Sujata Singh
-
అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు
ముందస్తు పదవీ విరమణపై సుజాతా సింగ్ న్యూఢిల్లీ: తన పదవి తొలగింపుపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్ మరో కొత్త విషయం వెల్లడించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ముందస్తు పదవీ విరమణ చేస్తున్నట్టు పేర్కొనడం వల్లే తన దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు. ‘‘విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించాలని ప్రధాని భావిస్టున్నట్టు జనవరి 28న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ నాతో ఫోన్లో చెప్పారు. నేను అదేరోజు సాయంత్రం ప్రధాని సూచన మేరకు ముందస్తు పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా. అయితే ‘ప్రధాని మోదీ సూచనల మేరకు’ అన్న పదాలను తొలగించాల్సిందిగా పీఎంవో అధికారులు కోరారు. కానీ నేను అందుకు నిరాకరించా. ఆ తర్వాత నన్ను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి’’ అని ఆమె చెప్పారు. తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు. -
జైశంకర్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ కొత్త కార్యదర్శిగా ఎస్.జైశంకర్ గురువారం ఢిల్లీలో సౌత్ బ్లాక్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను నిర్వహించాల్సింది చాలా పెద్ద బాధ్యత అని, దీన్ని తనకు అప్పగించటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముందుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది: సుష్మా సుజాతాసింగ్‌ను పదవి నుంచి ఆకస్మికంగా, అర్థాంతరంగా తొలగించటాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సమర్థించారు. జైశంకర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉందని, ఆ తేదీకన్నా ముందుగా ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ తాము ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందన్నారు. సుజాతాసింగ్ తొలగింపులో రాజకీయ ఉద్దేశమేమీ లేదన్నారు.