ఫైల్ ఫోటో
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం వంటి కారణాల దృష్ట్యా తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం చాలా అవసరమని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే అంశంలో ఇప్పుడే మాట్లాడటం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించారు.
చదవండి: Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే!
శుక్రవారం ఆయన ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాలిబన్ల నుంచి ఏవిధమైన సహకారం లేకుండా కాబూల్ నుంచి 15 వేల మందిని వెనక్కి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. ‘తాలిబన్లలోని కొందరు నేతలు కొన్ని అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. వాటిని కార్యరూపంలోకి తేవాలంటే వారితో చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు.
చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు
Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్!
Comments
Please login to add a commentAdd a comment