సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వానికి సంబంధించిన స్వభావం, విధివిధానాల విషయంలో భారత్‌దేశానికి ఎటువంటి అవగాహన లేదని కేంద్రం గురువారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. కాబూల్ విమానాశ్రయం మూసివేయడం కారణంగా నిలిచిపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు ముసివేసినట్లు తెలిపారు. కాబూల్‌లో ఎయిర్‌పోర్టు సేవలు మొదలైన అనంతరం భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారతీయులను స్వదేశానికి తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. మొదటిసారిగా తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న సంగతి విదితమే.
చదవండి: Afghanistan: అమెరికా సాధించింది శూన్యం, పుతిన్ సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment