cm pinarai vijayan
-
కేరళకు మెగాస్టార్.. సీఎంకు కోటి రూపాయల చెక్!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళలోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా చెక్‌ను అందజేశారు. త్రివేండ్రం వెళ్లిన మెగాస్టార్ కేరళ సీఎం పినరయి విజయన్ను కలిసి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనపై చిరంజీవి ఆరా తీశారు. బాధితులకు అందిస్తోన్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మరణించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. #TFNReels: Megastar @KChiruTweets lands in Trivendra, Kerala to handover ₹1 cr cheque to Kerala CM. ❤#Chiranjeevi #RamCharan #WayanadLanslide #TeluguFilmNagar pic.twitter.com/tP0S4TBEOQ— Telugu FilmNagar (@telugufilmnagar) August 8, 2024 -
రాజ్యాంగ పరిధి దాటొద్దు.. కేరళపై కేంద్రం విమర్శ
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని మండిపడుతోంది. అందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయమేని తెలుస్తోంది.సీఎం పినరయి విజయన్ జులై 15న రాష్ట్ర లేబర్ అండ్ స్కిల్స్ విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణిని కే.వాసుకిని తరుఫున రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి విదేశాగ వ్యవహారాలన్నీ కేంద్రం చేతులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ కేరళ మాత్రం నియమాల్ని బేఖాతరు చేసి రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిని ఎలా నియమిస్తుందనేది కేంద్రం వాదనరణ్ధీర్ జైశ్వాల్ ఆగ్రహం కేరళ నిర్ణయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తీవ్రంగా దుయ్యబట్టారు. విదేశీ వ్యవహారాలు సంబంధిత కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకునే హక్కు కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. రాజ్యంగంలోని ఏడవ షెడ్యూల్లోని లిస్ట్ 1, ఐటమ్ 10లో విదేశీ వ్యవహారాలు, కేంద్రం ఇతర దేశాలతో సంప్రదింపులు, సంత్సంభందాలు ఇలా విదేశీ వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే ఏకైక అధికారమని స్పష్టంగా నిర్దేశిస్తుంది,’అని జైస్వాల్ అన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధికి మించి కేంద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనేది మా ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. MEA Spox @randhir_jk on Appointing IAS officer K Vasuki as 'state's secretary in charge of external cooperation' by #Kerala Gov Foreign affairs and all matter which brings union into the relation with any foreign country are the sole prerogative of Union Gov. Foreign affairs… pic.twitter.com/bAHWYNHgWJ— Siddhant Mishra (@siddhantvm) July 25, 2024పార్లమెంట్లో సైతం చర్చరాజస్థాన్ పాలి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేరళ ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం. కేంద్రం బాధ్యతల విషయంలో అక్రమంగా వ్యవహరిస్తోందని అభివర్ణించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం తమని తాము ప్రత్యేక దేశంలా భావిస్తోందా’అని ప్రశ్నించారు.విదేశీ వ్యవహారాల్ని చూసుకునే బాధ్యత కేంద్రానిదే. అలా కాకుండా కేరళ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఐఎఎస్ అధికారిణిని విదేశాంగ కార్యదర్శిగా నియమించడం సబబు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
అర్ధరాత్రి అరెస్టులు
శబరిమల/కోజికోడ్: శబరిమలలో ఆదివారం అర్ధరాత్రి కలకలం. పోలీసులు 69 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీం తో బీజేపీ, ఆరెస్సెస్ సోమవారం కేరళ వ్యాప్తం గా ఆందోళనలు నిర్వహించాయి. అయితే వారంతా శబరిమలలో అలజడి సృష్టించేందుకు వచ్చారన్న సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నామనీ, నిజమైన భక్తులను ఇబ్బంది పెట్టలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అయ్యప్ప భక్తులెవరూ లేరనీ, వారంతా శబరిమలలో నిరసనలకు దిగి పరిస్థితిని దిగజార్చేందుకు వచ్చినవారేనని సీఎం పినరయి విజయన్ చెప్పారు. కోజికోడ్‌లో సీఎం మాట్లాడుతూ ‘వారెవరూ అయ్యప్ప భక్తులు కారు. అంతా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే. సమస్యలు సృష్టించేందుకే సన్నిధానం వద్దకు చేరుకున్నారు’ అని చెప్పారు. ఆలయం మూసివేశాక రాత్రి 11 గంటల తర్వాత కూడా వారంతా గుంపుగా చేరి అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ నిరసనలకు దిగడంతోనే పరిస్థితి మరింత దిగజారకుండా ముందస్తుగా 69 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నెయ్యాభిషేకం చేయించడం కోసం వచ్చి, రాత్రి అక్కడే ఉన్న భక్తులను తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ పోలీసుల చర్యను ఖండించింది. కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ సోమవారం నిలక్కళ్, పంబ, సన్నిధానం వద్ద పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని యుద్ధక్షేత్రంగా మార్చింది. భక్తులేమీ తీవ్రవాదులు కారు. యాత్రికులను బందిపోటు దొంగల్లా ఈ ప్రభుత్వం చూస్తోంది’ అని పేర్కొన్నారు. మరోవైపు శబరిమలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో పోలీసులు భక్తులను అదుపులోకి తీసుకొని సన్నిధానం నుంచి పంపించేశారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీఎం ఇంటి ముందు ధర్నా అరెస్ట్‌లకు నిరసనగా ఆరెస్సెస్, బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థ యువ మోర్చాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు కోజికోడ్‌లో సీఎం కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని తిరువనంతపురంలో కొందరు కార్యకర్తలు సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టగా, మరికొందరు సీఎం అధికారిక నివాసం ముందు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టులో టీడీబీ పిటిషన్ అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పును అమలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ గుడి నిర్వహణను చూసుకునే ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా ఇప్పటికే ఆలయ పరసరాల్లో వసతులు దెబ్బతిన్నాయనీ, సరైన సౌకర్యాలు లేనందున ఇప్పుడు యాత్రకు వస్తే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీబీ పిటిషన్లో పేర్కొంది. రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న ఎత్తివేయడం తెలిసిందే. -
పటిష్ట భద్రత మధ్య పూజలు
తిరువనంతపురం/శబరిమల: సాయుధ కమాండోలు.. భారీ సంఖ్యలో పోలీసులు.. అడుగడుగునా నిఘా కెమెరాలు.. కీలకప్రాంతాల్లో మొబైల్ జామర్లు..వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో స్వామి అయ్యప్ప కొలువైన శబరిమల సోమవారం దుర్భేద్యమైన కోటగా మారింది. శ్రీచిత్ర తిరునాళ్‌ను పురస్కరించుకు ని నేడు జరిగే ప్రత్యేక పూజలకు గాను శబరిమల గుడిని పూజారులు సోమవారం సాయం త్రం 5 గంటలకు తెరిచారు. దీంతో స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ముందుకు కదిలారు. ఓ మహిళ (30) స్వామి దర్శనం కోసం రావడంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ముఖ్యుల చాంబర్ల వద్ద జామర్లు గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. 20 మంది సభ్యుల సాయుధ కమాండోల బృందాన్ని, 100 మంది మహిళా పోలీసులను కలిపి దాదాపు 2,300 మంది పోలీసులను ప్రధాన ఆలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో మోహరించింది. ఆలయ సముదాయంలో కూడా 50ఏళ్ల పైబడిన మíß ళా పోలీసులను నియమించింది. ముఖ్య పూజారి కందరారు రాజీవరుతోపాటు ఇతర అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం లేకుండా సెల్‌ఫోన్ జామర్లు ఏర్పాటు చేసింది. మహిళాప్రవేశంపై నిరసన.. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు సుమారు 5వేల మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున వారిని బృందాలుగా లోపలికి అనుమతిస్తున్నారు. అలప్పుజ జిల్లా చెర్తాల ప్రాంతానికి చెందిన అంజు(30) తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పంబ వద్దకు చేరుకుని స్వామి దర్శనం కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కొందరు మహిళా జర్నలిస్టులు కూడా భద్రత మధ్య పంబ వద్దకు చేరుకున్నారు. దీంతో హిందూ ఐక్య వేదిక నాయకురాలు శశికళ నేతృత్వంలో పంబ గణపతి ఆలయం వద్ద భక్తులు కొండపైకి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నందున భక్తులెవరినీ అక్కడ ఉండేందుకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అది బీజేపీ అధ్యక్షుడి సలహాయే..! కోజికోడ్‌లో ఆదివారం జరిగిన యువమోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడిన వివాదాస్పద ప్రసంగం వీడియో కలకలం రేపుతోంది. గత నెలలో ఆలయం తెరిచిన సమయంలో 50ఏళ్లలోపు మహిళలెవ్వరినీ లోపలికి రానివ్వబోనని, అవసరమైతే ఆలయ ద్వారాలను మూసివేస్తానని ఆలయ ముఖ్య పూజారి కందరారు రాజీవరు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ నిర్ణయానికి తానిచ్చిన సలహాయే కారణమని హైకోర్టు లాయర్ కూడా అయిన శ్రీధరన్ ఆ సమావేశంలో