evacuation
-
USA: టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్‌ఎమ్ ఫారెస్ట్ సర్వీస్ తెలిపింది. వీటిలో అతి పెద్ద కార్చిచ్చు స్మోక్ హౌస్ క్రీక్ ఫైర్ లక్ష ఎకరాలు, గ్రేప్ వైన్ క్రీక్ ఫైర్ 30 వేల ఎకరాలు, విండీ డ్యూసీ ఫైర్ 8 వేల ఎకరాలను దహించి వేసింది. కార్చిచ్చు బీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను తరలిస్తున్నారు. తూర్పు టెక్సాస్, ద మిల్స్ క్రీక్, సాన్‌జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. I have a prayer request for y’all. The Texas Panhandle is on fire with zero containment. I don’t live in the panhandle but Texas is the home I live in currently and been in. Please pray for all in the path of this. Pray for Texas 🙏♥️ pic.twitter.com/U9R5Syb2kE — Rachel Wilson (@RachelWilson94) February 28, 2024 ఇదీ చదవండి.. మాలిలో ఘోర బస్సు ప్రమాదం -
‘గాజాలోని భారతీయుల తరలింపు.. ప్రస్తుతం కష్టమే’
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం బుధవారం 13వ రోజుకు చేరింది. ఇరు వర్గాల పోరులో మరణించిన వారి సంఖ్య అయిదు వేలకు చేరువైంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 3,478 మంది పాలస్తీనియన్లు మరణించారని, 12,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. మరో 4,562 మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది బందీలు ఇప్పటికీ హమాస్ ఆధీనంలోనే ఉన్నారు. తరలింపు కష్టం తాజాగా గాజాలోని భారతీయుల తరలింపుపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ స్పందించింది. గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారని, ప్రస్తుతం వారిని తరలించే పరిస్థితి లేదని ఏఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. గాజాలో పరిస్థితి కారణంగా పౌరుల తరలింపు కష్టంగా మారిందని.. అయితే అవకాశం దొరికితే వారిని స్వదేశానికి తీసుకొస్తామని చెప్పారు. నలుగురిలో ఒకరు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొన్నారు. భారతీయులెవరూ మరణించలేదు గాజాలో పౌరుల మరణాలు, మానవతా పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతోందని అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన.. ఇజ్రాయెల్- గాజా పోరులో ఇప్పటి వరకు ఏ ఒక్క భారతీయుడు ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు.కే రళకు చెందిన ఓ మహిళా కేర్‌టేకర్, తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలిపారు. చదవండి: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్ నేరుగా చర్చించాలి ‘ఆపరేషన్ అజయ్’ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయిదు విమానాల్లో1,200 మందిని ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు తరలించినట్లు బాగ్చీ వెల్లడించారు. వీరిలో 18 మంది నేపాలీ పౌరులు కూడా ఉన్నారు. 2002-23 మధ్యకాలంలో పాలస్తీనాకు భారత్ దాదాపు 30 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాలస్తీనాపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుందన్నారు. ఈ సమస్యపై పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోందని చెప్పారు. దారుణంగా గాజా పరిస్థితి హమాస్ మిలిటెంట్లు, వారి కార్యకాలపాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజా ప్రాంతంలో పరిస్థితులు ఆధ్వానంగా మారాయి. ఆహారం, నీరు, కరెంట్ కోతలతో పాలస్తీనియన్లు అల్లాడుతున్నారు. వేలాది నిరాశ్రయులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఆదేశాలతో లక్షలాది మంది ఉత్తర గాజా నుంచి తరలివెళ్తున్నారు. -
235 మందితో రెండో విమానం రాక
న్యూఢిల్లీ: సంక్షుభిత ఇజ్రాయెల్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’ పేరిట భారత సర్కార్ మొదలుపెట్టిన పౌరుల తరలింపు కార్యక్రమంలో భాగంగా శనివారం 235 మందితో ఇజ్రాయెల్ నుంచి బయల్దేరిన విమానం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీకి ఈ విమానం చేరుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ శనివారం వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పౌరులు చేరుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. టెల్ అవీవ్ నగరం నుంచి తొలి విమానం వచి్చన సంగతి తెల్సిందే. ఎయిర్ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆపరేషన్ కింద తొలి విమానంలో 200కుపైగా భారతీయులు స్వదేశానికి రాగలిగారు. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. ‘ మోదీ సర్కార్ తక్షణం స్పందించి తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడం పట్ల వీరంతా సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి ట్వీట్‌చేశారు. దీంతో శనివారంనాటికి మొత్తంగా 400కుపైగా భారత్‌కు చేరుకున్నారు. మరో రెండు విమానాలూ వస్తున్నాయ్ టెల్ అవీవ్ స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదింటికి, రాత్రి 11 గంటలకు మరో రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కు బయల్దేరతాయని టెల్ అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. సాయంత్రం విమానంలో 230కిపైగా, రాత్రి విమానంలో 330కిపైగా ప్రయాణికులు స్వదేశానికి రానున్నారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవి బయల్దేరతాయి. సంబంధిత వివరాలను ఎంబసీ ట్వీట్‌చేసింది. విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులు, వజ్రాల వ్యాపారులు సహా పలు రంగాలకు చెందిన దాదాపు 18,000 మంది భారతీయపౌరులు ఇజ్రాయెల్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సరీ్వస్‌లు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఆదివారంకల్లా రెండూ ఢిల్లీకి వస్తాయి. -
ఇంఫాల్ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు..
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, ఇతర పౌరులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తోంది. తొలి విడతగా సోమవారం మధ్యాహ్నం 72 మంది విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి (6ఈ–3165 విమానంలో) చేరుకున్నారు. మొత్తం 130 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు వివరాలు సేకరించిన అధికారులు తరలింపు చర్యలను వేగవంతం చేశారు. రిజర్వేషన్ల అల్లర్లతో మణిపూర్ అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులను సురక్షితంగా రప్పించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు మణిపూర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న 72 మందికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, పలువురు పోలీసు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. తమను మణిపూర్ నుండి సురక్షితంగా రప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. మణిపూర్‌లో ఉన్న మిగతా విద్యార్థుల్లో కొందరు సోమవారం రాత్రి, మరికొందరు మంగళవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. విద్యార్థుల తరలింపు వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. విద్యార్థులను హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా అండగా ఉంటాంమణిపూర్‌లోని ఎన్ఐటీ పక్కనే జరిగిన బాంబు దాడులతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడి విద్యార్థులు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా, భరోసాగా ఉంటుందన్నారు. ఇప్పట్లో తిరిగి వెళ్లే పరిస్థితి లేదు.. నాతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు అమ్మాయిలం రాష్ట్రానికి చేరుకున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పట్లో తిరిగి వెళ్లి చదువుకునే పరిస్థితులు లేవు. ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారిన తర్వాతే తిరిగి వెళతాం. – హరిణి, బీటెక్ విద్యార్థిని, మహబూబ్‌నగర్ మాకు సమీపంలోనే బాంబు దాడులు అల్లర్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. మాకు సమీపంలో బాంబు దాడులు కూడా జరిగాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాం. తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికారులతో సంప్రదింపులు ప్రారంభించిన తర్వాత ఆందోళన తగ్గింది. – వంశీ, బీటెక్ విద్యార్థి, జనగామ ప్రభుత్వం అమ్మా, నాన్నలా స్పందించింది తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం ఓ అమ్మ, నాన్నలా స్పందించి మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా చేర్చినందుకు ధన్యవాదాలు. – సాయికిరణ్, బీటెక్ విద్యార్థి, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!
సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రోజు రోజుకి హింసాత్మకంగా మారుతున్న సంగతి తెలసిందే. ఇప్పటి వరకు ఈ పోరులో 300 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినా పట్టించుకోకుండా ఇరు పక్షాలు ఘర్షణ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న మూడు వేల మందికి పైగా ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్కడ ఉన్న వారిని భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూడాన్‌లోని భారతీయుల భద్రత పరిస్థితిపై అధికారులతో వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సూడాన్‌లోని భారత రాయబారి రవీంద్ర ప్రసాద్ జైస్వాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూడాన్‌లోని చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారిచడమే గాక క్షేత్ర స్థాయిలో అక్కడ పరిస్థితులకు సంబంధించిన నివేదికను మోదీ సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే అధికారులను అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ..పౌరుల తరలింపుకి సంబంధించిన అన్ని రకాల సహాయాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పొరుగు దేశాల తోపాటు సూడాన్‌లో ఉన్న పౌరులతో సంభాషణలు చేయడం వంటి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో జైశంకర్ చర్చలు ఈ రోజు తెల్లవారుజామున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సూడాన్‌లోని అధ్వాన్నమైన పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో చర్చించారు. కాల్పుల విరమణ కోసం దౌత్యం జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సూడాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అక్కడ చిక్కుకున్న భారతీయల భద్రత, తరలింపుపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అదీగాక అక్కడ ఉన్న భారతీయ పౌరులు ఉన్నచోటునే ఉండాలని ఖార్టుమ్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇదిలా ఉండగా, అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తరలించేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్న విమానాశ్రయలే రంణరంగాలుగా మారిపోవడంతో అధి సాధ్యం కాకవపోవచ్చని తెలుస్తోంది. కాగా, ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకారం.. సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయారని, అందులో 1200 మంది సూడాన్‌లోనే 150 ఏళ్లుగా నివశిస్తున్నట్లు సమాచారం. (చదవండి: ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై అమిత్ షా ఆరా) -
పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ముందుగానే స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు. #WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4 — ANI (@ANI) August 28, 2022 -
Russia-Ukraine War: కీవ్ పరిసరాల్లో భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల్లో గురువారం భీకర పోరు కొనసాగింది. దీంతో సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన ముసుగులో రష్యా తన సేనలను పునరేకీకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డోన్బాస్ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేస్తోందని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు మారియుపోల్ నుంచి ప్రజలను తరలించేందుకు పలు బస్సులను ఆ నగరానికి పంపారు. నగరం నుంచి పౌర తరలింపు కోసం పరిమిత కాల్పుల విరమణకు రష్యా అంగీకరించింది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య మరోదఫా ఆన్లైన్ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే నగరం నుంచి పలువురు వలస పోవడంతో నగర జనాభా 4.3 లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వీరిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 బస్సులను ఇక్కడికి పంపామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. చెర్నోబిల్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా వెనక్కు తగ్గలేదు ముందుగా అంగీకరించినట్లు రష్యా వెనక్కు తగ్గడం లేదని నాటో జనరల్ స్టోల్టెన్‌బర్గ్ సైతం ఆరోపించారు. బలగాల ఉపసంహరణ ముసుగులో రష్యా తన బలగాలకు సరఫరాలందించడం, కావాల్సిన ప్రాంతాల్లో మోహరించడం చేస్తోందన్నారు. ఒకపక్క డోన్బాస్‌పై దాడికి దిగుతూనే మరోపక్క కీవ్ తదితర నగరాలపై రష్యా ఒత్తిడి పెంచుతోందని నాటో ఆరోపించింది. రష్యా చాలా పరిమితంగా బలగాల తరలింపు చేపట్టిందని బ్రిటన్ కూడా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి రష్యా తప్పు చేసిందన్న యూఎస్ వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 1, 34, 500 మందిని సైన్యంలో చేర్చుకునే ఆదేశాలపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. వ్యూహాత్మక తప్పిదం ఉక్రెయిన్‌పై దాడికి దిగాలనుకోవడం పుతిన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని, దీని వల్ల రష్యా బలహీనపడిందని, ప్రపంచదేశాల మధ్య ఏకాకిగా మారిందని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. రష్యా మిలటరీ పుతిన్‌ను తప్పుదోవ పట్టించి యుద్ధానికి దించిందని, దీనివల్ల ప్రస్తుతం పుతిన్‌కు మిలటరీ అగ్రనాయకులకు మధ్య పొరపచ్చాలు వచ్చాయని వైట్‌హౌస్ ప్రతినిధి కేట్బీడింగ్ఫీల్డ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలను, ఉక్రెయిన్‌కు సాయాన్ని అమెరికా కొనసాగిస్తుందన్నారు. రష్యాలో నాయకత్వ మార్పును బైడెన్ కోరుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమవుతారు. ఎస్400 మిసైల్ వ్యవస్థలోని భాగాలతో పాటు పలు మిలటరీ హార్డ్‌వేర్‌ను సకాలంలో అందించాలని లావ్రోవ్ను భారత్ కోరనుందని సమాచారం. తొలినుంచి ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది. -
రష్యా రాక్షస విధ్వంసం..చిన్నారులు, మహిళల పై కాల్పుల మోత
Russian Forces Desroy Seven Civilians: ఉక్రెయిన్ రష్యా మధ్య గత 18 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు రష్యా ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు మానవతా సాయం దృష్ట్యా నివాసితులను, విదేశీయులను తరలించేంత వరకు యద్దానికి విరమణ ప్రకటించింది. తొలుత రష్యా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదు కూడా. రాను రాను మరింత విజృంభించింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో విద్యార్థులను, విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేంత వరకు యుద్ధానికి బ్రేక్ అంటూ తన జౌదార్యం అనే ముసుగు వేసుకుంది. కానీ ఆ తర్వాత రష్యా తన తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. అంతేకాదు రష్యా ఉక్రెయిన్ దురాక్రమణలో భాగంగా అనేక దుశ్చర్యలకు పాల్పడింది. నివాసితుల గృహాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. ఇక అంతటి ఆగకుండా ఇప్పుడు మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా వారిపై కర్కశంగా దాడులు చేస్తుంది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కి సుమారు 36 కి.మీ దూరంలో ఉన్న పెరెమోగా అనే చిన్న గ్రామంలోని ప్రజలను తరలిస్తున్న శరణార్థుల కాన్వాయ్ పై రష్యా బహిరంగంగా కాల్పుల జరిపింది. పైగా ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారని, వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది. నిజానికి పెరెమెగా అంటే ఉక్రెనియల్లో విజయం అని అర్థం. రష్యన్ యుద్ధ ట్యాంకులు ఈ గ్రామం మీదుకు రాజధాని కైవ్ వైపుకు దూసుకుపోతున్నాయి. ఆ క్రమంలోనే రష్యా ఈ క్రూరమైన చర్యలకు పాల్పడిందని పేర్కొంది. మిగిలిన నిర్వాసిత ప్రజలను బలవంతంగా తమ గ్రామానికి తిరిగి తీసుకువచ్చిందిని, పైగా ఎంతమంది ఈ ఘటనలో గాయపడ్డారో కూడా తెలియలేదని వెల్లడించింది. ప్రస్తుతం తాము వారి గురించి తెలుసుకోవడం, మానవతాసాయం అందించడం వంటివి దాదాపు అసాధ్యం అని ఆవేదనగా తెలిపింది.అంతేకాదు అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోని రష్యా యుద్ధ నేరానికి పాల్పడిందని ఆక్రోశించింది. (చదవండి: రష్యాను మరింత రెచ్చగొడుతున్న జెలెన్స్కీ!) -
'చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం: యూనిసెఫ్
హోని: రష్యా దాడి మొదలయ్యాక ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి సరిహద్దులు దాటినట్టుగా యూనిసెఫ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘‘ఈ స్థాయిలో చిన్నారులు దేశం విడిచి పెట్టడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం’’ అని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా దేశం విడిచిపెట్టి వెళితే వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. తమ దేశంలో ఉన్న ప్రతీ ఎనిమిది మంది చిన్నారుల్లో ఒకరు శరణార్థి అని మోల్దోవా ప్రధానమంత్రి గవిరిలి చెప్పారు. మాజీ మిస్ ఉక్రెయిన్ వెరొనికా దిద్సెంకో కీవ్ నుంచి ఏడేళ్ల వయసున్న తన కుమారుడితో కలిసి నానా కష్టాలు పడి అమెరికాలోని లాస్ఏంజెల్స్ చేరుకున్నారు. కీవ్ నుంచి వస్తూ ఉంటే బాంబుల మోతలు వినిపించని ప్రాంతమే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతో పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని, అయితే వారికి మరిన్ని ఆయుధాలు కావాలని ఆమె చెప్పారు. -
ఓవైపు కాల్పుల మోత.. వణికించే చలిలో వలసలు
కీవ్: యుద్ధంతో కుంగిపోతున్న ఉక్రెయిన్‌లో ఓవైపు భారీగా రష్యా కాల్పుల మోత, మరోవైపు పెద్ద సంఖ్యలో పౌరుల తరలింపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా పొట్ట చేతపట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లారు. వీరిలో సగానికి సగం చిన్నారులేనని సమాచారం. వలస వెళ్లిన వారిలో చాలామంది పోలండ్ బాట పట్టారు. సమీలో బుధవారం ప్రకటించిన 12 గంటల కాల్పుల విరమణ సమయంలో మానవీయ కారిడార్ల గుండా గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు నగరం వదిలి వెళ్లినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మంగళవారం 1700 మంది భారతీయ, ఇతర దేశాల స్టూడెంట్లతో పాటు దాదాపు 5000 మంది నగరం వీడినట్టు సమాచారం. ఇతర నగరాల్లో మాత్రం రష్యా కాల్పులు, ఆ దేశానికి దారితీసే కారిడార్లను ఉక్రెయిన్ అంగీకరించపోవడంతో తరలింపులు సాధ్యపడలేదు. మారియుపోల్‌లో నిత్యావసరాలతో వస్తున్న ఉక్రెయిన్ హ్యుమానిటేరియన్ వాహనాలపై రష్యా సేనలు కాల్పులకు దిగడంతో అక్కడ కూడా తరలింపుకు విఘాతం కలిగినట్టు సమాచారం. బెలారస్ రాజధాని మిన్స్క్ ఎయిర్ బేస్‌లో రష్యా భారీ సంఖ్యలో హెలికాప్టర్లను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఇవన్నీ ఉక్రెయిన్‌పై మరింత భారీ దాడి వ్యూహంలో భాగం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా అల్లాడుతోంది. పరిస్థితి చేజారుతుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల నుంచి డాలర్స్ విత్డ్రాయల్స్పై రష్యా సెంట్రల్ బ్యాంకు పరిమితి విధించింది. ఇవన్నీ జనాల్లో భయాందోళనలను మరింతగా పెంచుతున్నాయి. దాంతో వీలైనంత వరకూ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. దాంతో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి. భీకర దాడులు పట్టణాలు, నగరాలను లక్ష్యం చేసుకుని రష్యా చేస్తున్న దాడులు బుధవారం మరింత పదునెక్కాయి. భారీగా వచ్చిపడుతున్న బాంబులు, క్షిపణులతో రాజధాని కీవ్, ఖర్కీవ్, మారియుపోల్, మల్యిన్, చుహుయివ్, ఒడెసా, చెర్నిహివ్, మైకోలెవ్ అల్లాడుతున్నాయి. ఖర్కీవ్, జైటోమిర్, మాలిన్ నగరాల్లోనైతే నివాస ప్రాంతాలపై రష్యా విమానాలు విచక్షణారహితంగా దాడులకు దిగాయి. వీటిలోనూ భారీగా ప్రాణనష్టం జరిగినట్టు చెబుతున్నారు. కీవ్ శివార్లలోని ఇర్పిన్, బుచా, హోస్టోమెల్, వ్యషోరోడ్, బోరోడియాంక తదితర చోట్ల పరిస్థితి దయనీయంగా ఉందని సమాచారం. తిండి, తాగునీరు, కరెంటు, మందులు తదితరాల కొరతతో ఎక్కడ చూసినా జనం అష్టకష్టాలు పడుతున్నారు. విపరీతమైన చలి పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. మారియుపోల్ తదితర నగరాల్లో ఏ వీధిలో చూసినా దిక్కూమొక్కూ లేకుండా పడున్న శవాలే కన్పిస్తున్నాయి. వీలైనప్పుడల్లా పెద్ద సంఖ్యలో శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. బాంబుల మోత ఏ కొంచెంసేపు ఆగినా నిత్యావసరాల కోసం దుకాణాలపై జనం దాడులకు దిగుతున్నారు. కనిపించిన సరుకులనల్లా ఖాళీ చేస్తున్నారు. ఇది పోట్లాటలకూ దారితీస్తోంది. రాజధాని కీవ్‌లో జనం చాలావరకు సబ్వే స్టేషన్లలోనే తలదాచుకుంటూ గడుపుతున్నారు. నగరంపై రష్యా భీకరంగా దాడులను కొనసాగిస్తోంది. నగరంలోని మానసిక చికిత్సాలయంలో 200 మందికి పైగా రోగులు నిస్సహాయంగా పడి ఉన్నారు. బుధవారం నాటి కాల్పుల్లో పౌరులు భారీగా మరణించినట్టు ఉక్రెయిన్ చెప్తోంది. రష్యా సైనికులూ, వెళ్లిపోండి: జెలెన్స్కీ రష్యా సైనికులు ఇప్పటికైనా యుద్ధం ఆపి వెనుదిరగాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. ‘‘మా పోరాట పటిమను రెండు వారాలుగా చూస్తున్నారుగా. మేం లొంగే ప్రసక్తే లేదు. మా భూభాగమంతటినీ తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం. వెళ్లిపోయారంటే ప్రాణాలు దక్కించుకున్న వాళ్లవుతారు’’ అని రష్యన్ భాషలో వారికి సూచించారు. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తమకు వెంటనే యుద్ధ విమానాలు పంపాల్సిందిగా పశ్చిమ దేశాలను మరోసారి కోరారు. జెలెన్స్కీ పిలుపునకు పోలండ్ స్పందించింది. ఉక్రెయిన్‌కు మిగ్ ఫైటర్ జెట్లను పంపేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని మాటెజ్ మొరావికి ప్రకటించారు. ఆస్పత్రి పై బాంబుల వర్షం మారియుపోల్‌లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా సైన్యాలు బాంబుల వర్షం కురిపించాయి. దాడిలో ఆస్పత్రి దాదాపుగా నేలమట్టమైందని సిటీ కౌన్సిల్ చెప్పింది. ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమంది. దీన్ని దారుణమైన అకృత్యంగా జెలెన్స్కీ అభివర్ణించారు. పసిపిల్లలతో పాటు చాలామంది శిథిలాల కింద చిక్కుబడ్డారని ఆవేదన వెలిబుచ్చారు. దాడిలో ఆస్పత్రి శిథిలాల దిబ్బగా మారిన వైనానికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. రష్యా సైనికుల అవస్థలు ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా రష్యా సైనికులను చంపేసినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. వందలాది యుద్ధ ట్యాంకులు, 1,000కి పైగా సాయుధ వాహనాలు, 50 దాకా యుద్ధ విమానాలు, సుమారు 100 హెలికాప్టర్లు తదితరాలను ధ్వంసం చేశామని ఆ దేశ సైన్యం వెల్లడించింది. తమ పౌరులను భారీ సంఖ్యలో రష్యా సేనలు పొట్టన పెట్టుకున్నాయని ఆరోపించింది. రష్యా ఖండిస్తున్నా, ఈ రెండు వారాల్లో దాని సైన్యానికి ఇప్పటిదాకా భారీ నష్టమే జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలున్ని గద్దెనెక్కించాలన్న లక్ష్యానికి ఇప్పటికీ రష్యా ఇంకా చాలా దూరంలోనే ఉంది. పైగా కీవ్ దేవుడెరుగు, ఖెర్సన్ మినహా ఏ ప్రధాన నగరమూ ఇప్పటిదాకా రష్యా అధీనంలోకి రాలేదు. ఉక్రెయిన్ చెబుతున్న స్థాయిలో కాకున్నా రష్యాకు సైనిక నష్టం వేలల్లోనే జరిగి ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ సైనికులు తమ పౌరులతోకలిసి రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. దాంతో ముందుకు సాగడం వారికి చాలా కష్టంగా మారుతోంది. ఉక్రెయిన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటనను పుతిన్ అంచనా వేయలేకపోయారంటున్నారు. పైగా సైన్యానికి ఆహారం, ఇంధన తదితర సరఫరాలు సరిగా అందడం లేదని తెలుస్తోంది. దీనికి వణికించే చలి తోడై వారి పరిస్థితి దుర్భరంగా ఉందంటున్నారు. అనుకున్నంత త్వరగా లక్ష్యం సాధించలేకపోయానన్న నిరాశలో ఉక్రెయిన్‌పై దాడులను పుతిన్ మరింత తీవ్రతరం చేయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రష్యా సైనికులు యుద్ధం చేయడానికి అంత సుముఖంగా లేరన్న సంకేతాలు ఆ దేశ నాయకత్వాన్ని కలవరపరుస్తున్నాయి (చదవండి: రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు..!) -
Ukraine Crisis: సేఫ్ కారిడార్లు ఎక్కడ? భారత్ అసంతృప్తి
ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నాం 12గం. 40ని. నుంచి విరమణ మొదలు కానుంది. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, మరియూపోల్, సుమీ, చెర్నీగోవ్ నగరాల నుంచి తరలింపునకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే.. మిగతా చోట్ల మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సేఫ్ కారిడార్లపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను తరలించే ప్రక్రియ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్.. ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. ఇందుకు పూర్తి సహకారం ఉంటుందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సైతం ప్రధాని మోదీకి తెలిపాయి. అయినప్పటికీ తరలింపు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడున్న వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అన్ని శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. సామరస్యంగా శాంతిపూర్వక చర్చలతో ఈ సంక్షోభం ముగియాలని భారత్ భావిస్తోంది. భారతీయుల తరలింపు సురక్షితంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. అని యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి, భద్రతా మండలిలో ప్రసంగించారు. సేఫ్‌కారిడార్ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఇరువైపు సానుకూల స్పందన వచ్చినట్లే అనిపిస్తోందని, కానీ, అది కార్యరూపం దాల్చట్లేదని ఆందోళన వ్యక్తం చేశారాయన. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రష్యా మరోసారి కాల్పుల విరమణ ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయినా ఇవాళ(మంగళవారం) సుమీ నుంచి భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల పౌరుల తరలింపు సురక్షితంగా పూర్తవుతుందేమో చూడాలి. సంబంధిత వార్త: సుమీ నుంచి తరలింపు.. అసలు సమస్యలు ఇవే! -
జెలెన్స్కీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు
ఉక్రెయిన్ సంక్షోభ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాలపాటు వీళ్ల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. రష్యాతో ఒకవైపు పోరు కొనసాగిస్తున్నప్పటికీ.. నేరుగా శాంతి చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్స్కీని ప్రధాని మోదీ అభినందించారు. అంతేకాదు భారతీయుల తరలింపు విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో.. భారత్‌లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాలని, అందుకు సహకరించాలని మోదీ, జెలెన్స్కీని కోరారు. ప్రత్యేకించి సుమీ రీజియన్ నుంచి తరలింపు క్లిష్టంగా మారిన తరుణంలో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించాలని మోదీ, జెలెన్స్కీని కోరినట్లు తెలుస్తోంది. -
ఉక్రెయిన్.. భారతీయుల తరలింపులో సమస్యలు!
ఊహించని రీతిలో ఉక్రెయిన్ యుద్ధానికి విరామం ప్రకటించి.. పౌరుల తరలింపునకు సహకరిస్తోంది రష్యా సైన్యం. ఈ క్రమంలో భారత్ పౌరులను సురక్షితంగా పంపించేందుకు సహకరిస్తామని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. అయితే చావు ఎటు నుంచి ముంచుకొస్తుందో అనే భయంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇబ్బందులు కొన్ని.. తరలింపు ప్రక్రియకు అడ్డం పడుతున్నాయి. ఉక్రెయిన్ తూర్పు భాగంలో సుమీ స్టేట్ యూనివర్సిటీలో వందలమంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో రష్యన్ బలగాల దాడులతో భీత వాతావరణం నెలకొంది. విద్యార్థులంతా చెల్లాచెదురై రెండో ప్రపంచ యుద్ధ బంకర్లో దాక్కుండిపోయారు. తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. సాయం కోసం భారత ఎంబసీని ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది అక్కడ!. రష్యా సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమీ ప్రాంతం. అందుకే యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సంకేతాలు ముందుగానే తెలియడంతో కొంతమంది నీళ్లు, ఆహారం ముందుగా తెచ్చి పెట్టుకున్నారు. కానీ, క్రమక్రమంగా కొరత మొదలైంది. దీనికి తోడు రష్యా దాడుల్లో వాటర్ పైప్ లైన్లు, పవర్ సిస్టమ్ దెబ్బతిని.. నీళ్లు, కరెంట్ లేక అసలు కష్టాలు మొదలయ్యాయి. సుమీలో యుద్ధ భయానికి దాక్కున్న చాలామందికి తిండి, నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఉన్నట్లుండి మంచు కురియడంతో విద్యార్థుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. మంచును కరిగించి ఆ నీటితోనే బాటిళ్లను నింపేసుకుంటున్నారు. Students in Sumy, north east of Ukraine, have started filling bottles with snow to melt and drink. On Thursday night, water station was bombarded by Russian forces cutting all water supplies, said Anuj, student in Sumy State University, who shot the video @scroll_in pic.twitter.com/NYys6PBHVl — Tabassum (@tabassum_b) March 4, 2022 దారుల్లేక.. యుద్ధం నిలిచిపోయి.. పౌరులను వెళ్లిపోవాలంటూ రష్యా బలగాలు ప్రకటించడం కొంత ఊరట ఇచ్చేదే. కానీ, సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ రైలు మార్గం ఒక్కటే పెద్ద దారి. కానీ, రష్యా దాడులతో రైల్వే ట్రాక్స్ దారుణంగా దెబ్బ తిన్నాయి. గగన తలం ఆల్రెడీ మూసుకుపోయింది. మరోవైపు రోడ్ల మీద రష్యన్ చెక్పాయింట్లు ఎక్కడికక్కడే వెలిశాయి. ఒకదగ్గర కానున్నా.. మరో దగ్గర ముప్పు మీద పడిపోతుందేమోనని విద్యార్థులు హడలి పోతున్నారు. సన్నగిల్లుతున్న ఆశలు! ఖార్కీవ్, సుమీలో కలిపి మొత్తం వెయ్యి మంది భారతీయ విద్యార్థులు ఉన్నారనేది ఒక అంచనా. మార్చి 2వ తేదీ వరకు సుమీకి 180కి.మీ.ల దూరంలోని ఖార్కీవ్లో విద్యార్థుల పరిస్థితి భయానకంగానే ఉండింది. అయితే కర్ణాటక విద్యార్థి నవీన్ మరణంతో.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత ఎంబసీ జోక్యంతో భారతీయ విద్యార్థులు సురక్షిత మార్గాల్లో సరిహద్దులకు సురక్షితంగా చేరారు. దీంతో సురక్షితంగా తామూ బయటపడతామని సుమీ విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, దారులన్నీ మూసుకుపోవడంతో భయాందోళనకు లోనవుతున్నారు. ఈ పదిరోజుల్లో కొందరు విద్యార్థులు రిస్క్ చేశారు. ఒకవైపు రష్యా సరిహద్దు, మరోవైపు బెలారస్ సరిహద్దు. అందుకే సుమీకి 170 కిలోమీటర్ల దూరంలోని పోల్తావా వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తుపాకులతో బెదిరించి మరీ సైన్యాలు వాళ్లను వెనక్కి పంపించాయి. ఇంటి నుంచి ఫోన్‌కాల్ వచ్చినప్పుడల్లా.. ఇదే తమ ఆఖరి ఫోన్‌కాల్ అనుకుంటున్న విద్యార్థులు ఎందరో. వాళ్లందరినీ సురక్షితంగా ఇంటికి చేరుస్తామని భారత ఎంబసీ ధైర్యం చెబుతోంది. జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పటడుగు వేయకండని, ధైర్యంగా ఉండాలని చెప్తూ వాళ్లను తరలించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. విద్యార్థులంతా సురక్షితంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు అంతా కోరుకుంటున్నారు. Exploring all possible mechanisms to evacuate 🇮🇳n citizens in Sumy, safely & securely. Discussed evacuation & identification of exit routes with all interlocuters including Red Cross. Control room will continue to be active until all our citizens are evacuated. Be Safe Be Strong — India in Ukraine (@IndiainUkraine) March 4, 2022 -
ఆ దేశాలతో చర్చలు.. ఉక్రెయిన్ నుంచి మన వాళ్లను రప్పించేందుకు ప్రత్యేక ప్లాన్
ఉక్రెయిన్‌లో యుద్ధరంగంలో చిక్కుకుపోయిన 16 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్లతో పాటు రోమేనియా ప్రభుత్వాలతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు ప్రారంభించారు. ఉక్రెయిల్‌లో ప్రస్తుతం రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే సాగుతున్నాయి. యూరప్ దేశాలపైవు ఉన్న పశ్చిమ ప్రాంతంలో దాడులు తక్కువగా ఉన్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాలకు పాస్‌పోర్ట్ ఇతర డాక్యుమెంట్లతో రావాలంటూ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం సూచించింది. ఇందుకు అనుగుణంగా ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులో ఉన్న హంగరీ, రోమేనియా, స్లోవేకియా, పోలాండ్లతో చర్చలు ప్రారంభించింది. సహరిస్తాం ఉక్రెయిన్ నంచి భారతీయుల తరలింపుకు సంబంధించి ఆ దేశ మంత్రి ఇవాన్ కుర్కోవ్తో జైశంకర్ మాట్లాడారు. తమ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు పూర్తి సహయసహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. అయితే నో ఫ్లై జోన్ ఉన్నందున దేశ సరిహద్దుల నుంచి తరలింపును ఇండియా చూసుకోవాల్సి ఉంది. డెబ్రికెన్ కీలకం ఉక్రెయిన్ సరిహద్దుల వరకు వచ్చిన ఇండియన్లను తరలించే విషయంలో హంగరీ ప్రభుత్వ సాయం కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి పీటర్ షిజార్టో చర్చలు జరపగా ఆ దేశంలోని డెబ్రికెన్ ప్రాంతం నుంచి భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామంటూ హమీ పొందారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్ తర్వాత ఆ దేశంలో రెండో పెద్ద నగరం డెబ్రికెన్. చర్చలు పూర్తి స్థాయిలో ఫలించి ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైతే ఈ నగరం కీలకం కానుంది. Reached out to my friend FM Péter Szijjártó of Hungary on the Ukraine evacuation. He has promised full cooperation to facilitate evacuation from Debrecen. Thank him for his understanding. — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 24, 2022 మేమున్నాం భారతీయుల తరలింపు విషయంలో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు యూరోపియన్ యూనియన్‌తో కూడా మన దేశ మంత్రులు, అధికారులు మాట్లాడుతున్నారు. తమ దేశం మీదుగా ఇండియన్ల తరలింపుకు అడ్డు చెప్పబోమని స్లోవేకియా హామీ ఇచ్చింది. కాగా సాధ్యమైనంత త్వరగా సుళువుగా చేపట్టాల్సిన తరలింపు ప్రక్రియపై ఈయూతో మన అధికారులు చర్చిస్తున్నారు. కొలిక్కి రావాలి ఉక్రెయిన్ విస్త్రీర్ణం విశాలంగా ఉండటంతో అనేక దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి పశ్చిమ దిశగా ఉన్న ఇతర దేశాలకు దగ్గరగా ఉన్నవి ఎన్ని ? ఇందులో ఎయిర్లిఫ్ట్కి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఏవీ అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. Received a call from EU HRVP @JosepBorrellF. Discussed the grave situation in Ukraine and how India could contribute to de-escalation efforts. — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 24, 2022 ఎంత కాలం తరలింపకు సంబంధించి ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు ఎక్కడి ఎలా రావాలనే సూచనలు చేయడంతో పాటు.. వచ్చిన వారిని వెంటనే తీసుకువచ్చేలా లాజిస్టిక్స్ సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు అనేక దేశాలతో చర్చలు జరిపి వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో స్పష్టత వచ్చాకా తరలింపు ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 16 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు -
ఆపరేషన్ సుకూన్, రాహత్ బాటలో మరో సాహసం! వాట్ నెక్ట్స్ ?
యుద్ధ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలతో కలిసి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. నిమిషనిమిషానికి మారిపోయే పరిస్థితుల నడుమ లిప్త కాలంలో నిర్ణయాలు తీసుకుంటూ ఎందరి ప్రాణాలనో కాపాడింది. మరోసారి అలాంటి అవసరం ఏర్పడింది... 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం సమయంలో ఎయిర్‌లిఫ్ట్ చేయగా ఆ తర్వాత కాలంలో అనేక ఆపరేషన్లు చేపట్టింది. వీటిలో లెబనాన్ కోసం ఆపరేషన్ సుకూన్ యెమెన్‌లో చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్ రాహత్లు ప్రత్యేకంగా నిలిచాయి. వీటిలో ఆపరేషన్ రాహత్‌లో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఉక్రయిన్ యుద్ధంతో మరోసారి విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడే అవసరం ఏర్పడింది. యెమెన్‌లో 5 వేల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థానిక కారణాలతో యెమెన్ దేశంపై 2015 మార్చి 27న సౌదీ అరేబియా దాడికి దిగింది. యెమెన్‌లో ఉన్న షైటే హోతీ రెబల్స్, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ దాడి మొదలు కాకముందే యెమెన్ ప్రెసిడెంట్‌ని రెబల్స్ కూలదోశారు. దీంతో ఆ దేశంలో పౌర ప్రభుత్వం నామమాత్రం అయ్యింది. ఇదే సమయంలో అక్కడ 5 వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. నో ఫ్లైజోన్ యెమెన్ నో ఫ్లైజోన్‌గా ఉండటంతో అక్కడికి నేరుగా విమానాలు పంపే అవకాశం లేకపోయింది. దీంతో యెమెన్‌లో ఉన్న భారతీయులు ఆ దేశానికి చెందిన తీరప్రాంత నగరం ఎడెన్‌తో పాటు దానికి సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్ నగరం సనాకు చేరుకోవాలని సూచించింది. పక్క దేశం నుంచి యెమెన్‌కి సమీపంలో ఉన్న ఆఫ్రికా ఖండ దేశం జిబోటీలో భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. యెమెన్ దేశంలో ఉన్న ఇండియన్లు రక్షించేందుకు సాయం చేయాల్సిందిగా జిబోటీ ప్రభుత్వానికి కోరింది. అక్కడ పర్మిషన్ రావడంతో ఇండియన్ ఆర్మీకి చెందిన సీ 17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు జిబోటికి చేరుకున్నాయి. నేవీ ఎంట్రీ యెమెన్‌లోని అడెన్ నగరం నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించడం కష్టంగా మారింది. వీటి మధ్యన అరేబియా సముద్రం ఉంది. దీంతో అడెన్ నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించేందుకు ఇండియన్ నేవికి చెందిన సుమిత్ర , ఎంబీ కరవత్తి, ఎంబీ కోరల్స్ నౌకలను పంపాలని నిర్ణయించారు. వీటిని ముంబై, లక్షద్వీప్ నుంచి యెమెన్‌కు వెళ్లాలంటూ ఆదేశించారు. వీటికి రక్షణ కల్పించేందుకు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తార్కాష్లు తోడుగా వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల పాటు 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ నౌకలు ఎడెన్ సమీపంలోకి చేరుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్ అడ్వెంచర్ మరోవైపు సనా ఎయిర్‌బేస్‌లో కూడా కొందరు ఇండియన్లు ఉన్నారు. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంతో సాహసం చేసి.. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య రెబల్స్ ఆధీనంలో ఉన్న సనా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడున్న వారిని విమానంలో ఎక్కించుకుంది. అంతే వేగంగా వారిని సురక్షితంగా ఎడెన్‌కు చేర్చింది. దీంతో అక్కడి నుంచి సుమారు ఐదువేల మంది నౌకల ద్వారా జిబోటీ చేరుకున్నారు. వీరి వసతి కోసం జిబోటీలో ఉన్న అన్ని హోటళ్లు, రిసార్టులు బుక్ చేసింది భారత ప్రభుత్వం. అక్కడి నుంచి దశల వారీగా విమానాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేరుకున్నారు. ఒక్క ఇండియన్లనే కాదు ఈ ఆపరేషన్‌లో 4,640 మంది ఇండియన్లను రక్షించారు. అంతేకాదు భారత స్థాయిలో ఏర్పాటు చేసుకోలేని ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా మన త్రివిధ దళాలు కాపాడాయి. ఇలా 41 దేశాలకు చెందిన 960 మందిని కాపాడారు. ఇందులో బంగ్లా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఇండోనేషియా, వంటి ఆసియా ఖండ దేశాలతో పాటు రష్యా, స్వీడన్, టర్కీ, ఇటలీ వంటి యూరప్ దేశాలు కెన్యా, ఉగాండ వంటి ఆఫ్రికన్ పౌరులు కూడా ఉన్నారు. అమెరికన్ పౌరులు కూడా ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు దక్కించుకున్నారు. ఉక్రెయిన్‌లో వేల మంది ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కూడా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. ఇందులో చాలా మంది అక్కడ ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రికత్లు మొదలుకాగానే ఇండియా రావాలంటూ సూచించారు. చివరి నిమిషంలో విమానటిక్కెట్టు ధరలు పెరగడం, సరిపడ విమానాలు లేక చాలా మంది చిక్కుకుపోయారు. వీరి కోసం ఎయిరిండియా ఫ్లైట్లను కూడా ప్రభుత్వం పంపింది. ఫస్ట్ ఫేస్‌లో మూడు ఫ్లైట్లు అక్కడి నుంచి వచ్చిన తర్వాత.. ఉక్రయిన్‌లో నో ఫ్లై జోన్ ప్రకటించారు. దీంతో ఎయిర్ లిఫ్ట్‌కి అవకాశం లేకుండా పోయింది. రెడీగా ఉండండి ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కనీసం 15 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో ప్రత్యామ్నయ ఏర్పాటు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఏర్పాటు పూర్తి కాగానే నేరుగా, సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేస్తామని భరోసా ఇచ్చింది. ఇందుకు తగ్గట్టుగా పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల వైపుకు రావాలంటూ సూచించింది. మరో ఆపరేషన్ ? కేంద్ర విదేశాంగ చేసిన తాజా సూచనతో మరోసారి ఆపరేషన్ రాహాత్, సుకున తరహాలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల సాయంతో తరలింపు చర్యలు చేపడుతుందా అనే చర్చ నడుస్తోంది. నౌక మార్గం ద్వారా తరలింపు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారంగా ఉంది. ప్రపంచాన్ని చుట్టి సముద్ర మార్గంలో ఇండియా నుంచి ఉక్రెయిన్ రేవు పట్టణమైన ఒడిసాకి చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని పూర్తిగా చుట్టేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గిబ్రాల్టర్ జలసంధి గుండా యూరప్ సమీపంలోకి చేరుకుని మధ్యదర సముద్రంలోకి వెళ్లాలి. ఆ తర్వాత టర్కీ ఇస్తాంబుల్ మీదుగా నల్లసముద్రంలోకి ప్రవేశిస్తే తప్ప ఒడేసా చేరుకోలేము. ఈ నౌకా ప్రయాణానికే నెల రోజుల సమయం పట్టవచ్చు. పైగా దారి మధ్యలో దోపిడి దొంగల భయం.. అనేక దేశాలతో దౌత్యపరమైన చర్చలు చేపట్టాల్సి వస్తుంది. ఈ విధానంలో అనేక చిక్కులు ఉన్నాయి. యూరప్ దేశాల హెల్ప్‌తో ఇక ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధ తీవ్రత తక్కువగా ఉందని భావిస్తున్న పశ్చిమ దిక్కున లెవివ్, లట్స్కే, ఉజోరాడ్, ఇజ్మాయిల్, చెర్నివిస్టీ వంటి నగరాలు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టుల వరకు చేరుకున్న ఇండియన్లను.. అప్పటి పరిస్థితులను బట్టి వాయు మార్గంలో ముందుగా యూరప్‌లో ఏదైనా సిటీకి తరలించి అక్కడి నుంచి ఇండియాకు తీసుకురావచ్చు. ఇంకా నో ఫ్లై జోన్‌గా ఉంటే రోడ్డు మార్గం ద్వారా ఉక్రయిన్ సరిహద్దులో ఉన్న హంగేరీ, పోలాండ్, జర్మనీ తదితర దేశాలకు తీసుకువచ్చి అక్కడి నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేపట్టే అవకాశం ఉంది. సవాల్ ఉక్రెయిన్ యూరప్, ఆసియా దేశాలకు ఇంచుమించు ల్యాండ్ లాక్డ్ స్టేట్‌గా ఉంది. సముద్ర మార్గం ఉన్నా అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్లతో పోల్చితే ఉక్రయిన్ తరలింపు భారత ప్రభుత్వాని పెద్ద సవాల్‌గానే చెప్పుకోవచ్చు. త్రివిధ దళాలను ఉపయోగించడంతో పాటు అనేక దేశాలతో సమన్వయం చేయాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో ప్రతీ పని కత్తి మీద సాము వంటిదే. తమ వారి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం గత అనుభవాల దృష్ట్యా కలుగుతోంది. - తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి వెబ్ ప్రత్యేకం -
‘అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపే మొదటి ప్రాధాన్యత’
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వానికి సంబంధించిన స్వభావం, విధివిధానాల విషయంలో భారత్‌దేశానికి ఎటువంటి అవగాహన లేదని కేంద్రం గురువారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. కాబూల్ విమానాశ్రయం మూసివేయడం కారణంగా నిలిచిపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు ముసివేసినట్లు తెలిపారు. కాబూల్‌లో ఎయిర్‌పోర్టు సేవలు మొదలైన అనంతరం భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయులను స్వదేశానికి తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. మొదటిసారిగా తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న సంగతి విదితమే. చదవండి: Afghanistan: అమెరికా సాధించింది శూన్యం, పుతిన్ సెటైర్లు -
ముమ్మరంగా తరలింపు!
కాబూల్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరిన్ని పేలుళ్లు జరుగుతాయన్న భయంతో పలు దేశాలు అఫ్గాన్‌లోని తమ ప్రజలను వెనక్కురప్పించే యత్నాలను ముమ్మరం చేశాయి. పేలుడు అనంతరం మూతపడిన విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రాకపోకలు ఆరంభమయ్యాయి. బాంబుల భయం తీరకపోయినా, విమానాశ్రయం బయట వందలాదిమంది గుంపులుగా దేశం విడిచి పోయేందుకు ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆగస్టు 31నాటికి యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలగనున్నాయి. అనంతరం ఏమైతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అఫ్గాన్ ప్రజానీకం ఉంది. అందుకే ఈలోపే ఏదో ఒక దేశానికి పారిపోవాలని పలుమంది విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్నారు. కాబూల్ నుంచి దాదాపు లక్షకు పైగా ప్రజలను సురక్షితంగా వేర్వేరు ప్రదేశాలకు తరలించామని అమెరికా ప్రకటించింది. ఇంకా వేలాది మంది పారిపోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. విదేశాలకు పోయే అవకాశం లేని పౌరులు దేశ సరిహద్దులకు చేరుకొని పొరుగు దేశాల్లో తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే నెలల్లో దాదాపు 5లక్షల మంది అఫ్గాన్ సరిహద్దు దేశాలకు శరణార్థులుగా పోవచ్చని యూఎస్ మిలటరీ అంచనా వేసింది. నిశితంగా గమనిస్తున్నాం: భారత్ ఆపరేషన్ దేవి శక్తి పేరిట ఆఫ్గానిస్తాన్‌లోని భారతీయుల తరలింపు ప్రక్రియను ఇండియా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరు భారత విమానాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 550 మందిని స్వదేశానికి తెచ్చాయి. వీరిలో దాదాపు 260మంది భారతీయులున్నారు. వీరితో పాటు అర్హులైన అఫ్గాన్ పౌరులను కూడా భారత్ సురక్షితంగా తరలించిందని, ఇంకా తరలింపు కొనసాగుతోందని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని, అఫ్గాన్‌లోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. అఫ్గాన్‌లో మిగిలిన భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చడంపైనే శ్రద్ధ పెట్టామన్నారు. దాదాపు 20మంది భారతీయులు, కొందరు అఫ్గాన్ జాతీయులు అనుకున్న సమయానికి విమానాశ్రయానికి రాలేకపోయారని, వీరిని తరలించే యత్నాలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఏ దేశం ఏం చేస్తోంది? అమెరికా: యూఎస్ పౌరుల తరలింపును మరిం త వేగవంతం చేసింది. త్వరలో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని యూఎస్ అధికారి ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. డెడ్‌లైన్ కల్లా తరలింపును పూర్తి చేస్తామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఇంకా దాదాపు 5,400మంది తరలింపునకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 24గంట ల్లో దాదాపు 12,500కు పైచిలుకు పౌరులను 89 విమానాల్లో తరలించామన్నారు. బ్రిటన్: అఫ్గాన్ నుంచి తమ బలగాల తరలింపు ప్రక్రియ ముగిసిందని బ్రిటన్ ప్రకటించింది. శుక్రవారం 9 విమానాలతో తరలింపును పూర్తి చేశామని తెలిపింది. అఫ్గాన్లతో కలిపి మొత్తం 14 వేల మందిని దేశం దాటించామని పేర్కొంది. ఇంకా 150 మంది బ్రిటన్ పౌరులు కాబూల్‌లో చిక్కుకుపోయారని ప్రధాని జాన్సన్ తెలిపారు. స్వీడన్: ఇప్పటివరకు దాదాపు 500 మంది స్వీడిష్ పౌరులతో సహా 1,,100మందిని అఫ్గాన్ నుంచి తీసుకువచ్చామని తెలిపింది. ఇటలీ: అఫ్గాన్ నుంచి 108మందితో కూడిన చివరి తరలింపు విమానం రోమ్కు చేరినట్లు ఇటలీ ప్రకటించింది. శుక్రవారానికి దాదాపు 4,900మంది అఫ్గాన్ పౌరులను దేశం దాటించామంది. ఫ్రాన్స్: శుక్రవారం రాత్రికి ఫ్రెంచ్ దేశీయుల తరలింపు పూర్తి కావచ్చని ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్: అఫ్గాన్ నుంచి తమ దేశీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని స్పెయిన్ తెలిపింది. సుమారు 1,900మంది అఫ్గాన్ పౌరులను కూడా తమ దేశానికి తెచ్చామంది. జర్మనీ: 45 దేశాలకు చెందిన దాదాపు 5,347 మందిని సురక్షితంగా సరిహద్దు దాటించామని, గురువారం తమ చివరి రెస్క్యూ విమానం అఫ్గాన్ నుంచి బయటపడిందని తెలిపింది. టర్కీ: కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహిం చాల్సిందిగా తాలిబన్లు తమను కోరారని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
‘తరలింపు ఆపండి’ : అమెరికాకు తాలిబన్ల స్ట్రాంగ్ వార్నింగ్
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నైపుణ్యం కలిగిన అఫ్గాన్లను తరలించుకు పోవడాన్ని నిలిపివేయాలని అమెరికాను హెచ్చరించారు. అలాగే అఫ్గన్లు దేశం విడిచి వెళ్లిపోవద్దని, కాబూల్‌లోని విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇకపై అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా వైద్యులు, ఇంజనీర్లు, ఇతర విద్యావంతులైన నిపుణులు తమకు చాలా అవసరమని మంగళవారం నాటి సమావేశంలో ప్రకటించారు. అలాగే ప్రస్తుత గందరగోళ పరిస్థితుల కారణంగా అఫ్గాన్లను విమానాశ్రయానికి అనుమతించడం లేదని, విమానాశ్రయంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవాలని కోరారు. వారి భద్రతకు తమది పూర్తి హామీ అని పేర్కొన్నారు. బ్యాంకులు బుధవారం నుంచి పనిచేస్తాయని, ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, లోకల్ పాలనా సంస్థలు ఇప్పటికే పనిలో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు మహిళలపై ఆంక్షలను కొనసాగిస్తూ కీలక ప్రకటన చేశారు. చదవండి : అమెరికాకు డెడ్‌లైన్ విధించిన తాలిబన్లు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్నేత తాజా హెచ్చరిక జారీ చేశారు. తమ భద్రత కోసం వారంతా ఇంట్లోనే ఉండాలన్నారు. అయితే భవిష్యత్తులో వాళ్లు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ రహస్య మంతనాలు జరిపారన్న వార్తలను ఆయన ఖండించారు. అలాంటి సమావేశం ఏదీ జరగలేదని తెలిపారు. చదవండి : Afghanistan: తాలిబన్లతో సీఐఏ చీఫ్ రహస్య భేటీ! అలాగే పంజ్‌షీర్ సోదరులంతా కాబూల్‌కు తిరిగి రావాలని ముజాహిద్ కోరారు. భయపడొద్దు, తిరుగుబాటు చేయొద్దని కూడా ఆయన తెలిపారు. కాబూల్‌నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకునేందుకు గడువును పొడిగించబోమని మరోసారి తెగేసి చెప్పారు. అమెరికా తన ప్రజలందరినీ ఆగస్టు 31 లోపు తరలించాల్సిందేనని స్పష్టం చేశారు. చదవండి : బంగారం లాంటి ఆస్తులు అమ్మేస్తున్నారు: మోదీపై రాహుల్ ధ్వజం -
‘నిష్క్రమణ’ నిర్ణయం సహేతుకమే
వాషింగ్టన్: అఫ్గాన్‌ను తమ సేనలు అర్ధంతరంగా వదిలివెళ్లడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధక్షేత్రంగా మారిన అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ఘట్టం.. చరిత్రలో సహేతుక రీతిలోనే పదిలమై ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 31వ తేదీలోపు అమెరికా సైన్యం స్వదేశానికి వస్తుందని బైడెన్ గతంలో ప్రకటించగా అంతకు రెండు వారాల ముందే తాలిబన్లు తెగబడి అఫ్గాన్ మొత్తాన్నీ ఆక్రమించారు. రణరంగంలో అఫ్గాన్ ప్రభుత్వ బలగాలకు తోడుగా నిలవడకుండా సొంత దేశానికి సైన్యాన్ని వెనక్కి పంపడంతో ఎయిర్‌పోర్టు వద్ద వందలాది మంది అఫ్గాన్ల అనూహ్యస్థాయిలో వలసలతో తోపులాటలు, కాల్పులు జరిగాయి. దీంతో విపక్ష రిపబ్లికన్ పార్టీసహా పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బైడెన్ మరోసారి స్పందించారు. ఆదివారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మా నిర్ణయం న్యాయబద్ధమైన, సహేతుకమైన నిర్ణయంగానే చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నా. ఇక మీదటైనా తాలిబన్లు ప్రజామోద నిర్ణయాలు తీసుకోవాలి. దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా నిలబెట్టాలి. తమ ధర్మమే అఫ్గాన్‌లో కొనసాగాలని తాలిబన్లు కోరుకుంటున్నారు. తమ పాలననూ అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని నమ్ముతున్నారు. అమెరికా లాంటి దేశాల దౌత్యసాయం వారికి అక్కర్లేదట. తాలిబన్లు.. సరైన ప్రణాళికలేని సాయుధమూకల గుంపు’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. -
మరో 392 మంది తరలింపు
న్యూఢిల్లీ: తాలిబన్ ముష్కర మూకల కబంధ హస్తాల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి తమ పౌరులు, భాగస్వాముల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆదివారం మూడు వేర్వేరు విమానాల్లో 392 మందిని వెనక్కి తీసుకొచ్చింది. వీరిలో ఇద్దరు అఫ్గానిస్తాన్ చట్టసభ సభ్యులు సైతం ఉండడం విశేషం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు(ఐఏఎఫ్) చెందిన సి–17 సైనిక రవాణా విమానంలో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు తరలించిన మొదటి బృందంలో 168 మంది ఉన్నారు. వీరిలో 107 మంది భారతీయులు కాగా, 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు. 87 మందిని శనివారం కాబూల్ నుంచి తజికిస్తాన్ రాజధాని దుషాన్‌బెకు చేర్చగా, వారిని ఆదివారం ఏఐ 1956 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారత్‌కు తరలించారు. వీరిలో ఇద్దరు నేపాల్ జాతీయులు ఉన్నారు. ఇక మరో 135 మందికిపైగా భారతీయులను కొద్ది రోజుల క్రితం అమెరికా, నాటో విమానాల్లో ఖతార్ రాజధాని దోహాకు తరలించారు. వారందరినీ ఇప్పుడు ప్రత్యేక విమానంలో దోహా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కాబూల్ నుంచి తరలించిన వారిలో ఇద్దరు అఫ్గాన్ చట్టసభ సభ్యులు అనార్కలీ హోనర్యార్, నరేంద్రసింగ్ ఖల్సా, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కష్టకాలంలో అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా 590 మంది.. భారత ప్రభుత్వం అఫ్గాన్ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 16న ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 590 మందిని వెనక్కి తీసుకొచ్చింది. అమెరికాతోపాటు ఇతర మిత్రదేశాల సహకారం, సమన్వయంతో భారత్ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. సోమవారం కూడా మరో బృందం భారత్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. ఇండియా వీసాలున్న అఫ్గాన్ పౌరులు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోకుండా తాలిబన్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరోధిస్తున్నారు. -
20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకి భయాందోళనలు కలిగిస్తున్నాయి. అవకాశం వస్తే.. ఆ దేశం దాటిపోవడానికి లక్షలాది మంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిత్యం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా అఫ్గాన్ నుంచి తరలిస్తున్నాయి. తాజాగా అఫ్గాన్ నుంచి ఓ ప్రత్యేక విమానంలో 168 మంది భారత్ చేరుకున్నారు. అఫ్గానిస్తాన్ ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా కాబూల్ నుంచి భారత్‌కు చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ..‘‘ నాకు ఏడుపు వస్తోంది. గత 20 ఏళ్లలో సాధించినదంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మిగిలింది సున్నా " అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నిలువ నీడ లేదు..! అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళ తన కుటుంబానికి సహాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. తాలిబన్లు మా ఇంటిని తగలబెట్టారు. మాకు నిలువ నీడ లేకుండా చేశారు. భారతీయ సోదరీసోదరులు రక్షణగా నిలిచారు. సహాయం చేసినందుకు నేను భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరింది. వీరిలో 107 మంది భారతీయులతో సహా 168 మందిని కాబూల్ నుంచి భారత్ తరలించింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. " పోలియో వైరస్‌కు నివారణ చర్యగా అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఉచిత పోలియో వ్యాక్సిన్ - ఓపీవీ& ఎఫ్‌ఐపీవీ టీకాలు వేయాలని నిర్ణయించాం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశాం.’’ అని తెలిపారు. #WATCH | Afghanistan's MP Narender Singh Khalsa breaks down as he reaches India from Kabul. "I feel like crying...Everything that was built in the last 20 years is now finished. It's zero now," he says. pic.twitter.com/R4Cti5MCMv — ANI (@ANI) August 22, 2021 We have decided to vaccinate Afghanistan returnees with free Polio Vaccine - OPV & fIPV, as a preventive measure against Wild Polio Virus Congratulations to the Health Team for their efforts to ensure public health Take a look at the vaccine drive at Delhi International Airport pic.twitter.com/jPVF1lVmRu — Mansukh Mandaviya (@mansukhmandviya) August 22, 2021 చదవండి: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్ మస్క్: వైరల్ -
ముప్పు లేకుండా తరలింపు పూర్తి కాదు: బైడెన్
వాషింగ్టన్: తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి తమ పౌరులను, భాగస్వామ్య దేశాల పౌరులను సాధ్యమైనంత త్వరగా స్వదేశాలకు చేరుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. ప్రాణాలకు ముప్పు లేకుండా తరలింపు ప్రక్రియ పూర్తి కాబోదని వ్యాఖ్యానించారు. జూలై నుంచి ఇప్పటిదాకా 18,000కు పైగా అమెరికన్లను సొంత దేశానికి తరలించామని చెప్పారు. సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య తరలింపు చేపడుతున్నాం కాబట్టి తుది ఫలితం ఏమిటన్నది చెప్పలేనన్నారు. మరోవైపు, అఫ్గానిస్తాన్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని అన్నారు. -
అఫ్గనిస్తాన్: మొదలైన తరలింపు.. స్వదేశానికి 85 మంది భారతీయులు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడంతో ఆ దేశంలో ఉన్న భారతీయుల తరలింపు ప్రక్రియ ఇవాళ మొదలైంది. వైమానిక దళానికి చెందిన సీ-130జే ప్రత్యేక రవాణా విమానం బయలుదేరింది. దాంట్లో 85 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ఆ విమానం రీఫ్యుయలింగ్ కోసం తజకిస్తాన్‌లో ల్యాండ్ అయినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. స్టాండ్‌బైగా కూడా మరో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. అలానే మరో ట్రాన్స్పోర్ట్ విమానం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సీ-17 విమానంలో సుమారు180 మంది భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్ నగరం తాలిబన్ల ఆధీనంలో ఉన్నది. అయితే ఎంత మంది విమానాశ్రయానికి చేరుకుంటారో చెప్పలేం. ఎయిర్ ఇండియా విమానాలను ఆపరేట్ చేయడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేవలం వాయుసేన విమానాలను నడపనున్నారు. (చదవండి: Afghanistan: ఆశలు ఆవిరి.. వారి 'ఖేల్' ఖతం..) వీలైనంత ఎక్కువ మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దౌత్యకార్యాలయ్యాల్లో పని చేస్తున్న సిబ్బందిని తరలించగా.. మరో 1000 మంది వేర్వేరు అఫ్గన్ నగరాల్లో చిక్కుకున్నటు ప్రభుత్వం భావిస్తోంది. వారందరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది గుర్తించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రస్తుతం అఫ్గన్‌లో ఉన్న ఓ గురుద్వారాలో 200 మంది హిందువులు, సిక్కులు శరణార్థులుగా ఉన్నట్లు సమాచారం. చదవండి: Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు! -
పులి రాక.. ఆలస్యమింకా!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ పులుల అభయారణ్యంలో కోర్ గ్రామాల తరలింపునకు మరికొంత కాలం పట్టేలా ఉంది. చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్న పులులకు స్థిర ఆవాసం ఏర్పడాలంటే కోర్ ఏరియాలోని గిరిజన గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలి. ఐదేళ్ల క్రితం సర్వేలో.. నిర్మల్ జిల్లా కడెం మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలో 21 పల్లెలు పులి సంచరించే ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు. మానవ సంచారంతో పులులకు ఇబ్బందులు, ఇటు గ్రామస్తులకు ముప్పు ఏర్పడుతుండడంతో గ్రామస్తుల అంగీకారంతో వేరోచోటుకు తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది. మొదటి దఫా కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 కుటుంబాలు, జన్నారం పరిధిలో మల్యాల, దొంగపల్లి, అలీనగర్ గ్రామాల్లోని 168 కుటుంబాలను పునరావాసం కింద తరలించాల్సి ఉంది. మొదట కడెం మండలం రాంపూర్, మైసంపేటలోని 142 కుటుంబాలను తరలించాలని నిర్ణయించారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నిర్వాసిత పరిహార ప్యాకేజీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్లు నిండిన వారిని యూనిట్‌గా పరిగణిస్తూ ఇల్లు, మూడెకరాల భూమి, అలా కాకుంటే రూ.10 లక్షల నగదు ఇస్తారు. ఇందులో మొదటి ఆప్షన్‌కు 48 కుటుంబాలు, రెండో ఆప్షన్‌కు 98 కుటుంబాలు సర్వే సమయంలో ఒప్పుకున్నాయి. పునరావాస కాలనీ కోసం కడెం మండలం కొత్తమద్దిపడగ సమీపంలో ఐదు హెక్టార్లు కేటాయించారు. సాగుభూమి కోసం ఇదే మండలంలో నచ్చన్ఎల్లాపూర్ జీపీ పరిధిలోని పెత్పురులో 107 హెక్టార్లు కేటాయించారు. ఈ రెండు గ్రామాల తరలింపునకే రూ.15 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ప్రాజెక్టు టైగర్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్రాలు 60-40 శాతం వాటాగా భరిస్తాయి. మూడేళ్ల కిందట కేంద్రం నిధులు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిధులు విడుదల చేసింది. ఇప్పటికీ పునరావాస కాలనీలో సదుపాయాలు కల్పించకపోవడంతో తరలింపు మరింత ఆలస్యం కానుంది. మరోవైపు ఎన్టీసీఏ గత ఏప్రిల్‌లో మహారాష్ట్రలో కోర్ పరిధిలోని గ్రామాలకు పునరావాస ప్యాకేజీ రూ.15 లక్షలకు పెంచడంతో ఈ ప్యాకేజీ ఇక్కడా వర్తిస్తుందా? లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. నోటిఫికేషన్ వస్తేనే తరలింపు పునరావాస తరలింపును రెండు కమిటీలు పర్యవేక్షిస్తాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్, రాష్ట్రస్థాయిలో సీఎస్ చైర్మన్లుగా ఉంటూ వ్యవసాయ, గిరిజన, అటవీ, వైద్య, విద్య, సాగునీటి శాఖల నుంచి అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ గ్రామాల తరలింపునకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. గ్రామాల తరలింపు జాప్యంపై ఎన్టీసీఏ గతంలో లేఖ సైతం రాసింది. ఇప్పటికీ తరలింపు ప్రక్రియ మొదలు కాలేదు. మరోవైపు తమ గ్రామాలను తరిలించేందుకు గిరిజనులు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు రోడ్డు, విద్య, వైద్యం తదితర సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస ప్రాంతాలకు తరలిస్తే తమ జీవనస్థితి మెరుగవుతుందని ఆశపడుతున్నారు. కారిడార్‌కే పులులు పరిమితం తొమ్మిదేళ్ల కిందట దేశంలో 42వ టైగర్ రిజర్వుగా ఏర్పడిన కవ్వాల్ అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015.44 చ.కి.మీ విస్తరించి ఉంది. ఇందులో కోర్ ఏరియా 892.23 చ.కి.మీ, బఫర్ ఏరియా 1123.21 చ.కి.మీ. ఐదేళ్లుగా కోర్ పరిధిలో రూ.లక్షలు ఖర్చు చేసి అనేక చర్యలు చేపట్టినప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులుగా ఉన్న కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, ఆదిలాబాద్ డివిజన్లలోనే పులులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతం పులుల రాకపోకలు ఉన్న కోర్ కాకుండా కారిడార్‌గా గుర్తించారు. ఇక్కడే కొన్ని పులులు జతకట్టి సంతానోత్పత్తిని పెంచుకున్నాయి. అలా ఫాల్గుణ అనే ఆడపులి రెండు దఫాల్లో 8 పిల్లల్ని కన్నది. ప్రాణహిత తీరం దాటగానే అవతలి వైపు తడోబా=అందేరీ టైగర్ రిజర్వ్, ఇటు ఆదిలాబాద్ జిల్లా వైపు తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి. అక్కడ పులుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇరుకు ఆవాసాల్లో ఇమడలేక కొత్త ఆవాసం, తోడు కోసం తెలంగాణ భూభాగంలో అడుగుపెడుతున్నాయి. వలస పులులను కొంతకాలం కవ్వాల్‌లో ఆపగలిగితే దేశంలోనే ప్రముఖ టైగర్ రిజర్వుగా మారే అవకాశం ఉందనే అశయంతోనే ఈ టైగర్ రిజర్వు ఏర్పాటు చేశారు. కోర్ పరిధిలోని కాగజ్‌నగర్ డివిజన్లో పోడు సాగుదారులకు పులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. వన్యప్రాణుల నష్టపరిహారం పెంపుపై కమిటీ వేసిన ప్రభుత్వం కోర్ పరిధిలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మాత్రం జాప్యం చేస్తోంది. దీనిపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల తరలింపు కోసం నోటిఫికేషన్ రాగానే ప్రక్రియ మొదలవుతుందన్నారు. మా ఊళ్లో సౌకర్యాలు లేవు.. మా గ్రామాన్ని వేరే ప్రాంతాన్ని తరలిస్తామని అటవీ అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ తరలించడం లేదు. మా ఊళ్లో కనీస సౌకర్యాలు లేవు. పునరావాస ప్రాంతానికి వెళ్తే సౌకర్యాలు ఉం టాయని గ్రామస్తులం అనుకుంటున్నాం. – గాదె బచ్చవ్వ, రాంపూర్, కడెం మండలం, నిర్మల్ జిల్లా -
హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు
సాక్షి, హైదరాబాద్: చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ మెట్రో ఆపద్బంధువుగా నిలిచింది. అత్యవసరంగా గుండెను తరలించి నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన వంతు సహకారం అందించింది. మెట్రో సహకారంతో.. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మహా నగరంలో ఓ మూలన ఉన్న ఆస్పత్రి నుంచి మరో మూలన ఉన్న ఆస్పత్రికి కేవలం 37 నిమిషాల్లోనే వైద్యులు గుండెను తరలించగలిగారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45) గత నెల 31 అస్వస్థతకు గురై హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరాడు. సోమవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించిన వైద్యులు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో వారు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చాలని నిర్ణయించారు. అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు సకాలంలో గుండెను తీసుకురావడం కష్టమని భావించిన అపోలో వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. ప్రత్యేక రైలు ఏర్పాటుకు వారు ఓకే చెప్పడం, పోలీసులు సైతం సహకరించడంతో గుండె తరలింపు ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. మెట్రో రైలులో గుండెను తరలిస్తున్న వైద్యులు ఆద్యంతం ఉత్కంఠ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఎల్భీనగర్–నాగోల్ మార్గంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసుల పహరా, అంబులెన్స్‌కు పైలెటింగ్ చేయడానికి పోలీసు వాహనాలు దారి పొడవునా సిద్ధమయ్యాయి. వైద్యులు నర్సిరెడ్డి గుండెను సేకరించిన తర్వాత.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గోఖలే నేతృత్వంలో అరుగురు సభ్యుల వైద్య బృందం సాయంత్రం 4.36 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అంబులెన్స్‌లో కామినేని ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కేవలం ఐదు నిమిషాలలోనే నాగోల్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మరో నిమిషంలో స్టేషన్లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక మెట్రో రైల్లోకి చేరుకున్నారు. వెంటనే బయలుదేరిన రైలు.. మార్గం మధ్యలోని 16 మెట్రో స్టేషన్లలో ఎక్కడా ఆగకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 21 కి.మీ మార్గాన్ని 28 నిమిషాల లోపుగానే రైలు చేరుకుంది. రైలును ఈ సమయంలో గంటకు 40 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రెండున్నర నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో వరకు కూడా పోలీసులు గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం సాయంత్రం 5.15 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించింది. నగరంలో మెట్రోలో గుండెను తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా నగరంలో మార్పిడి చేసే అవయవాల తరలింపు, అత్యవసర వైద్యసేవలకు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటూ.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల రాకపోకలతో అంబులెన్స్‌లు నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. గుండెను సకాలంలో తరలించాం ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన గుండెను బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరం నుంచి తీసిన నాలుగు గంటల్లోగా తిరిగి అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెను సకాలంలో అపోలోకు చేరవేసేందుకు మెట్రో జర్నీ ఉపకరించింది. – డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె మార్పిడి నిపుణులు, అపోలో ఆస్పత్రి ప్రజా సేవకు మెట్రో ముందుంటుంది ప్రజాసేవలో మెట్రో ఎప్పుడూ ముందుంటుంది. ఓ నిండు ప్రాణం కాపాడేందుకు మా వనరులను వినియోగించేంలా మాకో అవకాశం దక్కింది. నాగోల్–జూబ్లీహిల్స్ మధ్య రైలును ఏ స్టేషన్లోనూ ఆపకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశాం. – కేవీబీ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