prime minister office
-
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
మోదీ ‘బిల్లులు’ ఎవరు చెల్లిస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన జనవరి ఒకటవ తేదీ నుంచి 42 రోజుల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 పర్యటనలు జరిపారు. ఆయన ఈ పర్యటనల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా బీజేపీ ఏర్పాటు చేసిన పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఉదాహరణకు జనవరి 3వ తేదీన పంజాబ్‌లో పర్యటించిన ఆయన జలంధర్‌లో ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను అధికార హోదాలో ప్రారంభించారు. ఆ తర్వాత గురుదాస్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అదే విధంగా జనవరి 5వ తేదీన నరేంద్ర మోదీ ఒడిశాలోని బారిపడకు వెళ్లి అధికార కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అధికార కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలను కలపడం వల్ల బిజీగా ఉండే ప్రధానమంత్రులకు బోలడంత ప్రయాణ సమయం కలసి వస్తుంది. అయితే ప్రయాణ ఖర్చుల సంగతి ఏమిటీ? అధికారిక కార్యక్రమాల కోసం వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బీజేపీకి ఖర్చు కలసి వస్తుందా? బీజేపీయే ఖర్చును భరించడం వల్ల పీఎంవో కార్యాలయానికి ఖర్చు కలసి వస్తుందా? ఇరు వర్గాలు ఖర్చులను పంచుకుంటాయా ? ఖర్చుల విషయంలో అధికారిక కార్యక్రమాలను, ప్రైవేటు లేదా పార్టీ కార్యక్రమాలను పీఎంవో ఎలా వేరు చేస్తోంది ? పీఎంవో కార్యలయానికున్న నిబంధనల ప్రకారం ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడే ఆయన ప్రయాణ ఖర్చులను భరించాలి. పార్టీ కార్యక్రమాలకు హాజరయినప్పుడు పార్టీయే భరించాల్సి ఉంటుంది. రెండు పర్యాయాలు ప్రధాన మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించారు. అయితే ఆయన అధికారిక కార్యక్రమాలను, ప్రైవేటు లేదా పార్టీ కార్యక్రమాలను ఎప్పుడు కలపలేదు. నరేంద్ర మోదీ ఇప్పుడు రెండింటిని కలపారు కనుక ప్రయాణ ఖర్చులను ఎవరు, ఏ మేరకు భరిస్తున్నారన్న ప్రశ్న తలెత్తింది. ఇదే విషయమై మీడియా ఇటీవల పీఎంవో కార్యాలయానికి లేఖలు రాసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫిబ్రవరి 9వ తేదీన ఆయన అస్సాం వెళ్లి, అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఆనవాయితీ ప్రకారం దాన్ని రెండు పర్యటనలుగా పేర్కొనాల్సిన పీఎంవో ఒకే పర్యటనగా పేర్కొంది. ఈ లెక్కన మోదీ జనవరి ఒకటవ తేదీ నుంచి 27 పర్యటనలు చేయగా, పీఎంవో 12 పర్యటనలు చేసినట్లు పేర్కొన్నది. జనవరి 4వ తేదీన నరేంద్ర మోదీ మణిపూర్, అస్సాంలో చేసిన పర్యటన, జనవరి 22వ తేదీన వారణాసిలో చేసిన పర్యటన వివరాలు అసలు లేవు. ఆయన చేసిన 27 పర్యటనల్లో 13 పర్యటనలకు సంబంధించి ఎలాంటి కేటగిరీ లేదు. అధికార పర్యటనకు వెళ్లారా ? ప్రైవేటు పర్యటనకు వెళ్లారా లేదా విదేశీ పర్యటనకు వెళ్లారా? అన్న కేటగిరీలు తప్పనిసరి పేర్కొనాలి. ఖర్చులు ఎవరు భరించాలో తెలియడం కోసమే ఈ విభజన. నరేంద్ర మోదీ 2014 మే నెల నుంచి 2017 ఫిబ్రవరి మధ్యన జరిపిన 128 అనధికార పర్యటనలకు పీఎంవో కార్యాలయం భారత వైమానిక దళానికి 89 లక్షల రూపాయలను చెల్లించిందంటూ ‘హిందుస్థాన్ టైమ్స్’ ఓ వార్తను ప్రచురించడంతో ఆ డబ్బును తాము పీఎంవో కార్యాలయానికి ‘రీయింబర్స్’ చేశామంటూ బీజేపీ వివరణ ఇచ్చింది. అయితే అందుకు ఎలాంటి సాక్ష్యాలు చూపలేదు. అంతేకాకుండా పీఎంవో మార్గదర్శకాల ప్రకారం ప్రధాన మంత్రి అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించే మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయకూడదు. పార్టీ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎలాంటి విమర్శలైన చేయవచ్చు. మొదట్లో మోదీ కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించారు. ఆ తర్వాత ఏ కార్యక్రమంపై ఎక్కడికెళ్లినా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాన మంత్రిగా ఐదేళ్లలో 368 రోజులు విదేశాల్లో పర్యటించగా, రెండో పర్యాయం 284 రోజులు విదేశాల్లో పర్యటించారు. అదే నరేంద్ర మోదీ ఇప్పటికే 565 రోజులు విదేశాల్లో పర్యటించారు. -
శంకుస్థాపనకు ఖర్చెంత?
ఆంధ్రప్రదేశ్ బ్యూరో, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో నిర్వహిస్తుండడంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తాము కోరిన వివరణకు సాధ్యమైనంత త్వరగా స్పందించాలని సూచించింది. ఈ నెల 22న అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై పీఎంఓ దృష్టి సారించింది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం, ప్రచారానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుండటంపై సమగ్ర సమాచారం పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని పీఎంఓ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవైపు లోటు బడ్జెట్లో ఉన్నామంటూనే మరోవైపు రూ.కోట్లు ఖర్చు చే యడాన్ని కూడా పీఎంఓ ప్రస్తావించినట్లు తెలిసింది. శంకుస్థాపనకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర సర్కారు తీరుపై పీఎంఓ అసంతృప్తి రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ-బ్రిక్స్ పోర్టల్‌ను ముందుగా ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిం దో వివరణ ఇవ్వాలని పీఎంఓ పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. సింగపూర్, జపాన్ ప్రధానులను ప్రొటోకాల్ కు విరుద్ధంగా ఆహ్వానించడంపై కూడా పీఎంఓ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. భూమిపూజ పూర్తయినా ఆర్భాటం రాష్ర్ట రాజధాని నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపనకు మధ్య తేడా ఏమిటో వివరించాలని పీఎంఓ ఏపీ సీఎం కార్యాలయాన్ని కోరింది. జూన్ 6న సీఎం గుంటూరు జిల్లా మందడం గ్రామ సమీపంలో రాజధాని నిర్మాణానికి భూ మి పూజ చేశారు. దీని తరువాత నిర్మాణ పను లను ప్రారంభిస్తారు. భూమిపూజ రోజునే ము ఖ్యులను ఆహ్వానిస్తారు. పనుల ప్రారం భం రోజున ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. భూమిపూజ చేసిన నాలుగున్నర నెలల తరువాత సీఎం శంకుస్థాపన పేరుతో హడావిడి చేస్తున్నారు. దీంతో పీఎంవో రెండింటికి మధ్య ఉన్న తేడా వివరించాలని కోరినట్లు తెలిసింది. -
ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ జగన్‌కు లేఖ
-
అందుకే నా దరఖాస్తు తిరస్కరించారు
ముందస్తు పదవీ విరమణపై సుజాతా సింగ్ న్యూఢిల్లీ: తన పదవి తొలగింపుపై విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్ మరో కొత్త విషయం వెల్లడించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ముందస్తు పదవీ విరమణ చేస్తున్నట్టు పేర్కొనడం వల్లే తన దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు. ‘‘విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్‌ను నియమించాలని ప్రధాని భావిస్టున్నట్టు జనవరి 28న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ నాతో ఫోన్లో చెప్పారు. నేను అదేరోజు సాయంత్రం ప్రధాని సూచన మేరకు ముందస్తు పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా. అయితే ‘ప్రధాని మోదీ సూచనల మేరకు’ అన్న పదాలను తొలగించాల్సిందిగా పీఎంవో అధికారులు కోరారు. కానీ నేను అందుకు నిరాకరించా. ఆ తర్వాత నన్ను పదవి నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి’’ అని ఆమె చెప్పారు. తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు. -
మోడీతో గోవా సీఎం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం కలిశారు. ఇది మర్యాదకపూర్వక భేటీ అని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 7 రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో మోడీతో మనోహర్ పారికర్ సమావేశమయ్యారని ట్విటర్ లో పీఎంఓ వెల్లడించింది. మోడీ, పారికర్ కలిసున్న ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని పారికర్ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.