అన్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆలయాన్ని మూసివేస్తే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా అని రాజీవరు అడగ్గా అలాంటిదేమీ ఉండదు.. భక్తులంతా మీ వెనుకే ఉన్నారంటూ పిళ్లై ఆయనకు భరోసా ఇచ్చారు. అయితే, ఈ విషయాన్ని ముఖ్య పూజారి రాజీవరు ఖండించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ వివాదం బంగారంలాంటి అవకాశం అని పిళ్లై కార్యకర్తలతో అన్నారు. దీనిపై సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. ‘బీజేపీ ఆడు తున్న నాటకాన్ని భక్తులు అర్థం చేసుకోవాలి. శబరిమలలో సమస్యలు సృష్టించాలనే బీజేపీ నేతల కుట్రలపై తగు ఆధారాలు మా వద్ద ఉన్నాయి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. సోమవారం శబరిమల ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులు -
కేరళలో నదులెండిపోతున్నాయి..!
తిరువనంతపురం: ఇటీవల సంభవించిన భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోయి బావులు ఎండిపోయాయి. నేలను గుళ్లబారేలా చేసి రైతన్నలకు సాయపడే వానపాముల జాడే లేకుండా పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు. నీటిమట్టం తగ్గిపోవడంపై రాష్ట్ర జనవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్‌లు అధ్యయనం చేస్తాయని విజయన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 491 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
కేరళ బాధితులకు లారెన్స్ సాయం ‘కోటి’
కేరళ వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల సాయం ప్రకటించారు. కోలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించిన నటుడు లారెన్సే. వరదల్లో కేరళ ప్రజల కష్టాలు తనను కలచివేశాయని ఈ సందర్భంగా లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్ను శనివారం కలిసి చెక్‌ను అందజేస్తానని తెలిపారు. బాధితులు ఎవరైనా తనను వ్యక్తిగతంగా కలిస్తే, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. -
దైవభూమిలో ఇంకా అల్లకల్లోలమే
తిరువనంతపురం: వరదబీభత్సానికి కేరళ చివురుటాకులా వణికిపోతోంది. వర్షాలు ఆగకపోవడంతో నదులు, కాలువలకు వరదపోటు తగ్గట్లేదు. పరిస్థితి రోజురోజుకూ హృదయవిదారకంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే 22 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటిదాకా (ఆగస్టు 9న భారీ వర్షాలు మొదలైనప్పటినుంచి) మొత్తం మృతుల సంఖ్య 357కు చేరింది. 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే జరిపిన అనంతరం కేరళకు తక్షణ సాయంగా రూ.500కోట్ల సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో ఎర్నాకులం, త్రిసూర్, ఇడుక్కి, పత్తనంతిట్ట, చెంగనూర్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తిరువనంతపురం, కొల్లాం, కాసార్గోడ్ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గడంతో సహాయకకార్యక్రమాలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కేరళలో మరో 24 గంటలపాటు భారీవర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలువా, చలకుడి, చెంగనూర్, అలప్పుజ, పత్తనంతిట్ట ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం తీవ్రస్థాయిలో ఉంది. చాలాచోట్ల సహాయక కార్యక్రమాల్లో ఆలస్యంపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. చాలాచోట్ల రోడ్డు, రవాణా వ్యవస్థతోపాటు ప్రభుత్వ కార్యకాలాపాలు కూడా స్తంభించాయి. మోదీ, విజయన్ ఏరియల్ సర్వే వరద బాధితులు, కేరళ ప్రజలు అధైర్యపడవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రూ. 500కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించడంతోపాటు ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయాన్ని కేంద్రం నుంచే అందిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల ఆర్థిక సాయం కేంద్రం తరపున అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన తీవ్రంగా వరద బారిన పడిన అలువా, త్రిసూర్ ప్రాంతాల్లో ఎరియల్ సర్వే చేశారు. మోదీతోపాటు కేరళ గవర్నర్ పి. సదాశివం, సీఎం విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్, ఇతర అధికారులు కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ప్రాణ, ఆస్తినష్టం దురదృష్టకరమని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని కేరళ ప్రభుత్వానికి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు ప్రధాని సూచించారు. ఏరియల్ సర్వే అనంతరం కొచ్చిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మొత్తం 357 మంది చనిపోయినట్లు నివేదిక ఇచ్చింది. 3.53 లక్షల మందిని 2వేలకు పైగా పునారావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాగా, ఆగస్టు 12న కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రకటించిన రూ.100కోట్ల సాయానికి అదనంగా మరో రూ. 500 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు సమీక్ష అనంతరం ప్రధాని మోదీ వెల్లడించారు. పరిస్థితి గంభీరంగానే: విజయన్ సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అయితే సకాలంలో స్పందించి తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి కొంతైనా నియంత్రణలో ఉంది. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెల్లమెల్లగా కుదురుకుంటున్నాయి’ అని అన్నారు. ‘ఇప్పటివరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి రూ.19,512 కోట్ల నష్టం జరిగింది. కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల సాయం కావాలని ప్రధానిని అడిగాం. రూ.500కోట్ల తక్షణసాయాన్ని మోదీ ప్రకటించారు’ అని విజయన్ ట్వీట్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో కమ్యూనిస్టు ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సహాయక కార్యక్రమాలు సరిగ్గా కొనసాగడం లేదని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల విమర్శించారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైనందున.. ఈ బాధ్యతను పూర్తిగా ఆర్మీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అతిపెద్ద ఆపరేషన్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ 58 బృందాలు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌ను కేరళ వరద ప్రభావ ప్రాంతాల్లో జరుపుతోంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మొత్తం 55 బృందాలు రాష్ట్రంలోని వివిధ తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. మరో మూడు బృందాలు కూడా వీలైనంత త్వరగా వీరితో జతకలవనున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2006లో ఎన్డీఆర్ఎఫ్ స్థాపించిన తర్వాత ఒక రాష్ట్రంలో ఇన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగటం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. ఒక్కో బృందంలో 35–40 మంది సభ్యులుంటారు. ఆగస్టు 8 నుంచి కొనసాగుతున్న సహాయ కార్యక్రమాల్లో మొత్తం 194 మందిని, 12 పశువులను ఈ బృందాలు రక్షించాయన్నారు. మొత్తం 10, 647 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. త్రిసూర్‌లో 15, పత్తనంతిట్టలో 13, అలప్పుజలో 11, ఎర్నాకులంలో 5, ఇడుక్కి 4, మల్లపురంలో 3, వయాంద్, కోజికోడ్‌లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొచ్చిలోని కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడ ఈ కార్యక్రమాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఠి 234.4 సెం.మీ వర్షం కొచ్చి: వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో జూన్ 1 నుంచి ఈ నెల 18 వరకు 234.4 సె.మీ వర్షపాతం(సాధారణం కన్నా 42 శాతం అధికం) నమోదైనట్లు తిరువనంతపురంలోని వాతావారణ విభాగం(ఐఎండీ) విభాగం వెల్లడించింది. ఢిల్లీ వార్షిక సగటు వర్షపాతానికి ఇది ఐదు రెట్లు. ఇడుక్కి జిల్లాలో సాధారణం కన్నా 70 శాతం అధికంగా వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఈ ఏడాది లోటువర్షపాతం నమోదుకాకపోవడం గమనార్హం. ప్లీజ్..మోదీకి చెప్పండి కేరళలో వరదల దెబ్బకు సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ స్థిమితంగా ఉండే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. సాక్షాత్తు శాసనసభా సభ్యుడే తన రాష్ట్రంలోని దుస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘వరదల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సరిపడ సంఖ్యలో పడవలు లేకపోవడంతో పేద మత్స్యకారుల పడవలను వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని హెలికాప్టర్లు పంపి మమ్మల్ని కాపాడాలని దయచేసి ప్రధాని మోదీకి చెప్పండి’ అని చెంగన్నూర్ ఎమ్మెల్యే సాజి చెరియాన్ ఓ టీవీ చానెల్లో అభ్యర్థించారు. కేరళ పోరాటస్ఫూర్తికి సెల్యూట్: మోదీ ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయక వస్తువులను కేంద్రం తరపున అందజేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. రోడ్డు రవాణా వ్యవస్థను త్వరగా పునర్వ్యవస్థీకరించాలన్నారు. సామాజిక భద్రత, ఫసల్ బీమా యోజనల్లో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ న్యాయం జరిగేలా బీమా కంపెనీలు క్యాంపులు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించింది. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్‌లో భాగంగా ఇళ్లు ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇతర ప్రభుత్వ పథకాల కింద కేరళకు సాయం ఎక్కువ అందిస్తామని సీఎం విజయన్‌కు మోదీ హామీనిచ్చారు. ‘ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉన్న కేరళ ప్రజల పోరాట స్ఫూర్తికి సెల్యూట్. భారతజాతి మొత్తం కేరళ వెంటే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కేరళ త్వరగా సాధారణ స్థితికి రావాలని అభిలషిస్తున్నాను. కేరళకు కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుంది’ అని ప్రధాని ట్వీటర్లో పేర్కొన్నారు. శనివారం కేరళలోని వరద ప్రాంతం అలువాలో విలపిస్తున్న మహిళ సమీక్షాసమావేశంలో మోదీ, విజయన్ -
కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, సుమారు 54వేల మంది నిర్వాసితులు అయ్యారు. వీరిలో 53,501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏడు ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. పెరియార్ నది నీటి మట్టం అతివేగంగా పెరుగుతోంది. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్చ్ డ్యాం ‘ఇడుక్కి రిజర్వాయర్’ నిండడంతో మరో 3 గేట్లను ఎత్తారు. వరదలపై మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరదల నేపథ్యంలో ఈ నెల 12 వరకు ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
మద్యం సేవించేందుకు వయోపరిమితి
తిరువనంతపురం : మద్యం సేవించేందుకు వయోపరిమితిని పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది కూడా. మద్యం సేవించే యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంతో ఏం ఒరగకపోవచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కాగా, 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రయత్నించగా.. అది కుదరలేదు. దీంతో కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లకు మాత్రమే లైసెన్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవటంతో వందలాది పబ్‌లు, బార్లు మూతపడ్డాయి. ఉద్యమకారులు ఆ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ పబ్, బార్ యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేగాక పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరుగా మళ్లీ లైసెన్సులు జారీ చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా త్రీస్టార్‌హోటళ్లతోపాటు రిసార్ట్స్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే యువతను కట్టడి చేసేందుకు మాత్రం వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ జిమిక్కుగా అభివర్ణిస్తోంది. మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కి.. కంటి తుడుపు చర్యగా వయో పరిమితిని పెంచిందని విమర్శిస్తోంది. -
కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం
- అసెంబ్లీలో బీఫ్‌తో చేసిన వంటకాలు తిన్న ఎమ్మెల్యేలు తిరువనంతపురం: రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తోందంటూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేరళ అసెంబ్లీ మండిపడింది. పశు విక్రయాలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఇటీవల కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఖాతరు చేయబోమని కేరళ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించగా, గురువారం మరో అడుగు ముందుకువేసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో.. కేంద్రం తీరును నిరసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అధికార ఎల్డీఎఫ్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి విపక్ష యూడీఎఫ్ కూడా మద్దతు పలకడం గమనార్హం. కేంద్రం తీరును నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవడం తగదని ఆయన అన్నారు. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని భగ్నం చేసే ఏ నిర్ణయాన్నయినా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీఫ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యేలు పశు విక్రయాలు, బీఫ్ సహా ఇతర మాంసం విక్రయాలపై అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నదంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు కేరళ ప్రజాప్రతినిధులు. గురువారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు.. గొడ్డుమాంసం(బీఫ్)తో వండిన వంటకాలను అల్పాహారంగా స్వీకరించారు. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఈ మేరకు న్యాయనిపుణులతో చర్చించాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.