
కేరళ సీఎం పినరయి విజయన్(ఫైల్ ఫోటో)
కేరళ వరద విపత్తును కూడా క్యాష్ చేసుకోవడానికి నకిలీ కేటుగాళ్లు సిద్ధమైపోయారు. ఎస్‌బీఐ ఖాతా ద్వారా వరద విరాళాలను అక్రమంగా వసూలు చేసేందుకు ఎత్తుగడవేశారు. అయితే ఈ ప్రయత్నాలకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టారు అధికారులు. కేరళ సీఎం డిస్ట్రబ్ రిలీఫ్ ఫండ్ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను ఛేదించామని ఎస్‌బీఐ ప్రతినిధి వెల్లడించారు.
20025290179, త్రివేండ్రం పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో బ్యాంకు బ్రాంచ్‌గా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ద్వారా గుర్తించారు. అయితే ఈ ఖాతాలో రెండు, మూడువేలు మాత్రమే ఉన్నాయని దీన్ని ఇప్పటికే బ్లాక్ చేశామని బ్యాంకు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంకా ఎలాంటి లావాదేవీలు సాధ్యంకాదని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిజమైన బ్యాంకు ఖాతా 67319948232 ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా, ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మరోవైపు మోసపూరిత సందేశాలు / పోస్టర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నకిలీ ఖాతాలు, సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలకు సూచించింది. అలాగే సైబర్ నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
విరాళాలు పంపాల్సిన అసలైన బ్యాంకు ఖాతా, చిరునామా
లబ్ధిదారు పేరు: ప్రిన్సిపల్ కార్యదర్శి (ఫిన్), కోశాధికారి, సీఎండీఆర్‌ఎఫ్
బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)
ఖాతా సంఖ్య: 67319948232
శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం
IFSC: SBIN0070028
ఆఫ్‌లైన్ కాంట్రిబ్యూషన్: తిరువనంతపురానికి చేరేలా చెక్‌ను లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ను ఈ కింది చిరునామాకు పోస్ట్ చెయ్యవచ్చు / పంపవచ్చు
చిరునామా: ప్రిన్సిపల్ కార్యదర్శి (ఫైనాన్స్)
కోశాధికారి సీఎండీఆర్‌ఎఫ్
సెక్రటేరియట్, తిరువనంతపురం - 695 001
అలాగే సీఎం సహాయ నిధికి పంపే విరాళాలకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎస్‌బీఐతో పాటు పేటిమ్, భీమ్, తేజ్, ఫోన్ పే వంటి యునిఫైడ్ చెల్లింపు ప్లాట్‌ఫాంల ద్వారా కూడా సహాయాన్ని పంపించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment