అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు | PMO wanted her to delete Modi's reference in her letter | Sakshi
Sakshi News home page

అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు

Published Sun, Feb 1 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు

అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు

ముందస్తు పదవీ విరమణపై సుజాతా సింగ్
 
 న్యూఢిల్లీ: తన పదవి తొలగింపుపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్ మరో కొత్త విషయం వెల్లడించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ముందస్తు పదవీ విరమణ చేస్తున్నట్టు పేర్కొనడం వల్లే తన దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు. ‘‘విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించాలని ప్రధాని భావిస్టున్నట్టు జనవరి 28న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ నాతో ఫోన్‌లో చెప్పారు. నేను అదేరోజు సాయంత్రం ప్రధాని సూచన మేరకు ముందస్తు పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా. అయితే ‘ప్రధాని మోదీ సూచనల మేరకు’ అన్న పదాలను తొలగించాల్సిందిగా పీఎంవో అధికారులు కోరారు.

 

కానీ నేను అందుకు నిరాకరించా. ఆ తర్వాత నన్ను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి’’ అని ఆమె చెప్పారు. తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement