న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసిన తక్షణమే.. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సుజాతాసింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా ఆకస్మికంగా, అర్థంతరంగా తొలగించటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
‘‘అత్యంత సీనియర్ అయిన మహిళా విదేశాంగ సేవల అధికారిని మోదీ ప్రభుత్వం ఆకస్మికంగా, అర్థంతరంగా తొలగించటం.. ఆ ప్రభుత్వపు ఉద్దేశం, అది అనుసరిస్తున్న పరిపాలనా విధానాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సుర్జేవాలా గురువారం ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంతకుముందు ఆర్థికశాఖ కార్యదర్శిని కూడా ఇలాగే తొలగించారని.. ఇది మోదీ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు.
మోదీ వివరణ ఇవ్వాలి: కాంగ్రెస్
Published Fri, Jan 30 2015 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement