కలిసి కేరళ ప్రాంతంలో వాటిని అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే తొలివిడతగా శంకరసేన సేవా ట్రస్టుకు 5వేల దుప్పట్లు, 2వేల చీరలు, 1500 పంచెలు, 3వేల టవల్స్, ఆహారపదార్థాలు పంపించామని తెలిపారు. రెండో విడతగా ఆదివారం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎంఆర్ షాపింగ్‌మాల్ అధినేత మావూరి వెంకటరమణ, కృతుంగా రెస్టారెంట్స్ ఎండి నరేందర్‌రెడ్డి, అభిరుచి స్వీట్స్ అధినేత రామకృష్ణ, హూలీమేరీ ఇంజినీరింగ్ కళాశాల అధినేత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, మహిణ ఇన్ఫ్రా అధినేత సతీష్‌బాబు విరాళాలు ప్రకటించారు. శ్రీదుర్గా ఐబీపీ సెంచరీ క్లబ్ తరఫున లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం అందించారన్నారు. శారదాపీఠం ట్రస్టీలు చల్లా రామారావు, సభ్యులు కె.చలపతిరావు, పి.హనుమంతరావు, పి.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
కేరళ వరదలు : దేశమంతా మీ వెంటే..
సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళ ప్రజలకు భారత ప్రజలంతా బాసటగా నిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. వాయు, సైనిక, వైమానిక దళాలతో పాటు, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కేరళలో అవిశ్రాంతంగా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. సంక్షోభ సమయంలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందిని తాను అభినందిస్తున్నానని ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజలకు రక్షాబంధన్, జన్మాష్టమి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ తన రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఇటీవల మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. భారత రాజకీయ వ్యవస్థల్లో వాజ్‌పేయి సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని దివంగత నేత కట్టుదిట్టం చేశారన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సంఖ్యాబలంలో మంత్రుల సంఖ్య 15 శాతం మించరాదని వాజ్‌పేయి హయాంలోనే పరిమితి విధించారన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలప్రదమయ్యేలా వ్యవహరించిన పార్లమెంట్ సభ్యులను ప్రధాని అభినందించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం వేచిచూస్తోందని, ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా దేశ ప్రజలంతా వారి పక్షాన ఉన్నారని తాను హామీ ఇస్తున్నానన్నారు. -
కళ తప్పిన ఓనం
తిరువనంతపురం: అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఓనం వేడుకలతో కేరళ సందడిగా ఉండేది. తీవ్ర వరద విపత్తు కారణంగా శనివారం జరిగిన రాష్ట్ర సంప్రదాయ పండగ పూర్తిగా కళ తప్పింది. ఇంకా చాలా మంది బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండటం, వేలల్లో ఇళ్లు ధ్వంసం కావడంతో పండుగ శోభ కనిపించలేదు. ప్రకృతి ప్రకోపంతో గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చేందుకు పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, మసీదులు, చర్చీల్లోనే కొందరు ఓనం విందులను ఏర్పాటుచేశారు. సంప్రదాయ పూల తివాచీలు పరచి బాధితుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కష్టకాలాన్ని అధిగమించేలా కేరళ ప్రజలకు ఓనం కొత్త శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి ఓనం ఊహించలేదు ‘కొత్తగా కట్టుకున్న మా ఇంట్లో మరోసారి ఓనం జరుపుకోలేమని అసలు ఊహించలేదు. ఈరోజు(శనివారం) తిరు ఓనం. కానీ మేము ఇంకా సహాయక శిబిరంలోనే ఉన్నాం. వర్షాలు, వరదలు మా ఇంటిని నేలమట్టం చేశాయి’ అని 82 ఏళ్ల కుమారి అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్క కుమారే కాదు హఠాత్తు వరదలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన సుమారు 8 లక్షల మందిదీ ఇదే బాధ, ఇదే వ్యధ. అలప్పుజాలోని ఓ మసీదులో సాదాసీదాగా నిర్వహించిన ఓనం వేడుకల్లో సంప్రదాయ మలయాళ వంటకాలు అవియాల్, పాయసం, సాంబార్లను తయారుచేసి అక్కడ బాధితులకు వడ్డించారు. మృతుల సంఖ్య 293: ఈ నెల 8 నుంచి కేరళ వరదల్లో 293 మంది మృతిచెందగా, 36 మంది జాడతెలియకుండా పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరాశ్రయుల కోసం పునరావాస కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపింది. 26 ఏళ్ల తరువాత తొలిసారి గేట్లు ఎత్తి నీటిని విడుదలచేసిన ఇడుక్కి డ్యాం సమీప ప్రాంతాల్లో అత్యధికంగా 51 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. త్రిసూర్‌లో 43 మంది, ఎర్నాకులంలో 38 మంది, అలప్పుజాలో 34 మంది చనిపోయారు. మలప్పురంలో 30 మంది మరణించారు. 2,287 సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న సుమారు 8.69 లక్షల మంది ఇప్పుడిప్పుడే సొంతిళ్లకు చేరుకుంటున్నారు. సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. సహాయక చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి విజయన్‌కు వైమానిక దళం రూ.20 కోట్ల చెక్కు అందించింది. -
కేరళ వరదలు: ఇంట్లోకి పాము..
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న కేరళ ప్రజలకు ఇప్పుడు పాముల భయం వెంటాడుతోంది. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుతున్న వారు ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి బోరుమంటున్నారు. వరదలతో ఇళ్లలో నక్కిన పాములను చూసి భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే పాము కాట్లతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. మాములుగా చిన్నకీటకాలను చూస్తేనే భయంతో వణికిపోతారు మహిళలు. అలాంటిది ఓ మహిళ తన ఇంటికి వచ్చిన ఓ కొండచిలువను ధైర్యంగా వెళ్లగొట్టిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇంటి ప్రహారి గోడపైకి ఎక్కిన పామును ఆ మహిళ బూజు కర్రతో వెళ్లగొట్టి తమ కుటుంబాన్ని రక్షించింది. ఏ మాత్రం జంకకుండా పదేపదే కర్రను నేలకు కొడుతూ ఆ పామును వెళ్లగొట్టింది.ఆమె సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
కేరళకు యూఏఈ సాయం; ఎవరిది తప్పు?
సాక్షి, న్యూఢిల్లీ : జల ప్రళయానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇస్తానన్న ఆర్థిక సహాయాన్ని కేంద్రం తిరస్కరించిందన్న వార్తలపై కేంద్రం, కేరళ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం నాడు మరో మలుపు తిరిగింది. యూఏఈ ఆఫర్ గురించి మీకు ఎవరు చెప్పారు? ఆ వార్త ఎలా వచ్చింది? కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి వివరణ కోరడం, అసలు అలాంటి ఆఫరే యూఏఈ నుంచి రాలేదని బీజేపీ నాయకుడు అమిత్ మాలవియా శుక్రవారం ప్రకటించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు యూఏఈ ముందుకు వచ్చిందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆగస్టు 21వ తేదీన ట్వీట్ చేశారు. ఇది కేంద్రం ఇప్పటి వరకు ప్రకటించిన ఆర్థిక సహాయం 600 కోట్ల రూపాయలకన్నా అధికం అవడంతో ఆయన ట్వీట్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ వార్త తప్పన్న విషయమై వాట్సాప్ గ్రూపుల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ వార్తలో నిజమెంతుంది? అబద్ధమెంతుంది? అందుకు బాధ్యులెవరు? అన్న అంశాన్ని పరిశీలించాల్సిందే. అయితే వార్తా వ్యాప్తి క్రమాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చూడాలి. కేరళ జల ప్రళయం గురించి తెలియగానే యూఏఈ స్పందిస్తూ తమ దేశ విజయగాధలో కేరళ ప్రజల పాత్ర ఉన్నందున కేరళకు సహాయం చేయాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. కేరళ సహాయక చర్యలకు సహకరించేందుకు ఓ అత్యవసర కమిటీని ఏర్పాటు చేశామని యూఏఈ ఆగస్టు 18వ తేదీన ప్రకటించింది. కష్ట కాలంలో కేరళ ప్రజలను ఆదుకోవడానికి యూఏఈ ముందుకు వచ్చినందుకు ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అల్ మక్తౌమ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 21వ తేదీన కేరళ సీఎం పినరయి విజయన్, 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందని ట్వీట్ చేశారు. యూఏఈ ఈ విషయాన్ని ముందుగా గల్ఫ్‌లో అతిపెద్ద రిటైల్ చెయిన్ కలిగిన ‘లూలూ గ్రూప్’ యజమాని, మలయాళి వ్యాపారి యూసుఫ్ అలీ ఎంఏకు తెలియజేసిందని, నరేంద్ర మోదీకేమో అబుదాబీ రాజు షేక్ మొహమ్మద్ అల్ నాహ్యన్ ఈ విషయాన్ని తెలియజేశారని కేరళ సీఎంవో వరుస ట్వీట్లలో తెలియజేసింది. ఈ ట్వీట్లను ఆ రోజున యూఏఈగానీ, పీఎంవో కార్యాలయంగానీ ఖండించలేదు. ఈ ఆఫర్‌ను స్వీకరించేందుకు ప్రధాని మోదీ సుముఖంగా లేరని, విదేశీ సహాయం స్వీకరించకూడదనే కేంద్రం వైఖరికే ఆయన కట్టుబడి ఉన్నారంటూ ఆ మరుసటి రోజు, అంటే ఆగస్టు 22వ తేదీన అభిజ్ఞ వర్గాల పేరిట వార్తలొచ్చాయి. కేరళను ఆదుకునేందుకు పలు విదేశీ ప్రభుత్వాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకు ధన్యవాదాలు. విదేశీ విరాళాలను స్వీకరించకుండా స్వదేశీ నిధులను సహాయక చర్యలకు వెచ్చించే పద్ధతినే పాటిస్తాం. ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయక నిధులను కేరళ పునర్నిర్మాణానికి ఖర్చు పెడతాం. ఎన్ఆర్ఐ, పీఐవోలతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి మాత్రం ఆర్థిక సహాయాన్ని స్వీకరిస్తాం అంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళకు వచ్చిన విపత్తు అసాధారణమైనది కనుక, ఇలాంటి సమయాల్లో ఆర్థిక సహాయం తీసుకోవచ్చంటూ 2015 నాటి మోదీ ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్’ చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారికి విదేశీ సహాయాన్ని స్వీకరించాల్సిందిగా తన సీనియర్లను కోరుతున్నానని కేంద్ర బీజేపీ మంత్రి కేజే ఆల్ఫాన్స్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 24: భారత్‌కు తాము ఇంత మొత్తం ఆర్థిక సహాయం చేయాలంటూ కచ్చితమైన సంఖ్యనేమీ సూచించలేదని, ఎంత సహాయం అందించాలనే విషయమై ఇంకా కసరత్తు జరుగుతోందని భారత్‌లోని యూఏఈ రాయబారి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో వ్యాఖ్యానించారు. అదే రోజు బీజేపీ నాయకులు కేరళ ప్రభుత్వంపై దండయాత్ర ప్రారంభించారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తామనే ఆఫర్‌నే రాయబారి ఖండించినట్లు వారు ప్రచారం చేశారు. వాస్తవానికి ఆఫర్‌ను రాయబారి ఖండించలేదు. 700 కోట్ల రూపాయలను ఇస్తామన్న సంఖ్యను మాత్రమే ఆయన ఖండించారు. యూఏఈ ఆఫర్‌ను మోదీ ప్రభుత్వం తిరస్కరించిందన్నదే ఇక్కడ వార్తగానీ ఎంత అన్న సంఖ్య ముఖ్యం కాదు. కేంద్రం కన్న ఆఫర్ మొత్తం ఎక్కువ ఉన్నందున కేంద్రం పరువు తీయడానికి ఈ సంఖ్యను సృష్టించే అవకాశం కూడా ఉంది. మరి వాస్తవాలు తెలియడం ఎలా? గల్ఫ్ దేశం మోదీకే నేరుగా ఆఫర్ చేసిందని పినరయి విజయన్ చెప్పారు. తనకు ఆఫర్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. తనకు ప్రముఖ మలయాళి గల్ఫ్ వ్యాపారస్థుడు యూసుఫ్ అలీ చెప్పారని తెలిపారు. ఇటు కేరళతోపాటు అటు ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం, యూఏఈ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయనకు వాస్తవం తెలియాలి. మోదీ ముందుకు ఆఫర్ తీసుకొచ్చిన వారికి, ఆఫర్‌ను తిరస్కరించిన మోదీకి వాస్తవాలు తెలియాలి. దీనిపై ఇంత వివాదం జరుగుతున్నా మోదీ గానీ, ఆయన కార్యాలయంగానీ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. -
భారత వైమానిక సంస్థ భారీ విరాళం
తిరువనంతపురం: కేరళ వరద బాధితుల సహాయార్ధం భారత వైమానిక సంస్థ భారీ విరాళాన్ని అందించింది. వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళ వాసులను భారీగా సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సంస్థ తాజాగా ఆర్ధిక సహాయాన్ని కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వరద సహాయనిధికి 20కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. సీఎం డిస్ట్రస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్) చెక్‌ను శనివారం ఐఏఎఫ్ అందించింది. కేరళ అంతటా వరద తుఫాను ప్రాంతాల్లో ఒక వారం పాటు కొనసాగిన రెస్క్యూ కార్యక్రమాలలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది. తిరువనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్ను కలిసిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, సౌత్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ బి సురేష్ బృందం ఈ చెక్‌ను అందజేసింది. -
ఐఫోన్ కంపెనీ విరాళమెంతో తెలుసా?
తిరువనంతపురం : ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ భారీ వరదలతో అతలాకుతలమైంది. వందలాది మంది మరణించగా... లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కకావికలమైన కేరళను కాపాడేందుకు యావత్ భారత దేశం ముందుకొస్తోంది. డబ్బు, నిత్యావసర వస్తు సామాగ్రిని సాయం చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘కేరళలో వరదల పరిస్థితి గురించి తెలిసి మేం ఎంతగానో దిగ్భ్రాంతి చెందాం. కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్ ఇండియాకు రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నాం. వీటిని అవసరమైన దగ్గర స్కూళ్లను, ఇళ్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించండి’ అని ఆపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళను ఆదుకునేందుకు ముందుకురావాలని ఆపిల్ తన యూజర్లను ప్రోత్సహిస్తోంది. తన హోమ్ పేజీలో సపోర్ట్ బ్యానర్లను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక యాప్ స్టోర్, ఐట్యూన్‌లలో మెర్సీ కార్ప్స్కు విరాళాలు అందించేందుకు డొనేట్ బటన్ ఏర్పాటుచేసింది. ఈ బటన్ ద్వారా ఆపిల్ యూజర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో కేరళకు విరాళం ఇవ్వొచ్చని వెల్లడించింది. భారీ ఎత్తున సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపిల్ తన ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ స్టోర్ల ద్వారా విరాళాలు సేకరించి, తీవ్రంగా దెబ్బతిన్న వాటికి సాయంగా అందిస్తూ ఉంటుంది. ఆపిల్ కస్టమర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను వాడి 5 డాలర్లు, 10 డాలర్లు, 25 డాలర్లు, 50 డాలర్లు, 100 డాలర్లు, 200 డాలర్లను మెర్సీ కార్ప్స్కు డొనేట్ చేయొచ్చు. కాగ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు తరలివెళ్తున్నారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ కేరళ ప్రజలకు అండగా ఉంటున్నారు. -
కేరళకు ప్రముఖ ఆలయాల విరాళాలు
సాక్షి,హైదరాబాద్ : కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అక్కడ సంభవించిన వరదల్లో ఆస్తి నష్టంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం నలుమూలల నుంచి కేరళకు విరాళాలు, సహాయ సహాకారాలు అందుతున్నాయి. తాజాగా ప్రముఖ దేవాలయాలు కేరళకు ఆర్థిక సహాయాన్ని అందించాయి. శబరిమల అయ్యప్ప ఆలయం రూ. 10కోట్లు, తిరుమల దేవస్థానం రూ.5కోట్లు, షిర్డీ సాయి ఆలయం రూ.5కోట్లు, ముంబై సిద్ధివినాయక ఆలయం రూ. కోటి, జమ్మూకశ్మీర్ వైష్ణోదేవి ఆలయం రూ.కోటి, కొల్లురూ మూకాంబికా దేవాలయం రూ.1.25కోట్లు, పండరీపుర్ ఆలయం రూ.25లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. -
కేరళకు యూఏఈ విరాళంపై వివాదం
-
కేరళ వరద బాధితులకు మేకపాటి రూ.కోటి విరాళం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా రూ.కోటి విరాళాన్ని కేఎంసీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఈ విరాళాన్ని కేరళ సీఎం సహయనిధికి అందజేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28,29 తేదీల్లో స్వయంగా కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసి డీడీని అందజేసి, వరద బాధితుల పునరావసం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని కోరతారని తెలిపారు. -
వరద సాయంలోనూ రాజకీయాలేనా?
సాక్షి, హైదరాబాద్: కేరళలో వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, సాయం చేయడంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ మండిపడ్డారు. నగరంలోని మగ్దుంభవన్‌లో 2 రోజుల పాటు సాగే రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అతుల్‌కుమార్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రం 60 శాతం వరదలతో నష్టపోయిందన్నారు. కేరళకు సహాయం చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ సంకుచిత భావాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాజ్‌పేయి కలశయాత్రల పేరిట ఓట్ల కోసం మోదీ శవ రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. నిజంగా మోదీకి ఎస్సీల మీద ప్రేమ ఉంటే మేధోమధన కమిటీతో ఎందుకు నాలుగేళ్లుగా సమావేశాలు పెట్టలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల దేహాలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సభ పెట్టుకుని ప్రగతి నివేదిక ఏమని ఇస్తారని ప్రశ్నించారు. పౌరహక్కుల రక్షణ, ప్రజాస్వామిక పాలన జరగాలంటే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందన్నారు. -
కేరళపై ఇంత వివక్షా?
ప్రకృతి విలయతాండవంతో మొత్తం 14 జిల్లాలు నీటిలో మునిగి కేరళ రాష్ట్రం నేడు ఒక దీవిగా మారింది. ఆవాసాలు నీటిలో మునిగి తిండి, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో, తమ తమ శక్తిమేరకు సాయం చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఉండే భారతీయులు సైతం సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కాగా ప్రధాని మోదీ వైఖరి మాత్రం తీవ్ర వివాదాస్పదమౌతుంది. కేరళ రాష్ట్రానికి తక్షణ సహాయక చర్యల కోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ప్రకటించడం బాధాకరం. ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులు చూసి కూడా మోదీ ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోవని, ఇలాంటి పరిస్థితుల్లో వివక్ష చూపరాదని హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశ ప్రజల సొమ్ముకు కాపలా దారుగా ఉండాల్సిన ప్రధాని మోదీ దుబారా ఖర్చులకు, వ్యక్తిగత అభీష్టానికి, బీజేపీ, సంఘ్ పరివార్ ఉనికిని కాపాడుకోవటానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 2019లో జరుగబోయే అర్ధ కుంభమేళా ఏర్పాట్లకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2015 ఆగస్టులో బిహార్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సాయం కింద ఎంత కావాలంటూ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేలంపాట పాడి మరీ ప్రకటించారు. 2014–16 మధ్య వరుసగా రెండేళ్లు అనావృష్టి పాలైన తెలం గాణ రాష్ట్రంలో ఇన్–పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల సాయం అడుగగా, రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చి మోదీ చేతులు దులుపుకొన్నారు. 2014 అక్టోబర్‌లో హదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్టానికి రూ. 1,000 కోట్లు ప్రకటించారు కానీ, రూ.400 కోట్లకు మించి విడుదల చేయలేదు. 2015 డిసెంబరులో చెన్నై సిటీ జలదిగ్బంధం అయినప్పుడు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ. 5 వేలకోట్లు తక్షణ సాయం కోరగా, ఒక వెయ్యి కోట్లు ప్రకటిం చారు. ఇప్పటికైనా సర్వస్వం కోల్పోయిన కేరళ రాష్ట్రంపై వివక్ష చూపకుండా, నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలను మోదీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆకాంక్షిద్దాం. కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు ‘ 98667 76999 -
కేరళ వరదలు: ఒక్కో కుటుంబానికి రూ. లక్ష రుణం
తిరువనంతపురం : వరదలతో ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు కేరళ ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కుటుంబంలోని మహిళ పేరుతో రూ లక్ష వరకూ అందించే ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని సీఎం తెలిపారు. ఆగస్టు 8 నుంచి కురిసిన భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణికింది. కనీవినీ ఎరుగని వరదలతో 231 మంది మరణించగా 26,000కు పైగా గృహాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. వేలాది పునరావాస శిబిరాల్లో పది లక్షల మందికి పైగా తలదాచుకుంటున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదలతో కేరళకు రూ. 20,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఈ మొత్తం ప్రస్తుత సంవత్సర ప్రణాళిక వ్యయంతో సమానం కావడం గమనార్హం. 40,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని సీఎం విజయన్ వెల్లడించారు. కేంద్రం కేరళకు ఇతోధికంగా వరద సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కేరళ వరదలు: యూపీలో ఘాటెక్కిన ధరలు
లక్నో : గడిచిన వందేండ్లలో ఎన్నడూలేనంతగా వరదలు సృష్టించిన బీభత్సానికి కేరళ వాణిజ్య పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాఫీ, టీ, యాలకులు, మిరియాలు, రబ్బరు, అరటి తోటలన్నీ నేలకొరిగాయి. ఆరుగాలం కష్టించిన రైతన్నలకు ఇక కన్నీళ్లే మిగిలాయి. దీంతో ఒక్కసారిగా ధరల వాత కూడా మోగిపోతుంది. కేరళ వరదలతో ఉత్తరప్రదేశ్‌లో ధరలు హీటెక్కాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ మార్కెట్ అన్నింటిల్లోనూ మసాలా దినుసుల ధరలు ఘాటుఘాటుగా ఉన్నాయని తెలిసింది. కేరళ మసాలా దినుసుల ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారిగా ఉంది. కేరళ నుంచి సప్లై ఆగిపోవడంతో, తూర్పు యూపీలో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా ఉంటున్న వారణాసిలోని దీననాథ్ మార్కెట్లో మసాలా దినుసుల ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. కేరళను ముంచెత్తిన వరదలతో గత రెండు వారాల నుంచి దీననాథ్ మార్కెట్లోకి మసాలా దినుసుల సరఫరా తగ్గిపోయిందని ట్రేడర్ రామ్ జి గుప్తా తెలిపారు. ఈ కొరతతో ధరలు 20 శాతానికి పైగా పెరిగినట్టు చెప్పారు. నల్లమిరియాల ధరలు కేజీకి 315 రూపాయల నుంచి 400 రూపాయలకు పెరిగాయని, యాలుకల ధరలు కేజీకి 1300 రూపాయల నుంచి 1700 రూపాయలు పెరిగినట్టు మరో ట్రేడర్ అనిల్ కేసరి తెలిపారు. ఇక లవంగం ధరలు కేజీ 600 రూపాయలుంటే, ఇప్పుడు 700 రూపాయలున్నట్టు చెప్పారు. ఇతర మసాలాల ధరలు కూడా ఇదే విధంగా పెరిగాయని చెప్పారు. ఇక ఫతేపూర్ జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో కూడా మసాలాల ధరలు దాదాపు 30 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ధరల పెంపుపై స్పందించిన స్థానిక వర్తకులు.. యాలుకల ధరలు కేజీకి 1200 రూపాయల నుంచి 1600 రూపాయలు పెరిగినట్టు చెప్పారు. ఒకవేళ మసాలాలు త్వరగా మార్కెట్‌కు రాకపోతే, వీటి ధరలు 50 శాతానికి పైగా పెరిగే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. బరేలి హోల్‌సేల్ మార్కెట్లో కూడా వీటి ధరలు 15 శాతం కాకపుట్టిస్తున్నాయి. కేరళలో సృష్టించిన ఈ ప్రకృతి విలయతాండవం దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కూడా ప్రభావం చూపుతుంది. మసాలాలు మాత్రమే కాక, కొబ్బరి సప్లై కూడా నిలిచిపోయిందని అలహాబాద్ జిల్లా హోల్‌సేల్ మార్కెట్ చెబుతోంది. మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ధరలు మరింత హీటెక్కుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఈసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
స్పైడర్‌మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు కలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘హాలీవుడ్‌కు స్పైడర్ మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు ఉంటే కేరళ వాసులకు వీరందరు కలిసిన ఫిషర్మెన్’ ఉన్నారన్న కొటేషన్‌తో కేరళ వరద ప్రాంతాల్లో మత్స్యకారులు లేదా జాలర్లు అందించిన సేవలను సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి సహాయక చర్యలు అమోఘమని చెప్పడానికి పడవ పక్కన ఎర్రటి వర్షపు కోటును ధరించి కుడి చేతిలో భారీ తెడ్డును పట్టుకొని ఠీవీగా నిలబడిన మత్స్యకారుడి ఫొటోను కొటేషన్ కింద పొందుపర్చారు. ఇక పక్క పడవలో కేరళ రాష్ట్ర నమూనాను చూపించారు. సమాజంలోని విద్యార్థులు, వృత్తినిపుణులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది కుల, మత భేదాలు లేకుండా నిస్వార్ధంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పుడు ఒక్క మత్స్యకారుల సేవలనే కొనియాడడం సమంజసం కాదని కొందరికైనా అనిపించవచ్చు. కానీ కేరళ వాసుల్లో సామాజికంగా బాగా వెనకబడిన అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు. మనష్యులకు దూరంగా బతికే సముద్రపు అల్లకల్లోల ప్రపంచం వారిది. ఏ పూటకాపూట వెతుక్కునే జీవితాలు వారివి. ఇతర మానవ సమాజంతో వారు కలిసేదే బహు తక్కువ. చేపల వేట నుంచి రాగానే వారు తెగిన వలల పోగులను అల్లుకొనో దెబ్బతిన్న పడవల మరమ్మతు చేసుకొనో మళ్లీ రేపటి వేటకు సిద్ధమవుతారు. రాత్రికి ఇంత తిని పడుకుంటారు. వారికి పక్కా ఇళ్లుగానీ, ఇళ్ల పట్టాలుగానీ ఏ ప్రభుత్వం ఏనాడు కల్పించలేదు. వారు ఏనాడు డిమాండ్ చేయనూ లేదు. అలాంటి వారు నిస్వార్థంగా సేవలందించడం ఎప్పటికీ ఎనలేనిదే. ముఖ్యంగా పట్టణం తిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో వారు అందించిన సేవలు అమోఘం. దాదాపు వెయ్యి మంది జాలర్లు, ఐదు వందల బోట్లతో, సొంత డబ్బుతో ఇంధనం కొని సేవలు అందించడం మామూలు విషయం కాదు. కాకపోతే సముద్రపు అలల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో బోట్లను నడిపిన అనుభవం వారికి సహాయక చర్యల్లో ఎంతో ఉపయోగపడింది. ఒక్క అలప్పూజా ప్రాంతంలోనే వారు 16000 మంది ప్రజల ప్రాణాలను రక్షించారని ఆ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘అరే సరిగ్గా చదువుకోకపోతే మత్స్యకారుడివి తప్పా మరేమి కావంటూ మా ట్యూషన్ మాస్టర్ తిట్టినప్పుడు నిజంగా బాధ పడేవాడిని. నిజంగా నేడు వారిని చూస్తే గర్వంగా ఉంది. నీట మునిగిన ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచి నా సోదరిని రక్షించి తీసుకొచ్చారు. అందుకు ప్రతిఫలంగా తీసుకోవాల్సిందిగా ఓ నోట్ల కట్టను అందజేసినా, తమరు తమకు సోదరి లాంటి వారేనంటూ డబ్బును తిరస్కరించినట్లు నా సోదరి ఏడుస్తూ చెప్పడం నాకు ఏడుపు తెప్పించింది’ ఒకరు వాట్సాప్‌లో సందేశం పెట్టారు. ఇలాంటి సందేశాలు మరెన్నో! వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలతో మత్స్యకారుల పాత్ర ముగిసింది. ఇందులో వారు పలువురు గాయపడ్డారు. కొందరి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. కేరళ పునర్నిర్మాణంలో వారి పాత్ర ఎలాగు ఉండదు. త్వరలోనే వారిని ప్రజలు మరచిపోవచ్చు. నేడు మత్స్యకారుల సేవలను కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. భారీ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. రాజకీయావసారాల కోసం మాట్లాడడం ఆ తర్వాత మరచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ ప్రజలు అలా వారి సేవలను మరచిపోరాదు. తమ ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను తర్వాతనైనా గుర్తించి అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి గతేడాది వచ్చిన ‘ఓఖీ’ తుపానులో ఈ నాటి వరదల కన్నా ఎక్కువ మంది మత్స్యకారులు మరణించారు. వారి పాకలు కొట్టుకుపోయాయి. వారికి అందిన సహాయం అంతంత మాత్రమే. వారిది రోజూ చస్తూ బతికే జీవితమే. అధికారిక లెక్కల ప్రకారమే చేపల వేటకు వెళ్లన మత్స్యకారుల్లో నాలుగు రోజులకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట. ప్రజలే ముందుగా తమకు సాయం చేసిన మత్స్యకారులను గుర్తించాలి, ముఖ్యంగా పడవలు దెబ్బతిన్న వారిని గుర్తించి, వారి పడవలకు మరమ్మతులు చేయించాలి. అవసరమైన వారికి వలలు కొనివ్వాలి. ఆ తర్వాత వారి ఇళ్ల స్థలాల కోసం వారి తరఫున ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాలి. అందులో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికే ప్రాధాన్యత ఉండేలా చూడాలి. ఆ తర్వాత వారి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. వారికి జాతీయ, రాష్ట్ర రిస్క్యూ టీముల్లో ఉద్యోగాలు వచ్చేలా చూడాలి. అంతిమంగా వారి సేవలు చిరస్మరణీయంగా ఉండేలా ఓ మెమోరియల్ లాంటిది ఏర్పాటు చేయాలి. వారి సహకార సంఘం కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించేలా ఉంటే ఇంకా బాగుండవచ్చు. వీటి సాధన కోసం నవంబర్ 21న రానున్న మత్స్యకారుల దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదేమో! -
కేరళకు సన్నీలియోన్ సాయం ఏంటో తెలుసా?
ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ కేరళ వరద బాధితుల కోసం రూ.5 కోట్లు సాయం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే అదంతా అసత్య ప్రచారం అని కూడా స్పష్టం అయింది. అయితే సన్నీ మాత్రం కేరళ వరద బాధితులకు కావాల్సింది ఇస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. భర్త డానియెల్ వెబర్, మరికొంత మంది బాలివుడ్ స్నేహితుల సాయంతో 1200 కేజీల రైస్, పప్పును పంపించింది. ‘ఈ రోజు నేను, డేనియల్ కలిసి కేరళలోని కొంత మందికి ఆహారం అందించగలుగుతున్నాం. 1200 కిలోల బియ్యం, పప్పు(1.3 టున్నులు) అందించాం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికేం కావాలో నాకు తెలుసు. ఇంకా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జుహులో అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిన ప్రతీక్, సిద్ధార్థ్ కపూర్, సువేద్ లోహియా చాలా గొప్పవారు’ అని సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (చదవండి: కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట!) Today @dirrty99 and I hopefully will able to feed a few of the many people in Kerala that need a warm meal with 1200kg’s (1.3tons) of rice and daal. I know it’s not a dent in what actually needs to be sent and I wish I could do more. Humanity at its finest @_prat @suved @siddhanthkapoor the men that arranged an amazing event at “B” in Juhu to bring help to those in need! You guys are so amazing! A post shared by Sunny Leone (@sunnyleone) on Aug 23, 2018 at 10:49am PDT -
యూఏఈ అంబాసిడర్ సంచలన ప్రకటన
తిరువనంతపురం: వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీసాయాన్ని ప్రకటించడం ఆకర్షణీయంగా నిలిచింది. అయితే తాజాగా యూఏఈ ఆర్థికసాయంపై మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సాయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలేదని యూఏఈ అంబాసిడర్ ప్రకటించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. కేరళకు అందించే ఆర్థిక సహాయం నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. వారికందించాల్సిన విరాళాలపై తమ అంచనా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పారని రిపోర్ట్ చేసింది. అయితే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేవలం 600 కోట్ల రూపాయలిచ్చి కేంద్రం చేతులు దులుపుకోగా గల్ఫ్‌దేశం రూ.700 కోట్ల భారీ సాయం అందించిందంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు విదేశీ ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా భారీ చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. విదేశీసాయంపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే, యూఏఈ రాయబారి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూఏఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం కూడా గమనార్హం. మరి తాజా గందరగోళంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు గల్ఫ్ దేశం సాయాన్నితిరస్కరించడంపై పలువురు నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ గల్ఫ్ దేశం ఇచ్చింది రుణంకాదు, సాయం, విపత్తు నివారణ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే యూఏఈ సహాయాన్ని ఆమోదించేలా విధానంలో సవరణలు తేవాలంటూ ప్రధాని మోదీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఒక లేఖ రాశారు. ప్రజల బాధలను నిర్మూలించేలా విధానాలు ఉండాలి, విదేశీ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, దయచేసి తగిన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ యూఏఈ సహాయంపై స్వయంగా మీడియాకు తెలియజేసారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారని వెల్లడించారు. -
కేరళ వరదలు: ఈ దండి గుండెకు దండాలు
సాక్షి, చెన్నై: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మానవత్వంతో స్పందించే మంచి మనుషులు, పెద్దమనుషుల గురించి మనకు తెలుసు. అయితే బాధితుల కష్టాల పట్ల చలిస్తున్న ‘పెద్ద’మనుసున్న చిన్నారుల గురించి తెలుసుకుంటే.. బాలలు కల్లకపట మెరుగని కరుణా మయులే అనింపిచకమానదు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న తమిళనాడుకు చెందిన ఓ బాలిక చేసిన సాయం విశేషంగా నిలిచింది. గుండె ఆపరేషన్‌కోసం విరాళాల రూపంలో సేకరిస్తున్న సొమ్మును కేరళ వరద బాధితులకు డొనేట్ చేసి అపారమైన తన దాతృత్వ గుణాన్ని చాటుకుంది. కేరళ వరద బాధితుల గాధల్ని టీవీలో చూసిన అక్షయ(12) చిన్ని గుండె కదిలిపోయింది. అందుకే తనకు డబ్బులు ఎంత అవసరమో తెలిసినా, నిస్వార్ధంగా స్పందించింది. 5వేల రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఎందుకంటే పుట్టుకతోనే హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న అక్షయకు ఇప్పటికే ఒకసారి (నవంబర్, 2017)లో ఒకసారి గుండె శస్త్రచికిత్స జరిగింది. ఇపుడు మళ్లీ తీవ్ర సమస్యలు తలెత్తడంతో రెండవసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన అక్షయ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆపరేషన్‌కు అవసరమైన సొమ్మును సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 20వేలు సమకూరాయి. ఈ డబ్బులోంచే ఇపుడు 5వేల రూపాయలను కేరళ వరద బాధితులకు దానం చేయడానికి ముందుకు వచ్చింది. అక్షయ తమిళనాడులోని కరూర్ జిల్లాలోని తాంతోనిమలై సమీపంలో కుమారపలయం అనే చిన్న గ్రామంలో పుట్టింది. అక్షయ తల్లి జోతిమణి. తండ్రి ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ దంపతుల ముగ్గురి కుమార్తెల్లో పెద్ద పాప అక్షయ. రోజువారీ వేతన వ్యవసాయ కార్మికాలిగా పనిచేస్తూ తల్లి జోతిమణి కుటుంబాన్నిఒంటరిగా నెట్టుకొస్తోంది. మొదటిపారి గుండె ఆపరేషన్ కోసం ఫేస్బుక్లో విరాళాల ద్వారా 3.5 లక్షల రూపాయలు సేకరించగలిగామని జోతిమణి తెలిపారు. ఈ సారి కూడా అదే ప్రయత్నాల్లో ఉండగా అక్షయ నిర్ణయం తనను కదిలించిందని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ప్రతీ చిన్నసహాయం ఎంత ముఖ్యమైందో, విలువైందో తెలుసు. అందుకే అక్షయ ఇష్టాన్ని కాదనలేకపోయానని జోతి తెలిపారు. కాగా ఇటీవల వరదల్లో కేరళలో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల బాధల్ని గాధల్ని చూసి చలిస్తున్న చిన్నారులను చూస్తుంటే మాయమర్మమేమిలేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే అన్న ఆరుద్ర పదాలు గుర్తురాకమానవు. దండిగుండెతో కదులుతున్న ఈ చిన్నారుల సాయం కేరళలోని నిజమైన బాధితులకు చేరాలని కోరుకుందాం. -
తమిళనాడు వల్లే మాకు వరదలోచ్చాయి
-
కేరళను మినహాయించండి
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు. దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్డీఎంఏ అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్‌డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు. -
మానవత్వమే మతం
కొచ్చి: నవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్‌కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. దీంతో సమీపంలోని రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము. కానీ నీరు అలాగే ఉంది. దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. ‘మొదట మనమంతా మనుషులం. అందరం ఒకే దేవుని బిడ్డలం అని గుర్తుంచుకోవాలి’ అని రత్నేశ్వరి దేవాలయ కమిటీ సభ్యుడొకరు అన్నారు. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్‌లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్అయ్యాయి. హిందువులకు మసీదులో ఆశ్రయం వరదలకు నిరాశ్రయులైన పలు హిందూ కుటుంబాలకు మల్లప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామంలో ఉన్న జుమా మసీదు ఆశ్రయం కల్పించింది. వరదలకు నిలువనీడ కోల్పోయిన 78 మంది హిందువులకు మసీదులో వసతి కల్పించారు. వరదనీటితో అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని, మల్లప్పురంలోని అయ్యప్ప ఆలయాన్ని కొంతమంది ముస్లింలు శుభ్రం చేశారు. ‘ముక్క’ను వదులుకున్న ఖైదీలు కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు పరప్పన అగ్రహారం, బళ్లారి జైలు ఖైదీలు ఒక్కవారం మాంసాహారాన్ని వదులుకున్నారు. ఇలా ఆదా అయ్యే నగదు మొత్తాన్ని వరద బాధితల సహాయార్థం వెచ్చించాలని జైలు అధికారులను కోరారు. ఈ రెండు జైళ్లలో ప్రతి శుక్రవారం ఖైదీలకు మాంసాహారం వడ్డిస్తారు. ఇందుకోసం సుమారు రూ.2–3 లక్షల దాకా ఖర్చవుతోంది. బక్రీద్ సందర్భంగా కేరళలోని త్రిసూర్ రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు -
కేరళకు ఒక రోజు వేతనం
సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయ, పునరావాస చర్యల కోసం అధికారులు, సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ప్రతిపాదించినట్లుగా వేతనాలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేలా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులు, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర గెజిటెడ్ అధికారులు, టీచర్లు, పెన్షనర్లు, వర్కర్లు, యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఒక రోజు వేతనాన్ని కేరళ సీఎంఆర్ఎఫ్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రిటైర్డు ఉద్యోగులు, పెన్షనర్లు రూ.200 చొప్పున, ఫ్యామిలీ పెన్షనర్లు రూ.100 చొప్పున కేరళకు వితరణ ఇచ్చినట్లు తెలిపారు. విరాళంగా ఒకరోజు వేతనం: యూఎస్పీసీ కేరళ వరద బాధితుల కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) పేర్కొంది. గురువారం ఈ మేరకు యూఎస్పీసీ ప్రతినిధులు సీహెచ్ రాములు, చావ రవి, బి.కొండల్‌రెడ్డి, మైస శ్రీనివాసులు, రఘుశంకర్‌రెడ్డి తదితరులు ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిని కలసి అంగీకార పత్రాన్ని అందించారు. నెల వేతనం ఇచ్చిన రాగం సుజాత కేరళకు నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాతాయాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని గురువారం ఎంపీ కవితకు అందించారు. ఒకరోజు వేతనం విరాళం: టీటీజేఏసీ కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ (టీటీజేఏసీ) కమిటీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు నెల జీతంలో ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని టీటీజేఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు ప్రతినిధులు సరోత్తంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి,లక్ష్మారెడ్డి, నర్సింలు తదితరులు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ విరాళం కేరళకు సహాయం చేయడానికి రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ముందుకు వచ్చింది. టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిలు ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల సహాయం కేరళకు తమ వంతు సహాయం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఒక్కొక్క పెన్షనర్ రూ.200 చొప్పున రాష్ట్రంలోని మొత్తం పెన్షనర్ల నుంచి దాదాపు రూ. 4 కోట్లను అందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
సాయానికి రెడ్‌సిగ్నల్
ప్రకృతి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా సర్వం కోల్పోయిన కేరళ పౌరులు ఇప్పుడిప్పుడే బుర దతో నిండి ఉన్న తమ తమ ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కొందరికైతే వెళ్లడానికంటూ ఇళ్లే లేవు. అవి నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికీ ఇంకా వరద ముంపులో ఉన్న ప్రాంతాలున్నాయి. ఈలోగా ఊహించని విధంగా వరద సాయం వివాదం మొదలైంది. కేరళలో జరి గిన నష్టం మొత్తం రూ. 21,000 కోట్ల పైమాటేనని, సాధారణ జీవనం మొదలు కావాలంటే కనీసం రూ. 2,200 కోట్లు అవసరమని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు గ్రాంటుగా మంజూరు చేసింది. ఇంత భారీ నష్టం సంభవించి నచోట ఇది ఏమూలకు సరిపోతుందన్న ప్రశ్నకు జవాబిచ్చేవారు లేరు. మరోపక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఇవ్వజూపిన రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం తిరస్కరించింది. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. అంతేగాక ఏ దేశం సాయం చేయడానికి ముందుకొచ్చినా సున్నితంగా తిరస్క రించాలంటూ మన రాయబార కార్యాలయాలకు ప్రభుత్వం వర్తమానం పంపింది. ఇప్పుడు సంభవించిన నష్టం సాధారణమైనది కాదు. కేరళలోని అత్యధిక జిల్లాల్లోని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలమంది ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు అందిస్తున్న సాయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థి తుల్లో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్న దేశాలను తోసిపుచ్చటం సరైనదేనా అన్న సందే హం ఎవరికైనా తలెత్తుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాలు సాయం అందించటానికి ముందుకు రావటం, మన దేశం వద్దనడం ఇది మొదటిసారేమీ కాదు. కశ్మీర్ భూకంపం(2005), ఉత్తరాఖండ్ వరదలు(2013), కశ్మీర్ వరదలు(2014) ఉదంతాల్లో అమెరికా, జపాన్, రష్యాలు ఇవ్వ జూపిన ఆర్థిక సాయాన్ని మన దేశం తిరస్కరించింది. 2004కు ముందు ఇలా లేదు. 1991నాటి ఉత్తరకాశీ భూకంపం, 1993నాటి లాతూర్ భూకంపం, 2001నాటి గుజరాత్ భూకంపం, 2002నాటి బెంగాల్ తుఫాను, 2004నాటి బిహార్ వరదల సమయాల్లో విదేశాల నుంచి సాయం అందుకుంది. ఎందుకీ మార్పు? ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవిస్తున్న నష్టాన్ని స్వశక్తితో పూడ్చుకోవటం సాధ్యమని నిజంగా మన దేశం విశ్వసిస్తోందా? ఇంతవరకూ జరిగిన వేర్వేరు వైపరీత్యాలను మనం అలా ఎదుర్కొనగలిగామా? పూర్తిస్థాయి పునర్నిర్మాణాన్ని సుసాధ్యం చేసుకోగలిగామా? ఆత్మాభిమానం కొనియాడదగిందే. ఎలాంటి పరిస్థితులెదురైనా చేయిచాచరాదన్న సంకల్పం గొప్పదే. కానీ లక్షలాదిమంది బతుకులు రోడ్డున పడినప్పుడు, మౌలిక సదుపాయాల కల్పనకు మన శక్తి చాలనప్పుడు సైతం ఇలాగే ప్రవర్తించాలా? ఇది మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబించటం లేదా? ఇలా సాయాన్ని తిరస్కరించటం ద్వారా తానొక ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకున్నానని చాటి చెప్పాలన్న ఆరాటమే కనబడుతోంది. మన దేశం గతంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్ని చవి చూసింది. 60వ దశకంలో ఆకలి చావులు సంభవిస్తున్నప్పుడు, ప్రజలకు తిండిగింజలు చాలనప్పుడు అమెరికా ఇచ్చిన గోధుమలు, బియ్యంపై ఆధారపడ్డాం. 1991లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి అప్పు తెచ్చుకోవటానికి మన బంగారం నిల్వలను తాకట్టు పెట్టాం. ఇప్పటికి కూడా బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం మొదలుకొని వేర్వేరు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో సహా యాన్ని స్వీకరిస్తున్న దేశాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నాం. 2004లో సునామీ సంభవించి 12,000 మంది మరణించి, దాదాపు పది లక్షలమంది నిరాశ్రయులైనప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తొలిసారి విదేశీ సాయాన్ని తిరస్కరించారు. దీన్ని స్వయంశక్తితో ఎదుర్కొనగలమని అప్పట్లో ఆయన ప్రకటించారు. పైగా మన సర్కారు శ్రీలంకకు 2 కోట్ల 25 లక్షల డాలర్లు, ఇండొనేసియాకు పది లక్షల డాలర్లు ఆర్థిక సాయం అందించింది. అత్యంత పేద దేశమైన హైతీ మొదలుకొని బాగా అభివృద్ధి చెందిన జపాన్ వరకూ మన సాయం పొందాయి. 2005లో భారత్, పాకిస్తాన్‌లు రెండూ భూకంపం ధాటికి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఆ సమయంలో కూడా మన దేశం విదేశీ సాయాన్ని తిరస్క రించింది. కానీ పాకిస్తాన్‌ను ఒప్పించి దాని అధీనంలోని ఆక్రమిత కశ్మీర్‌కు దుప్పట్లు, మందులు, ఆహారం పంపింది. 2 కోట్ల 50 లక్షల డాలర్ల చెక్కు కూడా ఇచ్చింది. ఎవరిదగ్గరైనా సాయం తీసుకో వటమంటే వారికి సాష్టాంగపడటమేనన్న అభిప్రాయం ఉన్న పక్షంలో ఇవ్వడంలోనూ అదే విధానాన్ని పాటించాలి. వారికి కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించాలి. కనీసం వారు అర్ధించే వరకూ ఆగాలి. యూఏఈ కేవలం ఒక దేశంగా మాత్రమే సాయపడటానికి ముందుకు రావటం లేదు. తమ ఆర్థిక పురోగతిలో కేరళ నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల పాత్ర ఉన్నదని గుర్తించి, వారి కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం తమ ధర్మమని భావించింది. కేరళకొచ్చిన కష్టం జాతీయ వైపరీత్యంగా పరిగణించి కేంద్రం తగిన మొత్తంలో నిధులందిస్తే వేరే విషయం. ఇంత వరకూ వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంతమాత్రమే. సునామీ సమయంలో 10వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం అందించిన మొత్తం రూ. 500 కోట్లు. మహారాష్ట్ర వరదలు(2005)లో నష్టం రూ. 6,000 కోట్లయితే అందిన సాయం రూ. 700 కోట్లు. ఇలా ఎప్పుడైనా కేంద్రం నుంచి అందేది తక్కువే. నష్టానికీ, అందే సాయానికీ మధ్య ఇంత అగాథం ఉంటున్నప్పుడు ఏ దేశమైనా మన తిరస్కరణను చూసి పరిహసించదా? తోటి మనుషులు ఆపదలో పడినప్పుడు అండగా నిలబడటం మానవ నైజం. ఇవాళ వాళ్లు సాయ పడితే... రేపు మన వంతు రావొచ్చు. పరస్పరం సహకరించుకోవటం, సాయం చేసుకోవటంలో కించపడ వలసిందేమీ లేదు. -
కేరళ బాధితులకు లారెన్స్ సాయం ‘కోటి’
కేరళ వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల సాయం ప్రకటించారు. కోలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించిన నటుడు లారెన్సే. వరదల్లో కేరళ ప్రజల కష్టాలు తనను కలచివేశాయని ఈ సందర్భంగా లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్ను శనివారం కలిసి చెక్‌ను అందజేస్తానని తెలిపారు. బాధితులు ఎవరైనా తనను వ్యక్తిగతంగా కలిస్తే, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. -
ఇక ఇప్పుడు ఆపరేషన్ క్లీన్!
’మా పిల్లలు బడికెళ్ళేందుకు పుస్తకాలు లేవు. మా కోళ్ళూ, పశువులూ అన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మాకిప్పుడు తలదాచుకునేందుకు ఇంత నీడ లేదు మూడు లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా కట్టుకున్న ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాము’’అన్నీ పోగొట్టుకొని ప్రాణాలను మాత్రం చిక్కబట్టుకొని బతికిబయటపడ్డ శోభన ఆవేదన ఇది. ముంచెత్తిన చెత్తాచెదారం మధ్య గుర్తించలేని విధంగా తయారైన తమ ఇళ్ళను చూసుకొని జనం బావురుమంటున్నారు. ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి విలపిస్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి ఎర్నాకుళం జిల్లాలోని కొత్తాడ్లోని తమ ఇంటికి తిరిగి వెళ్ళిన 68 ఏళ్ళ వృద్ధుడు అక్కడి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదం కంటతడిపెట్టించింది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా తమ ఇళ్ళకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలనూ, వారి ఇళ్ళనూ శుభ్రపరిచి, నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టికేంద్రీకరించింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపైన ప్రభుత్వం దృష్టిసారించింది. ఇళ్ళను శుభ్రపరిచేపనిలో వేలాది మంది వాలంటీర్లు... స్థానిక స్వయంపాలన, ఆరోగ్య విభాగాల కింద దాదాపు 3000 కిపైగా బృందాలు ఇళ్ళను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్ళు కాకుండా ఇప్పటికే దాదాపు 12,000 మంది వాలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 12,000 ఇళ్ళను శుభ్రం చేసారు. దాదాపు 3000 పశువుల కళేబరాలను బుధవారం పూడ్చిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ’’దాదాపు ప్రజలందరినీ రక్షించాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వరదనీటిలో చిక్కుకుపోయారేమోనని ఇంకా వెతుకుతూనే ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నెల్లిపట్టి, పలక్కాడ్ జిల్లాల్లో మట్టిపెళ్ళలు విరిగిపడి నీటిలో చిక్కుకుపోయిన 11 మందినీ, మరో 15 మందినీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రక్షించినట్టు వెల్లడించారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్! ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి డిమాండ్ పెరిగింది. కొన్ని బావులు పూర్తిగా వరద బురదతో నిండిపోవడంతో వాటిని శుభ్రపరిచేందుకు ఒక్కొక్కరికీ 15000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వేసవిలో దాదాపు 40 బావులను శుభ్రపరిచే కూనమ్తాయ్కి చెందిన పికె.కుట్టాన్ బావులు శుభ్రం చేయాలంటూ తనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పెద్దగా లోతులేని చిన్న చిన్న బావులు ఒక్కొక్కదాన్ని శుభ్రపరిచేందుకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద బావులు శుభ్రపరచడం మరింత రిస్క్‌తో కూడుకున్నదంటున్నారు కుట్టాన్. ’’ముందుగా ఓ క్యాండిల్ని వెలిగించి బావిలోకి దింపి, అది ఆరిపోకుండా ఉంటేనే మేం బావిలోనికి దిగుతున్నాం. ఇలా చేయడం వల్ల బావిలోని ఆక్సిజన్ని అంచనావేసే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు అది చాలా ప్రమాదకరం’’ అంటారాయన. త్రీ బెడ్రూం ఫ్లాట్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు దాదాపు 20,000 ఖర్చు అవుతుందని ఉదయంపెరూర్లోని సానోజ్ జోసెఫ్ అన్నారు. ’’ఒక్కో ఇంటికి రెండ్రోజుల పని ఉంటుంది. అదంతా ఫ్రీగా చేయాలంటే సాధ్యంకాదు. మా కుటుంబాలను కూడా పోషించుకోవాలి కదా?’’ అని ప్రశ్నిస్తున్నారు జోసెఫ్. ఫిక్స్ ఆల్... ఇదిలా ఉంటే ఉచితంగా సేవలందించేందుకు ’’ఫిక్స్ ఆల్’’ అనే ఆన్లైన్ వేదికొకటి ఏర్పాటయ్యింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రిఫ్రిజిరేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు ’ ఫిక్స్ ఆల్’ ఆన్లైన్ సహాయకులు లిజి జాన్ బృందం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. -
కేరళ వరదలు : కారణం ఎవరంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లిన కేరళ తమ రాష్ట్రంలో వరదలకు కారణం తమిళనాడేనంటూ మండిపడింది. తమిళనాడు తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేరళ ముళ్లపెరియార్ డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లు వదలడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుందని ఆరోపించింది. డ్యాం నుంచి ఒకేసారి నీళ్లు విడుదల చేయవద్దని తమిళనాడు సర్కార్‌ను కోరినా వినిపించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం నీళ్లు పోటెత్తడంతో కేరళలో వరదలొచ్చాయని సుప్రీం కోర్టుకు కేరళ నివేదించింది. అంతకుముందు ఇదే కేసులో గతంలో ముళ్లపెరియార్ డ్యాంలో నీటి మట్టాన్ని 139 అడుగులకు తగ్గించాలని, అప్పుడే కేరళ ప్రజలు భయభ్రాంతులకు లోనవకుండా ఉంటారని సర్వోన్నత న్యాయస్ధానం తమిళనాడును కోరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్‌ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్‌లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
రిలీఫ్ క్యాంప్‌లో నిద్రించిన ఫోటో : మంత్రికి చీవాట్లు
తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సోమవారం రాత్రి సహాయ పునరావాస శిబిరంలో కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ నిద్రించిన వ్యవహారం ప్రహసనంలా మారింది. ట్విటర్లో ఆయన పోస్ట్ చేసిన పరుపుపై నిద్రిస్తున్న ఫోటోకు ప్రశంసలు రాకపోగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆల్ఫోన్స్ ఈ ఫోటోను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేయగా ఈ పోస్ట్‌పై నెటిజన్ల స్పందన ఆయనకు షాక్ ఇస్తోంది. సార్..ఇది పబ్లిసిటీ చేసుకునేందుకు సరైన అవకాశం కాదని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించగా, సార్ ఇది జోక్ కాదు..ఇలాంటి ప్రదర్శనలకు ఇది సమయం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు. కేంద్ర మంత్రిగా కేరళకు ఇతోధిక సాయం చేయాల్సిన మీరు ఇలాంటి చవకబారు ప్రచార ఎత్తుగడకు పాల్పడటం సరైంది కాదని మరొకరు ట్రోల్ చేశారు. సహాయ శిబిరంలో మీరు నిద్రించినా రేపటిపై బెంగతో చాలా మంది నిద్రకు నోచుకోలేదనే విమర్శలు ఆల్ఫోన్స్పై వెల్లువెత్తాయి. మరోవైపు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రస్తుతం సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేయడంపై దృష్టిసారించింది. -
కేరళ : కోల్‌కతా చిన్నారి సాయం ఎంతంటే..
కోల్‌కతా : ప్రకృతి విలయానికి విలవిల్లాడిన కేరళ వాసులను ఆదుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆపన్నహస్తం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో నేను సైతం అంటూ నాలుగేళ్ల చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది. కేరళలో ఉండే తన అక్కాచెల్లెళ్ల కోసమంటూ పిగ్గీ బ్యాంకులో దాచుకున్న 14 వేల 8 వందల రూపాయలను విరాళంగా ఇచ్చేసింది. నా అక్కాచెల్లెళ్ల కోసమే... కేరళ వరదల్లో తన తోటి చిన్నారుల కష్టాలను టీవీలో చూసిన అపరాజిత ఏం జరిగిందంటూ తల్లిదండ్రులను అడిగేది. ఈ క్రమంలో నీలాంటి ఎంతో మంది చిన్నారులు నీటిలో చిక్కుకుని బాధపడుతున్నారని, ఆకలితో ఏడుస్తున్నారంటూ వివరించారు ఆమె తల్లిదండ్రులు. దీంతో తన పిగ్గీ బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తానంటూ అపరాజిత ముందుకొచ్చింది. ఈ క్రమంలో జవదేవపూర్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీమన్ బోస్.. కేరళ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపునకు అపరాజితను తీసుకువెళ్లగా.. ఆమె తన పిగ్గీ బ్యాంకును ఆయనకు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను పశ్చిమ బెంగాల్ సీపీఐ(ఎం) తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. -
కేరళకు విదేశీ సాయం ఎందుకు వద్దు?
సాక్షి, న్యూఢిల్లీ : జలప్రళయంలో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించిన 700 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం సమంజసమేనా ? కాదా? అయితే ఏ మేరకు సమంజసం ? కాకుంటే ఎందుకు కాదు ? ఆపద సమయాల్లో వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని తిరస్కరించడమనే సంప్రదాయం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2004 సంవత్సరంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. 2004లో తమిళనాడు, అండమాన్, నికోబర్ దీవుల్లో సునామీ వచ్చినప్పుడు, 2005లో కశ్మీర్లో భూకంపం వచ్చినప్పుడు, 2013లో ఉత్తరాఖండ్‌లో వరదలు, 2014లో కశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సహాయాన్ని వరుసగా తిరస్కరిస్తూ వస్తోంది. ఇందుకు కారణం అవి బేషరతు విరాళాలు కాకపోవడమే. తాము ఇస్తున్న ఆర్థిక సహాయంలో ఫలాన సామాజిక వర్గానికే ఎక్కువ ఖర్చు పెట్టాలని, ఫలానా అభివద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేయాలని లేదా తాము అందిస్తున్న ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా వీసా నిబంధనల్లో తమ దేశానికి వెసులుబాటు కల్పించాలని, వాణిజ్య ఆంక్షలను లేదా తమ ఉత్పత్తుల దిగుమతులపై పన్నులను సడలించాలనో షరతులు ఉంటాయి. ఆశ్చర్యంగా ఈసారే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎలాంటి షరతులు లేకుండా ఏకంగా 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేరళకు ప్రకటించిన ఆర్థిక సహాయంకన్నా అది 15 శాతం ఎక్కువ. ఎమిరేట్స్ కార్మిక వర్గంలో ఎక్కువ మంది కేరళ వాసులే అవడం వల్ల ఆ దేశం ఇంతపెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బేషరుతుగా వచ్చిన ఈ ఆర్థిక సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించిందంటే దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవడం కోసమే కావచ్చు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎంతో పురోభివద్ధి సాధిస్తోందని చెప్పుకుంటున్న తరుణంలో విదేశీ వితరణను స్వీకరించడం బలహీనత అవుతుండొచ్చు. వాస్తవానికి గతంలో వచ్చిన సునామీ, వరదలు, భూకంపాలకన్నా ఇప్పుడు కేరళను ముంచెత్తిన జల ప్రళయం ఎక్కువ తీవ్రమైనది. కేరళలో కొన్ని వందల మంది మరణించడమే కాకుండా పది లక్షల మంది ప్రజలు నిరాశ్రీయులయ్యారని, 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల నష్టం వాటిళ్లి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఇలాంటి సమయాల్లో ఏ ప్రతిఫలం ఆశించకుండా బేషరతుగా సౌహార్దపూర్వకంగా వచ్చే విదేశీ ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం స్వీకరించవచ్చు’ అని ‘నేషనల్ డిస్సాస్టర్ మేనేజ్‌ఎంట్ ప్లాన్’ సూచిస్తోంది. కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇస్సాక్ కూడా కేంద్రం దష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ఎమిరేట్స్ ఇచ్చినంత ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని స్వయంగా కేరళకు ప్రకటించాలి. కేరళ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించాలి. -
వైరల్ వీడియో : హ్యాట్సాప్ ఇండియన్ ఆర్మీ
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమయింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. ఇప్పటి వరకూ దాదాపు 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఓ బాలుడిని కాపాడం కోసం సైనికుడు తాడు సాయంతో ఒంటి చేత్తో హెలికాప్టర్‌పైకి వెళ్లడం, ఓ పైలట్ చాకచక్యంతో గర్భిణీని కాపాడడం లాంటి వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియో కూడా వైరల్‌గా మరింది. వరదలో చిక్కుకున్న ఓ దివ్యాంగుడిని (ప్రోస్థెటిక్ అవయవం ధరించినవ్యక్తి) సైనికులు జాగ్రత్తగా కాపాడారు. ఓ అపార్ట్మెంట్లో చూట్టూ నీరు నిండి ఉంది. ఆ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో ప్రోస్థెటిక్ అవయవం ధరించిన వ్యక్తి చిక్కు పోయాడు. గమనించిన ఐదుగురు సైనికులు అతని కోసం పడవలో అక్కడి వెళ్లి నిచ్చెన సాయంతో జాగ్రత్తగా కిందికి దించి రక్షించారు. ఇదంతా వీడియో తీసి తమ అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘ ఎక్కడ ఉన్న మేం మిమ్మల్ని రక్షిస్తాం’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్అయింది. ఓపికతో దివ్యాంగుడిని కాపాడిన సైన్యానికి ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. చాలా మంది నెటిజన్లు సైనికులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్ ఇండియన్ ఆర్మీ, మీరే నిజమైన హీరోలు’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
కేరళ వరదలు : తమ వంతుగా టీమిండియా !
నాటింగ్ హామ్ : తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం ఇవ్వడంతో పాటు మూడో టెస్ట్ మ్యాచ్ ఫీజును భారత క్రికెటర్లు విరాళంగా అందివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్ల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఒక్కో టెస్ట్ మ్యాచ్ ద్వారా జట్టు మొత్తం ఆటగాళ్లకు కలిపి దాదాపు 1.5 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. బుధవారం మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో గెలిచి కేరళ వరద బాధితులకు అంకితమివ్వాలని జట్టుగా నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం. ఈ గెలుపును వారికి అంకితం ఇస్తున్నాం. ప్రస్తుతం కేరళలో చాలా విషాదకరమైన పరిస్థితి నెలకొందని’ చెప్పాడు. కేరళ వరద బాధితులకు తమ వంతు సాయంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా అందించాలని టీమిండియా నిర్ణయించుకుంది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ఆటగాళ్లు సమష్టిగా నిర్ణయం తీసుకుంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కేరళ వరద బాధితులకు టీమిండియా విరాళంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రూ.80 కోట్ల ఆర్థిక సాయం చేశాడంటూ ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే కేరళ బాధితులకు అన్ని విధాలా సాయం అందాలని, సహాయక బృందాలు వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోహ్లి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
3రోజులు ఆలస్యంగా కొచ్చి ఎయిర్పోర్ట్ సేవలు
సాక్షి, కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన కొచ్చి విమాశ్రయం మూడు రోజులు ఆలస్యంగా తన సేవలను ప్రారంభించనుంది. ముందు ప్రకటించినట్టుగా ఆగస్టు 26నుంచి కాకుండా 29వ తేదీ నుంచి పూర్తి స్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్ధకు జరిగిన నష్టంపై చర్చించారు. కేరళలోవరద పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ విమాన సేవలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాజా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొచ్చి విమానాశ్రయం సోలార్ పవర్ మీద నడుస్తుంది. అధికారులు విమానాశ్రయం నుంచి వరద నీటిని తొలగించినప్పటికీ, విమానాశ్రయం లోపల భారీ వరదలకారణంగా సౌర ఫలకాలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు 800 రన్‌వే లైట్లు మరమ్మతు చేయాలి, 2,600 మీటర్ల పొడవు గోడల పునర్నిర్మించటం అవసరం. దాదాపు 90శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులే వరద బాధితులు, వారందరూ వాళ్ల ఇళ్లలో చిక్కుకుపోయారు. మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం అందించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్ పోర్టు కేరళ వరదలతో రూ.220 కోట్లు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు. కొచ్చి విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌరశక్తి విద్యుత్ వ్యవస్థకు కలిగిన ఎయిర్ పోర్టు. వరదలతో దీనికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్స్ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు నాశనమయ్యాయి. -
అలాంటి వర్షమే ఆంధ్రప్రదేశ్‌లో కురిస్తే..
సాక్షి, అమరావతి : 2005 జూలై 16న ఒకేరోజు (24 గంటల్లో) 94 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం అతలాకుతలమైంది. 2015లో ఒకేరోజు 41.3 సెంటీమీటర్ల వాన కురిస్తే చెన్నై రూపురేఖలు కోల్పోయింది. తాజాగా కుండపోత వర్షంతో కేరళలో పెను విషాదం అలుముకుంది. ఇలాంటి వర్షమే ఆంధ్రప్రదేశ్‌లో కురిస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు ఊహించాలంటేనే ఒళ్లు జలదరిస్తోందని వాతావరణ, విపత్తు నిర్వహణ నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ప్రకృతి ప్రకోపం నుంచి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న ముప్పు న్యూక్లియర్ బాంబు కంటే ప్రమాదకరమని చెప్పక తప్పదని అంటున్నారు. ఆక్రమణల చెరలో నదులు, వాగులు స్వల్ప సమయంలో అత్యధిక వర్షం కురిస్తే వాననీరు త్వరగా బయటకు వెళ్లిపోయే మార్గం ఉంటే నష్టం తక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు లాంటి నగరాల్లో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లిపోయే మార్గాలు లేవు. నీటి ప్రవాహానికి వీలుగా సరైన మురుగు కాలువలు లేవు. కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలో ఒకేరోజు 28 సెంటీమీటర్ల వర్షం కురిస్తే పడవలపై ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోని పెద్ద నగరాలు, పట్టణాల్లో ఒకటి రెండు రోజులు కుండపోత వర్షం కురిస్తే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కొల్లేరు మంచినీటి సరస్సు పెద్ద రిజర్వాయర్లా ఉంది. రెండు జిల్లాల నుంచి ఎటువైపు నుంచి నీరు ఎక్కువగా వచ్చినా ఈ సరస్సు నుంచి సముద్రంలోకి నీరు వెళ్లిపోతుంది. అయితే, కొల్లేరును ఆక్రమించేశారు. చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. ఈ చెరువులు కాంక్రీట్ జంగిల్స్ లాంటివే. ఇందులో నీరు ఇంకదు. వాగులు, వంకలు ఆక్రమణలతో కుంచించుకుపోవడం వల్ల వరద నీరు ముందుకు వెళ్లే దారిలేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. రహదారులు ధ్వంసమవుతున్నాయి. మనిషి స్వార్థంతో ప్రకృతికి చేటు ఖనిజాలు, విలువైన రాళ్ల తవ్వకాల కోసం కొండలను పిండి చేస్తున్నారు. అభయారణ్యాలు తరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా చెట్లు నరికేస్తున్నారు. మైనింగ్‌తో కొండలు కరిగిపోతున్నాయి. నదులు, వాగులను ఆక్రమించడం, దారి మళ్లించడం, నదుల్లో ఇసుకను తోడేయడం వల్ల చాలా అనర్థాలు కలుగుతున్నాయి. నీరు నిదానంగా ప్రవహించడానికి ఇసుక ఎంతో అవసరం. ఇసుక నీటిని భూమిలోకి ఇముడ్చుకోవడంతోపాటు నీటిని పరుగెత్తకుండా నెమ్మదిగా నడిచేలా చేస్తుంది. నీరు వేగంగా ప్రవహిస్తే భూమిలోకి ఇంకిపోదు. ప్రవాహ వేగంవల్ల చెరువులు, రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోతాయి. అందుకే నదులు, వాగుల్లో ఇసుకను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ‘‘జూన్ నుంచి సెప్టెంబరు వరకూ 120 రోజుల నైరుతీ రుతుపవనాల కాలంలో గతంలో 84 రోజులకు పైగా వర్షాలు కురిసేవి. ఇప్పుడు వర్షపాతం తగ్గకపోయినా వర్షాలు పడే కాలం మాత్రం 84 నుంచి 60–65 రోజులకు పడిపోయింది. తక్కువ సమయంలోనే విపరీతమైన వర్షం కురిస్తోంది. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్లే విపత్తులు కాటు వేస్తున్నాయి’’ అని విశాఖపట్నానికి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ భానుకుమార్ తెలిపారు. నదికి స్వేచ్ఛ ఉండాలి వరుసగా రెండు రోజులు 30 సెంటీమటర్ల చొప్పున వర్షం కురిస్తే విజయవాడ, రాజధాని ప్రాంతం అమరావతి ఏమవుతాయో చెప్పడమే కష్టం. కొండవీటి వాగు ఉప్పొంగితే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతోపాటు పరిసర గ్రామాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెరువులను పూడ్చేయడం, వాగులను ఆక్రమించి ఇళ్లు నిర్మించడం పెను ప్రమాదానికి సంకేతాలే. ‘‘నదులను ఆక్రమించుకోరాదు. నదికి స్వేచ్ఛ ఉండాలి. దానిపై ఒత్తిడి పెంచితే మనకే ముప్పు’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిటైర్డు అధికారి నరసింహారావు పేర్కొన్నారు. -
కేరళకు లారెన్స్ భారీ విరాళం..!
సాక్షి, చెన్నై : ప్రకృతి విలయానికి తీవ్రంగా నష్టపోయిన కేరళ వరద బాధితులకు విరాళం అందించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులెందరో ముందుకొచ్చారు. తమ వంతు సాయం ప్రకటించారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ఈ జాబితాలో చేరారు. వరద బాధితుల సహాయార్ధం ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించారు. -
వైరల్ వీడియో: ఇన్ఫోసిస్ సుధామూర్తి గొప్ప మనసు
సాక్షి, బెంగుళూరు : కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు, వరదలు కేరళ-కర్ణాటక సరిహద్దులోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కొడగులో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులతో కలిసి వరద బాధితులకు నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఎంతోమంది సుధామూర్తి గొప్పమనసును మెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘అమ్మ’ అనే హ్యాష్‌టాగ్‌తో షేర్ చేసుకుంటున్నారు. -
వరదల నుంచి కోలుకుంటున్న కేరళ
-
బీఫ్ తినేవారికి సాయం చేయొద్దు!
న్యూఢిల్లీ: కేరళలో గొడ్డుమాంసం (బీఫ్) తిన్న వరదబాధతులకు సాయం చేయొద్దంటూ ఆలిండియా హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీఫ్ తినమని అఫిడవిట్ ఇచ్చిన వారికే సాయం చేయాలని పేర్కొన్నారు. హిందూధర్మం ప్రకారం గోమాతను చంపడం మహాపాపమన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ స్వామి చక్రపాణి మహారాజ్‌ను ఆలిండియా అఖాడా పరిషత్ ‘ఫేక్ బాబా’ల జాబితాలో చేర్చింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కారును స్వామి చక్రపాణి వేలంలో కొని తగులబెట్టిన సంగతి తెలిసిందే. -
యూఏఈ సాయం తిరస్కరణ.. కేరళ అసంతృప్తి!
వరదలు ముంచెత్తడంతో నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయానికి యూఏఈ ముందుకొచ్చింది. భారత్‌తో మరీ ముఖ్యంగా కేరళతో యూఏఈకి ప్రత్యేక సంబంధాలున్న నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం ఇంత భారీ సాయాన్ని ప్రకటించింది. ఈ సాయాన్ని స్వీకరించబోమని భారత ప్రభుత్వం తెలిపింది. విదేశీ విరాళాలను అంగీకరించబోవడం లేదని సమాచారం. 2004 డిసెంబర్ నుంచే అమల్లోకి 2004 డిసెంబర్లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిది. ఈ ‘విపత్తు సహాయ విధానం’లో భాగంగా విదేశీ సహాయాన్ని అంగీకరించకూడదని నిర్ణయించింది. సునామీ కారణంగా భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో తీవ్రనష్టం సంభవించిన సందర్భంలో ఈ విధానాన్ని ఖరారు చేశారు. సునామీ అనంతర సహాయ, పునర్నిర్మాణ కార్యక్రమాలు భారత్ సొంతంగా చూసుకోగలదని మన్మోహన్ చెప్పారు. కేరళలోని విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు దేశీయం గా అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలనే వినియోగించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉంది. దౌత్య కార్యాలయాలకు వర్తమానం కేరళ విపత్తుపై విదేశీ ఆర్థిక సహాయాన్ని స్వీకరించవద్దని ఇప్పటికే అన్ని రాయబార కార్యాలయాలకు మోదీ ప్రభుత్వం వర్తమానం పంపించింది. ఏ దేశ ప్రభుత్వమైనా సహాయం చేసే ఉద్దేశాన్ని వెల్లడిస్తే దానిని సున్నితంగా తిరరస్కరించాలని భారత రాయబార కార్యాలయాలకు పంపిన సందేశంలో పేర్కొంది. చివరగా 2004లో బిహార్ వరదలతో అతలాకుతలమైనపుడు విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని భారత్ తీసుకుంది. ఆ తర్వాతి సందర్భాల్లో తిరస్కరించింది. ఎన్ఆర్ఐల విరాళాలపై పన్ను లేదు ఇతర దేశాల ప్రభుత్వాలిచ్చే విరాళాలు, ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తున్నా, ఆ దేశాల్లోని భారతీయులు కేరళ సీఎం సహాయనిధికి నేరుగా విరాళాలు పంపించవచ్చు. వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. ‘విదేశీ విరాళాల చట్టం కింద గుర్తింపు పొందిన, లాభాపేక్ష లేని స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ద్వారా వచ్చే విదేశీ సాయంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి చెప్పారు. కేంద్రం నిర్ణయంపై కేరళ అసంతృప్తి! కొచ్చి: కేరళ వరదలకు విదేశాలు చేస్తున్న సాయాన్ని కేంద్రం తోసిపుచ్చడంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ విరాళాలు అత్యవసరమని రాష్ట్ర సీఎం భావిస్తున్నారు. యూఏఈ విరాళంపై పునరాలోచించాలని ప్రధానిని కలిసి విన్నవించనున్నట్లు విజయన్ తెలిపారు. విదేశీ సాయం తీసుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కూడా వారు ప్రధానిని కోరనున్నారు. యూఏఈ రూ.700కోట్లు, ఖతార్ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కేరళలో తెలుగోడి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళ వరద విలయానికి అక్కడ నివసిస్తోన్న వందలాది మంది తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కేరళ వ్యాప్తంగా వేలాది మంది తెలుగువారు ఉండగా.. ఒక్క కొచ్చిలోని ఏలూర్ కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వారంతా అక్కడికి వలస పోయారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వరద చుట్టుముట్టడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 నుంచి 100 తెలుగు కుటుంబాలపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. అనేక ఇళ్లు మునిగిపోవడంతో సామాన్లు పనికిరాకుండా పోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో తలదాచుకుని ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం వస్తువులన్నీ పాడవడంతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన స్థానిక ఫ్యాక్ట్ కంపెనీలో చిన్న కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వలస కార్మికులు కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీ, షిప్‌యార్డుల్లో దాదాపు వెయ్యి, పదిహేను వందల మంది తెలుగువారు పని చేస్తున్నారు. వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేక రోజు గడవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వీరిని ఆదుకోవడానికి కొచ్చి తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ చేపడుతోంది. ఇక్కడి తెలుగు ప్రజల్లో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది.