Foreign Secretary
-
మైనారిటీల భద్రత ఆందోళనకరం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మత, సాంస్కృతిక, దౌత్య సంబంధ ఆస్తులపై కొనసాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జషిమ్ ఉద్దీన్‌తో ఢాకాలో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మిస్రీ చెప్పారు. పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనా ఆగస్ట్ 5న భారత్‌కు వచ్చాక, రెండు దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశం అనంతరం ఢాకాలో మిస్రీ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సంబంధాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఇద్దరం చర్చించాం. భారత్ వైఖరిని స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా వివరించాను’అని మిస్రీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయాలని భారత్ భావిస్తోందన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనుస్, విదేశాంగ శాఖ సలహాదారు తౌహీద్ హుస్సేన్తోనూ సమావేశమయ్యానని చెప్పారు. బంగ్లాదేశ్ అభివృద్ధి, సుస్థిరత కోసం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు భారత్ తోడ్పాటునందిస్తుందని వారికి చెప్పానని మిస్రీ వివరించారు. ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలకు అవరోధంగా మారే అవకాశమే లేదని చెప్పారు. ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనుస్‌కు శుభాకాంక్షలు తెలిపిన విదేశీ నేత మన ప్రధాని మోదీయేనని మిస్రీ వివరించారు. ఇద్దరు నేతలు ఫోన్లో మనసు విప్పి మాట్లాడుకున్నారని చెప్పారు. భారత్ సహకారంతో బంగ్లాదేశ్‌లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టుల రోజువారీ పురోగతి, వాణిజ్యం, వ్యాపారం, కనెక్టివిటీ, ఇంధన రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలతోనూ రెండు దేశాల సంబంధాలు ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. -
రాజ్యాంగ పరిధి దాటొద్దు.. కేరళపై కేంద్రం విమర్శ
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని మండిపడుతోంది. అందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయమేని తెలుస్తోంది.సీఎం పినరయి విజయన్ జులై 15న రాష్ట్ర లేబర్ అండ్ స్కిల్స్ విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణిని కే.వాసుకిని తరుఫున రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి విదేశాగ వ్యవహారాలన్నీ కేంద్రం చేతులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ కేరళ మాత్రం నియమాల్ని బేఖాతరు చేసి రాష్ట్ర విదేశాంగ కార్యదర్శిని ఎలా నియమిస్తుందనేది కేంద్రం వాదనరణ్ధీర్ జైశ్వాల్ ఆగ్రహం కేరళ నిర్ణయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తీవ్రంగా దుయ్యబట్టారు. విదేశీ వ్యవహారాలు సంబంధిత కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకునే హక్కు కేవలం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం కూడా ఇదే చెబుతోంది. రాజ్యంగంలోని ఏడవ షెడ్యూల్లోని లిస్ట్ 1, ఐటమ్ 10లో విదేశీ వ్యవహారాలు, కేంద్రం ఇతర దేశాలతో సంప్రదింపులు, సంత్సంభందాలు ఇలా విదేశీ వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే ఏకైక అధికారమని స్పష్టంగా నిర్దేశిస్తుంది,’అని జైస్వాల్ అన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగ పరిధికి మించి కేంద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనేది మా ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. MEA Spox @randhir_jk on Appointing IAS officer K Vasuki as 'state's secretary in charge of external cooperation' by #Kerala Gov Foreign affairs and all matter which brings union into the relation with any foreign country are the sole prerogative of Union Gov. Foreign affairs… pic.twitter.com/bAHWYNHgWJ— Siddhant Mishra (@siddhantvm) July 25, 2024పార్లమెంట్లో సైతం చర్చరాజస్థాన్ పాలి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేరళ ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధం. కేంద్రం బాధ్యతల విషయంలో అక్రమంగా వ్యవహరిస్తోందని అభివర్ణించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం తమని తాము ప్రత్యేక దేశంలా భావిస్తోందా’అని ప్రశ్నించారు.విదేశీ వ్యవహారాల్ని చూసుకునే బాధ్యత కేంద్రానిదే. అలా కాకుండా కేరళ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఐఎఎస్ అధికారిణిని విదేశాంగ కార్యదర్శిగా నియమించడం సబబు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కేరళ విదేశాంగ కార్యదర్శి నియామకంపై రాజకీయ దుమారం
ఢిల్లీ: కేరళ ప్రభుత్వం నియమించిన విదేశాంగ కార్యదర్శి వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటంపై బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ సోమవారం లోక్‌సభలో విమర్శలు చేశారు.‘కేరళ రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటం రాజ్యాంగ విరుద్ధం. ఇలా చేయటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కేరళ ప్రభుత్వం తమను మాకు ప్రత్యేక దేశంగా భావిస్తోందా?. విదేశాంగ శాఖ సహకారం, సమన్వయం అంటే వివిధ దేశాలతో సంబంధాలు పెంచుకోవటం. ..కేంద్ర జాబితాలో భాగంగా విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు, మిషన్లుతో సత్సంబంధాలతో ఏర్పర్చుకునే విధులు. కేరళ ప్రభుత్వం విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటం కేంద్ర ప్రభుత్వానికి, యూనియన్ జాబితాకు కేటాయించిన అంశాలను ఉల్లఘించినట్లు అవుతుంది’అని విమర్శలు చేశారు.జూలై 15న కేరళ ప్రభుత్వం లేబర్, స్కిల్స్ డిపార్టుమెంట్ సెక్రటరీకి విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ చీఫ్ తీవ్రంగా ఖండించారు.చదవండి: ‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు -
‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం సొంతంగా విదేశాంగ కార్యదర్శిని నియమించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్ కే. వాసుకి అనే ఐఏఎస్ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించటంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.‘ఐఏఎస్ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించిన కేరళ సీఎం పినరయ విజయన్ రాజ్యాంగ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారు. విదేశీ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. రాజ్యాంగబద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరం. సీఎం పినరయి విజయన్ కేరళను ప్రత్యేక దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా?’ అని కేరళ బీజేపీ యూనిట్ చీఫ్ కే.సురేంద్రన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.The appointment of an IAS officer as 'Foreign Secretary' in Kerala by CM Pinarayi Vijayan is a blatant overreach and a violation of the Union list of our Constitution. The LDF government has no mandate in foreign affairs. This unconstitutional move sets a dangerous precedent. Is…— K Surendran (@surendranbjp) July 20, 2024 లేబర్ అండ్ స్కిల్స్ సెక్రటరీ కే. వాసుకికి విదేవి వ్యవహారాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతల్లో భాగంగా విదేశీ వ్యవహారాలక సంబంధించిన అంశాలను సమన్వయం చేయనున్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఎంబసీ, మిషషన్లతో అనుసంధానం చేయటంలో కొత్త నియమించిన విదేశంగా సెక్రటరీ వాసుకికి సహాయం చేయాలని ఢిల్లీలోని కేరళ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కేరళ ప్రభుత్వం చేసిన ఈ నియామకంపై మాజ కెబినెట్ సెక్రటరీ కే. ఎం. చంద్రశేఖర్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ సంబంధాలు కేంద్రం చేతిలో ఉంటాయి. దేశంలోని ఏ రాష్ట్రం విదేశాలకు సంబంధించిన సమాచారం, పనులు కావాలన్నా కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్తగా నియమించిన విదేశాంగ కార్యదర్శి.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కంటే మించి ఎలాంటి అదనపు పనులను చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి’ అని చంద్రశేఖర్ అన్నారు. -
UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్‌దే
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్ (లిజ్) ట్రస్ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్ జాన్సన్ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ట్రస్ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల అనంతరం ట్రస్ మాట్లాడారు. పార్టీ నేతగా ఎన్నికవడం గొప్ప గౌరవమన్నారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మేం చేసి చూపిస్తాం’ అంటూ ముమ్మారు ప్రతిజ్ఞ చేశారు. ‘‘పన్నులకు కోత విధించి ప్రజలపై భారం తగ్గించి చూపిస్తాం. ఇంధన సంక్షోభాన్ని అధిగమిస్తాం. ఈ కష్టకాలం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సాహసోపేతమైన చర్యలు చేపడతా. యునైటెడ్ కింగ్డమ్ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపిద్దాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రిషి చివరిదాకా తనకు పోటీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రధానిగా బోరిస్ ఘన విజయాలు సాధించారంటూ ఆకాశానికెత్తారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్. పన్నుల తగ్గింపు హామీలు, రిషిపై కోపంతో జాన్సన్ లోపాయికారీ మద్దతు తదితరాలు ట్రస్ గెలుపుకు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె నిర్ణయాత్మక విజయం సాధించారంటూ జాన్సన్ అభినందించారు. ‘‘నానాటికీ పెరిగిపోతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పార్టీని, దేశాన్ని ముందుకు నడిపేందుకు ట్రస్ వద్ద సరైన ప్రణాళికలున్నాయి. పార్టీ నేతలంతా ఆమె వెనక నిలవాల్సిన సమయమిది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. రిషి సంచలనం పార్టీ గేట్, విశ్వసనీయతకు సంబంధించిన ఆరోపణలతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే. నైతికత లేని జాన్సన్ సారథ్యంలో పని చేయలేనంటూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రిషి సంచలనం సృష్టించారు. మంత్రులంతా ఆయన బాటే పట్టి వరుసగా రాజీనామా చేయడంతో జాన్సన్ అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా వచ్చి పడ్డ కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టడం ద్వారా తొలుత రిషియే ముందంజలో ఉన్నారు. తర్వాత ట్రస్ అనూహ్యంగా దూసుకెళ్లారు. 1,72,437 లక్షల కన్జర్వేటివ్ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఆమెకు 57.4 శాతం ఓట్లు పోలవగా రిషికి 42.6 శాతం వచ్చాయి. ఆయన ఓటమి చవిచూసినా బ్రిటన్ ప్రధాని పదవి కోసం తలపడ్డ తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తనకు ఓటేసిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కన్జర్వేటివ్ సభ్యులమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో మనమంతా కొత్త ప్రధాని ట్రస్‌కు దన్నుగా నిలుద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు. పన్నుల విషయంలో ట్రస్‌తో విధానపరమైన వైరుధ్యం కారణంగా రిషి ఆమె కేబినెట్లో చేరడం అనుమానమేనంటున్నారు. అంచెలంచెలుగా ఎదిగి... బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా తల్లి నర్స్ టీచర్. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్ఫోక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్–ఇంగ్లండ్ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్ హ్యూ ఓ లియరీని ట్రస్ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్ పేరుబడ్డారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ వస్త్రధారణను అనుకరించారు. -
ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. రష్యన్ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు. ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని మోదీ ఆదేశించారని హర్షవర్దన్ ఉద్ఘాటించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామన్నారు. ఉక్రెయిన్తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 4 వేల మంది తిరిగి వచ్చేశారు. మాకు రక్షణ కల్పించండి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్లు సమాచారం. విద్యార్థులకు అడ్వైజరీ ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖ తెలిపారు. భారత్ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్ పేర్కొన్నారు. రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం తన గగనతలాన్ని మూసివేయడంతో, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గమధ్యంలోనే వెనుదిరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎయిరిండియా విమానం గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి కీవ్‌లోని బోరీస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. అప్పటికే రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానసేవలు చాలా ప్రమాదకరంగా మారినందున ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ సమయంలో ఇరాన్ గగనతలంపై ఉన్న ఆ విమానం తిరిగి వెనుదిరిగింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో 182 మంది భారతీయులు గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది విద్యార్థులేనన్నారు. ఈ నెల 22వ తేదీన ఎయిరిండియా పంపిన మొదటి విమానంలో కీవ్‌లో ఉన్న 240 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఆఖరి క్షణంలో ఆగిపోయారు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి బయలుదేరిన ఇద్దరు భారత విద్యార్థులు రష్యా దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రోణక్ షెరాసియా(18), అతడి స్నేహితుడు మహావీర్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో చెర్నివిట్సీలో ఉన్న బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ(బీఎస్ఎంయూ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారు గురువారం ఉదయం భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తెల్లవారుజామునే కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు చెక్–ఇన్ కౌంటర్ వద్దకు వెళ్లగా విమానం రద్దయ్యిందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదిలేక మళ్లీ బస్సులో యూనివర్సిటీకి బయలుదేరారు. కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా, పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు పలుమార్లు వినిపించాయని రోణక్ షెరాసియా చెప్పాడు. ఆ భీకర శబ్దాలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొన్నాడు. -
భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత!
లండన్: తమ అనుకూల నేతను ఉక్రెయిన్ అధినేతగా చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ మాజీ ఎంపీ యెవెహెన్ మురయేవ్ను రష్యా ఎంచుకొని ప్రోత్సహిస్తోందని యూకే విదేశీ వ్యవహరాలు, కామన్వెల్త్ కార్యాలయం (ఎఫ్సీడీఓ) శనివారం ప్రకటించింది. ఈ మేరకు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఇలాంటి ప్రయత్నాలకు రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రష్యా కుట్రలు పన్నుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ చెప్పారు. రష్యా వెనక్కు తగ్గాలని, ఇలాంటి కుట్రలు మానుకొని ప్రజాస్వామ్య మార్గం అవలంబించాలని కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా తాము, తమ మిత్ర దేశాలు ఊరుకోమన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసకునే ఉద్దేశంతో రష్యా సరిహద్దులోకి లక్షమంది సైనికులను తరలించిందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి ఆక్రమించుకునే బదులు, తమకు అనుకూల నేత చేతిలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఉంటే మంచిదని రష్యా భావిస్తోన్నట్లు ఎఫ్సీడీఓ తెలిపింది. యెవెహెన్ మాత్రమే కాకుండా పలువురు ఉక్రెయిన్ రాజకీయనేతలకు రష్యాతో సంబంధాలున్నట్లు తెలిపింది. 2015 నుంచి ఉక్రెయిన్‌లో బ్రిటన్ సేనలు సాయంగా ఉంటున్నాయి. బ్రిటన్ ఆరోపణలను రష్యా ఖండించింది. బ్రిటన్ ఆధ్వర్యంలో నాటో కూటమి సాగించే తప్పుడు ప్రచారంలో ఇదంతా భాగమని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. (చదవండి: ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని) -
భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!
వాషింగ్టన్: అఫ్గాన్ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అ«దీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో పాక్ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. (చదవండి: Kodanad Case: వీడని మిస్టరీ.. అంతులేని ‘కొడనాడు’ కథ) అఫ్గాన్‌పై అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని, భారత్ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఎలా రూపుదిద్దుకుంటాయో గమనిస్తున్నామన్నారు.తాలిబన్లతో భారత్ సంబంధాలు పరిమితమని, ఇటీవలి భేటీలో ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మారుతుందేమోనన్న భారత ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని తెలిపారు. అఫ్గాన్ భూభాగంలోని అనేక శక్తులకు పాక్ అండగా నిలిచిందని చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు అఫ్గాన్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని, వీరి కదలికలపై కన్నేసి ఉంచామని తెలిపారు. అఫ్గాన్ నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు సాగినా తాలిబన్లదే బాధ్యతన్నారు. నవంబర్‌లో అమెరికాతో చర్చలు భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు నవంబర్‌లో వాషింగ్టన్లో జరుగుతాయని హర్షవర్ధన్ చెప్పారు. ఈదఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, జైశంకర్‌లు తొలిసారి బైడెన్ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు. (చదవండి: బీజేపీ నేత సువేందుకు సమన్లు) -
తాలిబన్లతో సంప్రదింపులు చాలా అవసరం: యూకే
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం వంటి కారణాల దృష్ట్యా తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం చాలా అవసరమని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే అంశంలో ఇప్పుడే మాట్లాడటం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించారు. చదవండి: Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే! శుక్రవారం ఆయన ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాలిబన్ల నుంచి ఏవిధమైన సహకారం లేకుండా కాబూల్ నుంచి 15 వేల మందిని వెనక్కి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. ‘తాలిబన్లలోని కొందరు నేతలు కొన్ని అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. వాటిని కార్యరూపంలోకి తేవాలంటే వారితో చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! -
భూటాన్ భారత్‌కు హ్యాండిస్తే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం సంక్షోభం సమసిసోయిందని సరిహద్దులో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా-భూటాన్‌లు సంధి చేసుకుంటే.. మధ్యలో భారత్ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. గురువారం విదేశాంగ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... డోక్లాం ప్రస్తావన తీసుకొచ్చారు. ‘సరిహద్దులో సమస్య సమసిపోయినట్లేనని చెబుతున్నారు. అలాంటప్పుడు చైనా-భూటాన్‌లు ఓ ఏకాభిప్రాయానికి వస్తే భారత్ పరిస్థితి ఏంటి? సమస్యసాత్మక ప్రాంతంలో ఆ రెండు పొరుగు దేశాలు భూ ఒప్పందం చేసుకునే అవకాశాలు లేకపోలేదు కదా!. ఆ దిశగా మీకు ఏమైనా సమాచారం ఉందా?’ అని విదేశాంగ కార్యదర్శిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కార్యదర్శి విజయ్ గోఖలే.. అలాంటి అవకాశం ఉందని చెబుతూనే... పరిస్థితులు మాత్రం అందుకు సానుకూలంగా లేవని చెప్పటం కొసమెరుపు. అయితే ఈ విషయంలో భారత్ వెంటే తాము ఉంటామన్న సంకేతాలను భూటాన్ అందించిందని ఆయన వివరించారు. ఇక రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా స్పందిస్తూ... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. జూలై 2017 తర్వాత ఎలాంటి మోహరింపులు చోటు చేసుకోలేదని చెప్పారు. గత నెలలో శాటిలైట్ ఇమేజ్‌లు అనుమానాస్పద కట్టడాన్ని సూచించినప్పటికీ.. అది తమ సరిహద్దులోనే చేపడుతున్నట్లు చైనా వివరణ ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఈ ప్యానెల్.. సరిహద్దు సమస్యలు, రక్షణ చర్యలపై అధికారులతో భేటీలో సుదీర్ఘంగా చర్చించింది. -
విదేశాంగ కార్యదర్శి జైశంకర్ పదవీవిరమణ
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ పౌర అణు ఒప్పందంతో పాటు ఇండియా–చైనాల మధ్య నెలకొన్న డోక్లామ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఆదివారం పదవీవిరమణ చేశారు. మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న జైశంకర్.. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా కొనసాగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని మోదీ 2015, జనవరి 28న విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించారు. జైశంకర్ స్థానంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడైన 1981 ఐఎఫ్ఎస్ అధికారి విజయ్ కేశవ్ గోఖలే సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో పాటు సీషెల్స్‌కు చెందిన ఓ దీవిలో మిలటరీ సౌకర్యాల అభివృద్ధికి చేసే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడంలో జైశంకర్ కీలకపాత్ర పోషించారు. 1977 ఐఎఫ్ఎస్ అధికారి అయిన జైశంకర్ నాలుగున్నరేళ్ల పాటు చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. 2013లో అమెరికాలో భారత రాయబారిగా ఎం పికైన తర్వాత ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే ఉదంతంపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషి చేశారు. -
అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు
ముందస్తు పదవీ విరమణపై సుజాతా సింగ్ న్యూఢిల్లీ: తన పదవి తొలగింపుపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్ మరో కొత్త విషయం వెల్లడించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ముందస్తు పదవీ విరమణ చేస్తున్నట్టు పేర్కొనడం వల్లే తన దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు. ‘‘విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించాలని ప్రధాని భావిస్టున్నట్టు జనవరి 28న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ నాతో ఫోన్లో చెప్పారు. నేను అదేరోజు సాయంత్రం ప్రధాని సూచన మేరకు ముందస్తు పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా. అయితే ‘ప్రధాని మోదీ సూచనల మేరకు’ అన్న పదాలను తొలగించాల్సిందిగా పీఎంవో అధికారులు కోరారు. కానీ నేను అందుకు నిరాకరించా. ఆ తర్వాత నన్ను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి’’ అని ఆమె చెప్పారు. తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు. -
మోదీ వివరణ ఇవ్వాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసిన తక్షణమే.. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సుజాతాసింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా ఆకస్మికంగా, అర్థంతరంగా తొలగించటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘అత్యంత సీనియర్ అయిన మహిళా విదేశాంగ సేవల అధికారిని మోదీ ప్రభుత్వం ఆకస్మికంగా, అర్థంతరంగా తొలగించటం.. ఆ ప్రభుత్వపు ఉద్దేశం, అది అనుసరిస్తున్న పరిపాలనా విధానాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సుర్జేవాలా గురువారం ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంతకుముందు ఆర్థికశాఖ కార్యదర్శిని కూడా ఇలాగే తొలగించారని.. ఇది మోదీ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు. -
విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్‌పై వేటు