తిరువనంతపురం : కేరళ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని మండిపడుతోంది. అందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయమేని తెలుస్తోంది.
సీఎం పినరయి విజయన్ జులై 15న రాష్ట్ర లేబర్ అండ్ స్కిల్స్ విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణిని కే.వాసుకిని తరుఫున రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి విదేశాగ వ్యవహారాలన్నీ కేంద్రం చేతులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ కేరళ మాత్రం నియమాల్ని బేఖాతరు చేసి రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిని ఎలా నియమిస్తుందనేది కేంద్రం వాదన
రణ్‌ధీర్ జైశ్వాల్ ఆగ్రహం
కేరళ నిర్ణయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తీవ్రంగా దుయ్యబట్టారు. విదేశీ వ్యవహారాలు సంబంధిత కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకునే హక్కు కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది.
రాజ్యంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని లిస్ట్ 1, ఐటమ్ 10లో విదేశీ వ్యవహారాలు, కేంద్రం ఇతర దేశాలతో సంప్రదింపులు, సంత్సంభందాలు ఇలా విదేశీ వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే ఏకైక అధికారమని స్పష్టంగా నిర్దేశిస్తుంది,’అని జైస్వాల్ అన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధికి మించి కేంద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనేది మా ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు.
MEA Spox @randhir_jk on Appointing IAS officer K Vasuki as 'state's secretary in charge of external cooperation' by #Kerala Gov
Foreign affairs and all matter which brings union into the relation with any foreign country are the sole prerogative of Union Gov.
Foreign affairs… pic.twitter.com/bAHWYNHgWJ— Siddhant Mishra (@siddhantvm) July 25, 2024
పార్లమెంట్‌లో సైతం చర్చ
రాజస్థాన్ పాలి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేరళ ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం. కేంద్రం బాధ్యతల విషయంలో అక్రమంగా వ్యవహరిస్తోందని అభివర్ణించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం తమని తాము ప్రత్యేక దేశంలా భావిస్తోందా’అని ప్రశ్నించారు.
విదేశీ వ్యవహారాల్ని చూసుకునే బాధ్యత కేంద్రానిదే. అలా కాకుండా కేరళ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఐఎఎస్ అధికారిణిని విదేశాంగ కార్యదర్శిగా నియమించడం సబబు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment