హోని: రష్యా దాడి మొదలయ్యాక ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల మందికి పైగా చిన్నారులు తల్లులతో కలిసి సరిహద్దులు దాటినట్టుగా యూనిసెఫ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘‘ఈ స్థాయిలో చిన్నారులు దేశం విడిచి పెట్టడం ఇదే మొదటిసారి. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం’’ అని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ చెప్పారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా దేశం విడిచిపెట్టి వెళితే వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. తమ దేశంలో ఉన్న ప్రతీ ఎనిమిది మంది చిన్నారుల్లో ఒకరు శరణార్థి అని మోల్దోవా ప్రధానమంత్రి గవిరిలి చెప్పారు. మాజీ మిస్ ఉక్రెయిన్ వెరొనికా దిద్‌సెంకో కీవ్ నుంచి ఏడేళ్ల వయసున్న తన కుమారుడితో కలిసి నానా కష్టాలు పడి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ చేరుకున్నారు. కీవ్ నుంచి వస్తూ ఉంటే బాంబుల మోతలు వినిపించని ప్రాంతమే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతో పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని, అయితే వారికి మరిన్ని ఆయుధాలు కావాలని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment