ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా భారత్‌లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆప్ఘనిస్థాన్ దౌత్యవేత్త కార్యాలయం (కాన్సులేట్) తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ నియమితులయ్యారు.
2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తాలిబన్ పాలనను కేంద్రం వ్యతిరేకించింది. భారత్‌లో ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారుల్ని వెనక్కి పంపింది. మూడేళ్ల తర్వాత తాజాగా భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment