‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు | BJP Slams On Pinarayi Vijayan For Blatant Overreach Kerala Appoints Foreign Secretary, See Details Inside | Sakshi
Sakshi News home page

‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు

Published Sat, Jul 20 2024 5:26 PM | Last Updated on Sun, Jul 21 2024 1:08 AM

BJP slams on Pinarayi Vijayan for  blatant overreach Kerala appoints  foreign secretary

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం సొంతంగా విదేశాంగ కార్యదర్శిని నియమించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్‌ కే. వాసుకి అనే ఐఏఎస్‌ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించటంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

‘ఐఏఎస్‌ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించిన కేరళ సీఎం పినరయ విజయన్‌ రాజ్యాంగ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారు. విదేశీ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. రాజ్యాంగబద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరం. సీఎం పినరయి విజయన్‌  కేరళను ప్రత్యేక దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా?’ అని కేరళ బీజేపీ యూనిట్‌ చీఫ్‌ కే.సురేంద్రన్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

 

లేబర్‌ అండ్‌ స్కిల్స్‌ సెక్రటరీ కే. వాసుకికి విదేవి వ్యవహారాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. జూలై 15న ఉత్తర్వులు  జారీ చేసింది. ఈ బాధ్యతల్లో భాగంగా విదేశీ వ్యవహారాలక సంబంధించిన అంశాలను సమన్వయం చేయనున్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ ఎంబసీ, మిషషన్లతో అనుసంధానం చేయటంలో కొత్త నియమించిన విదేశంగా సెక్రటరీ వాసుకికి సహాయం చేయాలని ఢిల్లీలోని కేరళ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేరళ ప్రభుత్వం చేసిన ఈ నియామకంపై  మాజ కెబినెట్‌ సెక్రటరీ కే. ఎం. చంద్రశేఖర్‌ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ సంబంధాలు కేంద్రం చేతిలో ఉంటాయి. దేశంలోని ఏ రాష్ట్రం విదేశాలకు సంబంధించిన సమాచారం, పనులు కావాలన్నా కేంద్ర  విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్తగా నియమించిన విదేశాంగ కార్యదర్శి.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కంటే మించి ఎలాంటి అదనపు పనులను చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి’ అని చంద్రశేఖర్‌ అన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement