తిరువనంతపురం: ఇటీవల సంభవించిన భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోయి బావులు ఎండిపోయాయి. నేలను గుళ్లబారేలా చేసి రైతన్నలకు సాయపడే వానపాముల జాడే లేకుండా పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు.
నీటిమట్టం తగ్గిపోవడంపై రాష్ట్ర జనవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్‌లు అధ్యయనం చేస్తాయని విజయన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మేరకు ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 491 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment