ఢిల్లీ: కేరళ ప్రభుత్వం నియమించిన విదేశాంగ కార్యదర్శి వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటంపై బీజేపీ ఎంపీ పీపీ చౌదరీ సోమవారం లోక్‌సభలో విమర్శలు చేశారు.
‘కేరళ రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటం రాజ్యాంగ విరుద్ధం. ఇలా చేయటం కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కేరళ ప్రభుత్వం తమను మాకు ప్రత్యేక దేశంగా భావిస్తోందా?. విదేశాంగ శాఖ సహకారం, సమన్వయం అంటే వివిధ దేశాలతో సంబంధాలు పెంచుకోవటం.
..కేంద్ర జాబితాలో భాగంగా విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు, మిషన్లుతో సత్సంబంధాలతో ఏర్పర్చుకునే విధులు. కేరళ ప్రభుత్వం విదేశాంగ కార్యదర్శిని నియమించుకోవటం కేంద్ర ప్రభుత్వానికి, యూనియన్ జాబితాకు కేటాయించిన అంశాలను ఉల్లఘించినట్లు అవుతుంది’అని విమర్శలు చేశారు.
జూలై 15న కేరళ ప్రభుత్వం లేబర్, స్కిల్స్ డిపార్టుమెంట్ సెక్రటరీకి విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ చీఫ్ తీవ్రంగా ఖండించారు.
చదవండి: ‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment